సంకలనాలు
Telugu

హౌజ్ క్లీనింగ్‌లో హాట్‌ ఫేవరెట్‌గా మారుతున్న 'బ్రూమ్‌బర్గ్'

ABDUL SAMAD
25th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

" ఈమధ్య మా ఫ్రెండ్ ఒకరు పెళ్లి చేసుకుని నగరానికి వచ్చారు. ఇంటిని చక్కదిద్దుకోవడం వాళ్ళకు కష్టంగా మారింది. దీనికి తోడు అనారోగ్యంతో ఉన్న తల్లి వల్ల ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. చివరకు ఆ పని చేసిపెట్టే హౌస్ మెయిడ్ దొరకడంతో వారి సమస్య తీరిపోయింది. అది కూడా.. సింపుల్‌గా బ్రూమ్‌బర్గ్‌కి కాల్ చేశారంతే. వాళ్లే ఆ హౌస్ మెయిడ్‌ను ఏర్పాటు చేయడం.. ఆమె వచ్చి ఇంటిని శుభ్రం చేసి వెళ్లడం.. అలా చకచకా జరిగిపోయాయి ".

image


బ్రూమ్‌బర్గ్ అంటే ఏంటి ?

బ్రూమ్‌బర్గ్ ఓ క్లీనింగ్ సర్వీస్ కంపెనీ. మీ ఇంటిని, మీ ఆఫీసుని కూడా శుభ్రంగా ఉంచుతుంది. పట్టణాలు, మహా నగరాల్లో హౌస్ కీపింగ్ ఎంత కష్టంగా మారిందో మనందరికీ తెలుసు. వివిధ కంపెనీలు మంచి హౌస్ కీపింగ్ ఏజెన్సీల కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ అవసరాలను గుర్తుంచుకుని బ్రూమ్‌బెర్గ్ స్టార్టప్ మొదలైంది.

2013లో సమ్రాట్ గోయల్, ఇషాన్ ఈ బ్రూమ్‌బర్గ్‌కి రూపకల్పన చేశారు. హౌస్‌కీపింగ్‌లో నైపుణ్యం ఉన్న టీంని ఎంచుకున్నారు ఈ ఇద్దరూ. ఇళ్ళు, ఆఫీసుల్లో హౌస్‌కీపింగ్ చేయించడం ప్రారంభించారు. ఇంటర్నెట్‌లోకి వెళ్ళి బ్రూమ్‌బెర్గ్‌కి ఫోన్ చేస్తే చాలు మీ దగ్గరికి వచ్చి తమ సర్వీసులు అందిస్తారు.

ఐడియా ఎలా వచ్చింది ?

సమ్రాట్ గోయల్ సోదరుడు ముంబైలో ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఇంటికి నిప్పంటుకుంది. ఫైర్ సర్వీసెస్ వారు వచ్చి మంటలు ఆర్పేసి వెళ్లారు. అప్పటికే ఇల్లంతా నానా బీభత్సంగా మారిపోయింది. గదులు, ఫ్లోరింగ్, అన్ని రూమ్‌లు దుమ్ము ధూళితో మారిపోయాయి. ఆ ఇంటిలో అప్పుడు ఉండడం అసలు కుదరదని నిర్ణయించారు. ఇంటిని వెంటనే క్లీన్ చేయించాలని భావించారు. తమకు తెలిసిన క్లీనింగ్ కంపెనీలన్నిటికీ ఫోన్ చేశారు సమ్రాట్. అయితే వారంతా తమ వల్ల కాదన్నారు. పైగా దీపావళి, సంక్రాంతి టైంలోనే తాము ఆ పనిచేస్తామని...ఇప్పుడు చేయడం కుదరదని బదులిచ్చారు. ఇక చేసేదేం లేక ఇద్దరు కూలీలను పిలిచి దగ్గరుండి మరీ తర్వాత రోజు క్లీన్ చేయించాడు సమ్రాట్. అయితే అక్కడికి తీసుకొచ్చిన వారికి హౌస్‌కీపింగ్‌లో ఎలాంటి అనుభవం గానీ, సరైన పరికరాలు గానీ లేవు.

ఈ సంఘటన సమ్రాట్‌లో కొత్త ఆలోచనలకు నాంది అయింది. మంచి ప్రొఫెషనల్స్ ఉంటే ఇలాంటి పనులు సులువుగా అవుతాయని.. ఎంతోమందికి సౌకర్యంగా ఉంటుందని భావించారు. ఇదే సమయంలో లండన్ స్కూల్ ఎకనామిక్స్‌లో తనకు క్లాస్‌మేట్ అయిన ఇషాన్‌ని కలిసి తన ఐడియా గురించి తెలియజేశాడు. మరో సంగతేంటంటే అప్పటికే ఇషాన్ అమెరికాలో ఇలాంటి సర్వీసు ఒకటి ప్రారంభించాడు. దీని స్ఫూర్తిలో బ్రూమ్‌బర్గ్‌ని తెరమీదికి తెచ్చారు మిత్రులిద్దరూ.

image


బ్రూమ్‌బర్గ్‌ని సెప్టెంబర్ 2013 లో ప్రారంభించారు. అయితే కార్యకలాపాలు మాత్రం డిసెంబర్‌లో ప్రారంభమయ్యాయి. కుటుంబసభ్యుల సహకారం, పొదుపు చేసిన రూ.10 లక్షలు పెట్టుబడిగా పెట్టారు.

బ్రూమ్‌బర్గ్ ప్రారంభం అయ్యాక క్లీనింగ్ ప్రక్రియ ఈజీగా మారిపోయింది. ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత ఎంత ముఖ్యమో భారతీయుల్లో అవగాహన పెరిగిందంటారు నిర్వాహకులు. ఇల్లు, ఆఫీసుల్లో క్లీనింగ్‌కి జనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని గ్రహించారు. ‘‘మారుతున్న పరిస్థితుల్లో క్లీనింగ్ చేయడానికి ప్రొఫెసనల్స్ అవసరం ఎంతో ఉంది. మేము సాధారణంగా సంపన్నుల ఇళ్ళు, వారి ఆఫీసులు, రెస్టారెంట్లపై దృష్టి పెట్టాం. మేం ఆశించిన విధంగా బ్రూమ్‌బర్గ్ మేజర్ మెట్రోనగరాల్లో దూసుకుపోతోంది’’ అంటారు సమ్రాట్.

డిసెంబర్ 2013 లో బ్రూమ్‌బెర్గ్ ప్రారంభమే అదిరింది. ఒకే నెలలో 300 ఇళ్ళు, ఆఫీసులు, రెస్టారెంట్లు, షోరూమ్‌లను క్లీన్ చేసింది. వీళ్ల పనితీరు కస్టమర్లకు బాగా నచ్చింది. దీంతో ప్రోత్సాహమూ పెరిగింది. అంతే కాదు వాళ్లతో నెలవారీ ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఏ నెలకా నెల కంపెనీ క్లయింట్లు పెరుగుతూ వచ్చారు. మేం ఆశించిన దానికంటే మంచి స్పందన వచ్చిందనే చెప్పాలంటారు సమ్రాట్.

ఇళ్ళు, ఆఫీసులు, రెస్టారెంట్లలో క్లీనింగ్ చేయాల్సిన ప్రదేశాలను ముందుగా ఎంపికచేసుకుంటారు. వంట గదులు, బాత్‌రూమ్‌లను ప్రత్యేకంగా క్లీనింగ్ చేస్తారు. సాధారణంగా ఒక సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేయడానికి రూ.4500 వరకూ ఛార్జ్ చేస్తారు. ‘‘ మేం సాధారణంగా క్లీనింగ్ సంబంధించి ఛార్జి చేసేటప్పుడు మేథమెటికల్‌గా ఆలోచిస్తాం. అంతా పక్కాగా ఉంటుంది. అసలు క్లీన్ చేయాల్సిన ఇల్లు పరిస్థితి ఏంటి ? ఉన్నరూమ్‌లు, కామన్ ఏరియా. ఇంటి పరిసరాలు ఎలా ఉన్నాయి ? అనేవి ఆలోచించి ధర నిర్ణయిస్తాం. ఒక్కో ఇంటికి ఒక్కో ధర ఉంటుంది’’ అని చెబుతున్నారు సమ్రాట్.

బ్రూమ్‌బర్గ్ ఎక్కడుంది ?

బ్రూమ్‌బర్గ్ కంపెనీ ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సర్వీసులను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నారు. కాలేజీ విద్యార్ధులు, గృహిణులు, వృత్తి నిపుణులు..ఇలా ఎందరో వీళ్ల క్లైంట్లు ఉన్నారు. వారికి మా సేవల్లో ఎలాంటి లోపం రాకుండా చూసుకుంటాం. ఎక్కడికైనా ఇల్లు మారాలనుకున్నా.. ఏదైనా పని ఉండి ఇల్లు తాళం వేసి వేరే ఊరు వెళ్ళినా.. వచ్చిన తర్వాత మాకు కాల్ చేసి సిబ్బందిని పంపించమని చెబుతారు. అలాగే కొత్త గా కట్టుకున్న ఇల్లు, మార్పులు, చేర్పులు చేసుకున్న ఇళ్ళను మేం ఎంచుకుని క్లీన్ చేయించేస్తాం అంటున్నారు ఇషాన్.

image


భవిష్యత్తు ప్రణాళికలు

బ్రూమ్‌బర్గ్‌ని విస్తరించడంపై దృష్టిపెట్టారు సమ్రాట్, ఇషాన్‌లు. ‘‘మా బ్రూమ్‌బర్గ్ ద్వారా సేవలు విస్తరించాలనుకుంటున్నాం. కస్టమర్లు బుక్ చేసుకున్న వెంటనే మా సిబ్బంది క్యాబ్ ద్వారా అక్కడికి చేరుకుని సాధ్యమైనంత త్వరగా సేవలు పూర్తిచేసి వస్తారు. క్లీనింగ్‌కి సంబంధించి నాణ్యమయిన, పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులను వాడుతున్నాం. కస్టమర్లకు నాణ్యమయిన, రాజీలేని సేవలు అందిస్తున్నాం’’ అని చెబుతున్నారు సమ్రాట్, ఇషాన్‌లు. మా సిబ్బందికి ఎప్పటికప్పుడు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా టెక్నాలజీని కూడా పెంచాలని భావిస్తున్నాం. మేమే కాదు మాలాగే కొత్తగా స్టార్టప్‌ల ప్రారంభించేవారికి మేం రోల్‌మోడల్‌గా ఉంటాం అంటున్నారు నిర్వాహకులు.

బ్రూమ్‌బర్గ్ ప్రచారానికి సంబంధించి ప్రస్తుతం గూగుల్, సోషల్ మీడియాలపై దృష్టి పెట్టారు ఇషాన్, సమ్రాట్‌లు. దీంతో పాటు ఆఫ్‌లైన్ అడ్వర్టైజింగ్ గురించి ఆలోచిస్తున్నారు. వీటన్నిటికంటే పాత కస్టమర్ల మౌత్ పబ్లిసిటీ ఎంతో ముఖ్యమన్నారు సమ్రాట్.

‘‘మేం ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమం, పనివిధానం, నూతన పద్ధతుల అన్వయం, ఇన్సెంటివ్‌లపై ప్రధానంగా దృష్టి పెట్టాం. ఉద్యోగులకు ప్రేరణ కలిగించాలని నిర్ణయించాం. కస్టమర్ల దగ్గర నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌పై కూడా మేం చర్చిస్తున్నాం. బాగా పనిచేసిన వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. క్వాలిటీ, టైం మేనేజ్‌మెంట్ ముఖ్యమని చెబుతున్నాం’’ అంటారు సమ్రాట్.

క్లీనింగ్ టీంలో కొత్తవారిని చేర్చుకుని వారికి శిక్షణ ఇవ్వడం, వారికి అవగాహన కల్పించడం చేస్తుంటారు. మా స్టాఫ్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. వారిలో యువకులు ఎక్కువగా ఉన్నారు. ఉత్సాహంగా పనిచేస్తూవారు తమ టీం లను ముందుకు తీసుకుపోతున్నారు. సగటున బ్రూమ్‌బర్గ్‌లో పనిచేసే స్టాఫ్ సగటు వయసు 23 సంవత్సరాలే. 80 శాతంమందికి క్లీనింగ్‌పై మంచి శిక్షణ ఉంది. టీం సభ్యులందరి మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందింపచేయడానికి, వారి మధ్య పరస్పర సహకారానికి మావంతు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.

బ్రూమ్‌బర్గ్ వ్యవస్ధాపకులకు తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు ఉన్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో వారు ముందుకెళుతున్నారు. సమ్రాట్‌ ఫైనాన్స్ రంగంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కెపీఎంజీ, బీసీజీ, ఎల్‌ఎస్‌ఈల్లో ఉన్నత స్థాయిలో పనిచేశారు. ఢిల్లీ వర్శిటీ నుంచి ఇషాన్ బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. రియల్ ఎస్టేట్, బిజినెస్ మేనేజ్‌మెంట్లలో మంచి అనుభవం ఉంది. బీబీఏ, ఎంబీయే చేశారు. ప్రస్తుతం ఇషాన్ ఎల్ఎల్‌బీ చదువుతున్నారు. ఆపరేషన్స్, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో ఎంతోమంది మిత్రులున్నారు.

బ్రూమ్‌బర్గ్‌ని విస్తరించే అవకాశాలను వెతుకుతున్నారు ఇద్దరు మిత్రులు. 2017 నాటికి ఢిల్లీలో మరో రెండు బ్రాంచ్‌లు ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు.అలాగే మరో ఐదు మెట్రోనగరాలకు సేవలు విస్తరించే పనిలో ఉన్నారు. ఫ్రాస్ట్ అండ్ సులివాన్ కంపెనీ అంచనాల ప్రకారం మనదేశంలో ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ వాటా రోజురోజుకీ పెరిగిపోతోంది. 2011లో దీని వాటా రూ.3,795 కోట్లుగా నమోదైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కాంపౌండ్ యావరేజ్ గ్రోత్‌రేట్ (CAGR) ప్రకారం బ్రూమ్‌బర్గ్ 11.6 శాతం సాధించింది. మున్ముందు ఈ రేటు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. మంచి టీం, కష్టమర్ సపోర్ట్, గుడ్ రిలేషన్స్‌తో బ్రూమ్‌బర్గ్ దూసుకుపోతోంది.

వెబ్‌సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags