2016లో స్టార్టప్స్ జాతకం ఎలా ఉండబోతోంది..?

స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియాపై యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ దృష్టిస్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలివ్వాలని వినతి

2016లో స్టార్టప్స్ జాతకం ఎలా ఉండబోతోంది..?

Thursday January 14, 2016,

4 min Read

భారత్ లో స్టార్టప్ లేని జిల్లా, ప్రాంతం అంటూ ఏదీ ఉండకూడదు. ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్ష ఇది. దీన్ని నిజం చేయడంతో పాటు యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ ను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రారంభించనున్న కార్యక్రమం స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా. ఈ నెల 16న దీనికి సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ బ్లూప్రింట్ ప్రకటించనున్నారు. స్టార్టప్ ప్రారంభించాలనుకునే ఉత్సాహవంతులైన ఎంట్రప్రెన్యూర్స్ కు అవసరమైన సహాయ సహకారాలందించేందుకు రూపొందించిన పథకాలు, ప్రణాళికలను మోడీ ఆవిష్కరించనున్నారు. స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా ప్రోగ్రాం యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ కు కొత్త ఏడాదిలో వినూత్న ఆవిష్కరణలు రూపకల్పనకు సాయం చేయనుంది.

ఉత్సాహవంతులైన యువతలో దాగి ఉన్న ప్రతిభను చాటుకునేందుకు స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియాతో అవకాశం కల్పిస్తుండటంతో ఈ దశాబ్దం డెకేడ్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్స్ గా నిలిచిపోతుందన్నది ఇన్ఫోసిస్ కో ఫౌండర్, ఇన్వెస్టర్ ఎన్. ఆర్. నారాయణ మూర్తి అభిప్రాయం.

“పారిశ్రామికవేత్తల తారాబలం బాగుందనుకుంటు న్నాను. అందుకే ఈ దశాబ్దం డెకేడ్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్స్ గా నిలిచిపోనుంది.”- నారాయణ మూర్తి

ప్రపంచ బ్యాంకు 6 నెలలకోసారి వెలువరించే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ తాజా రిపోర్ట్ గ్లోబల్ ఎకానమీలో ఇండియా బ్రైట్ స్పాట్ గా మారుతుందని అభిప్రాయపడింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.8శాతం వృద్ధి నమోదుచేస్తుందని అంచనా వేస్తోంది. ఇది చైనా వృద్ధి రేటు కన్నా ఒక శాతం ఎక్కువని అంటోంది.

image


కొత్త ఏడాదిలో భారత స్టార్టప్స్ దూసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నది పరిశ్రమ వర్గాల అంచనా. యువర్ స్టోరీ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం 2015లో ఇన్వెస్టర్లు ఇండియన్ స్టార్టప్స్ లో 9 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ మొత్తం గత ఐదేళ్లలో పెట్టిన పెట్టుబడుల్లో 50 శాతం కావడం విశేషం. అయితే స్టార్టప్స్ జోరు కొనసాగాలంటే మాత్రం వాటికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది..

వాస్తవానికి ఇండియన్ స్టార్టప్ లో పెట్టుబడిన పెట్టిన కంపెనీల్లో చాలా వరకు సింగపూర్, యూఎస్ లో రిజిస్టరై ఉన్నాయి. అందుకే వాటిని పూర్తిగా ఇండియన్ స్టార్టప్స్ అని భావించలేం. కంపెనీలు ఇతర దేశాల్లో రిజిస్టర్ చేసుకోవడం వెనుక కూడా కారణముంది. వ్యాపారానుకూల దేశాల గ్లోబల్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 142 కాగా.. సింగపూర్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

స్టార్టప్ ఇండియాలో భాగస్వామి అయిన యువర్ స్టోరీ జరిపిన సర్వేలో చాలా మంది ఆంట్రప్రెన్యూర్స్ స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియాపై చాలా ఆశలు పెట్టుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా స్టార్టప్స్ నిబంధనలు సులభతరం చేయాలని వారంతా కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పన్ను చట్టాల్ని సవరించడమన్నది వారి రెండో కోరిక. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న ట్యాక్సుల భారం స్టార్టప్ బిజినెస్ ను దెబ్బతీస్తోంది. నిధుల లభ్యత, వనరుల కొరత, ఇంక్యుబేషన్ స్పేస్, మెంటార్లు లేకపోవడం ఇవన్నీ కూడా స్టార్టప్స్ కు సమస్యగా మారుతున్నాయి.

2015 స్టార్టప్లకు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. కొన్ని హిట్టయితే మరికొన్ని ఫట్ మనిపించాయి. ఇండియన్ స్టార్టప్స్ సిస్టం ఈ ఏడాది ఎలా ఉండబోతోందన్న అంశంపై యువర్ స్టోరీ జరిపిన సర్వేలో పారిశ్రామిక పండితుల వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

image


ఇండియన్ స్టార్టప్స్ ను ప్రోత్సహించే ప్రముఖ ఇన్వెస్టర్, మెంటర్ టీవీ మోహన్ దాస్ పాయ్ 2025 నాటికి ఇండియన్ స్టార్టప్స్ మేజర్ జాబ్ క్రియేటర్స్ గా మారతాయని అంటున్నారు. ప్రస్తుతం భారత్ లో 18వేల స్టార్టప్స్ ఉండగా.. వాటి విలువ 75బిలియన్ డాలర్లుగా ఉంది. 2025 నాటికి వీటి సంఖ్య లక్షకు చేరి విలువ 500 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. స్టార్టప్ ల ద్వారా 35 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. కంపెనీ ప్రారంభానికి సంబంధించి విధివిధానాలు సులభతరం చేయాలన్నది ఆయన డిమాండ్. స్టార్టప్స్ ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి 36అంశాలను ఇప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు మోహన్ దాస్ పాయ్.

“కాలేజీలు, యూనివర్సిటీల్లో 500 ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేయాలని సూచించాం.” - స్టార్టప్స్ ప్రారంభమైన ఐదేళ్ల వరకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నది మోహన్ దాస్ పాయ్ చేస్తున్న మరో కీలకమైన సూచన. తాము ఐదేళ్ల పాటు పూర్తిగా పన్ను మినహాయింపు కోరడం లేదని కేవలం ఈ రంగాన్ని ప్రోత్సహించాలని మాత్రమే కోరుతున్నామని అంటున్నారు. ట్యాక్స్ ఇంటెన్సివ్స్ వల్ల ఎంట్రప్రెన్యూర్స్ పన్నులకు సంబంధించిన ఆందోళన లేకుండా వ్యాపారం, ఆదాయం, విస్తరణపై దృష్టి కేంద్రీకరించే అవకాశం కలుగుతుందన్నది మోహన్ దాస్ పాయ్ మాట.

సిటీ ఇంక్యుబేషన్స్ కు ప్రోత్సాహం

“సిటీ ఇంక్యూబేషన్ సెంటర్స్ ను ప్రోత్సహించాలని మరికొందరు కోరుతున్నా రు. సిటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే యువత కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూనే స్టార్టప్స్ పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. స్టార్టప్స్ కోసం మెట్రో నగరాలు, మహా నగరాల వైపు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. వయసు పైబడిన వారిని సొంత ఊళ్లలో వదిలేసి యువత పట్టణాల వైపు పరుగులు తీయడం ఏ దేశానికి కూడా మంచిది కాదు” - అనిల్ కే గుప్తా, హనీ బీ నెట్ వర్క్ ఫౌండర్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వైస్ ఛైర్మన్.

image


“తక్కువ వనరులు, ఎక్కువ ఆదాయం ఇచ్చే లీన్ మోడల్ ప్రాధాన్యాన్ని స్టార్టప్స్ ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. సమర్థులైన ఉద్యోగుల ఎంపిక చేసుకోవడంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.” -ఆనంద్ లూనియా ఇండియా కోషెంట్ ఫౌండర్

“భవిష్యత్తులో లీన్ మోడల్ కు ప్రాధాన్యం పెరగనుంది. పెట్టుబడుల కాస్త మందగించినా.. ఇన్వెస్టర్లు విచక్షణతో నిధులు సమకూర్చుతారు. చాలా స్టార్టప్స్ ప్రాంతీయ బాషల సాయంతో జనానికి చేరువయ్యేలా ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నాయి. దేశమంతటా కొత్త వస్తువుల ఉత్పత్తి విస్తృతం కానుంది.” -అప్రమేయ రాధాకృష్ణ, టాక్సీ ఫర్ ష్యూర్ కో ఫౌండర్, ఏంజిల్ ఇన్వెస్టర్

కొత్త ఆవిష్కరణలతో విజయం తథ్యం

image


“ఈ ఏడాది గ్రామాల రూపు రేఖల్ని మార్చే సరికొత్త ఆవిష్కరణలు రావాలని కోరుకుంటున్నాం. అప్పుడే కోరుకున్న అభివృద్ధి సాధ్యమవుతుంది. బిజినెస్ టు కస్టమర్ సెగ్మెంట్ లో ఫండింగ్ చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీలపైనే దృష్టి పెడుతున్నారు. భారత కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నాయి. భారత వ్యవస్థపైనా వారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.” -అంకితా వశిష్ఠ, సాహా ఫండ్ ఫౌండర్

“కంపెనీల్లో నిపుణులైన ఉద్యోగుల్ని తీసుకోవడం, నైపుణ్యం ఉన్న వారిని ఇతర కంపెనీల నుంచి తమ కంపెనీల్లో చేర్చుకోవడం సాధారణమైపోనున్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగుతుండటంతో ఇప్పటి వరకు మనం ఊహించని డిజిటల్ విప్లవం రాబోతోంది. భవిష్యత్తులో ఇండియన్ యాప్స్ జనాల్లోకి మరింతగా చొచ్చుకెళ్తాయి. అంతే వేగంగా అభివృద్ధి చెందుతాయి.” -అమిత్ సోమని, ప్రైమ్ వెంచర్ మేనేజింగ్ పార్టనర్

image


“ఇండియన్ ఈ కామర్స్ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తి చూపుతాయి. కానీ వారు విచక్షణను ప్రదర్శిస్తూ పెట్టుబడులు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యమిచ్చే స్టార్టప్స్ మాత్రమే దూసుకుపోతాయి. వేరొకరి ఆలోచనలపై కాకుండా మన ఆలోచనలను నమ్ముకోవడం ఉత్తమం.” -కశ్యప్ దేవరా, ఎంట్రప్రెన్యూర్, ది గోల్డెన్ ట్యాప్ రచయిత

“2016 ఒక అద్భుతమైన సంవత్సరంగా నిలిచిపోనుంది. ఈ ఏడాది చాలా స్టార్టప్స్ భారీగా నిధులు సమీకరించుకుంటాయి. సీరీస్ సీ ఫండింగ్ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. ఇన్వెస్టర్లు కంపెనీల ఆదాయం, వృద్ధిని చూసి ఫండింగ్ చేస్తారు.” - సుమేర్ జునేజా, నార్వెస్ట్ వెంచర్ పార్ట్ నర్ ప్రిన్సిపల్

తస్మాత్ జాగ్రత్త

image


భారత్ లో స్టార్టప్స్ కు వాతావరణం ప్రోత్సాహకరంగా ఉన్నా.. 10శాతం కొత్త కంపెనీలు మాత్రమే విజయం సాధిస్తాయి. చాలా స్టార్టప్స్ ఐడియాలు ఫెయిల్ అవుతాయి. పట్టుదల, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలున్న ఎంట్రప్రెన్యూర్స్ ను మాత్రమే విజయం వరిస్తుంది. అపజయాలకు భయపడకుండా ముందుకు సాగాలన్నదే స్టార్టప్ కల్చర్ మనకు నేర్పే పాఠం. కింద పడితే మళ్లీ లేచి నిలబడాలి అప్పుడే విజేతగా నిలవగలం అంటారు మోహన్ దాస్ పాయ్.