సంకలనాలు
Telugu

వర్డ్ ప్రెస్ లో దుమ్మురేపుతున్న ఇద్దరు కుర్రాళ్లు

ashok patnaik
15th Nov 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

మ్యాగజైన్ త్రీ డాట్ కామ్ వర్డ్ ప్రెస్ థీమ్స్ తయారీలో అడుగు పెట్టి దాదాపు ఐదేళ్లు కావస్తోంది. కానీ దాన్ని ప్రారంభించిన వ్యవస్థాపకులకు మాత్రం ఇంకా కనీసం కాలేజీ డిగ్రీలు చేతికి రాలేదంటే నమ్ముతారా? భారత్ లో నంబర్ వర్ వర్డ్ ప్రెస్ థీమ్స్ తయారు చేసే స్టార్టప్ ఫౌండర్ల కథ ఇది.

“ముంబైలో బికాం చదువుతున్న రోజుల నుంచి నేను థీమ్స్ తయారు చేయడం మొదలు పెట్టా. తర్వాత కాలేజీకి వెళ్లడం మానేసి మరీ దీనిలోనే స్థిరపడిపోయా.” అహ్మద్

అహ్మద్ మ్యాగజైన్ త్రీకి కో ఫౌండర్ గా ఉన్నారు. ఈ స్టార్టప్ మొదలు పెట్టిన మొదటి రోజు నుంచే ప్రాఫిట్స్ తో ముందుకు దూసుకు పోతోందని అంటారాయన. చాలా మీడియా ఆర్గనైజేషన్స్, బ్లాగర్స్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లు, న్యూస్ ఏజెన్సీలు తమకు కస్టమర్లుగా ఉన్నారని చెప్పుకొచ్చారాయన.

image


160 దేశాల్లో మ్యాగజైన్ త్రీ

మ్యాగజైన్ త్రీ ప్రారంభించిన రోజునుంచి ఫాలోవర్స్ ని సంపాదించుకుంటూ ముందుకు పోతోంది. ఇండియాలో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్న ఈ స్టార్టప్ కు 160 దేశాల్లో యూజర్ బేస్ ఉంది. దాదాపు 14 వేల థీమ్స్ ని ఇప్పటి వరకూ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది సాధారణ విషయమైతే కాదు. వర్డ్ ప్రెస్ లో ఉండే థీమ్స్ లిస్ట్ లో మ్యాగజైన్ త్రీ థీమ్స్ కి ఉన్న క్రేజే వేరు. థీమ్స్ తోపాటు బిజినెస్ కోసం ఉపయోగించే ప్లగిన్స్ ని అందించడం ఈ స్టార్టప్ పని. వెబ్ సైట్ డిజైన్ చేయడానికి కావల్సిన థీమ్స్ ని అందిస్తుందీ స్టార్టప్. ఈ సెగ్మెంట్ లో డిమాండ్ చాలా ఉంది. వర్డ్ ప్రెస్ లో ఈ సెగ్మెంట్ లో కాంపిటీషన్ ఎంత ఉందో డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉండటం విశేషం. ఇదే తమ స్టార్టప్ సక్సస్ కాడానికి కారణమంటారు అహ్మద్.

మ్యాగజైన్ త్రీ టీం

మ్యాగజైన్ త్రీ కి అహ్మద్ కో ఫౌండర్. బికాం డ్రావుట్ ఆయన క్వాలిఫికేషన్. తర్వాత ఎగ్జామ్స్ రాసారు కానీ సర్టిఫికేట్ తీసుకోలేదు. పీజీ చేయలేదు. అప్పటి నుంచి వెబ్ సైట్స్, వర్డ్ ప్రెస్ , థీమ్స్, ప్లగిన్స్ మాత్రమే అతని జీవితంగా మారిపోయాయి. మహమ్మద్ ఈ స్టార్టప్ కి మరో కో ఫౌండర్. ఇతను కూడా కాలేజీ డ్రాపవుట్. కాలేజీలో ఉండగానే క్రియేటివిటీ వైపు అడుగులేసిన ఈయన తర్వాత కాలేజీ మొహం చూడలేదు. ఇద్దరూ కలసి 2010లో ఈ స్టార్టప్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేదు. మొదటిరోజు నుంచే లాభాలతో నడిచిన ఈ కంపెనీ పూర్తి బూట్ స్ట్రాపుడ్ గానే నడుస్తోంది. వీరిద్దరితో పాటు మరో ముగ్గురు ఆన్ రోల్ ఉద్యోగులున్నారు. ఈ మధ్యనే అబిడ్స్ లో ఉన్న ఆఫీసుని జూబ్లి హిల్స్ కి మార్చారు.

image


లక్ష్యాలు, ఇతర పోటీ దారులు

థీమ్స్ విషయంలో పోటీ ఎక్కువగానే ఉంది. కానీ మ్యాగజైన్ త్రీడీకి మాత్రమే సాధ్యమైన కొన్ని యునిక్ థీమ్స్ కు డిమాండ్ ఇతర పోటీ దారులకంటే ముందుండేలా చేస్తోంది. ప్రపంచంలో ఉండే వెబ్ సైట్లలో వర్డ్ ప్రెస్ కు 25 శాతం వాటా ఉంది. వర్డ్ ప్రెస్ లో భారత్ నుంచి మేగజైన్ త్రీ వన్ ఆఫ్ ది బెస్ట్ థీమ్ డిజైనర్ గా ఉంది. ఈ సెగ్మెంట్ లో మార్కెట్ వేల్యూ ఎంత ఉందనేది ఊహకందనిది. ఇదిలా ఉంటే వెబ్ సైట్ నుంచి ఇంటర్నెట్ అంతా మొబైల్ యాప్ వైపు పరుగులు పెడుతోంది. మేగజైన్ త్రీ కూడా ఆ దిశగా అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకూ మొబైల్ ప్లాట్ ఫామ్ లో థీమ్స్ రిలీజ్ చేయకపోవడం డ్రా బ్యాక్ గా చెప్పాలి. దీన్ని అధిగమించాల్సి ఉంది.

ఆదాయ వనరులు

యూజర్ బేస్ అంత స్థాయిలో లేకపోయినా ఆదాయం బాగానే వస్తోంది. ప్రస్తుతానికి 43 ప్రాడక్టుల కోసం థీమ్స్ డెవలప్ చేశారు. దీనికి సబ్ స్క్రిప్షన్స్ ఉన్నాయి. 4వేల రూపాయిల నుంచి ఈ సబ్ స్క్రిప్షన్ మొదలువుతుంది. ప్రీమియం థీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే లైఫ్ టైం సపోర్టు అందిస్తామంటున్నారు. ఇదే ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇప్పటి వరకూ లాభాల్లోనే ఉంది కనక ఆదాయం ఫర్వాలేదనే దీమాతో ఉన్నారు ఫౌండర్ అహ్మద్.

image


భవిష్యత్ ప్రణాళికలు

వర్డ్ ప్రెస్ లో నంబర్ వన్ థీమ్ బిల్డర్ గా 2016 సరికి ఎదగాలని చూస్తున్నారు. ఇప్పటి వరకూ చాలా మంది వెంచర్ క్యాప్టలిస్టులు తమని అప్రోచ్ అయినా ఫండింగ్ పై పెద్దగా ఆసక్తి చూపని ఈ స్టార్టప్ .. లార్జర్ ఇన్వెస్ట్ మెంట్ తో ఫండింగ్ వస్తే ఓకే చెబుతానంటున్నారు. టీం ఎక్స్ పేన్షన్ చేసి సేల్స్ టీం ను తయారు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్టప్ కంపెనీలు తమని అప్రోచ్ అవుతున్నాయిక కనక వాటి కోసం మరింత చవకైన డిజైన్డ్ థీమ్స్ తయారు చేయాలని అనుకుంటున్నట్లు అహ్మద్ ప్రకటించారు.

థీమ్స్ మార్కెట్ లో తామేంటో నిరూపించుకున్నాం కనక భవిష్యత్ లో ప్లగిన్ మార్కెట్ లోకి విస్తారించాలని యోచిస్తున్నట్లు చెబుతూ అహ్మద్ ముగించారు.
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags