సంకలనాలు
Telugu

విద్యకు విజ్ఞానాన్ని జోడిస్తూ ఎగ్జిబిషన్లు నిర్వహించే 'క్రాకర్‌జాక్ కార్నివల్'

team ys telugu
4th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

"మాతృత్వం ఓ మధురమైన అనుభూతి, అది మీ ఆలోచనలను, ప్రాధాన్యతల్ని మార్చేస్తుంది. బహుముఖ ప్రజ్ఞ, దక్షతగల వ్యక్తిగా, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా చేస్తుంది" అంటారు క్రాకర్స్‌జక్ కార్నివాల్, ఎగ్జిబిషన్స్ ఇండియా గ్రూప్ డైరెక్టర్.

దేశాభివృద్ధిలో పూర్తిగా భాగస్వామ్యమయ్యేలా ఎగ్జిబిషన్స్ ఇండియా గ్రూప్ ప్రారంభమైంది. దేశీయ, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతోనూ, భారతీయ సంస్థలు అంతర్జాతీయ షోలల్లో పాల్గొని కొత్త మార్కెట్‌ను ఆవిష్కరించడమే లక్ష్యంగా ఈ గ్రూప్ ఏర్పడింది.

image


"మా దగ్గరకు వచ్చే క్లైంట్లు, సరైన వేదిక ఎంచుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు మేం మధ్యవర్తులుగా వ్యవహరిస్తాం. అంతర్జాతీయ బ్రాండ్లు ఇండియన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మార్గాన్ని అన్వేషించేలా మేము సహకరిస్తున్నందుకు గర్వపడ్తున్నాం. దీంతోపాటే భారత కంపెనీలు గ్లోబల్ మార్కెట్లో నిలదొక్కుకునేలా చేయగలుగుతున్నాం" అంటున్నారు చంద్రిక.

ఏళ్లుగా సాధించిన ప్రగతి

ఢిల్లీలో పుట్టిన చంద్రిక, మోడ్రన్ స్కూల్లో చదువుకొని, లాస్ ఏంజెల్స్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోని మార్షల్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గ్లోబల్ మేనేజ్‌మెంట్ (ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ) పూర్తిచేశారు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీలోరెండేళ్లు పనిచేసిన అనుభవం తనకు ఎన్నో నేర్చుకోవడానికి ఉపయోగపడ్డాయంటున్నారు.

"వృత్తిపరంగా నేర్చుకుంది చాలా ఎక్కువ, అలాగే వివిధ దేశాలకు చెందిన కొలీగ్స్ నుంచి కూడా ఎంతో నేర్చుకున్నాను. ఆటుపోట్లని ఎదుర్కొని, డెడ్ లైన్‌లోపు అనుకున్నది సాధించడాన్ని నేర్చుకున్నాను" అంటున్నారు చంద్రిక. ఇదే పద్ధతిని పారిశ్రామికవేత్తగా మారిన తర్వాత కూడా కొనసాగించారు.

image


క్రాకర్‌జక్ కార్నివాల్ 'మేళా' కాదు - చంద్రిక

క్రాకర్‌జక్ కార్నివాల్‌ను స్థాపించాలనుకున్న వ్యవస్థాపకులు దాన్ని ఒక 'మేళా'గా రూపొందిద్దామని అనుకున్నారు. కానీ చంద్రిక మాత్రం అలా కాదని తెగేసి చెప్పేశారు. మార్కెట్ పరిధులను అర్ధం చేసుకోవడానికి, సందర్శకుల గురించి ఆలోచించడానికి వాళ్ల బృందానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత ఆశ్యర్యకరంగా, కాన్సెప్ట్ ఊపందుకుని తొందరగా తమ నిర్ణీత లక్ష్యాన్ని చేరుకున్నారు.

"సౌకర్యవంతంగా, సురక్షితంగా, కుటుంబం అంతా కలిసి ఉండే పండుగ వాతావరణం రూపొందిస్తాం. మా ఎగ్జిబిటర్లు, భాగస్వాములు టార్గెట్ గ్రూప్‌తో ఒకరితో ఒకరి మాట్లాడుకునే సదుపాయం కలుగుతుంది. ఇందుకోసం రీసెర్చ్‌లు, డీప్ స్టడీస్ చేసి, అందుబాటులో ఉన్న డేటాబేస్‌ను ఉపయోగించుకుంటున్నాం" అంటున్నారు చంద్రిక.

చంద్రిక - మనోగతం

విభిన్న నగరాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి, కంపెనీని అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే వ్యాపారాన్ని వృద్ధి చేయడమే లక్ష్యంగా కాకుండా ఉన్నత ప్రమాణాల్ని పాటించడమే ముఖ్యమంటున్నారు.

క్రాకర్‌జక్ కార్నివాల్ కాన్సెప్ట్ రావడానికి తన ఇద్దరు పిల్లలు సమైరా, జయాన్ ముఖ్య కారణం అంటున్నారు చంద్రిక. పిల్లల్ని తమతో పాటుగా కేవలం మాల్స్‌కు తీసుకెళ్లడం నచ్చలేదంటున్నారు చంద్రిక. "వారిలో సృజనాత్మకత వెలికితీసి, నేర్చుకోవాలనే తపనను, ఆలోచింపచేసే శక్తిని పెంపొందించే వాతావరణం కావాలనిపించింది" అంటున్నారు.

పిల్లల కోసం వారి అవసరాల కోసం దేశంలో కొన్నేళ్ల క్రితం వరకు ఒక్క వేదిక కూడా లేదు. కొత్త విషయాల్ని నేర్చుకుంటూ, ఉల్లాసంగా గడుపుతూ, తల్లిదండ్రుల కనుసన్నల్లో ఉండే సురక్షిత ప్రదేశం అవసరం ఏర్పడింది.

ఇద్దరు పిల్లల తల్లిగా తన చుట్టూ ఉన్న వనరుల్ను చంద్రిక ఉపయోగించుకుంటూ, తాననుకున్న ఈవెంట్స్‌ను రూపొందిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పో లు ఆర్గనైజ్ చేస్తూ, ఎగ్జిబిషన్స్ ఇండియా గ్రూప్ ట్రేడ్ ఫెయిర్ ఆర్గనైజర్స్ లో ముందున్నారు.

"గృహిణులైన తల్లులంటే నాకు గౌరవం. వారికి తక్కువ విలువ ఇస్తారు కానీ డిమాండ్ మాత్రం ఎక్కువే. తల్లి అంటే పూర్తి స్థాయి ఉద్యోగమే" అంటున్న చంద్రిక.. తన కుటంబం నుంచి పూర్తి స్థాయి సపోర్ట్ లభించడం అదృష్టమంటున్నారు. అతి సంక్లిష్త సమయాల్లో కూడా తాను పనిచేసేలా ప్రోత్సహించారని చెప్తున్నారు.


image


"ఇది గాలిలో ఉన్న ఏ ఒక్క బంతీ కింద పడిపోకుండా పట్టుకుని చేసే గారడీ విద్య లాంటిది" అంటున్న చంద్రిక, తాము ఎన్నుకున్న అవకాశాల్ని తల్లులు తప్పుగా భావించాల్సిన అవసరం లేదంటున్నారు. పిల్లలతో, కుటుంబంతో ఎంతసేపు గడిపామన్నది కాకుండా, ఎలా గడిపామన్నది ముఖ్యం. ఒక వర్కింగ్ మదర్‌గా కొన్ని సార్లు మల్టీ టాస్కింగ్ చేయాలి. ఒక్కోసారి అత్యవసరాలుంటాయి, కొన్నిసార్లు స్కూల్ ఈవెంట్లకు వెళ్లలేని స్థితి. దీంతోపాటే పనిచేసే చోట సంక్షోభం ఉంటుంది. ఎన్ని ఉన్నా మీరెంత ఓర్పుతో చేశారన్నది ముఖ్యం" అంటున్నారు ఈ వర్కింగ్ మదర్. ఉద్యోగం చేస్తున్న తల్లులే తమ పిల్లలకు రోల్ మోడల్స్ అవుతారని, తల్లుల నుంచి ఎన్నో ముఖ్యమైన విషయాలు వాళ్లు నేర్చుకుని అమూల్యమైన వ్యక్తులుగా తయారవుతారని చంద్రిక నమ్ముతారు.

"నా కూతురు సమైరకు నేనో మార్గదర్శిగా మారాలనుకుంటున్నా. తన అనుభవం, చదువు, అర్హతలు.. కుటుంబం, సమాజానికి ఉపయోగపడేలా సమైరను తీర్చిదిద్దాలని అనుకుంటున్నా చేయాలనుకుంటున్నా" అంటున్నారు ఈ స్ఫూర్తిదాయక మామ్‌ప్రెన్యూర్.

పిల్లలతో పాటుగా వారి కుటుంబ సభ్యులపై కూడా అనుకూల ప్రభావాన్ని చూపించేలా తాను ప్రయత్నిస్తున్నానని చంద్రిక నమ్ముతున్నారు. పిల్లల కోసం వాల్డ్ క్లాస్ ఈవెంట్స్ జరిగేలా క్రాకర్‌జాక్ కార్నివల్ మార్గదర్శనం చేస్తుందని అనుకుంటున్న చంద్రిక, తన దగ్గరికి వచ్చే పేరెంట్స్ తాను చేసిన షో బాగుందని చెప్తే సంతోషిస్తానని అంటూ ముగించారు.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags