సంకలనాలు
Telugu

హలో హైదరాబాద్ అంటున్న 91స్ప్రింగ్ బోర్డ్..!

ashok patnaik
16th Feb 2016
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

ఒక స్టార్టప్ ఐడియా వచ్చింది. వర్కవుట్ చేద్దామంటే ఆఫీస్ లేదు. ఫర్నిచర్ గట్రా ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. ఇంటర్నెట్ అర్జెంటు. కానీ దాని గురించి అర్జెంటుగా మాట్లాడాలి. ఇంటినే ఆఫీస్ గా మార్చాలంటే కుదరని పని. ఇలాంటి వారి కోసమే ఎస్టాబ్లిష్ అయ్యాయి కమ్యూనిటీ స్పేస్ లు. ఇంకో మాటలో చెప్పాలంటే కో-వర్కింగ్ స్పేస్. 

అందులో సకల సదుపాయాలుంటాయి. కుర్చీల దగ్గర్నుంచి ఇంటర్నెట్ దాకా. ఏసీ నుంచి కెఫెటేరియా వరకు. అన్నీ ఉంటాయి. వర్క్ షాప్ నిర్వహించుకోండి . మీటప్ ఎరెంజ్ చేసుకోండి. ఈవెంట్స్ పెట్టుకోండి. గెట్ టు గెదర్ అనుకోండి. లేదంటే ఆఫీసుగా కన్వర్ట్ చేసుకోండి. డే పాస్ నుంచి నెలరోజుల వరకు రకరకాలుగా బుక్ చేసుకోవచ్చు. ఒక్కోదానికి ఒక్కో రేటు. మెంబర్ షిప్ కూడా ఉంది. అవసరాలను బట్టి ప్లాన్స్ వుంటాయి.

ఇలాంటి కో వర్కింగ్ స్పేస్ రెండేళ్ల కిందట ఢిల్లీలో మొదలైంది. అందులో వందకు పైగా స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. ఆ మధ్య బెంగళూరులోనూ స్టార్టయింది. కేరళలో ఇటీవలే పెట్టారు. హైదరాబాదులో అలాంటి కో వర్కింగ్ స్పేస్ తో ముందుకొచ్చింది 91 స్ప్రింగ్ బోర్డ్.

image


ఎలా వుంటుందీ 91 స్ప్రింగ్ బోర్డ్ ?

హైదరాబాద్ లో మంచి ప్రైమ్ లొకేషన్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. 20 థౌజండ్ స్వ్కేర్ ఫీట్స్ వైశాల్యం. ఫైవ్ ఫ్లోర్స్ హబ్. టెర్రస్. కేఫ్. ఒకేసారి 300 మందికి సిట్టింగ్. కంఫర్టబుల్ వర్క్ స్టేషన్స్. కాన్ఫరెన్స్ హాల్స్. హైస్పీడ్ వై-ఫై. ప్రొజెక్టర్. స్క్రీన్. డాక్యుమెంట్ స్టోరేజీ కోసం లాకర్. ఇలా.. జిరాక్స్ మెషీన్ నుంచి కాఫీ మిషన్ దాకా సకల సదుపాయాలున్నాయి. అన్నట్టు స్పోర్ట్స్ లాంజ్ కూడా వుంది. డైలీ బేసిస్ నుంచి మంథ్లీ పాస్ వరకు రకరకాల ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్ బట్టి ఫెసిలిటీస్.

image


మరిన్ని అడ్వాంటేజెస్

1.కో వర్కింగ్ స్పేస్ కి సబ్ స్క్రిప్షన్ మాత్రమే ఇన్ కమ్ సోర్స్. దీంతోపాటు ఇన్వెస్ట్ మెంట్ అందించే కంపెనీలకు అవసమైతే సలహాదారుగా వ్యవహరిస్తారు. హబ్ కి వచ్చే కంపెనీల జాబితాని షార్ట్ లిస్ట్ చేసి ఏంజిల్ ఇన్వెస్టర్లకు పంపిస్తారు.

2.మూడు నెలలకోసారి స్టార్టప్ ఓపెన్ అవర్ ఈవెంట్ చేపడతారు. తద్వారా స్టార్టప్ లకు ఇన్వెస్టర్లను కలిసే అవకాశం ఉంటుంది. ఏంజిల్ ఇన్వెస్టర్లతో నేరుగా స్టార్టప్ ఫౌండర్లు, టీం ఇంటరాక్ట్ అయ్యే చాన్స్ ఉంది.

3.రివర్స్ పిచ్. ఇదేంటంటే, ఏంజిల్ ఇన్వెస్టర్లు నేరుగా వచ్చి స్టార్టప్ లను కలుస్తారు. ఫండింగ్ కోసం వాళ్లు అప్లై చేయడం. తర్వాత ఎదురు చూడటం. రెస్పాండ్ రాక ఉసూరుమనడం. ఇలాంటి బాధ అక్కర్లేదు. అంటే, స్వయంగా ఏంజిల్ ఇన్వెస్టర్లే రివర్సులో స్టార్టప్ ని ఇంటరాక్ట్ అవుతారన్నమాట. నచ్చితే టేకప్ చేస్తారు.

4.ప్రతి శుక్రవారం ఫ్రైడే అన్విండ్ పేరుతో హబ్ లో స్పోర్ట్స్ ఆడతారు. అలసిపోయిన బ్రెయిన్ కు అదొకరకమైన ఆటవిడుపు.

image


హబ్ ఇంచార్జ్ మణిక ఏమంటున్నారంటే..

తెలంగాణ ప్రభుత్వ సాయంతో నడుస్తు టీ హబ్ లాగానే మా దగ్గర కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫండింగ్ ఇస్తామని చెప్పలేం కానీ ఆ ఫండింగ్ కి కావల్సిన ఎక్స్ పోజర్ మాత్రం ఇస్తాం. అలా ఒకరకంగా ఫండింగ్ చాలెంజ్ ని ఎదుర్కోవడం ఈజీ అవుతుంది. పైగా మా ఫ్యాక్టరీ నుంచి వచ్చే స్టార్టప్స్ అంటే ఇన్వెస్టర్లకు క్రేజ్.

హైదరాబాద్ టీం

మణిక. ఈమె హబ్ ఇన్ -చార్జ్. ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ. వినీత్- హబ్ కమ్యూనిటీ మేనేజర్. అతనికి ఆరేళ్ల అనుభవం. రాహుల్- ఆపరేషన్స్ చూసుకుంటారు. సతీష్ ఫెసిలిటీ మేనేజర్. టీం చిన్నదే అయినప్పటికీ ఢిల్లీలో దిమ్మదిరిగే సక్సెస్ సాధించారు. పైగా ఎక్కడుంటే అక్కడి లోకల్ ఫ్లేవర్ యాడ్ చేయడం 91స్పింగ్ బోర్డ్ సక్సెస్ ఫార్ములా.

పోటీకామనేగా..

రిస్కు లేకుండా ఏదీ అంత ఈజీ కాదు. ఇక్కడా అదే సూత్రం వర్తిస్తుంది. స్టార్టప్స్ కు మెంటార్షిప్ అందించడం అంత అర్రిబుర్రి వ్యవహారం కాదు. మణిక అదే అంటారు. సాధారణంగా ఫండింగ్ ఆశించి ఇక్కడికి స్టార్టప్స్ వస్తుంటాయి. వాళ్ల ఐడియాని అర్థంచేసుకొని, ఆదాయం సంపాదించే మార్గాన్ని అన్వేషించాలి. దాన్ని విడమరచి చెప్పడం, మెంటార్షిప్ అందిండం పెద్ద చాలెంజ్ అంటున్నారు. అందుకోసం ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేస్తున్నామని ఆమె వివరించారు.

ఈ రంగంలో పోటీ గురించి చెప్పనక్కర్లేదు. అయితే 91 స్ప్రింగ్ బోర్డ్, తనకున్న బ్రాండ్ నేమ్ తో పాటు మార్కెట్లో ఉన్న గుడ్ విల్ తో దూసుకుపోతున్నది. ఒక స్టార్టప్ అనుకుంటే దాన్ని సక్సెస్ చేయడమే బోర్డు పని. ఇతర పోటీదారులకు- తమకు అదే తేడా అంటారు మణిక.

image


ఫ్యూచర్ ప్లాన్స్

సికింద్రాబాదులో మరో కో వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దాంతోపాటు మరో 6 హబ్ లను ఏర్పాటు చేయాలన్నది వీళ్ల ప్లాన్. అందులో ఒకటి వైజాగ్ కావడం విశేషం. మార్కెటింగ్ టీంని కూడా పెంచాలని చూస్తున్నారు.

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags