సంకలనాలు
Telugu

ప్రాణం పోసే పొగలేని పొయ్యి !

వంట చేయడం వల్ల వేలాది మంది చనిపోతున్నారని చెప్తే నమ్మలేం కానీ ఇది నిజం. వంటింటి పొగ ఏటా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇటు ప్రాణాలు తీయడమే కాక, అటు పర్యావరణాన్ని కూడా దెబ్బతీస్తున్న ఈ సమస్యకు ఓ పరిష్కారం వుంటుందా.. ? ఈ ప్రశ్నకు ఎన్విరోఫిట్ సమాధానం చెబ్తోంది.

bharathi paluri
27th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఊపిరితిత్తులు అరిగిపోయేలా పొగగొట్టాన్ని ఊదే ఇల్లాలు, తెరలు తెరలుగా కమ్ముకుపోయిన పొగ, మసికొట్టుకుపోయిన వంటిల్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఇళ్లు అడుగడుగునా కనిపిస్తాయి.

ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్‌టిట్యూట్ (TERI) ఈ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఇంధన వనరుల్లో మార్పులు, అసమానతలపై ఓ అధ్యయనం చేసింది. కలపను వంట చెరకుగా వాడుతున్న రాష్ట్రాల్లో గోవా మొదటి స్థానంలో, కర్ణాటక రెండో స్థానంలో వున్నాయని ఈ అధ్యయన సారాంశం. గోవాలో నెలకి ఒక్కో ఇంటికి సగటున 197 కేజీల కలప వాడుతుంటే, కర్ణాటకలో 195 కెజీలు వాడుతున్నారు. జాతీయసగటు 115 కేజీలతో పోలిస్తే, ఈ రెండు రాష్ర్టాలో వాడకం చాలా ఎక్కువే అని చెప్పాలి.

దీనివల్ల నష్టమేంటి ? అంటే చాలానే వుంది. వాడుతున్న వ్యక్తులకే కాక, మొత్తం పర్యావరణానికే దీని వల్ల పెను నష్టం జరుగుతోంది. సంప్రదాయ స్టవ్‌ల నుంచి, వాటిలో పూర్తిగి మండకుండా మిగిలిపోయిన కలప నుంచి.. వచ్చే బ్లాక్ కార్బన్ (నల్లటి పొగ) వల్ల ఇంట్లో ఎయిర్ పొల్యూషన్ (ఇంటిపొగ) పెరుగుతుంది. ఇది శీతోష్ణ స్థితిలో పెను మార్పులకు దారితీస్తుంది.

ప్రపంచంలో అకాల మరణాలకు ఈ ఇంటిలోపలి వాయుకాలుష్యం (IAP) అతి పెద్ద కారణమవుతోంది. లెక్కల్లో చెప్పాలంటే, దీని వల్ల ప్రపంచంలో ఏటా 43లక్షల మంది చనిపోతున్నారు. అంటే, హెచ్ ఐవి, మలేరియా, టీబీ లాంటి జబ్బులన్నిటివల్ల చనిపోతున్నవారి సంఖ్య కంటే, ఇంట్లో పొగ వల్ల చనిపోతున్న వారి సంఖ్యే ఎక్కువ. ఇండియాలో కూడా ఈ ఇంటిపొగ కారణంగా ఏటా పదిలక్షల మందికి పైగానే చనిపోతున్నారు. ఇప్పటికీ దేశంలో 63 శాతం మంది కలప, పిడకలు లాంటి సంప్రదాయ ఇంధనం మీదనే ఆధారపడుతున్నారు.

మరి ఈ సమస్య పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు సత్ఫలితాలివ్వలేదు ? ఇప్పటి దాకా ఈ ప్రయత్నాలు చేసిన ప్రభుత్వ .. ప్రభుత్వేతర సంస్థలు ఎక్కువగా స్టవ్‌ల పంపిణీ మీద దృష్టిపెట్టాయి. వీటిని వాడేంత చదువు సంధ్యలు గ్రామీణ ప్రాంతాల్లో లేకపోవడం, లేదా ఈ పొయ్యిలు మూణ్ణాళ్ళకే చెడిపోవడం లాంటి కారణాల వల్ల ఈ ప్రయత్నాలేవీ పెద్దగా ఫలితాలివ్వలేదు.

2007లో ఈ సమస్యకు ఓ కొత్త పరిష్కారాన్ని కనుగొనడానికి ఎన్విరోఫిట్ ప్రయత్నించింది. మార్కెట్‌కు ఏం కావాలో అది అంధించడం వల్ల ఎన్విరోఫిట్ ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పాలి. చౌకగా అందించడం కంటే, నాణ్యత మీద ఎక్కువ దృష్టి పెట్టడం, మార్కెట్ లో ఎక్కువగా అందుబాటులో వుండేలా చూడడం ఎన్విరోఫిట్ ప్రత్యేకత. ఇప్పటిదాకా ఇలాంటి పొయ్యిలని ఇస్తే తీసుకోవడానికే అలవాటు పడ్డ మహిళలు ఇప్పుడు కొనుగోలుదార్లుగా మారారు.

ఎన్విరోఫిట్ రూపొందించిన మంగళ్ స్టౌవ్ ఇదే

ఎన్విరోఫిట్ రూపొందించిన మంగళ్ స్టౌవ్ ఇదే


మరో వైపు ఇంటిపొగ సమస్యను కూడా ఎన్విరోఫిట్ పరిష్కరించింది.

‘‘మూడు ప్రధాన మైన లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాం. మొదటిది ప్రజలకు (కస్టమర్లకు, ఉద్యోగులకు) ఉపయోగపడాలి. రెండోది...పర్యావరణానికి ఉపయోగపడాలి..( కర్బన ఉద్గారాలను, వంటింటి పొగను తగ్గించడం) ఇక మూడోది.. వ్యాపారాన్నిలాభసాటిగా మార్చడం. అంటారు ఎన్విరోఫిట్ ఎమ్ డి, హరిష్ అంచన్.

నాణ్యమైన స్టవ్‌లను రూపొందించి, తయారు చేసి అమ్మడం ద్వారా కొనుగోలుదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి, ఇటు ఆర్ధిక ప్రగతికి, అటు ఆరోగ్యకరమైన పర్యావరణానికి పాటు పడాలనేది సంస్థ లక్ష్యం. కంపెనీ తొలి ఉత్పత్తులను ప్రయోగపూర్వకంగా కర్ణాటకలోని షిమోగా లో ప్రారంభించారు.

ఎన్విరోఫిట్ తయారు చేసిన స్టవ్‌ల వల్ల వంట చేసే సమయం సగానికి తగ్గిపోయింది. పొగ, విషపూరిత వాయువులు 80శాతం తగ్గిపోయాయి. దీంతో పాటు ఇంధన వినియోగం కూడా 60శాతం తగ్గింది. అంటే, మహిళలు వంట దగ్గరే రోజంతా గడపక్కర్లేదు. ఇంధనం కోసం అడవులను యథేచ్ఛగా నరికేయడం తగ్గుతుంది. అన్నిటికి మించి వంటిల్లు పొగచూరిపోకుండా.. ఆరోగ్యవంతంగా తయారవుతుంది.

ఈ స్టవ్‌కు ఎన్విరోఫిట్ మంగళ స్టవ్ అని పేరుపెట్టింది. ఇందులో విషవాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు రాకెట్ ఛాంబర్ టెక్నాలజీని వాడారు. బాడీని స్టీల్ తో తయారు చేయడం వల్ల మార్కెట్ లోకి విడుదలయిన వెంటనే ఈ స్టవ్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఏడులక్షలకు పైగా స్టవ్‌లు అమ్ముడుపోయాయి.

ఈ మంగళ స్టవ్ మార్కట్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ చా లా మార్పులు చేసారు. తాజాగా పి సి ఎస్ 1 మోడల్ వచ్చింది. వంట మరింత త్వరగా అయి, ఇంధన ఖర్చులు ఇంకాస్త తగ్గేలా ఈ మోడల్ ను రూపొందించారు. మరింత ధృఢంగా వుంటూనే, తక్కువ బరువుండే ఈ కొత్త స్టవ్ హ్యాండిల్ గ్రిప్ కూడా మెరుగుపరిచారు. మొత్తం మీద ఈ మేడిన్ ఇండియా మోడల్లో ఇప్పుడు చాంబర్ లైఫ్ కూడా పెంచారు. ఒకసారి కొంటే ఐదేళ్ళు దీని గురించి ఆలోచించక్కర్లేదు.

PCS-1 ఇంటి అవసరాల కోసం కాగా, ఎక్కువ మందికి వంటచేయాల్సిన చోట.. EFI 100L మోడల్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఈ వంద లీటర్ల స్టవ్‌తో 300 వంద మందికి వంట చేయొచ్చు. స్కూళ్ళు, అనాధాశ్రమాలు, ఇతరత్రా సంస్థల కోసం ఈ మోడల్‌ను డిజైన్ చేసారు. మొత్తం మీద ఇండియాలో ఈ ఉత్పత్తుల మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం మూడున్నర లక్షల మంది ఈ స్టవ్‌లను వాడుతున్నారు. ఇండియాలో ఉత్పత్తులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిదిన్నర లక్షల స్టవ్‌లు అమ్ముడుపోయాయి.


ఇండియాలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని ఎన్విరోఫిట్ ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పబ్లిక్, ప్రయివేట్, సోషల్ సెక్టర్ భాగస్వామ్యాల ద్వారా ఇప్పటి దాకా ఉనికి లేని రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తామని అంచన్ చెప్తున్నారు.

పక్కా బిజినెస్ మోడల్ తో దేశంలో వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా ఎన్విరోఫిట్ వుండాలనుకుంటోంది. ఈ రంగంలో విశేష అనుభవం ఉండడం వల్ల మరింత మంది కస్టమర్లను ఆకర్షించగలమనే విశ్వాసం వీరిలో వుంది. ‘‘నిత్యనూతనంగా డిజైన్లు వుండాలన్న మా తపన, మా కస్టమర్లు మాపై వుంచిన విశ్వాసం, వారికి తెలిసిన వారందరికీ ఈ ఉత్పత్తుల గురించి చెప్తున్న తీరు.. ఇవన్నీ చూస్తుంటే, 2018..19 నాటికి మా స్టవ్ అమ్మకాలు పదిలక్షలకు చేరుతుందనే నమ్మకం మాకుంది..’’ అని నమ్మకంగా చెప్పారు. అంచన్..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags