సంకలనాలు
Telugu

రీచార్జ్, టాప్ అప్‌తో సోలార్ కరెంట్ - గ్రామాల్లో సింఫా నెట్వర్స్ వినూత్న వ్యాపారం

గ్రామీణ జీవితాల్లో వెలుగులు నింపుతున్న సింఫా నెట్వర్క్స్ గ్రామీణ పట్టభద్రులకు ఉపాధి సౌరశక్తి వర్తకం ద్వారా లక్షల టర్నోవర్గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తున్న సోలార్ పవర్

team ys telugu
18th Jun 2015
Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share

కొన్నేళ్ల క్రితం టాంజానియాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ మహిళ మదిలో తళుక్కుమన్న ఆలోచన.. నేడు భారతదేశం మారుమూల పల్లెల్లో కొత్త రకం వర్తకానికి తెరలేపింది. ఓ చదరపు మీటర్ పొడవున్న సోలార్ ప్యానల్‌ను కొనుగోలు చేసిన ఆమె... దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో చుట్టుపక్కల వారి మొబైల్ ఫోన్‌లకు ఛార్జింగ్ చేసి ఇచ్చేది. అయితే ఇందుకుగానూ ఎంతోకొంత మొత్తాన్ని ఛార్జ్ చేసేది కూడా..! రానురాను ఈ వ్యాపకమే ఆమె ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఓ సారి అనుకోకుండా ఆ టాంజానియా మహిళను కలిసిన పౌల్ నీధామ్ ఆమె వినియోగిస్తున్న టెక్నాలజీకి ముగ్ధుడవ్వడమే కాదు.. మరికొంత మందితో కలసి "సింపా నెట్వర్క్స్" కు శ్రీకారం చుట్టేశాడు.

image


ఓ మహిళ ఆలోచన.. ఉచితంగా లభించే సౌరశక్తి అమ్మకం ద్వారా ఓ నూతన పరిశ్రమను నెలకొల్పడమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరికో ఉపాధి కల్పించడంతోపాటూ, దారిద్ర్య రేఖ దిగువున ఉండే గ్రామీణ జీవితాల్లో వెలుగులనూ నింపుతోంది.

"గ్రామీణ భారతదేశంలో సౌరశక్తి వినియోగం ఇంకా అందుబాటులోకి రాకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. సోలార్ ప్యానెళ్ల ధర అధికంగా ఉండటం ఇందుకు ఓ కారణమైతే... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడటం, సౌరశక్తి వినియోగదారుల నుంచి వసూళ్లు రాబట్టుకోవడంలోని సమస్యలు ఈ రంగంలోని పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెడుతున్నాయ"ని చెబుతున్నారు పౌల్.

సింఫా నెట్వర్క్స్‌ను స్థాపించిన పౌల్.. నేడు 270 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు, 350 మంది గ్రామీణ వర్తకుల సేవలు వినియోగించుకుంటూ... భారతీయ బీఓపీ మార్కెట్‌లో సంచలనమే సృష్టించారు. ప్రస్తుతం ఈ సంస్థ సేవలను 9వేల మంది వినియోగించుకుంటున్నారు.

image


గ్రామీణ ప్రాంతాల్లో ఖరీదైన సోలార్ ప్యానెళ్లను కొనలేని వారి వద్ద కొంత రుసుము చెల్లించుకుని తమ సేవలు అందిస్తోంది సింఫా నెట్వర్క్స్. "వినియోగదారులు ముందుగా కొంత మొత్తాన్ని చెల్లిస్తే... వారి ఇంటికి సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తాము. ఆ తరువాత రీచార్ట్ లేదా టాప్ అప్ కార్డ్ ద్వారా... వారు మా సేవలను వినియోగించుకోవచ్చు. అందుకోసం ప్రతి గ్రామంలోనూ కొన్ని రీచార్జ్ పాయింట్ లను ఏర్పాటు చేశాము. 18నెలల కాంట్రాక్ట్ పూర్తయ్యాక... సోలార్ సిస్టమ్ దానంతట అదే అన్ లాక్ అవుతుంది. ఆ తరువాత వినియోగదారులు ఉచితంగానే సౌర విద్యుత్తును ఉపయోగించుకోవచ్చున"ని వివరిస్తున్నారు సింఫా నెట్వర్క్స్ సహ-వ్యవస్థాపకుడు పౌల్.

సింఫా నెట్వర్క్స్ మూడు ప్రధాన స్థాయిల్లో తమ వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

  • తొలుత గ్రామీణ స్థాయిలోని మా పంపిణీదారులు తమ బంధువులకు, స్నేహితులకు సరసమైన ధరకే సింఫాను అందిస్తారు. మార్కెట్‌ను బలోపేతం చేసుకునేందుకు, వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనడంలో ఈ ప్రక్రియ ఎంతో కీలకం. ప్రస్తుతం సింఫా నెట్వర్క్స్ లో శిక్షణ పొందిన సుమారు 350 మంది ప్రతినిధులు గ్రామీణ స్థాయిలో మా మార్కెట్‌ను పటిష్టం చేసే పనిలో ఉన్నారు.
  • తర్వాతి స్థాయిలో వినియోగదారుల ధరఖాస్తులను మా అధికారులు పరిశీలిస్తారు. మా యాజమాన్య నిబంధనల ప్రకారం సదరు ధరఖాస్తులను ఎంపిక చేస్తారు.
  • అనంతరం మా వద్ద శిక్షణ పొందిన సోలార్ టెక్నీషియన్లు.. ఎంపికైన ధరఖాస్తుదారుల ఇళ్లకు సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు పట్టభద్రులను ఎంపిక చేసి వారికి సరైన శిక్షణ ఇచ్చిన అనంతరం.. సోలార్ టెక్నీషియన్లుగా మా వద్దే ఉపాధి కల్పిస్తాం. ఇందుకు కావాల్సిన సామాగ్రిని, సోలార్ కిట్‌ను కొనుగోలు చేసేందుకు వారికి లోన్ కూడా మంజూరు చేస్తాం. అయితే ప్రారంభంలో సోలార్ టెక్నీషియన్లు కొన్ని కనెక్షన్లు ఫిక్స్ చేసే వెసులుబాటూ మేమే కల్పిస్తాం. కొత్తగా ఉపాధిపొందిన వారికి ఇది ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుంది.

సెల్కో ఇండియా భాగస్వామ్యంతో... 2010 నుంచి మొదలుకుని కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు తమ సేవలను అందిస్తోంది సింఫా నెట్వర్క్స్. 2013లో చైనా, బెంగళూరులోని రెండు సంస్థల భాగస్వామ్యంతో తమ సేవలను ఉత్తర్ ప్రదేశ్ లోని 8 జిల్లాలకూ విస్తరించారు.

image


2014 సెప్టెంబరులో సింఫా నెట్వర్క్స్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టిన టర్బో అత్యంత భారీగా అమ్ముడుపోయిన ఉత్పత్తిగా రికార్డ్ సృష్టించింది. " ఏళ్లుగా వినియోగదారుల నుంచి సేకరించిన అభిప్రాయాలను, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని టర్బోను తీర్చిదిద్దాం. ఇక సోలార్ హోమ్ సిస్టమ్‌లో ఓ 40వాట్ల ప్యానెల్, మూడు లైట్లు, ఓ ఫ్యాన్, రెండు మొబైల్ చార్జింగ్ పాయింట్లు అందజేస్తాం. ఈ సిస్టమ్ 12గంటలపాటు నిరంతరాయంగా 110 వాట్ల విద్యుత్త్‌ను అందిస్తుంది. ఆరు నెలల తరువాత వినియోగదారుడు సోలార్ సిస్టమ్‌ను పూర్తిగా సొంతం చేసుకునే "ఫ్లెక్సీ ప్లాన్" ను కూడా మా సంస్థ ప్రవేశపెట్టింద"ని తమ ఉత్పత్తులు, సేవల గురించి సుధీర్ఘంగా వివరిస్తున్నారు పౌల్.

పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లు త్వరితగతిన సేవలు అందించేందుకు సింఫా ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటూనే ఉంది. "కొన్నిసార్లు నిర్ణీత సమయంలో ఉత్పత్తిని వినియోగదారునికి చేరవేయడంలో పంపిణీదారులు విఫలమువుతున్నారు. కాబట్టి, అన్ని స్థాయిల్లోనూ పంపిణీదారులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మేము అందించే సేవలకు మించి కొనుగోళ్లు జరుగుతున్నాయి. గ్రామీణ స్థాయిలో వినియోగదారులకు సేవలు అందించేందుకు సోలార్ టెక్నీషియన్ల కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు.. గ్రామీణ స్థాయిలో టెక్నీషియన్లకు తరచూ శిక్షణా తరగతులను నిర్వహిస్తూనే ఉన్నాము. నిర్ణీత లక్ష్యాల ద్వారా వారికి ఇంటెన్సివ్ లు ఇస్తున్నాం"

తమ విజయప్రస్థానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న సింఫా నెట్వర్క్స్ బృందం.. 2019 నాటికి పది లక్షల మంది వినియోగదారులకు తమ సేవలు అందించే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది.

Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share
Report an issue
Authors

Related Tags