సంకలనాలు
Telugu

అరవయ్యో దశకంలోనే సాఫ్ట్‌వేర్‌లో సత్తాచాటిన షీర్లే

GOPAL
24th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అంటూ స్త్రీ మూర్తిని గౌరవిస్తున్నా, వాస్తవంలోకి వచ్చే సరికి పరిస్థితి మరోలా ఉంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సిక్సీటీస్ లోనైతే మహిళలు వంటింటి కుందేళ్లే. జాబ్ చేసే మహిళలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కానీ డేమ్ స్టీఫెన్ షీర్లే మాత్రం ఆ రోజుల్లోనే పురుషులకు దీటుగా టెక్నాలజీ రంగంలో సత్తా చాటారు. సాఫ్ట్ వేర్ అంటే తెలియని రోజుల్లోనే దాన్ని డబ్బులకు అమ్మి తానేంటో ప్రపంచానికి చాటారు. తను ఉద్యోగం చేయడమే కాదు.. తన తోటి మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించేందుకు కృషి చేశారు. వర్క్ ఫ్రమ్ హోం అనే పదమే వినిపించని సమయంలో మహిళలకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించారు. రిటైరైన తర్వాత తన సంపదలో ఎక్కువ భాగాన్ని చారిటీలకే ఇచ్చేసి మానవత్వం చాటుకున్నారు.

ఐదేళ్ల వయసులోనే నాజీ జర్మనీ సైన్యం బారినుంచి బయటపడ్డ డేమ్ స్టీఫెన్ షీర్లే తన జీవితాన్ని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోలేదు. కంప్యూటర్ హార్డ్ వేర్ తోపాటు సాఫ్ట్ వేర్ ఉచితంగా వచ్చిన 1962లోనే ఓ స్టార్టప్ ను ప్రారంభించారు. ఆ సమయంలోనే సంస్థను ప్రారంభించి మూడు బిలియన్ డాలర్ల కంపెనీగా వృద్ధి చేశారు. అంతేకాదు గృహిణిలకు, మహిళలకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కూడా కల్పించారు. ఆ సమయంలో ఆ ఊహ కూడా ఎవరికీ రాలేదు.

‘‘నాకు పిచ్చి పట్టిందని జనం అనేవారు. ఫ్రీగా వచ్చే దానికి ఎవరైనా డబ్బెందుకు చెల్లిస్తారని అనేవారు. కానీ నాకు మాత్రం హార్డ్ వేర్ కంటే సాఫ్ట్ వేర్ చాలా ముఖ్యమని అనిపించేది’’ - షీర్లే

షీర్లే లక్ష్యాలు కొన్నే. అవీ అసాధారణమైనవేమీ కావు. సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించడం ఆమె లక్ష్యం. మహిళా ఉద్యోగిణిలను వేధించే మగబాసుల కోసం కాదు.. మహిళలకు సాధికారం, ఆర్థిక స్వాతంత్రం కల్పించాలనే ఉద్దేశంతో సంస్థను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

‘‘ఇప్పటివరకూ ఎవరూ వినని అత్యంత విజయవంతమైన టెక్ ఎంట్ర ప్రెన్యూర్ ఆమె’’ అని షీర్లే గురించి ఆమె టెడ్ టాక్స్ చెప్తుంది. టర్ ప్రెన్యూర్ గా ఎదిగేందుకు ఎదర్కొన్న అడ్డంకులను షీర్ల తన టెడ్ టాక్స్ లో వివరించారు. టెక్నాలజీ రంగం మొత్తం పురుషాధిక్యంతో కూడుకున్నదని, అలాంటి రంగంలో తాను కొన్ని ప్రమాణాలు నెలకొల్పాలని చెప్తారామె. తన టెడ్ షోలతో ఆమె కాస్త నవ్వు కూడా పుట్టిస్తుంటారు. లక్ష్యంతో పనిచేసే మహిళల తలలు ఎందుకు ఫ్లాట్ గా ఉంటాయో హ్యుమరస్ గా వివరించారు. ‘‘ఉన్నత శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్న మహిళల తలలు ఫ్లాట్’’గా ఉంటాయి’’ అని ఆమె అంటారు.



షీర్లే టెడ్ టాక్స్ ను 1.5 మిలియన్ల మంది వీక్షించారు. అలాగే ఆమె ఆత్మ కథ ‘‘లెట్ ఇట్ గో’’ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. శరణార్థ శిబిరం నుంచి వచ్చిన ఓ చిన్నారి ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగిన వైనాన్ని ఆమె ఆ పుస్తకంలో వివరించారు.

డేమ్ స్టీఫెన్స్ కంపెనీ ఫ్రీలాన్స్ ప్రోగ్రామర్స్.. ఫ్రీలాన్స్ వర్క్ లోనే అత్యున్నతమైన కాన్సెప్ట్ అది. అత్యుత్తమ మేథమెటిషియన్ అయిన షీర్లేకు ఎంతో ముందు చూపు ఉంది. ఆధునిక సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలను సృష్టించిన అతి కొద్ది మందిలో ఆమె కూడా ఒకరు. ఆమె కంపెనీ స్టాక్ మార్కెట్ లో ప్రవేశించిన సమయంలో, ఆ సంస్థలో పనిచేస్తున్న 70 మంది ఉద్యోగులు ఒక్కసారిగా మిలియనీర్లుగా మారిపోయారు. 1993లో అధికారికంగా రిటైరైన తర్వాత తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఆమె చారిటీకే ధారాదత్తం చేశారు. అప్పటి నుంచి ఫిలాంథ్రోపిస్ట్ గా పనిచేస్తున్నారు. 1960లలోనే స్టార్టప్ లను ప్రారంభించడంపై ఆమె యువర్ స్టోరీతో మాట్లాడారు. భారతీయ మహిళలను అత్యున్నత సీనియర్ పొజిషన్లలో నియమించడంపై వివరించారు

యువర్ స్టోరీ: మిమ్మల్ని నడిపించిందేంటి?

షీర్లే:

image


మనలో చాలామంది టెక్నాలజీ రంగంలో ఉన్నారు. ఎందకంటే ఆ రంగం మీద అంతులేని ఆసక్తి. సాఫ్ట్ వేర్ ను రూపొందించినందుకు నాకు పెద్దమొత్తంలో చెల్లించడాన్ని నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే అదంతా ఫన్ గా అనిపించేది. నాలో ఉన్న ఆధ్యాత్మికత నమ్మకాలే నన్ను పనివైపుగా నడిచేలా చేశాయి. కానీ మా కంపెనీ మాత్రం నన్ను మహిళల తరఫున పోరాడేలా పరిస్థితులు సృష్టించాయి. తమ ఆర్థిక జీవితాలను నియంత్రణలో పెట్టగలిగే మహిళలు మాకు కావాలి. అదే కంపెనీ విభిన్నంగా ప్రారంభించేందుకు పరిస్థితులను సృష్టించింది. నేను ప్రపంచాన్ని మార్చగలనని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ మహిళల పరిస్థితుల్లో మార్పు తేగలనని మాత్రం అనుకున్నాను.

యువర్ స్టోరీ: 

మార్పు ఓ విపత్తు వంటిదని మీ పుస్తకంలో రాశారు. కానీ అది తప్పనిసరి కాదు. మీ కాలంలో మీరు, మీ సహ మహిళలు చేసిన పని.. అడ్డుగోడలను బద్దలు కొట్టగలిగిందా? కానీ ఇప్పటికీ అవే సమస్యలను మహిళలు 21వ శతాబ్దంలోనూ ఎదుర్కొంటున్నారు. మార్పు ఇప్పటికీ కొనసాగుతున్నది? దీన్ని చూస్తుంటే మీకు అసహనం రావడం లేదా?

షీర్లే:

మీరు చెప్తున్నది నిజమే. మార్పు చాలా నెమ్మదిగా జరుగుతున్నది. అయితే మార్పు నిలిచిపోలేదు. నెమ్మదిగా సాగుతున్నదంతే. ఒక్కరాత్రిలో విస్ఫోటనం సాధ్యం కాదు. గత వందేళ్లుగా మహిళల జీవితాల్లో నెమ్మదిగా పారదర్శకత అనేది వస్తున్నది. సమాజం వెనక్కి వెళ్లిపోకుండా చట్టాలు సాయపడుతున్నాయి. నేను 50 ఏళ్ల క్రితం చర్చించిన సమస్యలపై ఇప్పటికీ యూకేలో చర్చలు జరుగుతున్నాయి. చట్టాలైతే మారాయి కానీ.. సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. సమాన అవకాశాలు, సమాన చెల్లింపులు.. ఇలాంటి అంశాలు ఎప్పటికైనా కొత్తగానే ఉంటాయి.

image


నేను వ్యాపారంలోకి అడుగుపెట్టిన సమయంలో నా ఆలోచనలు ఎంతో విప్లవాత్మకంగా ఉండేవి. మహిళలంటే అందాల బొమ్మలు కాదు.. అందరిలాగే ప్రొఫెషనల్స్ మని చాటి చెప్పేందుకు ఎంతో పోరాడాల్సి వచ్చింది. కొన్నిసార్లు ప్రొఫెషనల్స్ నాతో అసభ్యంగా ప్రవర్తించారు. సీరియస్ గా పని చేస్తున్న సమయంలో కొందరి వికారపు చేష్టలు ఇబ్బంది కలిగించేవి. అలాంటి సమస్యలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి. కాని ప్రస్తుతం తమ అపజయాలకు లింగవివక్షను సాకుగా చూపడం మహిళలకు సాధారణమైపోయింది. కానీ 21వ శతాబ్దంలో విజయం ఎలా సాధించేందుకు మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది.

యువర్ స్టోరీ: 

భారత్ తో ప్రత్యేక సంబంధాలున్నాయని మీరు చెప్పారు?

షీర్లే

అవును నిజమే. నా భర్త ఇండియాలోనే పెరిగారు. అది రాజుల కాలం. దాని గురించి ఇప్పుడు మాట్లాడటం వృథా. 1960ల కాలంలోనే భారతీయ మహిళలను నేను సీనియర్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ గా నియమించాను. నేను నియమించిన తొలి మహిళా ఉద్యోగి మిసెస్ బకయా. ఆమె ఇప్పటికీ నాకు గుర్తున్నారు. ఆమె ధరించిన చీరలు, బొట్టుబిళ్లలంటే నాకు ఎంతో ఆసక్తి ఉండేది. ఆమె ఉన్నత విద్యావంతురాలు, సంప్రదాయ మహిళ. సాఫ్ట్ వేర్ గురించే కాకుండా కళలు, సాహిత్యం, సంస్కృతి గురించి మేం ఎంతో చర్చించేవారం. నేను బాస్.. ఆమె ఉద్యోగిని. దీంతో మేం ఎప్పుడు మిత్రులం కాలేకపోయాం. కానీ ఆమెతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉండేది.

యువర్ స్టోరీ:

మీ దృఢమైన ఆలోచనల కారణంగానే, మీరు ఆంటర్ ప్రెన్యూర్ గా ఉంటూనే యాక్టివిస్ట్ గా సక్సెసయ్యారు?

షీర్లే: 

అటు సమాజ సేవ, ఇటు వ్యాపారం చేసిన తొలి సంస్థ మాదే. అయితే అప్పట్లో దాన్ని సోషల్ బిజినెస్ అనలేకపోయారు. ఆ పదమే లేకపోయింది. వంద శాతం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా సంస్థను నడిపించేందుకు ఎంతో పరిశోధన చేశాను. ఓ మహిళగా మంచి లాభాలు గడిస్తే తప్ప, చారిటీని నిర్వహించలేమని గుర్తించాను. అభివృద్ధి నెమ్మదిగా వచ్చింది. తొలి డివిడెండ్ ఇచ్చేందుకు 25 ఏళ్లు పట్టింది. తొలి జీతం తీసుకునేందుకు ఎన్నో ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. తొలి ఏడాదైతే ఖర్చులు కూడా తీసుకోలేకపోయాను. నాకు ఎంతో గర్వంగా ఉంది. డబ్బులు సాధించినందుకు కాదు. మేం సృష్టించిన సంపద, మేం కల్పించిన ఉపాధి, మా సంస్థ తెచ్చిన మార్పులను చూసి ఎంతో సంతోషమేస్తుంది.

యువర్ స్టోరీ: 

నాజీ జర్మనీ నుంచి తప్పించుకోవడం, ఇంగ్లండ్ లో శరణార్థిగా మారడం.. వంటి గత అంశాలు మీ భవిష్యత్ కు ఎలా సహకరించాయి?

షీర్లే:

నా జీవితం మొత్తం గతం కారణంగానే స్ఫూర్తి పొందింది. ఒక్కరోజు కూడా వృథా చేయకూడదని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. నా జీవితం ఎంతో విలువైనదని నిరూపించాలని అనిపిస్తుంది. 75 ఏళ్ల క్రితం ఉన్నట్టుగానే ఇప్పుడు సైతం దృఢంగానే ఉన్నాను. ఇప్పుడు నాకు వయసైపోయింది. కానీ ఉదయం లేచిన వెంటనే అనిపిస్తుంది నెనంతా అదృష్టవంతురాలినని. అప్పట్లో ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు. నేను ఇప్పుడు అందరికీ సహకరిస్తున్నాను.

యువర్ స్టోరీ: 

ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని మీరు ముందు అనుకోలేదా. వేరే ప్రత్యామ్నాయం లేక ఈ రంగాన్ని ఎంచుకున్నారా?

షీర్లే: 

18 ఏళ్ల వయసులోనే ఓ రీసెర్చ్ స్టేషన్ లో పనిచేశాను. అక్కడంతా పురుషాధిక్యమే. తొలిసారిగా నేను క్యాంటిన్ లోకి వెళ్లిన సమయంలో 200 మంది కొత్త మహిళా ఉద్యోగిని కళ్లప్పగించి చూస్తున్నారు. నేను జూనియర్ గా ఉన్న సమయంలో అందరూ నాతో చక్కగా ప్రవర్తించారు. అందమైన యువ ఉద్యోగినిని కావడంతో నాతో బాగానే మసులకునేవారు. కానీ ఆ తర్వాత నేను మరింతగా చదవడం మొదలు పెట్టాను. మరిన్ని ప్రదేశాలకు వెళ్లాలని అనుకున్నాను. దీంతో నా దృక్పథం మారిపోయింది. కానీ నాకన్నీ వ్యతిరేకతలే ఎదురయ్యాయి. ‘‘అది నీ కోసం కాదు. నువ్వు మహిళవు’’. ‘‘గ్రాడ్యుయేట్ పొజిషన్ కు మేం ఎప్పుడూ మహిళను నియమించుకోలేదు’’, ‘‘ఇలాంటి ఉద్యోగాల్లో మేం మహిళలను నమ్మలేం’’ ఇలాంటి కామెంట్స్ వినిపించేవి. అప్పట్లో మహిళల ఉద్యోగాలకు సంబంధించి కొన్ని చట్టాలుండేవి. కోల్ మైన్స్ వంటి రంగాల్లో మహిళలను నియమించేవారు కాదు. అర్ధరాత్రిళ్లు వరకు మహిళలు పనిచేయకుండా ఆ చట్టాలు అండగా నిలిచేవి. కానీ నేను మాత్రం అలాంటి చట్టాలు పట్టించుకోకుండా కంప్యూటర్లతో బాగా పొద్దుపోయేవరకు కుస్తీ పట్టేద్దాన్ని.

అప్పట్లో మేం ట్రాన్స్ అట్లాంటిక్ టెలిఫోన్ కేబుల్ ప్రాజెక్ట్ పై పనిచేస్తుండేవారం. అట్లాంటిక్ పైన షిప్ ద్వారా కేబుల్స్ వేశాం. కానీ నాకు మాత్రం షిప్ లోకి అనుమతి ఇవ్వలేదు. నా పని డిమాండ్ చేస్తున్నప్పటికీ నన్ను షిప్ లోకి అనుమతించలేదు. అందుకు కారణం.. మహిళలకు షిప్ లో టాయిలెట్స్ లేకపోవడమే. ఆ షిప్ కెప్టెన్ కు మహిళలు బోర్డు మీద ఉండటం ఇష్టం లేదు. ఇలాంటి ఎన్నో నమ్మకాలు ఉండేవి. కానీ నేను మాత్రం అలాంటి వాటిని పట్టించుకోకుండా నా పనులు నేను చేసుకున్నాను.

యువర్ స్టోరీ: 

1960లలోనే సంస్థను పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

షీర్లే: 

అప్పటి సంగతులు చెబితే మీరు నవ్వుతారు. సంస్థను ప్రారంభించాలనుకున్న సమయంలో నా దగ్గర కేవలం 6 పౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి కాలంలో అవి వంద పౌండ్లకు సమానం. మా సొంత ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తెచ్చాను. అప్పట్లో వ్యాపారం గురించి నాకు ఏం తెలియదు. తొలి ప్రాజెక్ట్ లో అన్నింటి ధరను తప్పుగా వేశాను. పనిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ధరను నిర్ణయించాను. ఇతర ఖర్చులను పట్టించుకోలేదు. వ్యాపారాన్ని ఆర్థికంగా సమర్థంగా నడిపించడం కంటే విలువలు, ప్రజలు, ఉద్యోగుల గురించే ఎక్కువగా పట్టించుకున్నాను. అయితే ఆ తర్వాత కాలంతో పాటు మారాను. చాలా నెమ్మదిగా సంస్థ వృద్ధి ప్రారంభమైంది.

టెడ్ టాక్ షోలో మాట్లాడుతున్న డేమ్ స్టీఫెన్ షీర్లే

టెడ్ టాక్ షోలో మాట్లాడుతున్న డేమ్ స్టీఫెన్ షీర్లే


అప్పట్లో నేనో అమెచ్యూర్ ను. అమెచ్యూర్ అన్న సెన్స్ ఉండేది. దీంతో స్థానికంగా ఉండే ఓ మేనెజ్ మెంట్ సెంటర్ ను సంప్రదించాను. ‘‘మా సంస్థకు రండి. మాది మోడ్రన్ కంపెనీ. కంప్యూటర్లు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, మా సంస్థ పనితీరును పరిశీలించండి. తద్వారా మోడ్రన్ కంపెనీ గురించి మీకు తెలుస్తుంది. అలాగే మేం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయి. దీంతో మార్కెట్ లో ఎలా ప్రవర్తించాలో, ఎలా విక్రయించాలో నాకు నేర్పించండి’’ అని వారిని కోరాను.

ఇప్పుడు ప్రపంచం విభిన్నంగా మారిపోయింది. ఇప్పుడు ఎంతోమంది యువకులు సంస్థలను ప్రారంభించి పదేళ్లలోనే బిలియనీర్లుగా మారిపోతున్నారు. ఫేస్ బుక్ లాంటి సంస్థలు అనతీకాలంలోనే పెద్ద సంస్థగా మారింది. ప్రస్తుతం ఫేస్ బుక్ లో 3500 మంది మహిళా ఉద్యోగులున్నారు. అయితే సంస్థ ప్రారంభమైన సమయంలో బోర్డులో ఒక్క మహిళ కూడా లేరు. పరిస్థితులు మారుతున్నాయి. కానీ వారు మాత్రం అలానే ఉంటున్నారు.

యువర్ స్టోరీ

1960లలో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ ఎలా ఉండేది? రోజువారీ వ్యవహారాలను మీ సంస్థ ద్వారా ఎలా విభిన్నంగా హ్యాండిల్ చేయాలని మీరనుకున్నారు?

షీర్లే: 

నేను సంస్థను ప్రారంభించినప్పుడు అసలు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీనే లేదు. నేను, మరికొందరం కలిసి ఇండస్ట్రీని సృష్టించాం. కంప్యూటర్ హార్డ్ వేర్ తో పాటు సాఫ్ట్ వేర్ ను కూడా ఉచితంగా ఇచ్చేవారు అప్పట్లో. కానీ సాఫ్ట్ వేర్ ను ప్రత్యేకంగా మార్కెట్ లో విక్రయించాలన్నదే మా బిజినెస్ మోడల్. మమ్మల్ని చూసి చాలామంది నవ్వారు. మాకు పిచ్చిపట్టిందని కూడా అన్నారు. సాఫ్ట్ వేర్ ఉచితంగా లభిస్తున్న సమయంలో దాన్ని డబ్బులు పెట్టి ఎవరు కొంటారని ఎద్దేవా కూడా చేశారు. కానీ నాకు మాత్రం హార్డ్ వేర్ కంటే సాఫ్ట్ వేరే ముఖ్యమైనదని నమ్మకముండేది.

సంస్థను ప్రారంభించిన కొత్తలో ఎక్కువగా అమెరికా కంపెనీలను సందర్శించాను. ఎందుకంటే కొత్త ఆలోచనలను బ్రిటన్ లో కంటే అమెరికాలో ఎక్కువగా ఆధరిస్తారు. బ్రిటిషర్లు ఎక్కువగా సంప్రదాయవాదులు. కంప్యూటర్ నిపుణులు కావాలని అడ్వర్టయిజింగ్ చేసే సంస్థలకు పెద్ద సంఖ్యలో లెటర్లు రాశాను. నాకు ఉద్యోగం అక్కర్లేదు.. మా సంస్థ అందిస్తున్న సేవలు వివరించేందుకు ఒక్కసారి అవకాశమివ్వమని కోరాను. అయితే నేను రాసిన లెటర్లలో కొన్నింటికి మాత్రమే జవాబు వచ్చేవి. ఆ సమయంలో మా ఆయన నాకో సలహా ఇచ్చారు. స్టీఫెన్ షీర్లే పేరుతో కాకుండా ఇంటిపేరు స్టీఫెన్ పేరుతో లెటర్లు రాయాలని సూచించారు. దీంతో స్టీఫెన్ పేరుతో నేను రాసిన లేఖలు మంచి స్పందనవచ్చింది. దీంతో మేం అందిస్తున్న సర్వీసుల గురించి కంపెనీల మేనేజర్లతో మాట్లాడే అవకాశం లభించింది. నేను మహిళనని ఆ తర్వాత తెలిసినా, నన్ను బయటకు వెళ్లమనలేకపోయారు.

image


అప్పట్లో ఎంతో సరదా ఉండేది. మేం చేస్తున్న పని విభిన్నమని మాకు తెలుసు. అయితే మేం చేస్తున్న పని ఎంత ముఖ్యమైందో మాత్రం మాకు తెలియదు. ప్రతి రోజు గట్టెక్కేందుకు ఎంతో పోరాడాల్సి వచ్చేది. కష్టాలు పెరిగిన ప్రతిసారీ, మరింత పట్టుదలతో పనిచేయడం ఆరంభించాను. దీంతో నెమ్మదిగా మార్కెట్లో పట్టు సాధించాం. విజయవంతమైన కంపెనీగా గుర్తింపు పొందాం. దీంతో అన్ని కంపెనీల్లాగా మా కంపెనీని కూడా గుర్తించారు.

మేం అప్పట్లో ఇంటి నుంచే పనిచేశాం. అప్పుడు నాకు ఓ చిన్న పాప. డైనింగ్ రూమ్ లో పాపను పక్కన పెట్టుకునే పనిచేశాను. అదే సమయంలో డ్రాయింగ్ రూమ్ లో పియానోపై పేపర్లు పెట్టుకుని మరికొందరు పనిచేస్తుండేవారు. ( మా ఆయన పియానో వాయించేవారు). బెడ్ రూంలో మరికొందరు. మాది మోడ్రన్ కంపెనీ అయినప్పటికీ.. ఇల్లు మాత్రం మోడ్రన్ ది కాదు. మాకు అప్పట్లో కోల్ ఫైర్ ఉండేది. సంస్థకు మేనేజర్ ను అయిన నేను ఉద్యోగులకు మార్గదర్శిగా ఉండాలి. కానీ రూం ను వెచ్చగా ఉంచేందుకు ఫైర్ ను మండించాల్సి వచ్చేది.

మనోహరమైన జీవితం..

ఆ రోజులెంతో సంతోషంగా ఉండేవి. ఆ రోజులు నా జీవితంలో ఎంతో సంతోషకరమైనవి. సంస్థ, చిన్న కుటుంబంతో నా జీవితం ఎంతో సంతోషంగా గడిచింది. పన్నులు, ప్రభుత్వ సహకారం వంటి అంశాల్లో ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న వాటితో పోలిస్తే.. అప్పట్లో కష్టాలు నామమాత్రమైనవే.

యువర్ స్టోరీ:

మీరు పూర్తి చేసిన తొలి ప్రాజెక్టులేంటి?

షీర్లే: 

ఆశ్చర్యకరంగా.. నేను గతంలో పనిచేసిన కంపెనీ నుంచే నాకు తొలి ప్రాజెక్ట్ వచ్చింది. కంప్యూటర్ పరికరాలు తయారు చేసే సంస్థలో నేను తొలినాళ్లలో పనిచేశాను. మార్కెట్ లో ఉన్న ధరల గురించి నాకు తెలియకపోవడంతో.. వారు నన్ను కొద్దిగా అర్థం చేసుకుంటారనుకున్నాను. అయితే ఆ సంస్థలో పనిచేసినప్పుడు నేను తీసుకున్న మొత్తాన్నే నాకు ఆఫర్ చేశారు.

ఇక రెండో కంపెనీ.. నా మాజీ కొలిగ్ ద్వారా వచ్చింది. అమెరికా కన్సల్టెన్సీ తో పనిచేశారాయన. ఆ సంస్థ యూకేలో సబ్సిడరీని ప్రారంభించాలనుకుంది. దానికి కావాల్సిన మేనేజ్ మెంట్ ప్రొటోకాల్ ను డిజైన్ చేయాల్సిందిగా నన్ను కోరారు.

అలా తొలి నాళ్లలో వచ్చిన ప్రాజెక్టులు.. తెలిసినవారు రిఫర్ చేసినవే. స్నేహితులు, వారి స్నేహితులు.. ఇలా రిఫరెన్సుల ద్వారా ప్రాజెక్టులు వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది బ్రిటీష్ రైల్వేస్ షెడ్యూలింగ్ ప్రైట్ ట్రక్స్. దాన్ని విజయవంతంగా పూర్తి చేయడం నిజంగా మా అదృష్టం. ఆ కాంట్రాక్ట్ ను పూర్తి చేసేందుకు నేను యూకే మొత్తం తిరగాల్సి వచ్చింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లోప్రయాణించడం నా జీవితంలో అదే తొలిసారి.

యువర్ స్టోరీ: 

మిమ్మల్ని చూస్తుంటే మాకు ఒక పదం గుర్తొస్తుంది. అదే సాహసోపేతం. ఎందుకంటే మీరెన్నో భిన్నమైన సవాళ్లను ఎదుర్కొన్నారు. మహిళల కోసమే సంస్థను ప్రారంభించడం, ఫ్రీలాన్స్ అన్న పదమే తెలియని రోజుల్లో మహిళలకు ఇంటి నుంచే పనిచేసుకునేందుకు అవకాశమివ్వడం, ఉచితంగా సాఫ్ట్ వేర్ దొరుకుతున్న కాలంలో దాన్ని డబ్బులకు అమ్మడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఏదైనా సాధించాలనుకుంటే ఒక్కోదానిపై దృష్టిపెట్టాలి. మీరు ఇవన్నీ ఎలా చేశారు?

షీర్లే: 

ఒకేసారి విభిన్నమైన పనులు చేయడం ఎంటర్‌ప్రెన్యూర్లకు సాధ్యమే. మనం పెట్టుకున్న లక్ష్యాలు సాకారం చేసుకోవాలంటే బిజీగా ఉండక తప్పదు. ఒక్క సవాలుతో సరిపెట్టుకోవడం నాకు సాధ్యపడదు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఒక్క సవాలు సరిపోదు.

యువర్ స్టోరీ: 

వర్ధమాన ఎంటర్‌ప్రెన్యూర్లకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి?

షీర్లే: 

మనం సృష్టించాలనుకున్నది ఏదైనా ప్రత్యేకమైనదే. వినియోగదారుల దృష్టనుంచి చూస్తే వారేం కోరుకుంటున్నారో అర్థమవుతుంది. అలాగే ఆలోచనలు కూడా ముఖ్యమే.

image


ముఖ్యంగా మహిళలు విభిన్న దృక్పథాలు కలిగి ఉంటారు. నా సలహా ఏంటంటే.. సంప్రదాయమైన పని పద్ధతులను కొనసాగిస్తూనే కొత్త కొత్త ఆవిష్కరణలను తీసుకురావాలి. కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ఫర్ఫెక్షనిజం వంటి విభిన్న నైపుణ్యాలను సాధించాలి. దేనిపైనేతై గురిపెడుతున్నావో దాన్నే సాధించాలి. విజయం సాధించేందుకు మంచి శిక్షణ పొందాలి. నీ చుట్టుపక్కల గౌరవనీయులైన ప్రజలు ఉండేలా చూసుకోవాలి. చివరగా పనిలో ఎంజాయ్ చేయాలి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags