సంకలనాలు
Telugu

గ్లోబల్ మార్కెట్ లో ఇండియన్ కంపెనీ సత్తా

Sri
7th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురుచూడొద్దు. మనకు తోచిన దారిలో- మనకు నచ్చిన దారిలో నడిస్తే- ఆ దారే పూలదారి అవుతుంది. విజయం దానంతట అదే వరిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్టార్టప్ కథ కూడా అంతే. స్టార్టప్ ను, వ్యాపారాన్ని విస్తరించాలంటే కచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి నిధులు ఇవ్వాల్సిందేనా? సరైన ప్లానింగ్ ఉంటే అలాంటి అవసరమే లేదు. వ్యాపారాన్ని విస్తరించడానికి కావాల్సిన నిధుల్ని ఓ కంపెనీ సొంతగా సమకూర్చుకుందంటే అంతకు మించిన శుభవార్త ఇంకేం ఉంటుంది? అసలు ఈ రోజుల్లో స్టార్టప్ కంపెనీలన్నీ ఈరోజుల్లో స్టార్టప్స్ అన్నీ మిలియన్ డాలర్ల నిధుల సేకరణతో యూనికార్న్ క్లబ్ లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నాయి. కానీ ఓ కంపెనీకి అలాంటి అవసరమే రాలేదు. అదే ఆర్ఎన్ఎఫ్ టెక్నాలజీస్. ఈ కంపెనీ విజయగాథేంటో తెలుసుకుందాం.

ఇద్దరు మిత్రులు... ఒక స్టార్టప్...

రఘీబ్ ఖాన్, ఫైసల్ అబీదీ.. ఇద్దరు స్నేహితులు. 2009లో నోయిడాలో ఓ కంపెనీ స్థాపించారు. అదే ఆర్ఎన్ఎఫ్ టెక్నాలజీస్. మొబైల్ డెవలప్ మెంట్, ఆన్ లైన్ మార్కెటింగ్, వెబ్ అప్లికేషన్ లాంటి సేవలందించే సంస్థ. 225 మంది ఉద్యోగులు, 100 మంది క్లైంట్లతో ఆరేళ్లలో ఈ కంపెనీ సక్సెస్ బాటలో దూసుకుపోతోంది. వీరి క్లైంట్లలో స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ తో పాటు ఫార్చ్యూన్ 100 లోని కంపెనీలు ఉండటం విశేషం.

ఆక్షన్ బేస్డ్ షాపింగ్ పోర్టల్ BuyAlmost.comతో కలిసి ఈ కంపెనీ ప్రారంభమైంది. యూజర్లు BuyAlmost.comలో ఫ్రీ రిజిస్ట్రేషన్ కోసం సైనప్ చేసుకోవాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత యూజర్లు కొనుగోళ్లు మొదలుపెట్టాలి. బిడ్ ప్రైస్ పన్నెండు రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. అది లాంఛైన మూడు నెలల్లో లక్షా 20 వేల రిజిస్ట్రేషన్లు వచ్చాయి.

"రెండు లక్షల రూపాయల సీడ్ క్యాపిటల్ తో స్టార్టప్ ను ప్రారంభించాం. తర్వాత మా వృద్ధి రేటు పలు ప్రముఖ వెంచర్ క్యాపిటల్స్ సంస్థలను ఆకర్షించింది. అయితే వారితో అప్పుడే మేము చర్చలు జరపలేదు. ఎందుకంటే మా ప్రొడక్ట్ కు సంబంధించి లాభాలపై మాకు సరైన స్పష్టత లేదప్పుడు" అంటారు రఘీబ్.

31 ఏళ్ల రఘీబ్, 30 ఏళ్ల ఫైజల్ లు చిన్ననాటి నుంచే మిత్రులు. ఒకరికొకరు బాగా తెలుసు. ఇద్దరూ న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీలు చదివారు. ఆ తర్వాత ఫైజల్ గూగుల్ లో చేరాలనుకున్నాడు. రఘీబ్ ఏఓఎల్ ఆఫర్ అంగీకరించాడు. తర్వాత టాప్ కోడర్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్ లో వీరి ప్రదర్శనతో దశ తిరిగింది. ఏడాది తర్వాత బ్రిటీష్ టెలికామ్ లో చేరాడు ఫైజల్. నవంబర్ 2009లో వీరిద్దరూ ఒకేచోట చేరి కంపెనీని రిజిస్టర్ చేశారు. జనవరి 2010లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

ఈ కథ కూడా చదవండి

ఆర్ఎన్ఎఫ్ టెక్నాలజీస్ టీమ్

ఆర్ఎన్ఎఫ్ టెక్నాలజీస్ టీమ్


ప్రపంచానికి పరిచయం

మొదటి అర్థ సంవత్సరంలోనే కమర్షియల్ డాటా అందించే ఓ సంస్థ నుంచి మిలియన్ డాలర్ కాంట్రాక్ట్ వచ్చింది. క్రమక్రమంగా వీరి వ్యాపారం వృద్ధి చెందింది. వెబ్, మొబైల్ లాంటి పలు డొమైన్లలో సేవలు అందించడం మొదలుపెట్టారు. ఉత్తర అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ దేశాల కంపెనీలకు ఆన్ లైన్ మార్కెటింగ్ సర్వీసులు అందించారు.

"దేశీయ సంస్థలతో పోలిస్తే మొదట్నుంచీ మా సర్వీసులు, ధర పాశ్చాత్య కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా ఉండేవి. మొదట్నుంచీ మాకు స్పందన కూడా విదేశీ కంపెనీల నుంచే ఎక్కువగా ఉంది. ఎక్కువ భాగం(90 శాతానికి పైగా) నార్త్ అమెరికా కెనెడా నుంచి మిగతా 10 శాతం క్లైంట్లు బ్రిటన్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్నారు" అని వివరిస్తున్నారు ఫైజల్.

నోయిడాతో పాటు ఈ కంపెనీకి టెక్సాస్, హోస్టన్ లల్లో సేల్స్ ఆఫీసులున్నాయి. డో కెమికల్స్, ఎల్3 కమ్యూనికేషన్స్, బాలీ టెక్నాలజీస్, 888 క్యాసినో, లారి ఫ్లింట్ పబ్లికేషన్స్, ది సెర్చ్ ఏజెన్సీ లాంటి క్లైంట్లు ఉన్నారు. మార్చి 2012లో ఫొనాటో స్టూడియోస్ పేరుతో మరో అనుబంధ సంస్థను ప్రారంభించారు. ఈ కంపెనీ ఐఓఎస్, ఆండ్రాయిడ్, ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్స్ కోసం క్యాసినో యాప్స్ తయారు చేస్తోంది. స్లాట్స్ క్యాసినో, బింగో వింగో, రోలెట్ క్యాసినో, బ్లాక్ జాక్ మల్టీప్లేయర్, క్యాప్స్ క్యాసినో స్టైల్ లాంటివి టాప్ లో ఉన్నాయి. ఫొనాటో స్టూడియో తయారు చేసిన యాప్స్ కోటికి పైగా డౌన్ లోడ్స్ చేసుకోవడం విశేషం. వీరిలో పది లక్షల మంది యాక్టీవ్ యూజర్స్ ఉండటం మరో విశేషం. 25 ప్రీమియం యాప్స్ కూడా ఉన్నాయి. ఐట్యూన్స్ లో టాప్ 200 క్యాసినో గేమ్స్ లో వీరి యాప్స్ లో ఎక్కువగా ఉన్నాయి. వర్చువల్ గేమింగ్ అందించే 888 హోల్డింగ్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుని బాలీ టెక్నాలజీస్ కు యాప్స్ తయారు చేసిస్తోంది. లాస్ వెగాస్, మకావ్ లోని క్యాసినోలకు ఈ యాప్స్ ముఖ్యం. ఆరేళ్లలో ఆర్ఎన్ఎఫ్ టెక్నాలజీస్ ఆదాయం 5300 శాతం పెరిగింది. సగటున ఏటా 138 శాతం వృద్ధి ఉంటోంది. ఆన్ లైన్ మార్కెటింగ్ కన్సల్టెంట్, స్టాఫింగ్ సొల్యూషన్స్, వెబ్ అప్లికేషన్ డెవలప్ మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్ మెంట్ లాంటి డొమైన్స్ లో ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాయి. వచ్చే రెండేళ్లలో నార్త్ అమెరికాలో వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

రఘీబ్ ఖాన్, ఫైసల్ అబీదీ

రఘీబ్ ఖాన్, ఫైసల్ అబీదీ


యువర్ స్టోరీ మాట

విజన్ మొబైల్స్ డెవలపర్ రిపోర్ట్ ప్రకారం మొబైల్ ఎకానమీలో కాంట్రాక్ట్ యాప్ డెవలప్ మెంట్ ఎక్కువ ఆదాయం అందిస్తుంది. నోయిడాకు చెందిన ఈ కంపెనీ ఇండియాలో సత్తాచాటకపోయినా అమెరికా, బ్రిటన్, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాల్లో అద్భుతమైన స్పందన పొందుతోంది. ఇటీవల భారతదేశంలోని గేమర్స్ కు పెద్ద ఎదురు దెబ్బ ఏంటంటే... జ్యూవెల్ క్రష్, హిల్ క్లైంబ్ రేసింగ్, ప్లాంట్స్ వర్సెస్ జోంబీస్-2, సబ్ వే సర్ఫర్స్, ట్రాఫిక్ రేసర్స్, టెంపుల్ రన్ 2, జోంబీస్ లాంటి గేమ్స్ కి యాండ్రాయిడ్, మాపిన్ వైరస్ నుంచి ఇబ్బందులున్నాయి. ఫొనాటో స్డూడియోస్ కి చెందిన జింగా, బిగ్ ఫిష్ గేమ్స్, డబుల్ డౌన్ క్యాసినో, జీఎస్ఎన్ గేమ్స్ కు ప్రపంచవ్యాప్తంగా యూజర్లున్నారు. అయితే భారతీయ క్లైంట్లను పొందడం మాత్రం ఫొనాటో స్టూడియోస్ కు సవాల్. అయితే... 25 ప్రీమియం యాప్స్ తో భారతీయ సంస్థ ప్రపంచ మార్కెట్ లో తనదైన ముద్ర వేయడం గొప్ప విశేషమే.

ఈ కథ కూడా చదవండి

ఈ కథ కూడా చదవండి

ఈ కథ కూడా చదవండి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags