సంకలనాలు
Telugu

ఓ ఫెయిల్యూర్ బిజినెస్‌మెన్.. 'క్యాట్ గురు' స్థాయికి ఎలా ఎదిగారు ?

11th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మందలో ఒకరిగా ఉండకు..వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు అనే స్వామి వివేకానంద మాటలను అక్షరాల నిజం చేశారు అరుణ్ శర్మ. అయితే చేసిన ప్రతి పనిలో ఓటమి ఎదురొచ్చి స్వాగతం పలికినా అయినా కుంగిపోలేదు. అవసరాలు కొత్త దారులను వెతికితే... అనుభవాలు కొత్త పాఠాలు నేర్పుతాయి అనే నానుడిని నిజం చేస్తూ, అరుణ్ చివరికి భారత్‌లో 'క్యాట్ గురు' గా మారిపోయారు. వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారు.

ఐఐఎం బెంగుళూర్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అరుణ్ శర్మ 1995 లో మిత్రులతో కలిసి ఓ కొత్త సంస్థను ప్రారంభించారు. పాట్నాలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభించారు. అప్పుడు లీడింగ్ బ్రాండ్‌గా ఉన్న TULECలో ఫ్రాంచైజ్‌ తీసుకున్నారు. అయితే మార్కెట్లో తగిన వనరులు లేకపోవడంతో.. ఆ ప్రాజెక్టు దురదృష్టవశాత్తు ఫెయిలైంది. వీటికి తోడు అనేక కారణాలు కంపెనీని బోర్డు తిప్పేసేలా చేశాయి. వ్యాపారవేత్తగా ఓడిపోయిన శర్మ ఆ తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసినా సంతృప్తిగా లేరు. ఇంకా ఏదో చేయాలనే ఆతృత అతనిలో కనిపించేది. సొంతంగా వినూత్నమైన వ్యాపారం చేయాలని ఎప్పుడూ కోరుకునేవారు. కొద్దికాలానికే కార్పొరేట్ ఉద్యోగానికి కూడా గుడ్ బై చెప్పేశారు. 

"ఐఐఎం బెంగుళూర్‌లో పట్టభద్రుడైనప్పటికి రెండేళ్ల తర్వాత ఉద్యోగం లేక రోడ్డున పడాల్సి వచ్చింది. కెరీర్ లేదు. ఉద్యోగం పోయింది. పారిశ్రామికవేత్తగా చేదు అనుభవంతోపాటు 20 లక్షల రూపాయిల అప్పు తలపైన పడింది. ఎలా ఆ మొత్తాన్ని చెల్లించాలో తెలియక సతమతమయ్యాను '' అని పాత రోజులను గుర్తు చేసుకుంటారు శర్మ.
అరుణ్ శర్మ

అరుణ్ శర్మ


'' జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే...ఒక్కసారి నా పరిస్థితి మారిపోయింది. ప్రణాళిక లేకపోవడం, ఏమి చేయాలో తెలియకపోవడమే మొదటి తప్పు.. అనే నిర్ణయానికి వచ్చేశాను. ఇక అంతా అయిపోయింది.. చేయడానికి ఏమీ లేదు అనే టైంలో ఒక కొత్త ఆలోచన మదిలో మెదిలింది. మేనేజ్మెంట్ ఎంట్రన్స్‌లో విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వడం ఒక్కటే నేను చేయగలిగిన పని అని అప్పట్లో అనిపించింది. ఆప్టిట్యూడ్, కెరీర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇవ్వడమే మంచిదని భావించాను '' అంటారు అరుణ్.

అంతే ఈ ఒక్క నిర్ణయం.. అరుణ్ శర్మను ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు దూసుకెళ్లాలే చేసింది. ఒక్కో అడుగు వేసుకుంటూ.. అటు ఫ్యాకల్టీగా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే.. విస్తరణలో కూడా వేగం పెంచారు. పుస్తకాలు రాయడంతో, వినూత్నంగా విద్యార్థులకు వివరించడంతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. క్యాట్ పరీక్షకు హాజరయ్యే ప్రతీ విద్యార్థికీ ఇప్పుడు అరుణ్ శర్మ పేరు తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో.. ?

క్యాట్ టెస్ట్ కోసం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ఎలా సిద్ధమవ్వాలి ? CAT కోసం డేటా ఇంటర్‌ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ కోసం ఎలా రెడీ కావాలో వివరిస్తూ ఆయన రాసిన రెండు పుస్తకాలు హాట్ కేక్స్‌లా అమ్ముడుపోయాయి. దీని తర్వాత ఇక అరుణ్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏనాటికీ ఏర్పడలేదు. టెక్నాలజీని వాడుకుంటూ కాంపిటీటర్ల కంటే వంద అడుగులు ముందుకేసి అలా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేందుకు వేలాది మంది విద్యార్థులను అరుణ్ తయారు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం CAT 'keeda' , CAT ' Taker వంటి కోర్సులు, పుస్తకాలు 14 సంవత్సరాల్లో ఎంతో మంది విజేతలను తయారు చేశాయి. అరుణ్ శర్మ పదికి పైగా పుస్తకాలు రాయగా, అవి ఏకంగా 15 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి.

ఐఐఎం సీటుతో దశ తిరిగింది

అరుణ్ తండ్రి బ్యూరోక్రాట్. దీంతో ఆయన మల్టీ కల్చర్, మల్టీ స్కూల్స్ సహా.. వివిధ నగరాల్లో పెరగాల్సి వచ్చింది. బాల్యమంతా మహారాష్ట్ర లోని చిన్న పట్టణాల్లో గడపాల్సి వచ్చింది. చదువు కూడా ఒక్క చోట కాకుండా అలానే సాగింది. యావరేజ్ గ్రేడ్‌తో స్కూలింగ్ పూర్తి చేసి... ఎంఐటీ పూణెలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అక్కడ ఫస్ట్ క్లాస్ రావడంతో లైఫ్‌కు టర్నింగ్ పాయింట్ లభించింది. వెంటనే ఐఐఎంలో చేరడం.. జీవితంలో పెనుమార్పులకు కారణమైందని వివరిస్తారు. 

" నాకు తెలిసినంత వరకూ చాలా మంది విద్యార్ధులు మంచి క్వాలిటీ కంటెంట్ లేకపోవడంతో కాన్ఫిడెంట్‌గా ఉండరు. ఇదే పరీక్షకు సమాయత్తం కాకుండా వెనక్కి లాగుతుంది. వీళ్ల సమస్యలన్నీ తీర్చడమే నా లక్ష్యం. అదృష్టవశాత్తు నాకు మెక్‌గ్రాహిల్ వంటి పబ్లిషర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ CAT ప్రచురించడానికి ముందుకొచ్చారు.'' 


Mindworkzz ,ఆన్ లైన్ లెర్నింగ్

ఇప్పుడు "Mindworkzz పేరుతో హై క్వాలిటీ డిజిటల్ కోర్సులు అందిస్తూ... స్టూడెంట్ కమ్యూనిటీలో కొత్త ఒరవడి సృష్టించారు అరుణ్. క్యాట్, యుపిఎస్‌సి, సిశాట్, గేట్, జిమ్యాట్‌లతో పాటు CBSE బోర్డ్ పరీక్షల కోసం మైండ్ వర్క్స్ డిజిటల్ కంటెంట్‌ను అందిస్తోంది.

ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, లైఫ్ సాఫ్ట్ స్కిల్స్, ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్, ఎమోషనల్ , టైమ్ మేనేజ్‌మెంట్... మొదలైన విభాగాల్లో తానే సొంతంగా ఏకైక విధానాన్ని అభివృద్ధి చేశారు. సాధారణ టీచర్, లేదా ట్రైనర్ ఎలా అర్థమయ్యేలా వివరిస్తారో.. నేనూ అలానే చెప్తాను అని వివరిస్తారు. 

'' నా సెషన్ లో సింపుల్ మంత్రాలు ఉంటాయి.

ఎ) ప్రతి సెషన్‌ను ఒక ఈవెంట్‌గా భావిస్తా.

బి) విద్యార్థులకు నేర్పే ట్రైనింగ్ కొత్త ఆలోచనలతో ఉండే విధంగా చూస్తాను.

సి) నేను నేర్పిన విషయాలను విని నేర్చుకోవడం కంటే ఓ వినోద ప్రక్రియలా ఉండేలా ప్లాన్ చేస్తాను '' .


పారిశ్రామిక వేత్త నుంచి Mindworkzz vision సారధి వరకు...

కొత్త అవకాశాలతో పలు సంస్థలతో కలిసి పని చేయడం ద్వారా Mindworkzz ఛీఫ్ అరుణ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. "నేను క్లిష్టమైన పనులు, సవాళ్లు , క్వాలిటీ ఆఫ్ ఔట్ పుట్, ఇలా ప్రాధాన్యాల ప్రకారం వివిధ పాత్రలు పోషిస్తుంటాను. కోర్సు, బోధన, మ్యాధ్స్, వ్యక్తిగత అభివృద్ధి, రీజనింగ్, డేటా ఇంట్రప్రిటేషన్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను.

Mindworkzz టీమ్

Mindworkzz టీమ్


ఆన్‌లైన్ శకానికి నాంది

'' ఇక్కడ ఆన్‌లైన్ లెర్నింగ్ వ్యాపారం ఎల్లలు, హద్దులు లేకుండా పెరుగుతోంది. అయితే ప్రస్తుతం విద్యార్ధులు మైండ్ సెట్ ఇందుకు హద్దుగా ఉంది. ఒక గురువుగా నేను ఎలాంటి ఆంక్షలూ కోరుకోను. ఆఫ్ లైన్‌లో శిక్షణా కార్యక్రమం కంటే ఆన్‌లైన్ మెరుగ్గా ఉంటుంది. కోర్సులో చాలా సౌలభ్యం ఉంది. క్లాసుల కోసమంటూ... సుదూర ప్రయాణాలు చేసి... టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉంటే అక్కడే తరగతులు... ఒక వేళ ఎక్కడైనా క్లాస్ మిస్సయితే... రివ్యూ, రివైజ్ చేసుకొనే అవకాశం ఉంది. ఫోన్ , టాబ్లెట్ ,కంప్యూటర్ కాదేదీ చదువు కోవడానికి అనర్హం అంటారు అరుణ్. ఏం చెప్పాలనుకున్నా కమ్యూనికేట్ చేయడానికి ఎలాంటి ఆంక్షలు లేవని...'' చాలా సందర్భాలలో ఆన్ లైన్ ట్రైనింగ్ లో విశదపరిచారు.

రెవెన్యూ...Mindworkzz టర్నోవర్

మొదటి సంవత్సరం: రూ. 8 లక్షలు

రెండవ సంవత్సరం: రూ. 65 లక్షలు

2014-2015 టర్నోవర్: కోటిన్నర రూపాయిలు

పెయిడ్ యూజర్ల సంఖ్య: 800-1000

మార్కెటింగ్ ఖర్చు: రూ. 6-8 లక్షలు,

ఒక్కో యూజర్‌పై ఖర్చు: రూ. 600-800

వెబ్ సైట్ లో రోజుకు హిట్స్: 2000

భవిష్యత్తు ప్రణాళికలు

Mindworkzz, కోర్సుల కోసం మేము తయారు చేసిన నమూనా కొత్త రకమైంది. ఒకేసారి ఎంత మంది విద్యార్థులైనా పరిమితి లేకుండా కోర్సుల్లో చేరవచ్చు. మేము రానున్న 5-7 సంవత్సరాలలో 100% వృద్ధిని సాధించగలమని అంచనా వేస్తున్నామని చెప్పి ముగించారు అరుణ్ శర్మ.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags