సంకలనాలు
Telugu

బెంగళూరు భోజన ప్రియులు వీటిని చూస్తే తినకుండా ఉండలేరు

నోరూరించే వేడివేడి ఇడ్లీలు,వడలు, దోశలుదర్శనీల్లో లభించే ప్రత్యేకమైన స్నాక్స్సాంప్రదాయ భోజనాలకు పేరుగాంచిన దర్శనీలుఐటి సిటీలో రాజ్యం ఏలుతున్న దర్శనీ రెస్టారెంట్లు

ashok patnaik
22nd May 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

ఉదయం వేడివేడి ఇడ్లీతో కొబ్బరి చెట్నీ కలిపి ఇస్తే.. లొట్టలేస్తూ లాగించేస్తాం. సాయంకాలం గరమ్ చాయ్‌కి ముందు ఓ సాదా దోశ తింటే.. ఆ టేస్టే వేరు కదా. క్షణం తీరిక లేని బెంగళూరు నగర జనానికి అక్కడి టేస్టీ ఫుడ్ మాత్రమే సేద తీరుస్తోంది. అయితే ఇక్కడి టిఫిన్ షాపులు పేర్లు ఎక్కువగా దర్శిని అని ఉంటాయి. తిండివిషయానికొస్తే బెంగళూరులో మనం దర్శిని కల్చర్‌ను చూడొచ్చు. ఢిల్లీలో పరాఠావాలి గల్లీ, కోల్ కతలో రోల్స్, ముంబైలో కేఫెలు, వడాపావ్‌లు ఉన్నట్లుగానే బెంగళురులో దర్శినీలన్న మాట. ప్రతి వీధిచివరలో ఏదో ఒక పేరుతో ఒక దర్శినీ కనిపిస్తుంది. వడ, ఇడ్లి, ఫిల్టర్ కాఫిీతోపాటు బట్టర్, క్రంచీ దోశలు ఇక్కడ లభిస్తాయి. మధ్యతరగతి నుంచి ఆమ్ ఆద్మీ దాకా ప్రతి ఒక్కరూ దర్శినీల్లో టిఫిన్స్ తినే వారే. ఇటీవల చిన్నారులకోసం ప్రత్యేక దర్శినిలు పుట్టుకొచ్చాయి. మొత్తం మీద బెంగళూరులో వెలసిన దర్శినిల విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


విద్యార్థి భవన్

విద్యార్థి భవన్


విద్యార్థి భవన్

సౌత్ బెంగళూరు కి ఇదొక ల్యాండ్ మార్క్ సింబల్. సిటీలోని అత్యంత పురాతన దర్శినిగా దీన్ని చెప్పొచ్చు. పచ్చని గోడలపై, సాంప్రదాయ బద్దమైన బొమ్మలు వేసి ఉంటాయి. దాదాపు 70ఏళ్లు దాటిన ఈ దర్శిని ఇప్పటికీ అదే టేస్ట్ తో ఓ కల్చరల్ హబ్‌గా జనానికి సేవలందిస్తోంది. నటులు, రైటర్లు,ఫిల్మ్ స్టార్లు, కాలేజి స్టూడెంట్లు ఇలా ప్రతి ఒక్కరికీ ఇక్కడి దోశలు రుచి చూస్తుంటారు. మసాలా దోశ, సాగు దోశ, రవ్వదోశ తోపాటు కాఫీ కూడా ఇక్కడ ఎంతో ఫేమస్. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు. పెద్ద క్యూ ఉంటుంది. వందల మంది తమకు దోశ ఎప్పుడు దొరుకుతుందా, కాఫీ ఎప్పుడు తాగుదామా అని నోరెళ్ల బెట్టుకొని ఎదురు చూస్తారు.


image


బ్రహ్మీస్ కాఫీ బార్

ఇక్కడ దొరికే కొబ్బరి చెట్నీ అదుర్స్. ఇడ్లీలతో ఇచ్చే ఈ చెట్నీ కోసం జనం ఎగబడతారు. ఈచెట్నీకి వాడే ఫ్లేవర్ ఏంటో ఎవరికీ తెలదు. కానీ రుచి మాత్రం బ్రహ్మాండం. ప్రతి రోజూ ఉదయం ఇడ్లీ, వడల కోసం జనం క్యూ కడతారు. వీటితోపాటు ఇచ్చే కొబ్బరి చెట్నీ కోసమే వీరి తాపత్రయమంతా. కారాబాత్ ఇక్కడ దొరికే మరో వంటకం. చివరగా కాఫీ తో ముగిస్తే ఇక్కడ ఉదయం బ్రేక్ ఫాస్ట్ సంపూర్ణం అవుతుందన్న మాట.

దావణగెరె బెన్నె దోశె

దావణగెరె బెన్నె దోశ కర్నాటక లో చాలా ఫేమస్. ఇది దోశలో ఓ వెరైటి. బట్టర్ ఫ్లేవర్‌తో దీన్ని తయారు చేస్తారు. నట్‌కప్ప సర్కిల్ లో దావణగెరె బెన్నె జాయింట్ అంటే అదుర్స్ అనాల్సిందే. సాయంత్రం అయితే జనం దోశల కోసం ఎగబడతారు. ఇందులో బిన్నె దోశ, ఆయిలీ దోశ లాంటి రకాలు కూడా ఉన్నాయి. సంధ్యా సమయాన రోడ్లపై మాట్లాడుకుంటూ దొశలు తింటుంటే అది మాటలకు అందని అనుభూతి అంటారు రుచిమరిగిన జనాలు.

మావల్లి టిఫిన్ రూం

మావల్లి టిఫిన్ రూం


ఎంటిఆర్- మావల్లి టిఫిన్ రూం

మావల్లి టిఫిన్ రూం(ఎంటిఆర్) గురించి ప్రస్తావించకుండా బెంగళూరు ఫుడ్ కల్చర్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 1924 లో ప్రారంభించిన ఎంటిఆర్ ఫుడ్స్‌కు దేశం మొత్తం క్రేజ్ ఉంది. దక్షిన భారతంలో ఎంటిఆర్ బ్రాండ్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. బెంగళూరులో ఎంటిఆర్ టిఫిన్స్ టేస్టే వేరు. సెలవు రోజైతే ఇక్కడ మసాలా దోశ కోసం కాపుకాయక తప్పదు. లంచ్ కోసం వెళ్లామంటే వెయిటింగ్ చేయాల్సిందే. ఇక్కడి దోశ కోసం ముఖ్యమంత్రైనా క్యూలో వేచిచూడాల్సిందే అనే ఓ పుకారు కూడా ఉంది. రవ్వ ఇడ్లీని రెండో ప్రపంచ యుద్దం కాలంలో ఎంటిఆర్ ఇన్వెంట్ చేసిందని చెప్పుకుంటారు. వెండి గ్లాసులో మంచినీరు ఇస్తారిక్కడ. పరిసరాలు కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి.

దోశ క్యాంప్

జయనగర్, నాల్గవ బ్లాక్ లో మీకు శ్రీగణేష్ దర్శన్ దర్శనమిస్తుంది. దీన్ని స్థానికంగా దోశ క్యాంప్ అంటారు. రకరకాలైన దోశలకు ఇది ఫేమస్. మసాలాలతో కూడిన దోశలు, చట్నీలు ఇక్కడ లభిస్తాయి. అక్కీ రోటి ఇక్కడ ట్రై చేయాల్సిన వంటకాల్లో ఒకటి. ఉల్లి దోశ, బెనారస్ దోశల టేస్టే డిఫరెంట్. దోశ కాకుండా ఇంకేదైనా తినాలనుకుంటే కచ్చితంగా మిని ఇడ్లీ తీసుకుంటే సరిపోతుంది.

అడిగాస్

నగరంలో ఉన్న మరో ప్రముఖ దర్శని అడిగాస్. బ్రహ్మీస్ కాఫీ బార్ రుచికి ఇంచుమించు సరిపోయే రుచికరమైన వంటకాలిక్కడ దొరుకుతాయంటారు. అడిగా కుటుంబానికి చెందిన వారు బెంగళూరులో ఎన్నో ఫేమస్ దర్శినీలను ప్రారంభించారు. సౌతిండియన్ స్నాక్స్ , చాట్స్, జూసులను 24x7 సర్వీసు అందిస్తున్న ఏకైక మల్టీ క్యుసిన్ హాట్ స్పాట్‌గా అడిగాస్‌కు పేరుంది. నగరంలో చాలా రకాల చైన్ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ జయనగర్ ఇందులో ప్రముఖంగా చెప్పుకోదగినది.

ఎస్ ఎల్ వి

ఎస్ ఎల్ వి


ఎస్.ఎల్‌.వి.

ఎంటీఆర్ మాజీ ఉద్యోగి ఎస్సెల్వీని ప్రారంభించారనే పుకారుంది. నగరంలో ఔట్లెట్స్ ఉన్నప్పటికీ జయనగర్ 9వ బ్లాక్ లో ఉన్నదాని కోసం మనం ప్రముఖంగా చప్పుకోవాలి. వీధి చివర ఎక్కువ మంది జనం నిల్చొని కనిపించినట్లైతే అక్కడ కచ్చితంగా ఎస్సెల్వీ దర్శిని ఉందని మీరు గుర్తుపట్టొచ్చు. మసాలా దోశ ఇక్కడ బాగుంటుంది. చంద్రహారా అనే స్వీట్ ఎస్సెల్వీలో ఉన్నట్లు ఇంకెక్కడా ఉండదంటే నమ్ముతారా.

మైయ్యాస్ లో కాఫీ టంబ్లర్

మైయ్యాస్ లో కాఫీ టంబ్లర్


మైయ్యాస్

ఎంటిఆర్ కుటుంబానికి చెందిన వారే మైయ్యాస్ ను ప్రారంభించారు. జయనగర్ నాలుగో బ్లాక్ లో ఉన్న ఈ దర్శిని జనానికి ఎంటిఆర్ టేస్టుకు సమానమైన రుచిని అందిస్తోంది. నాలుగు ఫ్లోర్ల మైయ్యాస్‌లో మీల్స్, స్నాక్స్ తో పాటు ఎంటిఆర్ ఫుడ్ ప్యాక్‌లు దొరుకుతాయి. కాఫీ, జూస్ సప్లై చేయడానికి సిల్వర్ టంబ్లర్‌ను ఉపయోగిస్తారు. ఎంటిఆర్‌ కంటే మెరుగ్గా ఇక్కడ ఆనియన్ దోశ, బోండా సూప్ దొరుకుతుంది.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags