సంకలనాలు
Telugu

అందవిహీనాన్ని ఆత్మస్థైర్యంతో జయించిన ధీర వనిత గాథ

వైక్యలంతో బాధపడుతున్నవారిలో ధైర్యాన్ని నింపేందుకు డాక్యూమెంటరీని రూపొందిస్తున్న లిజీ

GOPAL
9th Jul 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

ఓ స్థానిక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ తన జీవితాన్నే మార్చేస్తుందని లిజీ వెలస్క్వీజ్ ఎప్పుడు ఊహించలేదు. ఆ ఇంటర్వ్యూ ‘యూట్యూబ్’లో ‘ది వరల్డ్స్ అగ్లియెస్ట్ విమెన్’ పేరుతో అప్‌లోడ్ కూడా చేశారు. ఈ వీడియోను చూసి చాలామంది విచిత్రమైన కామెంట్లు చేశారు. వికృతంగా ఉన్నావంటూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఐతే యూట్యూబ్‌లో ఆ వీడియోని 40 లక్షల మందికిపై వీక్షించారు. 

‘‘లిజీ ప్లీజ్, ప్రపంచానికి ఒక ఫేవర్ చెయ్యి. నిన్ను నువ్వు కాల్చుకుని చచ్చిపో’ అంటూ కొందరు వ్యాఖ్యానించారు.

లిజీ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఆమె ఎప్పటికీ బరువు పెరగలేరు. ప్రపంచంలో ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నవారు లిజీతో కలిపి ముగ్గురు మాత్రమే. ఈ సిండ్రోమ్ కారణంగా ఆమె శరీరంలో ఎలాంటి కొవ్వూ(ఫ్యాట్) ఉండదు. అంటే ఆమె శరీరంలో ఎప్పటికీ కొవ్వు ఏర్పడదు. దీని కారణంగా ప్రతి 15 నిమిషాలకోసారి ఆమె ఏదైనా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆమె పెరిగిన అత్యధిక బరువు 29 కిలోలు మాత్రమే. అలాగే లిజీకి కుడి కన్ను కూడా కనిపించదు. ఇతరులకైతే ఇవన్నీపెద్ద అవరోధాలే. కానీ లిజీ మాత్రం ఇవి తనకు ఆశీస్సులేని అంటున్నారు. 

‘ఈ సమస్య కారణంగా నేను ఎంత తిన్నా కొవ్వురాదు’’ అని ఆమె తనపైనే తాను జోక్ వేసుకుని నవ్వుకుంటారామె.
లిజీ వెలస్క్వీజ్

లిజీ వెలస్క్వీజ్


లిజీ పుట్టినప్పుడు, ఆ శిశువు ఆకారాన్ని చూసి హాస్పిటల్‌లో అంతా విస్తుపోయారు. డాక్టర్లయితే ఈమె నడువలేదని, పాకలేదని, తనంతట తాను, ఎవరి సాయమూ లేకుండే ఏ పనిచేసుకోలేదని స్పష్టం చేశారు. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం నిరాశ చెందలేదు. తమకున్నదానితో తమ కూతురిని సంతోషంగా పెంచుకుంటామని చెప్పారు.

తనలో ఇంత పోరాట స్ఫూర్తి రేకెత్తడానికి తన తల్లి మద్దతే కారణమని లిజీ అంటారు. తొలిసారిగా లిజీ స్కూల్‌కు వెళ్లిన సమయంలో ఆమె ఆకారం తాబేలులా ఉండేది. ఆమె వెన్నువైపు లావుగా ఉండేది. దీంతో ఎవరూ కూడా లిజీతో మాట్లాడేందుకు ఇష్టపడేవారు కారు.

దీంతో ఆమె తన తల్లిదండ్రులను అడిగారు ‘నేనే ఎందుకిలా ఉన్నాను అని?’. ఓ అరుదైన వ్యాధి కారణంగా, మిగతా పిల్లలతో పోలిస్తే కాస్త విభిన్నంగా ఉంటావని చెప్పి, లిజీని ఊరడించే ప్రయత్నం చేశారు ఆమె తల్లిదండ్రులు. కానీ ఆ వ్యాధి నీకు ఏ విధంగానూ అడ్డుకాబోదని వివరించి చెప్పారు. ఎవరూ ఇష్టపడకపోయినా స్కూల్‌కు వెళ్లాలని, వ్యాధిని తలచుకుని బాధపడొద్దని చెప్పి, లిజీలో స్ఫూర్తినింపారు.

లిజీ వెలస్క్వీజ్

లిజీ వెలస్క్వీజ్


‘‘నా గురించి ప్రజల‌కు ఓ అభిప్రాయం ఏర్పరచ్చేది బాహ్యా ఆకారమేనని నేను భావించేదాన్ని. నా ఆకారం అసహ్యంగా ఉంది. అందరికీ చీదరపుట్టిస్తుందేమోనని భయపడ్డాను. పొద్దున లేవగానే, అద్దంలో చూసుకుని నన్నునేను అసహ్యించుకునేదాన్ని. కానీ ఆ తర్వాత తెలుసుకున్నాను. జీవితాన్నిమంచిగా మలుచుకోవాలన్నా, పాడు చేసుకోవాలన్న అది నా చేతిలోనే ఉందని గ్రహించాను. ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకోవాలనుకున్నాను. నా విజయాలు, నా ఘనతలే నన్ను నిర్వచిస్తాయని నిర్ణయించుకున్నాను’’ అని లిజీ వివరించారు.

లిజీ ప్రస్తుతం స్ఫూర్తిదాయకమైన వక్త. అంతేకాదు మంచి రచయిత్రి కూడా. ఇప్పటికే మూడు పుస్తకాలను రచించారు. ఆమె రాసిన తొలి పుస్తకం ‘లిజీ బ్యూటిఫుల్’.. తనకు జీవితంలో ఎదురైన అడ్డంకులు, తాను చేసిన పోరాటాల గురించి, బాహ్య ఆకారానికి సమాజం ఇచ్చే ప్రాధాన్యత గురించి ఇందులో వివరించారామె. లిజీ చిన్నప్పుడు, ఆమె తల్లి రాసిన వ్యాఖ్యలను కూడా అందులో పొందుపర్చారు. ఆ పుస్తకం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఇక ఆమె రాసిన రెండో పుస్తకం ‘బీ బ్యూటిఫుల్, బీ యూ’. ఇందులో ఆత్మనూన్యతతో బాధపడుతున్నవారికి ఆమె సలహాలు ఇచ్చారు. నెగటివిటీ, ప్రతికూలంశాలను ఎదుర్కోవడమెలా అన్నఅంశాలను వివరించారు, వ్యక్తిగత యోగా చేస్తూ, వాస్తవికమైన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకోవాలని సూచించారు.

ఈ రెండో పుస్తకం గురించి ఎడిటోరియల్ రివ్యూలో ఇలా రాశారు

‘‘సెలబ్రిటీల ఫొటోలు.. ప్లాస్టిక్ సర్జరీలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో లిజీ వెలస్క్వీజ్ ఓ స్వచ్ఛమైన సహజ శక్తి. ఈమె స్టోరీ ఎంతో మందికి ఆదర్శం. ఒంటరిగా ఫీలయ్యే, అపార్థాలు చేసుకునే, భయపడే వ్యక్తులతోపాటు .. ఎందరికో ఈమె స్టోరీ స్ఫూర్తి ప్రదాత’’ అని వివరించారు.

ప్రస్తుతం లిజీ ఓ డాక్యూమెంటరీని రూపొందించే పనిలో ఉన్నారు. సమస్యలు, ప్రతికూలాంశాలతో బాధపడే, పోరాటం చేసే వ్యక్తులు ధైర్యంగా సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశాలను ఈ డాక్యూమెంటరీలో పొందుపర్చనున్నారు. భవిష్యత్‌లో ఎవరూ కూడా ఆత్మన్యూనతతో బాధపడకూడదన్న ఉద్దేశంతో ఆమె ఈ డాక్యూమెంటరీని రూపొందిస్తున్నారు.

ఆమె తన లక్ష్యాన్ని చేరుకోవాలని యువర్‌స్టోరీ కూడా కోరుకుంటోంది. చిన్న విషయాలకే డిప్రెషన్‌లోకి కూరుకురపోయే మనలాంటి ఎంద‌రికో ఈమె స్ఫూర్తి ప్రదాత.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags