సంకలనాలు
Telugu

జీవన శైలిని బట్టి వచ్చే వ్యాధుల రిస్క్ ని తెలియజేసే స్టార్టప్

team ys telugu
21st Apr 2017
1+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఇది మూడేళ్ల క్రితం మాట. ఒకసారి ప్రశాంత్ తన స్నేహితుడిని కలవడానికి వాళ్ల ఊరెళ్లాడు. అక్కడికి వెళ్లగానే ఊహించని షాక్ తగిలింది. కలవాల్సిన ఫ్రెండ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. హఠాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. చాలా యంగ్ ఏజ్‌. హార్ట్ ఎటాక్ రావాల్సిన వయసు కూడా కాదు. ఆ వార్త విని నిర్ఘాంతపోయాడు. కారణం విపరీతమైన పనిఒత్తిడి. అంతకు మించి వేరే ఏం లేదు. వర్క్ టెన్షన్ లో పడి, సమయానికి తినక, సరిగా నిద్రపోక, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా గుండె గాలిబుడగలా పేలిపోయింది.

స్నేహితుడిని ఇంత నిశ్శబ్దంగా కబళించిన ఆ మహమ్మారి బారిన మరెవరూ పడొద్దనే ఉద్దేశంతో ప్రశాంత్ తీవ్రంగా ఆలోచించాడు. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే FEDO స్టార్టప్. ఫెడో అంటే Feel Good Do Better అని అర్ధం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారంగా రూపొందించిన ఈ స్టార్టప్ మనిషి ఆరోగ్యాన్ని మినిట్ టు మినిట్ స్టడీ చేసి, అవసరమైన సలహాలు ఇస్తుంది. ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంది.

image


మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి తీస్తోంది. బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ లాంటి అనేక రోగాల బారిన పడుతున్నారు. ఏ ఒక్కరికీ కూడా తాము ఫలానా డిసీజ్ మూలంగా బాధపడుతున్నామని- కంఠంమీదకి వచ్చేదాకా తెలియదు. ఇలాంటి గ్లేరింగ్ ప్రాబ్లమ్‌కి తిరుగులేని సొల్యూషన్ కనిపెట్టాలనే లక్ష్యంతోనే ఫెడో అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేశారు.

లైఫ్ స్టయిల్ డిసీజ్ అనేది మనిషిని చాలా రకాలుగా వెంటాడుతుంది. ఎంత ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా మారుతున్న జీవనశైలి మూలంగా వస్తున్న రుగ్మతలకు అంచనా వేసే సరైన టెక్నాలజీ లేదు. తీరా ప్రాణాల మీదకు వస్తేగానీ తెలియడం లేదు. అప్పటికే జరగరాని నష్టం జరుగుతోంది.

లైఫ్ స్టయిల్ డిసీజ్ మూలంగా ఇండియాలో 30 నుంచి 69 ఏళ్లలోపు వాళ్లు 14.2 మిలియన్ మంది మృత్యువాత పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం భారత ఆర్ధిక వ్యవస్థలో లైఫ్ స్టయిల్ డిసీజ్ తాలూకు వైద్యం విలువ 2012-30 మధ్య కాలంలో 6.2 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. దాంతోపాటు డాక్టర్-పేషెంట్ రేషియో కూడా ఊహించనంత పెరుగుతుంది.

ప్రజల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, అవసరమైతే అలర్ట్ చేయడమే ఫెడో లక్ష్యం. పెద్దగా శ్రమపడాల్సిన పనిలేదు. ఇది ఒక హెల్త్ బ్లాగ్ లాంటిది. ఎలాంటి లైఫ్ స్టయిల్ అయినా సరే, మనం ఎంటర్ చేసే వివరాలను బట్టి, అవసరమైన సూచనలు సలహాలు, పరిష్కార మార్గాలను చూపిస్తుంది.

ప్రస్తుతానికి బీటూబీ మోడల్ ని డెవపల్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు, ఇన్షూరెన్స్ కంపెనీలకు, గవర్నమెంట్ ఇన్ స్టిట్యూషన్లకు కావల్సిన స్కోర్ చాలా ఎఫెక్టివ్ గా వస్తోంది. సమర్ధవంతంగా వస్తోందని ప్రశాంత్ అంటున్నారు.

ఏడాది క్రితం ప్రశాంత్ తన ఫ్రెండ్ అరుణ్ తో కలిసి ఫెడో స్థాపించారు. అరుణ్ ఎంబీయే గ్రాడ్యుయేట్. ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్, ఔట్ సోర్సింగ్, ఆటోమోటివ్, హాస్పిటాలిటీ, ఇలా పలు రంగాల్లో ప్రశాంత్ కి 12 ఏళ్ల అనుభవం ఉంది. గత పదేళ్లుగా ఇద్దరు కలిసి వర్క్ చేశారు. ఫెడోకి సంబంధించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయడంలో చాలా పాషనేట్ గా పనిచేశారు.

హైరిస్క్ అసెస్మెంట్ కంపెనీల పట్ల జనం అయోమయంలో ఉంటారు. కానీ మేం దానికి భిన్నం అంటారు ప్రశాంత్. ఇచ్చే హెల్త్ స్కోర్ వ్యక్తిగత డెమోగ్రఫిక్స్, లైఫ్ స్టయల్ ఆధారంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా ఇన్షూరెన్స్ కంపెనీలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. హై రిస్క్ పీపుల్ స్కోరింగ్ ద్వారా వారి హెల్త్ ప్రొఫైల్ కచ్చితత్వంతో చెప్తుంది. ఇంకో విశేషం ఏంటంటే ఏ కస్టమర్ ప్రొఫైల్ కూడా బహిర్గతం చేయదు. సెన్సిటివ్ సమాచారం ఉంటే గోప్యంగా ఉంచుతుంది.

సహేతుకమైన, విశ్లేషణాత్మకమైన డేటాను సేకరించడానికి ఒక యాప్ కూడా రిలీజ్ చేశారు. అది ఆల్గారిథాన్ని క్లీన్ చేయడానికి ఒక ఫీడర్ గా పనిచేస్తుంది. ఇప్పటిదాకా ఫెడో 5 లక్షల డేటా పాయింట్లతో 80 శాతం కచ్చితత్వంతో 8 రకాల లైఫ్ స్టయిల్ వ్యాధుల ప్రభావాన్ని గుర్తించింది.

ఈ స్టార్టప్ ప్రస్తుతానికి బూట్ స్ట్రాప్డ్ మోడ్ లో ఉంది. తర్వాతి లెవల్ ప్రాడక్ట్ కోసం ఫండ్ రెయిజ్ చేయాలని భావిస్తున్నారు. దాంతోపాటు దేశంలోని ఇన్షూరెన్స్ కంపెనీలతో పాటు మరో మూడు ఇంటర్నేషనల్ సంస్థలతో ఫెడో టై అప్ పెట్టుకున్నారు.

టూల్ టెస్టింగ్ కోసమే యాప్ లాంఛ్ చేశారు. అదెంత హిట్టయిందంటే.. రెండు వారాల్లోనే ఐదు వేల డౌన్ లోడ్లను నమోదు చేసింది. వాస్తవానికి వీరి లక్ష్యం యాప్ బేస్డ్ ప్రాడక్ట్ కాదు. ఫోకసంతా ఇన్ స్టిట్యూషనల్ సేల్స్ మీదనే పెట్టారు. త్వరలో సైట్ లో బేసిక్ టూల్ ప్రారంభించి, వ్యక్తిగతంగా ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేయాలని చూస్తున్నారు. హెల్త్ విషయంలో ఫెడోని బెంచ్ మార్క్ ఇండికేటర్ గా చేయాలన్నదే వీరి లక్ష్యం.

ఫెడో టీంలో మొత్తం ఐదుగురు ఉన్నారు. రాబోయే కొద్ది నెలల్లో మరింత అన్వేషణ చేపడతామంటున్నారు. దీనిపై వర్క్ చేస్తున్న ప్రతీ క్షణాన్నీ ఎంజాయ్ చేస్తున్నామని టీం సభ్యులు చెప్తున్నారు. అదీగాక టిస్సోట్ అవార్డు గెలుచుకోవడం చాలా బూస్ట్ ఇచ్చిందని చెప్పుకొస్తున్నారు. టిస్సోల్ లాంటి పెద్ద కంపెనీ తమని గుర్తించినుందకు గర్వంగా ఫీలవుతున్నారు. త్వరలో ఐపీఎల్ విన్నింగ్ సెలబ్రేషన్ లో పాల్గొనాలని ప్లాన్ చేస్తున్నారు. 

1+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags