సంకలనాలు
Telugu

ఆన్‌లైన్ ఫ్యాషన్ ఫీల్డ్‌లో లక్‌ మాదేనంటున్న సోలోలుక్

డిజైనర్ బ్రాండ్ లతో దూసుకొస్తోన్న సోలోలుక్వెబ్ పోర్టల్ లో వేల సంఖ్యలో దుస్తులుమగువల కోసం ప్రత్యేకమైన డిజైన్లువింటేజ్ బట్టలంటే యమ గిరాకీ

ashok patnaik
28th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మగువల ఫ్యాషన్ కోసం ఆన్‌లైన్ మార్కెట్ అనేది ఓ సరికొత్త విప్లవమనే చెప్పాలి. ఫ్యాషన్ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని ఆక్రమించిందంటే అతిశయోక్తి కాదేమో. ఒక క్లిక్కుతో ఎన్నో వెబ్ సైట్లు కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతాయి. కానీ ఆన్‌లైన్ సముద్రంలో కావలసిన వస్తువుని లేదా డ్రెస్‌ని ఎన్నుకోవడం సాధ్యపడుతుందా ? అమ్మాయిలకైతే తరం కావడం లేదట. ఈ విషయాన్ని గుర్తించిన సోలోలుక్ ..వీరికోసం తమ సైట్‌లో ఓ సొల్యూషన్ చూపిస్తోంది.

ప్రతీ బ్రాండ్, ఆన్‌లైన్ స్పేస్ , ఈకామర్స్ లోకి ప్రవేశిస్తుండటం వాటి మధ్యనే పోటీ వాతావరణం నెలకొంది. ఆన్‌లైన్ కస్టమర్లు వెరైటీని మాత్రమే కాదు తేడాలను కూడా గుర్తించి చూస్తారు. దీంతో మగువల కోసం ప్రత్యేకమైన ఫ్యాషన్‌ను తమ వెబ్‌సైట్‌లో అందిస్తోంది సోలోలుక్.

సోలో లుక్ ‌ఉత్పత్తులతో ఓ మోడల్

సోలో లుక్ ‌ఉత్పత్తులతో ఓ మోడల్


బ్యాక్‌గ్రౌండ్ -

ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన హర్ష 2009లో ఫైనాన్షియల్ సర్వీసు కంపెనీ ప్రారంభించారు. తర్వాత 2011లోముగ్గురు స్నేహితులతో కలసి ఆన్‌లైన్లో టీషర్ట్‌లు అమ్మే వ్యాపారాన్ని మొదలు పెట్టారు. డిజైన్, ప్రింట్‌లపై అధ్యయనం చేసిన తర్వాత ఓ బడ్జెట్ షీట్ తయారు చేశారు. ఆ తర్వాత వెబ్‌సైట్‌ని డెవలప్ చేశారు. తర్వాత కొంతమంది వెండార్లను కలసిన తర్వాత ప్రింటింగ్ ఔట్ సోర్సింగ్, ఫ్యాబ్రిక్ కొనుగోలు పూర్తయ్యాక తాము సిద్ధమయ్యామని హర్షల్ తెలిపారు. మార్కెట్లో ఉన్న కొంతమంది సీజనల్ వెండార్లతో మాట్లాడిన తర్వాత మరోసారి తమ వ్యాపారం పై పునరాలోచించారు. ఈసారి జిగార్ జటాకియా అనే వ్యక్తిని కలిసారు. జిగార్ ది ఈకామర్స్‌లో అందేవేసిన చేయి. టెక్నికల్ హెడ్‌గా జిగార్ కంపెనీలో జాయిన్ అయ్యారు. గతంలో జిగార్ మ్యాడ్ బైట్స్ పేరుతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్‌ని నడిపారు. రీసెర్చ్ అండ్ బ్రాండింగ్‌లతో కంపెనీ రెండు విభాగాలుగా మారింది. ఎలక్ట్రానిక్స్ తర్వాత ఈ కామర్స్‌లో ఫ్యాషన్ అనేది అతిపెద్ద మార్కెట్‌గా గుర్తించగలిగారు. అందమైన డిజైన్లు తయారు చేసే వేల మంది డిజైనర్లను వెతికి పట్టుకొని వారికి ఆర్థిక సాయం అందించాం. వారినుంచి ఉత్పత్తిని పెంచగలిగాం. మగువల ఫ్యాషన్ విషయంలో ఎన్ని వెరైటీలు తీసుకొచ్చినా తక్కువే అవుతుందనేది హర్షల్ మాట. 

ది చాలెంజెస్

డిజైనర్లతో టై అప్ చేయడానికి టీంలో ప్రత్యేక విభాగం ఉంది. డిజైనర్లను టై అప్ చేయడం అంత సులువైన విషయమైతే కాదు. ఎందుకంటే స్పష్టమైన, నాణ్యమైన ఫోటోగ్రాఫ్‌లు అవసరం ఉంటాయి. “ మొదట్లో, మేం ఔట్ సోర్సింగ్ ద్వారా డిజైనర్లను తీసుకొనే వాళ్లం. అయితే అది అన్ని విధాలా లాభధాయకం కాలేదు. అంతే కాకుండా పెద్దగా నాణ్యమైన డిజైన్లు దొరక్కపోవడంతో మా అభిప్రాయాన్ని మార్చుకున్నాం. డిజైన్ల బాధ్యతా తామే నిర్వహిస్తున్నాం. వెబ్‌సైట్లో జాబితా తయారు చేయడానికి సోలో లుక్ ఒక స్టూడియోను అద్దెకు తీసుకొని ఫుల్ టైం ఫోటోగ్రాఫర్‌తో పాటు కంటెంట్ రైటర్‌ని తీసుకున్నామన్నారు హర్షల్.

'సోలోలుక్ కో ఫౌండర్ హర్షల్

'సోలోలుక్ కో ఫౌండర్ హర్షల్


ఆ తర్వాతి సవాలు కంపెనీ రిజిస్ట్రేషన్.“చట్టబద్దమైన సంస్థని(కంపెనీని) మొదట్లో ప్రారంభించడం అనుకూలమని నేనైతే భావించను. ఎందుకంటే మారిన కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్‌కి రెండునెలలు పడుతుంది. 2014లో మారిన కంపెనీ యాక్ట్ గురించి చాలామంది చార్టెడ్ అకౌంటెంట్‌ల దగ్గర కూడా సరైన సమాచారం లేదు. కానీ లక్కీగా.. మేం ఏప్రిల్ 2015 కంపెనీ యాక్ట్ కింద మా కంపెనీని రిజిస్టర్ చేయగలిగాం” అని హర్షల్ ఆనందం వ్యక్తం చేశారు.

భవిష్యత్ లక్ష్యాలు -

ప్రస్తుతం సోలో లుక్ ఫ్రీమియంత మోడల్‌ పై పనిచేస్తోంది. ఇందులో లిస్టింగ్, రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు. ఆర్డర్ వస్తే దానిపై డిజైనర్లు కమిషన్ తీసుకుంటారు. “ఇప్పుడు దాదాపు మా దగ్గర 85 మంది డిజైనర్లు, బ్రాండ్లు ఉన్నాయి. మూడు నెలల్లో 35 బ్రాండ్‌లు ఆన్‌లైన్లోలోకి వచ్చాయి. ఈ సంఖ్యని 200లకు చేర్చడం మా ముందున్న సవాలని హర్షల్ వివరించారు. 18నుంచి42 వయసు మధ్యగల 32 మిలియన్ భారతీయ మగువలను మేం టార్గెట్ గా పెట్టాం. వచ్చే మూడు నెలల్లో మిడిల్ ఈస్ట్, యూఎస్‌తో పాటు యూరప్ మహిళలను సైతం చేరువ కావడానికి సిద్ధపడుతున్నామని తమ లక్ష్యాలను వివరించారు.

భారత్ లో 2020నాటికి 120 మిలియన్ల మగువలు ఆన్ లైన్లో యాక్టివ్ అవుతారని కొన్ని సర్వేలు వెల్లడించాయి. వారికి ఫ్యాషన్ పరంగా వారి అవసరాలను తీర్చడానికి సోలోలుక్ సిద్ధపడుతోందని హర్షల్ ముగించారు.

web url: www.sololook.com

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags