సంకలనాలు
Telugu

మన దేశ మొదటి మహిళా సుమోకు స్పాన్సర్లు కావాలి !

team ys telugu
4th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

తన వయస్సులో ఉన్న పిల్లలంతా కార్టూన్ నెట్ వర్క్ చూస్తుంటే.. అయిదేళ్ల హెటల్ దవే మాత్రం జాకీ చాన్ సినిమాలు చూస్తూ బిజీగా గడిపేది. చిన్నతనం నుంచి విభిన్నంగా ఏదో ఒకటి చేయాలని అనుకునేది. జాకీచాన్‌పై చిన్నారి చూపించే అభిమానాన్ని గమనించిన తండ్రి కరాటే నేర్పించడానికి తీసుకెళ్లాడు. అయితే ఆ రోజు అక్కడ జూడో క్లాస్ జరుగుతుండడం తన అదృష్టం అంటుంది హెటల్ దవే.

image


ఇప్పుడు హెటల్ దవే భారత దేశంలో మొట్టమొదటి మహిళ సుమో రెజ్లర్. ఏడేళ్ల వయసులో తన తొలి టోర్నమెంట్ ఆడింది హేతల్. "ఎన్నో ఓటములని చవిచూశాను. నా స్థానంలో ఎవరైనా ఉండి ఉంటే, ఆడాలన్న ఆలోచననే ఎప్పుడో మరిచిపోయేవారు. కానీ నేను పడ్డ కష్టమంతా ఫలించింది. నాకెరీర్ మలుపు తిరిగింది, అలానే కొనసాగించాను '' అంటుంది హేతల్. తైవాన్లో 2009లో జరిగిన విమెన్స్ మిడిల్ వెయిట్ క్యాటగిరీలో అయిదో స్థానం సంపాదించింది దవే.


ఆమె వేసే ప్రతీ అడుగులో తన తల్లిదండ్రులు, సోదరుడు అక్షయ్ ఉంటారు. అయితే చదువంటే ఎప్పుడైనా ఒత్తిడికి గురయ్యేదానివా అంటే మాత్రం "ఇతర పిల్లలు ఇంకా మంచి మార్కులు రావడానికి చదువుతుంటే నేను మాత్రం పాసవడానికే మాత్రమే చదివేదాన్ని. నా తల్లిదండ్రులకు తెలుసు నాకు ఏదంటే ఇష్టమో, వారు దాన్నే ప్రోత్సహించారు" అంటూ నవ్వుతుంది హెటల్. మొదటి నుంచి తనకు స్పోర్ట్స్ అంటే మక్కువ ఎక్కువ, అందుకే అదే దిశగానే అడుగులు వేసింది.

image


ఏకలవ్యుడిలా ప్రయత్నించింది

స్పోర్ట్స్ మీద మనస్సు పెట్టుకున్న హేతల్, ఇతర మార్గాల్లోను అందరికంటే భిన్నంగా వ్యవహరించేది. ఇతర అబ్బాయిలు, అమ్మయిలు ప్రేమల గురించి మాట్లాడుకుంటుంటే హేతల్ మాత్రం చెమటోడుస్తూ, తీవ్రంగా పరిశ్రమించేది. దీంతో, టీనేజీలో ఉండే ఎక్సైట్మెంట్‌ను మిస్సయ్యావా అనడిగితే, " ఎప్పుడూ అలా ఫీలవలేదు. నాకంటూ ఒక గోల్ ఇప్పటికీ ఉంది. ఎటువైపూ చూడకుండా నా దృష్టినంతా ఆ గోల్ మీదనే పెట్టాను. అదొకటే నేను ఆలోచించేది" అంటుంది. ఆ గోల్ ఏంటి అంటే, " ఒలింపియన్ అనిపించుకోవాలన్నదే నా గోల్. నేను ఇంకా ఆడూతున్నాను కాబట్టే ఆ గోల్‌ను పెట్టూకున్నాను. ఆ తర్వాత మంచి టీచర్ అవుతా" అంటుంది. హెటల్ జూడో నేర్పిస్తుంది. తన స్టూడెంట్ ఒకరు నేషనల్ లెవల్లో కూడా ఆడారు. "నేషనల్ ఛాంపియన్‌కు గురువు అని ఏదో ఒక రోజు అనిపించుకుంటాను" అంటుంది.


తను అంతపెద్ద అందగత్తె ఏమీ కాదు, అందులోనూ తానెంచుకున్న స్పోర్ట్ కూడా విభిన్నం. ఈ నేపధ్యంలో ఎవరైనా స్కూల్ డేస్‌లో ఏడిపించారా అనడిగితే, నవ్వుతూ 'అంత ధైర్యం ఎవరూ చేయలేకపోయేవారు. కాలేజీలో ర్యాగింగ్ కల్చర్ ఉండేది. అయితే నన్ను ర్యాగ్ చేయడానికి వచ్చినవాడు పరుగెత్తుకుంటూ పారిపోయాడు" అంతూ నవ్వుతుంది హెటల్. "ఫ్రెండ్స్ అందరూ కలిసినపుడు అబ్బాయిలాగే ఉండేదాన్ని. స్కూల్లో నా జర్నల్స్ పూర్తిచేయడానికి అబ్బాయిలంతా హెల్ప్ చేసేవారు. నాకంటూ మంచి సయాహ సహకారాలు అందించే టీం ఉండేది. వాళ్లతో కలిసిపోయి ఉండేదాన్ని, ఎప్పుడు ఒంటరిదాన్నని ఫీలవలేదు" అంటుంది.


కమ్యూనిటీ జోక్యం

హెటల్ ది రాజస్తాన్‌కు చెందిన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం."అమ్మయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికే ఒప్పుకోని కుటుంబాలున్నాయి. ఇప్పటికీ ఆ కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. చదువుకోవడం కష్టతరమైన విషయం, ఇక ఆటలంటే సాధ్యమయ్యే విషయమే కాదు. అందులోను నిండుగా దుస్తులు లేకుండా ఆడే ఆటంటే ఊహకే అందదు. అయితే నా తల్లిదండ్రులు మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేను ఉంటున్న సమాజం నాకు ఏమీ చేయనపుడు నేనెందుకు వాళ్ల గురించి ఆలోచించాలి" అంటుంది హేతల్.

image


సపోర్ట్ సిస్టం

నేను రెండు స్కూల్స్ మారాను అంటూ నవ్వుతూ చెప్తుంది హెటల్. " నేను తొమ్మిదో తరగతి ఫెయిలయ్యాను, దాంతో స్కూల్ మారాల్సి వచ్చింది. రెండో స్కూల్ నా ఇష్టాల్ని గమనించి ప్రోత్సహించింది. నా కెరీర్‌కు తగ్గట్టుగా స్కూల్ టైమింగ్స్‌ను మార్చుకునేలా చేసింది". టీచర్స్ సపోర్ట్‌ను, స్కూల్ డేస్ మరిచిపోలేనంటుంది హెటల్. ఇక కాలేజీలో ఇంకా రిలాక్స్డ్‌గా అనిపించింది. " కాలేజీలో మా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నా తండ్రిలా సహకరించాడు. ఒక రకంగా నాకు ఇద్దరు తండ్రులని చెప్పొచ్చు" అంటుంది హెతల్.

హెటల్ దవే కుటుంబం ఆర్ధికంగా బాగా ఉన్నదేమీ కాదు. డబ్బుల కోసం కష్టపడేది హేతల్. ప్రాక్టీసింగ్‌తో పాటుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుచెప్పేది. జూడో క్లాసులకు తీసుకెళ్లి, తిరిగి తీసుకురావడానికి తండ్రి దగ్గర డబ్బులుండేవి కాదు. శిక్షణ నుంచి వచ్చేటపుడు, మా నాన్న నా సోదరుడిని భుజాల మీదకు ఎక్కిచుకుని, మా బ్యాగ్స్ పట్టుకుని నడిచేవాడు. మేము ఎంత దూరం నడిచి ఇంటికి వస్తున్నమో తెలియకుండా మాకు కథలు చెప్తూ, పాటలు పాడుతూ నడిపించుకుని తీసుకువచ్చేవాడు. ఆ సమయంలో మేము చాలా చిన్న పిల్లలం, బస్సులో వెళ్లడానికి డబ్బులు లేవని ఎలా చెప్పలో నాన్నకు అర్థం కాలేదు." అంటుంది హేతల్.

ఆర్థికంగా కష్టంగా ఉన్నప్పటికీ హేతల్ తండ్రి తనను ముంబై లోని బెస్ట్ టీచర్ కవస్ బిల్లిమొరియ దగ్గరికి తీసుకెళ్లాడు. "అతను దేశంలోనే పెద్ద పేరున్న జూడో మాస్టర్, ఓలింపియన్. శిక్షణకోసం బాగా చార్జ్ చేసేవాడు, కానీ మాదగ్గర డబ్బులు తీసుకోలేదు. మొదట్లో నాన్న ఫీజ్ ఇచ్చేవాడు కానీ, నా టాలెంట్, పట్టుదల చూశాక, మీ అమ్మాయికి నేనే నేర్పిస్తానని చెప్పాడు" అంటుంది హెటల్ దవే. ఇప్పుడు ఆమె.. కవస్ దగ్గరే ఇతరులకూ ట్రైనింగ్ ఇస్తోంది.

image


"కావాలంటే నేను డబ్బులు సంపాదించవచ్చు, కానీ నేను ఇంకా ఏదో చేయాలని అనుకుంటున్నాను. ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి అమ్మాయిల కోసం ఒక అకాడమీ ఓపెన్ చేసి వారికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను. వారికి మంచి దారి చూపించాలని భావిస్తున్నా" అంటుంది. క్రికెట్‌కు ఇచ్చిన ప్రాముఖ్యత ఇతర ఆటలకు మన దేశంలో ఇవ్వకపోవడం బాధించిందా అనే ప్రశ్నకు హేతల్ ఇచ్చే సమాధానం మనల్ని ఆశ్చర్య పరుస్తుంది. "నేనెపుడూ బాధపడలేదు. ఇతర దేశాలనుంచి వారి తరుఫున ఆడమని ఆఫర్లు వచ్చాయి. నేను మాత్రం దేశం తరుఫున ఆడడానికే నిర్ణయించుకున్నాను. ఎవరి దగ్గరనుంచి నేను ఏదీ ఆశించట్లేదు. నేను చేసేది ఏదైనా నన్ను ఆపకండి. అది మాత్రమే నేను కోరుకుంటున్నా. నాకు వ్యతిరేకంగా చేయొద్దు, అంతే" అంటుంది హెతల్. "క్రికెట్‌కున్న పాపులారిటీ జూడో కు లేదు, ఇది జనాల్లోకి వెళ్లడానికి ఇంకా టైం పడ్తుంది. క్రికెట్ తో ఎప్పటినుంచో జనాలకు అనుభందం ఉంది. అలాగే జూడో కూడా వెలుగొందుతుంది"


స్పూర్తి - నిరాశ

ఓటమి నిరాశకు గురిచేస్తుంది, చీకట్లోకి నెట్టేస్తుంది. ఓడిపోయిన తర్వాత తనేం చేస్తుంది ? మళ్లీ ఎక్కడి నుంచి బలాన్ని సంపాదిస్తుంది ? అనడిగితే..."నా తండ్రి నుంచి. చిన్నప్పటి నుంచీ, ఇప్పటిదాకా నేను ఓడిపోయిన మరుసటి రోజు నా దగ్గరకు వచ్చి, పర్లేదు మనం మరోసారి బాగా కష్టపడ్దాం" అంటారు. ప్రతీసారి నాకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చెవారు. తనిచ్చే ఉత్సాహం తోనే నేను ఆడగలుగుతున్నాను. ఆయన నా అదృష్ట సూచిక. ఆయన నాతో ఉంటే నేను ఓడిపోను అంటుంది.

హెటల్ దవేకు ఇప్పుడు 28 ఏళ్లు. పెళ్లెప్పుడు చేసుకుంటావని అడిగితే " ప్రజలు అడుగుతుంటారు కానీ నేనేమీ ఒత్తిడికి గురికాను. నాకూ అనిపిస్తుంది ఒక తోడు కావాలని. మా నాన్న లాగే.. నేను ఆడుతున్నప్పుడు ప్రోత్సహిస్తూ, కమాన్... కీప్ గోయింగ్ అంటూ అరిచేవాడు కావాలి. ఇదీ నా ఊహా చిత్రం" అంటుంది.

హేతల్ కోసం ఆమె కుటుంబం చేయాల్సిన దానికంటె కూడా ఎన్నో చేసింది. ప్రభుత్వం నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ ఆమెకు ఎలాంటి సహకారం లభించలేదు. అదే జరిగితే తనకెంతో మేలు జరుగుతుందని చెప్తుంది హేతల్. "నాకు స్పాన్సరర్స్ ఎవరూ లేరు. టోర్నమెంట్శ్ స్టార్ట్ అయితే ఇతరులు ప్రాక్టీస్ తీవ్రం చేస్తారు. అయితే నేను మాత్రం స్పాన్సరర్ల కోసం ప్రతీ గడప తిరగాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా వాళ్ల దగ్గరకు వెళ్లి నాకు స్పాన్సరింగ్ చేస్తారేమోనని అడగాల్సి వస్తోంది. 2012 లో నేను ఆడలేకపోవడానికి కారణం నాకు స్పాన్సరర్లు లేకపోవడమే. నేను ఆడకపోతే ఓలింపిక్స్‌కు క్వాలిఫై కాలేను. స్పాన్సరర్ అవసరం నాకు ఎంతైనా ఉంది" అంటుంది హేతల్.

2012 లో పోలండ్ లో జరిగిన ఆసియన్ చాంపియన్ షిప్ లో చివరిసారిగా ఆడింది హేతల్. ఆటను కొనసాగించడం కంటే మరేదీ కోరుకోవట్లేదు ఆమె. "నాకంటూ ఒక స్పాన్సరర్ కావాలి, అంతకు మించి ఏదీ వద్దు. ఆటను కొనసాగించాలనుకున్నా స్పాన్సర్షిప్ లేకుండా అది సాధ్యం కాదు. ప్రతీ రోజు కష్టపడి ప్రాక్టీస్ చేసే స్పోర్ట్స్ పర్సన్ దేశం తరుఫున ఆడలేకపోవడం మనస్సును ముక్కలు చేస్తుంది". అంటుంది హేతల్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags