సంకలనాలు
Telugu

ఇంటర్నెట్ లేకుండానే ఉచిత కాల్స్

ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా కాలింగ్ ఫెసిలిటీఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫ్రీకాల్స్ల్యాండ్‌ఫోన్లకూ ఉచిత కాల్స్ సౌకర్యం

ABDUL SAMAD
1st Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

వైబర్, వాట్సాప్. ఇవి ఇంతగా ఫేమస్ కావడానికి కారణం- ఫ్రీ కాల్స్, ఫ్రీ మెసేజెస్. మీకు తెలుసా? మ‌న‌దేశంలో నెల‌కు ప‌దిన్న‌ర కోట్ల మంది వైబ‌ర్ యూజ్ చేస్తున్నారు. అయితే ఇక్క‌డ కండిష‌న్ ఏంటంటే వాటికి ఇంట‌ర్నెట్ క‌చ్చితంగా ఉండాలి. నెట్ లేకుండా ఏం చేయ‌లేం. మ‌రి అదేదీ లేకుండా ఫ్రీ కాల్స్‌, ఫ్రీ మెసేజెస్ చేసుకునే వెసులుబాటు ఉందా? దేశంలో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా మొబైల్ గానీ లాండ్ లైన్ గానీ ఫ్రీగా వాడుకునే స‌ర్వీస్ ఏదైనా ఉందా? ఇదంతా వింటుంటే- అదేదే ఉంటే బాగుండు క‌దాని అనిపిస్తోందా?

image


ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ.

Freekall. పేరులో ఫ్రీ ఉన్న‌ట్టే అది కంప్లీట్ ఫ్రీ.. ఫ్రీ..ఫ్రీ. ఇది బెంగళూర్ బేస్డ్ క్లౌడ్ టెలిఫోన్ కంపెనీ. దీని ద్వారా కస్టమర్లు దేశంలో ఎక్క‌డి నుంచి ఎక్కడికైనా, మొబైల్, ల్యాండ్‌ఫోన్ బీభ‌త్సంగా వాడుకోవ‌చ్చు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి దీనికి విపరీతమైన స్పందన వస్తోందంటున్నారు సంస్థ ప్రతినిధి యశ‌స్ సి శేఖర్. ఫ్రీకాల్‌ను రీలాంఛ్ చేశాక యూజర్ల సంఖ్య రోజుకు 2 నుంచి 3వేలకు పైగా పెరుగుతోంది. అది కూడా మార్కెటింగ్ కోసం ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌కుండా.

image


ఆటోమేటిగ్గా కనెక్ట్

మొద‌ట్లో నెంబర్ గుర్తు పెట్టుకుని డయల్ చేయడంలో ఇబ్బందులుండేవి. అందుకే ఆ విధానానికి స్వస్తి పలికి స్మార్ట్ ఫోన్ యూజర్లకు వీలుగా ఓ యాప్ తీసుకొచ్చారు. ఫ్రీకాల్ యాప్‌ లోనే కాంటాక్ట్స్ కనిపిస్తాయి. డయల్ చేయాలనుకునే నెంబర్‌ పై టాప్ చేస్తే చాలు. 5 సెకన్ల వెయింటింగ్ పీరియడ్ వ‌స్తుంది. తర్వాత ఫ్రీకాల్ నెంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఒక 10సెకన్ల యాడ్ వినిపించాక, కాల్ ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతుంది. ఈ ఫ్రీకాల్ లేటెస్ట్ కాన్సెప్ట్ వెనక కృషి మొత్తం వినయ్ కశ్యప్‌కే చెందుతుందంటాడు శేఖర్. ప్రస్తుతం అత‌ను వేరే కంపెనీలో పని చేస్తూ నెలల తరబడి ఈ యాప్ కోసం పాటుప‌డ్డాడు. 

ఫ్రీకాల్... తర్వాతేంటి?

యాప్ లాంఛింగ్ తర్వాత కొన్ని సవాళ్లను ఎదుర్కొంది ఫ్రీకాల్. ప్రధానంగా కాలర్ ఐడీ విషయంలో కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయి. యూజర్ డయల్ చేసిన తర్వాత కాల్‌ రిసీవ్ చేసుకునే వ్యక్తికి.. కాలర్ ఐడీని... కాల్ రిసీవ్ చేసుకున్నవారికి పంపడంలో ప్రాబ్లం ఫేస్ చేశారు . కారణం.. రెండు వైపులా డయల్ చేసి కాల్ లింక్ చేసివ్వాలి. ఆ ప‌రిస్థితుల్లో సింగపూర్, హాంకాంగ్ లాంటి దేశాలకు కాల్స్ ఫార్వార్డ్ చేసేందుకు భారతీయ చట్టాలు అనుమతించలేదు. వీటన్నిటినీ అధిగమించి ఇంటర్నేషనల్ కాలింగ్ ఫెసిలిటీ కల్పించడానకి కొంత టైం ప‌ట్టింది. అలాగే ఇంటర్నెట్ ఆధారిత కాలింగ్‌ నూ జత చేసేందుకు యత్నిస్తోంది ఫ్రీకాల్. 

అంతర్జాతీయంగా విస్తరణ

ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వీసులు లాంఛ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నామంటున్నారు యశ‌స్ శేఖర్. అంతర్జాతీయంగా పలు బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జ‌రుపుతున్నారు . గ్లోబల్‌గా వీలైనన్ని ఎక్కువ మార్కెట్లలో ఫ్రీకాల్ యాప్‌ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌యత్నిస్తోంది కంపెనీ.

ఫ్రీ క్రెడిట్స్

ఇప్పటికే వేల కొద్దీ కస్టమర్లు రిజిస్ట‌ర్ అయ్యారు. ఆ సంఖ్య మ‌రింత పెరిగేందుకు ఫ్రీ కాల్ ఎక్స‌ర్‌సైజ్ చేస్తోంది. అలాగే క‌స్ట‌మ‌ర్ల‌కు కాల్ చేసుకునేందుకు క్రెడిట్ సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పిస్తోంది. అడ్వ‌ర్ట‌యిజింగ్ లో భాగంగా ప‌లు యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే అకౌంట్స్ కు ఫ్రీ క్రెడిట్స్ యాడ్ అవుతాయి. వీటితో ప్రపంచంలో ఎక్కడికైనా ఉచితంగా కాల్ చేసుకునే సదుపాయం లభిస్తుంది. 

ఈ సంస్థకు రంజిత్ చెరిక్కెల్ అనే వ్యక్తి రూ. 10లక్షల సీడ్ రౌండ్ ఫండింగ్ చేశారు. అత‌ను 88mph అనే ఆఫ్రికా బేస్డ్ ఆక్సిలరేటర్ ప్రోగ్రాం ప్లాట్‌ఫాంను నిర్వహిస్తున్నారు. అదికాకుండా కస్టమర్ల సౌకర్యాలను పెంచుకునేందుకు, సర్వీసుల్లో మరింత క్వాలిటీ అదించేందుకు ఫ్రీకాల్‌ సంస్థ‌ ఏంజల్ ఇన్వెస్టర్లను అన్వేషిస్తోంది. దాంతోపాటు mail@fredkall.coకు ద్వారా క‌స్ట‌మ‌ర్ల ఫీడ్‌బ్యాక్ ను కోరుతోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags