సంకలనాలు
Telugu

మీటింగ్స్ ఎరెంజ్ చేసి పెట్టే హైదరాబాద్ స్టార్టప్ !

6th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఇంటర్ లో ఉన్నప్పుడు ఏదైనా కంపెనీ పెట్టాలనే ఆలోచన వచ్చింది సాయికృష్ణకు. ఆనాడు వచ్చిన ఆలోచన ఒక పట్టాన ఉండనీయలేదు. ఉద్యోగం చేస్తున్నా సరే.. మనసు వ్యాపారం మీదకే మళ్లింది. ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ పెడదామనుకొన్నాడు. తర్వాత మనసు మారింది. వీకెండ్ కోసం అకేషన్ ప్లాన్ వెబ్ సైట్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందనుకున్నాడు. అలా వీకేఎన్డీపీఎల్ఎన్ డాట్ కామ్(wkndpln.com) అనే ఓ సైట్ ని ప్రారంభించాడు. దానికి ట్రాక్షన్ ఓ మోస్తరుగానే వచ్చింది. జనం మీటింగ్ కోసం పాజిటివ్ గా రెస్పాన్స్ కావడం చూసిన సాయి.. 2012 లో మీటింగ్ ఎంగేజ్ కాన్సెప్ట్ పై పని చేయడం ప్రారంభించాడు. అప్పుడే దీన్ని టై మాసప్ లో ప్రజెంట్ చేశారు. అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు. తర్వాత హైదరాబాద్ లో జరిగే ఈవెంట్స్ కు అటెండ్ కావడం, స్టార్టప్ లపై జరిచే చర్చల్లో పాల్గొనడం.. సాయి దినచర్యగా మారింది. ఆ తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దగ్గరి నుంచి పది లక్షలు సీడ్ ఫండ్ కలెక్ట్ చేసి frissbi ని ప్రారంభించాడు. 2013 డిసెంబర్ లో దానికి మార్పులు చేర్పులు చేశాడు. 

image


స్టార్టప్ పనితీరు

సాధారణంగా మనం ఎవరినైనా కలవాలంటే ఏం చేస్తాం..? వాళ్లకి కాల్ చేయడమో.. లేదంటే మెసేజో చేస్తాం. ఎక్కడ కలవాలి.. ఎప్పుడు కలవాలి అనేదానిపై రెండు మూడు కాన్వర్సేషన్స్ నడుస్తాయి. అయినా క్లారిటీ లేకుంటే తప్పని పరిస్థితుల్లో కాల్ చేస్తాం. ఇలా మూడు కాల్స్.. ఆరు మెసేజీలు. ఈ తతంగమంతా ఓ క్యాజువల్ మీటింగ్ కోసం మాత్రమే. మరి క్లయింట్ మీటింగ్ ఎలా? ఆ మీటింగ్ ప్రాడక్ట్ కోసమే అయితే ఎలా? షెడ్యూల్డ్ మీటింగ్ కాకుండా అర్జెంట్ మీటింగ్ అయితే, అప్పటికప్పుడు అందిరికీ చెప్పాలంటే ఎలా? దానికంటే ఎమర్జెన్సీ మీటప్ అయితే ఎలా..? వీటన్నింటికీ ఈజీ సొల్యూషన్ చెప్తోంది frissbi యాప్.  

స్టార్టప్ కంపెనీలతో పాటు సాధారణ మీటింగ్ లు, ఇతర మీటప్స్ ఎంగేజ్ చేయడానికి ఇది పక్కా సొల్యూషన్ చెబుతోంది. యాప్ లో రిజిస్ట్రర్ చేసుకొని, మీటింగ్ టైం చెబితే చాలు.. అటు వైపు వారు కూడా ఇందులో రిజిస్ట్రర్ అయివుంటే, ఇద్దరికి దగ్గరుండే, అనుకూలగా ఉండే ప్లేస్ ని ఆటోమేటిగ్ గా సెర్చ్ చేసి సజెషన్ లో చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి నేరుగా మీటింగ్ కి వెళ్లి పోవడమే. ప్రస్తుతం వెయ్యిమంది యూజర్లున్న ఈ స్టార్టప్.. గత ఏడాదే బేటా వెర్షన్ లాంచ్ అయింది. ఇండియాలోనే తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సోషల్ ప్లానింగ్ అప్లికేషన్ ఇదే అంటున్నారు ఫౌండర్ సాయి.

image


స్టార్టప్ టీం

ఇక టీం విషయానికొస్తే సాయికృష్ణ దీని ఫౌండర్. 2005లో జేఎన్టీయూ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. తర్వాత విప్రోలో ఉద్యోగం. స్విట్జర్లాండ్, కెనడాల్లో పనిచేసిన అనుభవం ఉంది. అనంతరం హైదరాబాద్ వచ్చాడు. జాబ్ రిజైన్ చేసి స్టార్టప్ మీద దృష్టి సారించాడు. 2012 ప్లానింగ్ సాఫ్ట్ వేర్ డెవలప్ చేసి వీకేఎన్డీ పీఎల్ఎన్.కామ్ ప్రారంభించాడు. గత ఏడాది అక్టోబర్ లో దానికి పూర్తిరూపమొచ్చింది. దానికి డైరెక్టర్ గా శ్రీహరి వ్యవహరిస్తున్నారు. వారితో పాటు మరో ఐదుగురు పనిచేస్తున్నారు.

ఫండింగ్

సీడ్ ఫండింగ్ గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి మొదట ఒక పదిలక్షలు జమ చేశారు. అనంతరం 2014లో శ్రీహరికి డైరెక్టర్ బాధ్యతలు అప్పగించి ఆయన నుంచి 90లక్షల ఫండ్స్ ను రెయిజ్ చేశారు. ప్రస్తుతం సిరీస్ ఏ రౌండ్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నామని సాయి ప్రకటించారు.

సవాళ్లు, పోటీదారులు

సోషల్ యాప్స్ చాలా వస్తున్నప్పటికీ ఈ తరహా యాప్ బహుశా ప్రపంచంలోనే మొదటిదని సాయి చెబుతున్నారు. కనుక పోటీ దారుల గురించి పట్టించుకునే అవసరం లేదంటున్నారు. అయితే సవాళ్ల గురించి ప్రధానంగా ప్రస్తావించారు.

1. భారతీయులు సరికొత్త విషయాలను అందిపుచ్చుకోవడంలో కొద్దిగా సమయం తీసుకుంటారు. తమ కాన్సెప్ట్ ని జనంలోనికి తీసుకెళ్లడం ప్రధాన సవాలని అంటున్నారు.

2. ఈరంగంలో ఇన్వెస్టర్లను వెతకడం కూడా పెద్ద సవాలే అని సాయి చెప్పుకొచ్చారు.

3. ఐడియాని స్టార్టప్ గా మార్చే క్రమంలో ఎన్నో సవాళ్లు. దీన్ని సస్టెయిన్ చేయడం ఇప్పుడు తమ ముందున్న సవాలని అంటున్నారు. అన్ని ఎదుర్కొన్నట్లే వీటిని కూడా ఎదుర్కొంటామని సాయి దీమా వ్యక్తం చేశారు.

image


లక్ష్యాలు, ఫ్యూచర్ ప్లాన్స్

బిటుబి, బిటుసి మొడల్ లో ట్రాక్షన్ పెంచుకుంటున్నారు. అది పూర్తయ్యాక సబ్ స్క్రిప్షన్ మొడల్ లో కంటిన్యూగా రెవెన్యూ తీసుకు రావడమే మా లక్ష్యం అంటున్నారు. దీంతో పాటు ఈ ఏడాది చివర్లో తమ బ్రాండ్ నుంచి మరో ప్రాడక్ట్ తీసుకొస్తామని అన్నారు సాయి.

“వాట్సాప్ ప్రారంభించి రోజు ఇంత మందికి కనెక్ట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. మా ప్రాడక్ట్ కూడా అంతే. ఇప్పుడు ప్రారంభించాం. భవిష్యత్ లో భారత దేశం నుంచి వచ్చిన మరో హాట్ కేక్ గా మారబోతుందని ముగించారు సాయి”

app link

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags