సంకలనాలు
Telugu

మూడేళ్లలో మూడు స్టార్టప్స్- అదరగొట్టిన అర్పితా ఖాద్రియా

Pavani Reddy
22nd Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

నాలుగేళ్ల క్రితం అర్పితా ఖాద్రియా ఒక కంపెనీలో బ్రాండ్ మేనేజర్ గా పనిచేసేవారు. మణిపాల్ లోని ప్రఖ్యాత టీఏపీఎంఐ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ చదివారు. ఫాస్ట్ ట్రాక్, టైటాన్ లో బ్రాండ్ మేనేజర్ గా పనిచేశారు. కార్పొరేట్ ప్రపంచంలో తారాజువ్వలా దూసుకపోవాల్సిన ఈమె… 30 ఏళ్ల వయసులోనే అంటే మూడేళ్ల క్రితం ఉద్యోగం మానేశారు. ఏదైనా సొంతంగా చేయాలన్న తపనే దీనికి కారణం. అనకున్నదే తడవుగా స్టార్టప్ రంగంలో అడుగుపెట్టారు. ఒకటికాదు రెండు కాదు మూడేళ్లలో మూడు స్టార్టప్ లు స్థాపించి విజయవంతంగా నడుపుతున్నారు.

ఏంటీ సైన్ టిస్ట్ 

లాజిక్ అండ్ రీజనింగ్ ఆధారంగా ఆడే గేమే సైన్ టిస్ట్. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే… 2015 ఏప్రిల్ లో ఫ్లిప్ కార్ట్ లో ఒక పజిల్ బుక్ పెట్టారు. ఫన్నీగా ఉండే ఆ పజిల్ బుక్ కు మంచి స్పందన వచ్చింది. లక్షా 50వేల రూపాయల పుస్తకాలను అమ్మేశారు. ఎలాంటి మార్కెటింగ్, అడ్వర్టైజ్ మెంట్ చేయకుండానే వచ్చిన రియాక్షన్ చూసి ఆమె ఆశ్చర్యపోయారు. వెంటనే పజిల్ బుక్ కు ఆండ్రాయిడ్ వెర్షన్ లో యాప్ తీసుకొచ్చారు. ఇది 2016 జనవరిలోనే సైన్ టిస్ట్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ గేమ్ ను స్టూడెంట్స్ కు లాజికల్ ఆప్టిట్యూడ్ టెస్టులగానూ , క్రాస్ వర్డ్స్ గానూ ఉపయోగ పడుతుంది. ఫేస్ బుక్ సైతం సైన్ టిస్ట్ ను గుర్తించి… బూట్స్ ట్రాప్ ట్రాక్ ప్రోగ్రాంగా షార్ట్ లిస్ట్ చేసింది. ఆ టెస్టుల్లో విజయవంతమైతే 30 వేల డాలర్లు, అంటే 20 లక్షల రూపాయల బహుమతి కూడా ప్రకటించింది. అన్నట్టు సైన్ టిస్ట్ యాప్ కు 135 దేశాలు కాపీరైట్ హక్కుల్ని కూడా ఇచ్చాయి. 

లైఫ్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఒకసారి జర్నీ ప్రారంభిస్తే … ఎక్కడికి చేరుతామో ఎవరూ చెప్పలేరంటున్నారు అర్పిత. ఈమె రూపొందించిన సైన్ టిస్ట్ యాప్ మొబైల్ ప్రీమియర్ అవార్డులకు భారత్ తరపున ఎంపికయ్యింది. బార్సిలోనాలో ఈ నెలాఖరుకు సైట్ టిస్ట్ యాప్ పోటీపడనుంది. ఇదేమి చిన్న విషయం కాదు… మల్టీ నేషనల్ కంపెనీలు తయారుచేసిన యాప్స్ ను కాదని… భారత్ తరపున పోటీకి ఇది ఎంపికయ్యింది. ఇదంతా అర్పితకున్న పట్టుదల, దీక్షల వల్లే సాధ్యమయ్యింది.

బెజ్రాక్ కంపెనీలో నలుగురు ఫుల్ టైం ఉద్యోగులున్నారు. ఆండ్రాయిడ్ లో 4.6 రేటింగ్ సాధిస్తోంది. 12 దేశాల్లో దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. బెస్ట్ న్యూ గేమ్స్ జాబితాలో యాపిల్ కంపెనీ చోటు కల్పించింది. ఇప్పటికే 25 వేలమంది డౌన్ లోడ్ చేసుకున్నారు. సైన్ టిస్ట్ యాప్ కు మెంటోస్ ఇండియా అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కూడా దొరికింది. ఈ యప్ ట్యాగ్ లైన్ “దిమాక్ కి బత్తీ జలా దే”. ఈ మాట అందర్నీ ఆకట్టుకుంటోంది. అర్పిత గతంలో మెక్ కాన్ ఎరిక్సన్ యాడ్ ఏజెన్సీలో కెరీర్ ను ప్రారంభించారు. యాడ్ ఏజెన్సీలో పనిచేసేవారికి ఇలాంటి ట్యాగ్ లైన్స్ గురించి చెప్పాలా?

వాకింగ్ బేర్ ఫుట్

ఈ స్టార్టప్ సైన్ టిస్ట్ కంటే ముందుది. పనిచేసే చోట వాతావరణం నచ్చక , బాస్ తో కుదరక 2012లో అర్పిత తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. భర్త ప్రోమిత్ సహకారంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. జీవితం ఒక్కసారిగా శూన్యమైపోయింది. పాతాళానికి పడిపోయాక పైకే కదా చూడాలి అంటూ నవ్వేస్తారు అర్పిత. బేర్ ఫుట్ అనే స్టార్టప్ కంపెనీని 2012 సెప్టెంబర్ లోనే స్థాపించారు. బేర్ ఫుట్ అనేది స్టార్టప్ లకోసం ఏర్పాటుచేసిన బ్రాండ్ కన్సల్టెన్సీ. పెద్ద కంపెనీలకు బ్రాండింగ్ సమస్య లేదు. కానీ స్టార్టప్ లు సొంతంగా ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకే తక్కువ ధరకే బ్రాండింగ్, మార్కెటింగ్ సేవలను బేర్ ఫుట్ అందిస్తోంది. ఒకసారి ఐదారుగురు క్లైంట్స్ కన్నా ఎక్కువ సంస్థలకు సేవలందించడానికి ఇష్టపడరు అర్పిత. చేసే పనిలో పర్ఫెక్షన్ కోసమే ఇలా చేస్తున్నానని చెబుతోంది. బేర్ ఫుట్ కంపెనీలో నలుగురే పనిచేస్తున్నారు. 15 మంది ఫ్రీలాన్సర్లున్నారు.

ఇక 2016 జనవరిలోనే నాన్ ప్రాఫిట్ అనే ఒక స్టార్టప్ ప్రారంభించారు. మొన్ననే దాని ద్వారా చెన్నై వరదబాధితులను ఆదుకున్నారు . దాతలిచ్చిన డబ్బును బాధితులకు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పలు సంస్థలిచ్చే డబ్బును బాధితులకు చేరుస్తున్నారు. ఎన్జీఓలు, చారిటబుల్ ట్రస్టులు డబ్బలివ్వాలని చాలా మందిని విజ్ఞప్తి చేస్తాయి. అయితే ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేస్తారని చాలా మంది భయపడతారు. వాటిని పోగొట్టి పారదర్శకత తీసుకురావడానికి దీన్ని స్థాపించాను.. డబ్బురూపంలోకాకుండా… వస్తురూపంలో సాయాన్ని కూడా సేకరిస్తున్నాం అంటారు అర్పిత. 

పని, సంపాదనేకాదు – జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయాలి

వర్క్ – పర్సనల్ లైఫ్ మధ్య సమన్వయం చాలా ముఖ్యమంటారు అర్పిత. అందుకే తన ఉద్యోగులను వీకెండ్ లో కచ్చితంగా సెలవు తీసుకోవాలంటారు. ట్రావెలింగ్ అంటే ఈమెకు ప్రాణం. ఏమాత్రం ఖాళీ దొరికినా కొత్త ప్రాంతానికి చెక్కేస్తారు. అర్పిత ఎక్కడికి వెళ్లినా అక్కడ అనుభవాలను ట్రావెల్ బ్లాగ్ లో అందంగా పొందుపరుస్తారు.

సక్సెస్ మంత్ర

అర్పితకు అమెరికా వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ అంటే చాలా ఇష్టం. సీరియల్ ఆంట్రప్రెన్యూర్ గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారీమె. “థింక్ బిగ్, స్టార్ట్ స్మాల్, యాక్ట్ నౌ” ఇదే అర్పిత ఫిలాసఫీ. స్టార్టప్ లు ప్రారంభించేవారికి చాలా ఓపిక ఉండాలంటారు. డబ్బే సర్వస్వం కాదు చేస్తున్న పనికూడా కరెక్టుగా ఉండాలంటారు . ఉద్యోగులు, వినియోగదారులు, కంపెనీల బాస్ లు ఇలా అందరితోనూ సత్సంబంధాలకు ప్రాధాన్యతనిస్తారు. పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలకు అవకాశాలొచ్చినా… స్టార్టప్ లకే ప్రాధాన్యతనిస్తున్నారు అర్పిత. విజయానికి షార్ట్ కట్స్ లేవని, కష్టపడి పనిచేయడం ఒక్కటే మార్గమంటున్నారు ఈ యంగ్ అండ్ డైనమిక్ ఆంత్రప్రెన్యూర్. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags