సంకలనాలు
Telugu

ఆన్ లైన్ లేడీస్ టైలర్!!

RAKESH
14th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అస‌లే ఆఫీసు పార్టీ! హ‌స్బెండ్ తొంద‌ర‌పెడుతున్నారు! కానీ ఏ డ్ర‌స్సు వేసినా న‌చ్చ‌డం లేదు! అన్నీ ఆన్ లైన్ లో ముచ్చ‌ట‌ప‌డి కొన్నవే! కానీ ఏ ఒక్క‌టీ ఒంటికి ఫిట్ కావ‌డం లేదు! చాలా మంది ఆడవాళ్లు ఎదుర్కొనే స‌మ‌స్యే ఇది! మ‌రి వేల‌కు వేలు త‌గ‌లేసి కొన్న డ్ర‌స్సుల‌న్నీ బీరువాకే ప‌రిమితం కావాలా? దీనికి సొల్యూష‌న్ లేదా? ఎందుకు లేదు? స‌్టిచ్ మై ఫిట్ ఉందిగా!!

image


ఎంత కాస్ట్ లీ డ్ర‌స్సయినా ఒంటికి నప్పితేనే బాగుంటుంది. చూడ్డానికీ గాడ్జియ‌స్ గా క‌నిపిస్తుంది. కానీ బాడీకి పర్ ఫెక్టుగా ఫిట్ అయ్యే డ్రస్ దొరకడం అంత ఈజీ కాదు. షాపుల‌న్నీ తిరిగినా, చివ‌రికి ఆన్ లైన్ లో సైజు వెతుక్కుని మ‌రీ కొన్నా- ఏదో వెలితి. కానీ ఇప్పుడా ప్రాబ్లమ్ లేదంటున్నారు భావనా మోత్వాని. మీరు బొటిక్ కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. బొటికే మీ ఇంటికి వ‌స్తుందంటున్నారామె. ఇంత‌కీ ఎవ‌రీ భావ‌నా మోత్వాని?

చిన్న నాటి డ్రీమ్..

ఫ్యాష‌నిస్టా- అంటే ఫ్యాష‌న్ డిజైన‌ర్ గా మారిన టెకీ అని అర్థం. భావ‌నా మోత్వానీ ఐఐటీ రూర్కీలో ఇంజనీరింగ్ చదివారు. క్లాస్ లో టాప్. చదువయ్యాక నేరుగా ఐటీ జాబ్. లోకల్ బన్యా లాంటి స్టార్ స్టారప్స్ కు టెక్ ఆపరేషన్ హెడ్. పదేళ్ల అనుభవం. బిందాస్ లైఫ్. కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి. త‌న చైల్డ్ హుడ్ డ్రీమ్ వేరు. చేస్తున్న ఉద్యోగం వేరు. 40-45 ఏళ్లకు కార్పొరేట్ రంగం నుంచి రిటైర్ అయిపోయి, రొటీన్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి, సొంతంగా ఫ్యాషన్ బొటిక్ పెట్టాలన్నదే ఆమె కల. ఫ్యాషన్ అంటే అంత పిచ్చి ప్రేమ! అందుకే త‌న డ్రీమ్ నెర‌వేర్చుకున్నారు.

స‌రికొత్త‌ వ్యాపార ఆలోచన..

ఫ్యాష‌న్ మార్కెట్. రోజుకో కొత్త ఫ్యాషన్, డిజైన్ సంద‌డి చేస్తుంటుంది. అయితే అందులో చాలా అంత‌రాలు ఉన్న‌ట్టు భావ‌న‌ గుర్తించారు. త‌న లాంటి మ‌హిళ‌లు నిస్సంకోచంగా ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నా.. సంప్ర‌దాయ దుస్తుల ఎంపిక‌లో మాత్రం వారు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు తెలుసుకున్నారు. సాధార‌ణంగా ఇండియ‌న్ విమెన్ డిఫ‌రెంట్ బాడీ షేప్స్ లో ఉంటారు. వారికి ఇంట‌ర్నెట్ లో దొరికే స్టాండ‌ర్డ్ సైజు అప్ప‌ర్ బాడీకి సూట‌వుతుంది గానీ లోయ‌ర్ బాడీకి స‌రిపోదు. భావ‌న కూడా ఇలాంటి స‌మ‌స్యే ఎదుర్కొన్నారు. చ‌క్క‌టి డ్ర‌స్ కుట్టించ‌డానికి త‌ను ఉండే ప్రాంతంలో మంచి టైల‌ర్, బొటిక్స్ గురించి ఎంత వెతికినా ఫ‌లితం లేక‌పోయింది. అప్పుడే ఆమెకు ఒక‌ ఆలోచ‌న వ‌చ్చింది. అదే స్టిచ్ మై ఫిట్!

2015 ఆగ‌స్టులో స్టిచ్ మై ఫిట్ వెబ్ సైట్ స్టార్ట్ అయింది. ఇది కూడా ఒకరకంగా ఆన్ లైన్ షాపింగ్ లాంటిదే. కానీ మిగ‌తా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. సైట్ లోకి ఎంట‌రైన త‌ర్వాత న‌చ్చిన డ్రెస్ డిజైన్, క‌లర్ ఎంపిక చేసుకోవాలి. స్మాల్, మీడియం, లార్జ్ సైజుల బాధ ఉండ‌దు. క‌స్ట‌మ‌ర్ ఇంటికి స్టైలిస్ట్ ను పంపి కొల‌త‌లు తీసుకుంటారు. వాటికి అనుగుణంగా డ్రెస్ కుట్టి హోమ్ డెలివ‌రీ ఇస్తారు. సైజులో, డిజైన్ లో ఇంచు కూడా తేడా రాదు! అదే స్టిచ్ మై ఫిట్ స్పెషాలిటీ. కుర్తీస్, ట్యూనీస్, స‌ల్వార్ క‌మీజ్, పార్టీ వేర్, బ్లౌజెస్- ఇలా ఏది కావాల‌న్నా దొరుకుతుంది. ఒక్క‌సారి కొల‌త‌లు ఇస్తే స‌రిపోతుంది. డిజైన‌ర్లు వాటిని సేవ్ చేసి పెట్టుకుంటారు.

మొద‌ట్లో ఒక స్టైలిస్ట్ తో ప్రారంభ‌మ‌య్యాం. వివిధ ర‌కాల ఫ్యాబ్రిక్స్, పాట‌ర్న్స్ లో 20 రకాల డిజైన్లు రూపొందించాం. ఆన్ లైన్ లో ఒక కొత్త షాపింగ్ సిస్ట‌మ్ తీసుకొచ్చాం. క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా ఈ ఐడియా న‌చ్చింది. రెస్పాన్స్ కూడా బాగుంది- భావ‌న‌
image


అస‌లే పోటీ ప్ర‌పంచం! ఏది చేసినా డిఫ‌రెంట్ గా ఉండాల‌న్న‌ది భావ‌నా మోత్వానీ ఫిలాసఫీ. రోజురోజుకూ మారిపోయే ఫ్యాష‌న్ ట్రెండ్స్ కు త‌గ్గ‌ట్టుగా ప‌నిచేయాలన్న‌దే ఆమె ఐడియా. ముంబైలో చాలా మంది స్టైలిస్టులు ఉన్నారు. కానీ వారంతా త‌మ ఇల్లు లేదా బొటిక్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోని క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే సేవ‌లందిస్తున్నారు. కొంత‌మందికి సొంత బొటిక్ లు కూడా లేవు. వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని, ఇంకా డ‌బ్బు సంపాదించాల‌ని వాళ్ల‌కూ ఉంది. కానీ టెక్నాల‌జీ ప్రాబ్ల‌మ్. అందుకే అలాంటి వాళ్లంద‌రికీ ఒక ప్లాట్ ఫామ్ ఇవ్వాల‌నుకుంటోంది భావ‌న‌. బొటిక్ బిజినెస్ లో ఉన్న డిజైన‌ర్ల‌కు త‌న కంపెనీ స్టిచ్ మై ఫిట్ ద్వారా అవ‌కాశం క‌ల్పించాల‌నుకుంటోంది.

ప్ర‌స్తుతం చాలా ఈ-కామ‌ర్స్ పోర్ట‌ల్స్ కస్ట‌మ‌ర్ల స‌మ‌స్య‌ల కోసం ఒక గ్రీవెన్స్ సెల్ తో నెట్టుకొస్తున్నారు. ఇత‌ర ప్రోడ‌క్ట్స్ విష‌యంలో అయితే ఫ‌ర‌వా లేదు గానీ ఫ్యాష‌న్, దుస్తుల విష‌యంలో మాత్రం అది స‌రికాదంటారు భావ‌న‌. క‌స్ట‌మ‌ర్ల‌ను నేరుగా క‌లిసి వాళ్ల అభిరుచి, సైజుకి త‌గ్గ‌ట్టుగా డ్ర‌స్సులు కుట్టివ్వ‌డ‌మే క‌రెక్టు అంటున్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ మ‌ధ్య స‌మ‌తుల్యం పాటిస్తూ బిజినెస్ ర‌న్ చేస్తున్నానంటారు భావ‌న‌.

ఫ్యూచ‌ర్ ప్లాన్ ఇదీ..

భావ‌నా మోత్వానీ ఫ్రెండ్ నీతూ సింగ్ కంపెనీలో కో-ఫౌండ‌ర్ గా జాయిన్ అయ్యారు. ప్ర‌స్తుతం స్టిచ్ మై ఫిట్ లో ఎనిమిది బొటిక్ లు ఉన్నాయి. త్వ‌ర‌లో మ‌రో రెండింటిని యాడ్ చేయ‌నున్నారు. వారానికి కొత్త‌గా నాలుగు బొటిక్స్ అయినా యాడ్ చేసుకోవాల‌న్న‌దే భావ‌న ప్లాన్. వెబ్ సైట్ లో మొత్తం 200కు పైగా డిజైన్లు ఉన్నాయి. ముగ్గురు స్టైలిస్టులు, టైల‌రింగ్ టీం ప‌నిచేస్తోంది. నెల‌కు 200 వ‌ర‌కూ ఆర్డ‌ర్లు వ‌స్తుంటాయి. ఈ మ‌ధ్యే ఆఫీసు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కొత్త ఏడాది ప్ర‌థ‌మార్థంలో బీటీఎల్ (బిలో ద లైన్) సేల్స్ ప్ర‌మోష‌న్ కూడా చేయాల‌ని కంపెనీ భావిస్తోంది. అంత‌కాదు, అతి త్వ‌ర‌లోనే బెంగ‌ళూరు, ఢిల్లీకి బిజినెస్ విస్త‌రిస్తానంటున్నారు భావ‌నా మోత్వాని!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags