సంకలనాలు
Telugu

మీ మైండ్ లో స్టార్ట‌ప్ పెట్టే ఆలోచన ఉందా..?! అయితే ముందు ఇది చ‌ద‌వండి!!

Karthik Pavan
8th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఉద‌యం లేస్తే ర‌న్ ర‌న్ ర‌న్‌. టెన్ టు సెవెన్‌. నాన్‌స్టాప్ వ‌ర్క్‌. అవుట్‌పుట్‌కోసం టెన్ష‌న్‌. బాస్ డెడ్‌లైన్ అంటే చిరాకు. క్రియేటివిటీకి ఆస్కారం లేదు. కొత్త ఆలోచ‌న‌ను ఇంప్లిమెంట్ చేసే టైం ఉండ‌దు. డైలీ అదే రోటీన్‌. చేయాల‌నుకున్న ప‌ని చేయ‌లేము. నెలాఖ‌రుకు జీత‌మొచ్చినా రెండ్రోజులే ఆ స‌ర‌దా.. లైఫ్‌లో ఏదో తెలియ‌ని లోపం. ఇలాంటి వాళ్లంద‌రిదీ ఒకే ఐడియా. ఒక స్టార్ట‌ప్ పెట్టాలి. ఏదో ఒక‌టి సాధించాలి.అంద‌రికంటే కాస్త భిన్నంగా ఉండాలి. మొత్తంగా మ‌న లైఫ్‌ని మ‌నం లీడ్ చేయాలి.

image


అంతా బానే ఉంది. స్టార్ట‌ప్‌ల విప్ల‌వం న‌డుస్తోంది. కొత్త కొత్త ఐడియాల‌తో యూత్ ముందుకెళుతున్నారు. చాలామంది స‌క్సెస్ అవుతున్నారు. కానీ.. అస‌లు స్టార్ట‌ప్ ఎలాంటివాళ్ల‌ కోసం? అంద‌రూ స్టార్ట‌ప్ పెట్టి స‌క్సెస్ కాగ‌ల‌రా?

మీరు ఈ కింది కేటగిరీకి చెందిన వాళ్లయితే, అర్జెంటుగా ఆంట్ర‌ప్రెన్యూర్ కావాల‌నే ఆలోచ‌న‌ విర‌మించుకోండి.

 1. జాబ్ టైటిల్‌, ప్ర‌తీ ఏటా 10శాతం జీతం హైక్. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఆంట్రప్రెన్యూర్షిప్ కష్టం.
 2. ఒక మంచి ఇల్లు కొనుక్కోవ‌డం. మంచి లైఫ్ పార్ట్‌న‌ర్ కావాల‌నుకోవ‌డం. ఇద్ద‌రు చురుకైన పిల్ల‌లు కావాల‌ని క‌ల‌లు క‌న‌డం. వీటితో లైఫ్‌ బిందాస్ అనుకోవడం. కలలు మంచివే. కానీ బ్యాడ్ లక్. అవి ఆంట్ర‌ప్రెన్యూర్ లక్షణాలు కావు.
 3. స్టార్ట‌ప్‌ల గురించి మాట్లాడుకోవ‌డానికి వీకెండ్ పార్టీలు అరేంజ్ చేసుకోవ‌డం. అంత‌వ‌ర‌కూ ప‌నికానిచ్చేసి, త‌ర్వాత మ‌ర్చిపోవ‌డం. ఇవి మాత్రమే ఆంట్రప్రెన్యూర్ ని చేయలేవు.
 4. జ‌నాల‌ను న‌మ్మించేసి ఏదొకటి చేసి ఆ కాస్తా డ‌బ్బులు సంపాదించేయ‌డం.. కచ్చితంగా ఇదే ఫార్ములాను స్టార్ట‌ప్‌లో కూడా అప్ల‌య్ చేయ‌చ్చ‌ని అనుకొవ‌డం- అమాయకత్వం. ట్రై చేయడం వేస్ట్.
 5. జీవితంలో ఫైనాన్షియ‌ల్ స్టేట‌స్ అంటే.. నెల‌నెలా వ‌చ్చే శాల‌రీయేనని భావించేవాళ్లు ఏనాటికీ స్టార్టప్ ఆలోచన చేయలేరు.
 6. ఉద్యోగం చేసేచోట బాస్‌కి చెప్ప‌కుండా వ‌రుస‌గా రెండువారాల లీవ్ తీసుకున్నారా? ఆంట్రప్రెన్యూర్షిప్‌లో ఇలాంటి రిస్కులు రోజుకు ఒక‌టి తీసుకోవాలి.
 7. స‌వాళ్లంటే భ‌య‌ప‌డితే మీరు వ్యాపారం చేయ‌లేరు.
 8. 90 శాతం ఫెయిల్ అవుతాయ‌ని అంటుంటారు. కాబ‌ట్టి కొత్త విష‌యాల జోలికి వెళ్ల‌డ‌ం ఎందుకు రిస్కు అనుకుంటున్నారా? అయితే మీరు స‌క్సెస్‌ఫుల్ ఆంట్ర‌ప్రెన్యూర్ కాలేరు.
 9. చివ‌ర‌గా.. నాకే అన్నీ తెలుసు అనుకోవ‌డం.. జూనియ‌ర్స్ మాటలను సిల్లీగా కొట్టిపారేయడం.. స్టార్ట‌ప్ పెట్టి స‌క్సెస్ అవ్వాలంటే కేవ‌లం సీఈవోల మాటే వినాల‌నే భ్ర‌మ‌లో ఉండ‌టం.
ప్ర‌తీ అప‌జ‌యం మీక మాన‌సిక స్ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది - రిచ‌ర్డ్ బ్రాన్‌స‌న్‌

ఈ స్టోరీ కూడా చదవండి

ఆంట్రప్రెన్యూర్షిప్ ధైర్య‌వంతుల‌కు మాత్ర‌మే!

 1. మాన‌సిక స్ధైర్యం ఎక్కువ‌గా ఉండాలి
 2. రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు కాలేమ‌న్న విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాలి.
 3. మీతో క‌లిసి స్టార్ట‌ప్ మొద‌లుపెట్టిన వాళ్లు మ‌ధ్య‌లో మిమ్మ‌ల్ని వ‌దిలేసి వెళ్లిపోవ‌చ్చు.
 4. ఇన్వెస్ట‌ర్లు మొద‌ట ఒప్పుకుని త‌ర్వాత హ్యాండ్ ఇవ్వ‌చ్చు.
 5. చేతిలో డ‌బ్బులు లేకుండా ఉండే సంద‌ర్భాలు చాలా ఉంటాయి
 6. ఆంట్రప్రెన్యూర్షిప్ అనేది అంత ఈజీ కాదు. ఎన్నో స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించాలి. ఎన్నో బాధ‌ల‌ను భ‌రించాలి. మీ అభిరుచుల కోసం ల‌క్ష‌ల్లో జీతాలున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టే ధైర్యం చేయ‌గ‌ల‌గాలి. వంద‌ల స్టార్ట‌ప్‌ల విజ‌య‌గాధ‌లు వింటాం. కానీ.. దాని వెనుక వాళ్లు ప‌డిన శ్ర‌మ‌ను మాత్రం ఎప్పుడూ వినం. తెలుసుకోం.

ఆంట్రప్రెన్యూర్షిప్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే!

చిరాకు

నెల‌నెలా ఈఎంఐ లాగా చిరాకు వెంట‌ప‌డి త‌రుముతూ ఉంటుంది. ఎన్నో ప‌క్కాగా ప్లాన్‌ చేసుకుంటాం. కానీ ఫెయిల్ అవుతుంటాయి. అలాంటి ప‌రిస్ధితిని నివారించ‌లేం కానీ.. ఇరిటేషన్ ను ఎలా త‌గ్గించుకోవాలో మాత్రం నేర్చుకోగ‌లం

అభ‌ద్ర‌త‌

మీరు తీసుకున్న నిర్ణ‌యాలపై మీకే అనుమాలు వ‌స్తుంటాయి. ఆ ప‌రిస్ధితుల్లో హెల్ప్ చేసేవాళ్లు ఉండ‌రు. మీకు మీరు బాస్‌గా మార‌డానికి ఇదే సంద‌ర్భం అనుకూలిస్తుంది. మెంటార్స్ ఉన్నా కానీ.. ప్ర‌తీ చిన్న విష‌యానికీ వాళ్ల స‌ల‌హాలు అడ‌గ‌లేం. మీ మీద మీకే న‌మ్మ‌కం పోతుంది. వ‌రుస అప‌జ‌యాల త‌ర్వాత మీరు ఎందుకూ ప‌నికి రారు అనే సిచ్యుయేష‌న్‌కి వ‌చ్చేస్తారు.కానీ.. మీరు తీసుకున్న నిర్ణ‌యం క‌రెక్టేన‌ని గ‌ట్టిగా న‌మ్మ‌డం, ప‌ట్టుద‌ల అనే రెండు అంశాలు ఇలాంటి ప‌రిస్ధితిపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి తోడ్ప‌డ‌తాయి.

ప‌ని వ్య‌స‌నంగా మారిపోతుంది

ప్ర‌తీ ఆంట్ర‌ప్రెన్యూర్ విష‌యంలో ఇది జ‌రుగుతుంది. అయితే, దేన్ని వ్య‌స‌నంగా చేసుకున్నా జీవితంపై దాని ప్ర‌భావం ఉంటుంది. స్ట్రెస్‌ని త‌గ్గించుకోవ‌డానికి మ‌ద్యం, ధూమ‌పానానికి బానిస‌లుగా మారే అవ‌కాశాలు లేక‌పోలేదు

నిద్ర లేమి

ప్రొడ‌క్ట్‌ని టైమ్‌కి డెలివ‌రీ చేయాలి. అంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డాలి. అంటే నిద్ర మానుకోవాలి. చాలామంది ఆంట్ర‌ప్రెన్యూర్లు నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతుంటారు.

కుటుంబ సంబంధాలు దెబ్బ‌తింటాయి

ఇంట్లో వాళ్ల‌తో టైమ్ స్పెండ్ చేయ‌లేక‌పోయిన‌ప్పుడు ఈ విష‌యం బాగా అర్ధ‌మ‌వుతుంది. దొరికే కాస్త స‌మ‌యాన్నీ వాళ్ల‌తో మంచి విష‌యాలు, కుటుంబ‌విష‌యాలు మాట్లాడ‌టానికి స్పెండ్ చేయాలి. ఎలాంటి ప‌రిస్ధితుల్లో కంపెనీ స‌మ‌స్య‌ల గురించి మాట్లాడ‌ద్దు.

ఆహారపు అల‌వాట్లు

ముఖ్యంగా బ్యాచిల‌ర్ ఆంట్ర‌ప్రెన్యూర్లు ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటారు. వండుకోవ‌డానికి టైమ్ దొర‌క‌దు. ఏది దొరికితే అది తినేస్తుంటారు. అంత‌కంటే చ‌క్క‌గా ప‌ళ్లు ముందుపెట్టుకుని ప‌నిచేసుకుంటే మంచిది.

సోష‌ల్ లైఫ్ అనే మాటే ఉండ‌దు

మైండ్‌లో కేవ‌లం ప్రొడ‌క్ట్ గురించే ఆలోచిస్తుంటారు కాబ‌ట్టి పెద్ద‌గా ఈ విష‌యం ఆంట్ర‌ప్రెన్యూర్లు ఎవ‌రికీ అర్ధంకాక‌పోవ‌చ్చు. కానీ.. మీరు ఎన్ని పార్టీలు మిస్ చేశారో మీ ఫ్రెండ్స్‌ని అడిగితే చెప్పేస్తారు.

ఇవ‌న్నీ మిమ్మ‌ల్ని భ‌య‌పెట్ట‌డానికి చెబుతున్న‌విష‌యాలు కావు. ప్ర‌తీ ఒక్క స్టార్ట‌ప్ విష‌యంలోనూ ఇవి జ‌రుగుతుంటాయి. అందుకే.. ఉన్న ఉద్యోగం వ‌దిలేసి స్టార్ట‌ప్ పెట్టుకునే ఆలోచ‌న ఉంటే ఈ కింది విష‌యాల‌ను ఒక‌సారి చెక్ చేసుకోండి..

 • నేను ఎందుకు ఉద్యోగం వ‌దిలేయాలి? బాస్ ఇచ్చిన వ‌ర్క్ న‌చ్చ‌డంలేదు. నాకు నేనే బాస్ కావాలి!
 • ఫుల్‌ టైమ్ జాబ్ చేస్తూ నా డ్రీమ్ ప్రాజెక్ట్‌ని మెద‌లుపెట్ట‌చ్చా? ప్రొడ‌క్ట్‌ని లాంచ్ చేయ‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుంది?
 • ప్లాన్ A , ప్లాన్ B ఏంటి. ఒక‌వేళ రెండూ ఫెయిల్ అయితే ఇంకో రెండు ప్లాన్లు రెడీగా ఉన్నాయా?
 • ఒక నెల‌కు ఎంత ఖర్చుపెడుతున్నారు? ఇప్పుడు ఖ‌ర్చుపెడుతున్న‌ది ఎంత? భ‌విష్య‌త్తు ఖ‌ర్చులు లెక్క వేసుకోండి.
 • భవిష్య‌త్తులో కుటుంబాన్ని పోషించాలంటే ఎంత ఖర్చు అవుతుందీ లెక్క‌గట్టండి. పెళ్లి, పిల్ల‌ల చ‌దువులు, టూర్.. ఇలా ప్ర‌తీదీ అందులో క‌ల‌పండి.
 • జీతం లేకుండా ఎన్నాళ్లు ఇల్లు గ‌డుస్తుంది? మ‌ఈ మీ కొత్త స్టార్ట‌ప్ ఏడాది త‌ర్వాత రిట‌ర్స్న్ ఇస్తుంద‌నుకుంటే.. రెండేళ్ల‌కు డ‌బ్బులు ఆదా చేసుకోండి.
 • చివ‌ర‌గా మిమ్మ‌ల్ని మీరు ఒక ప్ర‌శ్న వేసుకోండి. నా ఉద్యోగం వ‌దిలి అభిరుచి కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన మూడేళ్ల త‌ర్వాత ఎలా అనిపిస్తుంది? నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకుంటారా లేక ఆ బాధ‌ను భ‌రించి మీ జీవితాశయం కోసం ముందుకు వెళ‌తారా?

మీ నిర్ణ‌యం ఏంటి? కింద కామెంట్ప్‌లో ఎవ‌రి నిర్ణ‌యాన్ని వాళ్లు తెలియ‌జేయండి.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags