సంకలనాలు
Telugu

ఇండియా ఇంక్రెడిబుల్... మరి ఇండియన్స్ సంగతేంటి..?!

"కశ్మీర్ టు కేరళ" చుట్టొచ్చిన పర్యాటకురాలు కేథరిన్ మెమరీస్....

SOWJANYA RAJ
21st Mar 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


కశ్మీర్ లో కనువిందు చేసే వెండికొండలు... 

తీరప్రాంతాల్లో ఉల్లాసపరిచే బీచ్ లు... 

ఈశాన్యంలో అబ్బురంగా కనిపించే హిల్ స్టేషన్లు... 

దక్షిణాదిన పరవశింపచేసే ప్రకృతి సౌందర్యం... 

 ఓహ్... తల్చుకుంటనే ఇన్‌క్రెడిబుల్ ఇండియా అనకుండా ఉండలేరు. 

విదేశీ పర్యాటకులకైతే మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

అలాంటి ఆసక్తితోనే ఇండియాని ఎక్స్ ప్లోర్ చేయాలనే ఉద్దేశంతో నాలుగైదు నెలల లాంగ్ టూర్ పెట్టుకున్నారు ఇంగ్లాండ్ కు చెందిన కేథరిన్ లిగ్గాత్. సోలో ట్రావెలింగ్ పై అమిత ఆసక్తితో ఎన్నో దేశాలు చూసిన కేథరిన్... భారత్ కు మాత్రం బాయ్ ఫ్రెండ్ డేవిడ్ తో వచ్చారు. కొత్త ప్రదేశాలను ఒంటరిగా ఆస్వాదించడంలో డేవిడ్ కూడా పట్టభద్రుడే. అయితే ఇన్‌క్రెడిబుల్ ఇండియాని మాత్రం ఇద్దరూ కల్సి అస్వాదించాలనుకున్నారు. 

కానీ వారికి ఒక్కటే అనుమానం ఇండియా ఇన్ క్రెడిబులే .. మరి ఇండియన్స్..! ....

గతంలో జరిగిన.. మీడియాలో వచ్చిన ఎన్నో ఘటనలు గురించి తెలుసుకున్నారు.. తమకు అలాంటి అనుభవాలు ఎదురుకావనే గట్టిగా నమ్మారు. ఆ విశ్వాసంతోనే భారతగడ్డపై అడుగుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది...? ...

కేథరిన్ మాటల్లోనే చదువుదాం...

"మేం ఢిల్లీలో అడుగుపెట్టి అప్పటికీ నాలుగు గంటలే అయింది. నీట్ గా డ్రెస్ చేసుకుని రెస్పెక్ట్ ఇవ్వాలనిపించేలా ఉన్న వ్యక్తి మాదగ్గరకు వచ్చాడు. ఓ ట్రావెల్ ఆఫీసుకు తీసుకెళ్లాడు. మేము అతన్ని చాలా మంచి వ్యక్తిగా భావించాం. కానీ అతను మమ్మల్ని వేరే ఆఫీసుకు తీసుకెళ్లాడు. అతి ఎక్కువ ఖర్చుకు టూరిజం ప్యాకేజీ కొనిపించే ప్రయత్నం చేశాడు." అమృత్ సర్ వెళ్లి గోల్డెన్ టెంపుల్ ను చూసి సిక్కుల సంస్కృతి, సంప్రదాయాలను అవగాహన పెంచుకుందామనుకున్న మాకు.. మొట్టమొదటగా ఎదురైన అనుభవం ఇది. ఎలాగోలా ఆ డూప్ గాడి నుంచి తప్పించుకుని బయటపడ్డాం.

డేవిడ్ తో కేథరిన్<br>

డేవిడ్ తో కేథరిన్


కానీ తర్వాత రోజు....

"ఢిల్లీ రైల్వే స్టేషన్ లో నిలుచుని ఉండగా ఓ వ్యక్తి వచ్చి నా మీద చేయి వేయబోయాడు. కానీ అతను.. నా వెనుక డేవిడ్ ఉన్న విషయాన్ని గుర్తించలేదు. అతను నా మీద చేయి వేసేలోపే డేవిడ్ అతన్ని ఓ చరుపు చరిచాడు. ఉలిక్కిపడిన అతను వెళ్లిపోయాడు. నేనూ డేవిడ్ పడీపడీ నవ్వుకున్నాం... "...

తొలి రోజుల్లోనే చేదు అనుభవాలు చూసినా ... అమృత్ సర్ అందాలు మాత్రం అద్భుతం. అక్కడి యూనిక్ కల్చర్, ఫుడ్... జీవితాంతం నెమరు వేసుకోవచ్చు. అక్కడ దొరికే ప్రతి తినుబండారాన్ని కనీసం రెండుసార్లు టేస్ట్ చేయాలనిపిస్తుంది. 

కొన్ని తెలిసొచ్చిన అనుభవాలతో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. నిండుగా డ్రెస్ చేసుకోవడంతో పాటు సన్ గ్లాసెస్ పెట్టుకున్నాం. ఫేస్ ఫీలింగ్స్ ను కనిపించకుండా ఉంచడానికి. పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు మర్యాదగా అడిగిన వారందరితోనూ ఫోటోలు దిగాను. కానీ అడగకుండా ఫోటోలు తీసేవారిని మాత్రం వదిలిపెట్టలేదు. మ్యానర్స్ పై క్లాస్ పీకడానికి వెనుకాడలేదు. గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమీ జరగకూడదని అనుకుంటూ గట్టిగా గాలి పీల్చి వదిలి ప్రశాంతంగా వచ్చేస్తాము. కొన్నిసార్లు ఆరోజు ఓ సాహసంలా... మరికొన్ని రోజులు అదో అద్భుత అనుభవంగా జరిగిపోయింది.

మంచి వాళ్లూ ఉన్నారు...

అయితే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినంత మాత్రాన భారతీయులందరికీ అలాంటి ట్యాగ్ నే తగిలించలేము. ఎందుకంటే మా ప్రయాణంలో చాలా మంది మంచివాళ్లు, సరదా మనుషులు కూడా తారసపడ్డారు.

అమృత్ సర్ పర్యటనలో ఉన్నప్పుడు ముగ్గురు ఫోటోగ్రాఫర్లు... డేవిడ్ కు తలపాగా పెట్టి అద్భుతమైన ఫోటోషూట్ చేశారు. ఖజురహోలో స్టే చేసినప్పుడు అక్కడి వెయిటర్... షిప్టుల మధ్య ఖాళీ సమయంలో వాళ్ల పొలానికి తీసుకెళ్లాడు. అతని కుటుంబసభ్యులను పరిచయం చేశాడు. వారందరితో మేం సరదాగా గడిపాం. ఇలాంటి అద్భుతమైన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి.

అమృత్ సర్ లో కేథరిన్, డేవిడ్<br>

అమృత్ సర్ లో కేథరిన్, డేవిడ్


"రాజస్థాన్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలంతా మమ్మల్ని వింతగా చూసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే మా నుంచి వాళ్లు కళ్లు తిప్పేవాళ్లు కాదు. తర్వాత మాకు అర్థమయిందేమిటంటే... వారు ఓ తెల్ల అమ్మాయి, నల్ల అబ్బాయి కలసి తిరగడాన్ని అంతవరకూ చూసి ఉండి ఉండరు. కొంతమంది భారతీయ మిత్రులు ఇక్కడి వివాహ వ్యవస్థ, కుల ప్రాధాన్యం గురించి వివరించినప్పుడు ఆ విషయం ఆర్థమయింది. అయితే ఇది కొంచెం జీర్ణించుకోలేని విషయమే" 

మళ్లీ.. మళ్లీ గుర్తు చేసుకోలేని అనుభవం

అది ముంబైకి వచ్చిన సమయం. గుర్తు చేసుకోవాలంటేనే మనసుని కష్టపెట్టుకోవాలి. కొలాబా బీచ్ లో మేము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి నా వెనకాల మీద చెత్తో బలంగా కొట్టాడు. అప్పుడు నా చేతిలో సగం నీళ్లున్న వాటర్ బాటిల్ ఉంది. మరేమీ ఆలోచించకుండా ఆ బాటిల్ ను అతనిపై విసిరికొట్టాను. డేవిడ్ వెంటనే ఏం జరిగిందని అడిగాడు. నేను ఏమీ చెప్పకపోయినా... జరిగిందేమిటో తను ఈజీగానే గుర్తించాడు. అప్పటికే నా మీద చేయి వేసిన వ్యక్తి కొంత దూరం వెళ్లిపోయాడు. వెంటనే డేవిడ్ పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని పట్టుకున్నాడు. అయితే అతను తిరగబడి డేవిడ్ పై దాడి చేశాడు. చివరికి అతను వదిలించుకుని పారిపోయాడు. 

ఇంకా ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే... ఒక్కరు కూడా అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. డేవిడ్ ఎవరితోనైనా ఫైటింగ్ చేయడాన్ని, గాయపరచడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అతను వయోలెంట్ పర్సన్ కాదు. కానీ పోలీసులు వచ్చేవరకు అతన్ని పట్టుకుని ఉండాలని అనుకున్నాడు.

ముంబై బీచ్ లో కేథరిన్<br>

ముంబై బీచ్ లో కేథరిన్


వీరి రియాక్షన్ విన్న తర్వాత ధర్మశాలలో ఓ యంగ్ ప్రొఫెషనల్ తో మేము జరిపిన సంభాషణ గుర్తుకు వచ్చింది. పర్వతాలపై ప్రశాంతతను వెదుక్కుంటూ వచ్చిన ఆ బెంగళూరు ప్రొఫెషనల్.. ఎక్కడైనా చీకటి పడకముందే ఇంటికి చేరుకుంటానని చెప్పింది. ఎందుకంటే రాత్రి సమయంలో అంత సేఫ్ గా ఫీల్ అవ్వలేనని మాకు చెప్పింది. సొంత దేశంలో యువతే బయటకు వెళ్లడానికి అభద్రతా భాావంతో ఫీలవుతున్నప్పుడు... ఓ విదేశీ పర్యాటకురాలు ఇంకెంత భయపడాలి..? వారు భయపడితే అర్థం ఏమిటి..? సొంత మనుషుల నుంచే ముప్పుందని భయపడే ప్రదేశంలో వేరేవారికి నమ్మకం ఎలా కలుగుతుంది..?


ముంబైలో జరిగిన ఘటనను మాత్రం నేను ఎప్పటికీ క్షమించలేను. కొంతమంది వ్యక్తులు తమ ప్రవర్తన వల్ల దేశానికి ఎంత చెడ్డపేరు తెస్తున్నారో గుర్తించలేకపోతున్నారు. నేను ఇండియా గురించి చెబుతున్నప్పుడల్లా.. ఇతర మహిళా పర్యాటకులు వెక్కిరిస్తూంటారు. ఈ విషయంలో భారతీయులు తమ మైండ్ సెట్ ను మార్చుకోవాలని నేను కోరుకుంటాను. చాలామంది తమ ప్రవర్తనతో దేశానికే చెడ్డపేరు తెస్తున్నారు. మంచి ప్రవర్తన ఉన్నవాళ్లూ చాలా మంది ఉన్నా... ఒక్క చెడ్డ ఘటన చాలు పెద్ద మరక పడటానికి. అందుకే నా పర్యటన అనుభవాలను చాలా బ్యాలెన్సింగ్ గా వివరించే ప్రయత్నం చేశా.

మేం నాలుగున్నర నెలలపాటు భారత్ లో పర్యటించాం. కశ్మీర్ లోని లెహ్ నుంచి కేరళలోని వర్కాలా వరకు తిరిగాం. ఇదో భావోద్వేగమైన పర్యటన. ఇక్కడ మేం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నమ్మండి.. నమ్మకపోండి.. మేం తిరిగి వెళ్తున్నందుకు కొంచెం బాధగానే ఉంది.

ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా... ఇండియా ఇన్ క్రెడిబులే. కానీ కొంత మంది ఇడియట్స్ వల్లే ఇండియాకు చెడ్డపేరు వస్తోంది. ఇంకా ఎంతకాలం మహిళలు, పర్యాటకులు భయం..భయంగా వీధుల్లో రోడ్ల మీద నడవాలి..?

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags