సంకలనాలు
Telugu

మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి మెడిసిన్స్ డెలివరీ ! 3 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న 'బుక్ మెడ్స్'

ashok patnaik
11th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మందులు చీటీ మీ చేతిలో ఉండి, మీ స్మార్ట్ ఫోన్‌తోనే మెడిసిన్స్ తెప్పించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది బుక్ మెడ్స్ డాట్ కామ్ (BookMeds.com). ఎప్పుడైనా ఎక్కడైనా, అత్యవసర సమయాల్లోనూ ఎలాంటి టెన్షన్ లేకుండా ఆన్‌లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు.. మీరున్న చోటికే డెలివర్ చేస్తామంటున్నారు ఫౌండర్ మహమ్మద్ అబుబాకర్. హైదరాబాద్ కేంద్రంగా గతేడాది మేలో ప్రారంభమైన ఈ స్టార్టప్ రెండు సార్లు ఫండ్ రెయిజ్ చేసింది. మరింత దూకుడుగా విస్తరించాలని చూస్తోంది.

" హైదరాబాద్ అంటే హెల్త్ క్యాపిటల్ లాంటింది. మెడిసన్ అందించడంలో టెక్నాలజీని మొదటి సారి మేమే ఉపయోగించినందుకు గర్వంగా ఉంది" - అబు

image


బుక్ మెడ్స్ ప్రారంభం

2013లోనే బుక్ మెడ్స్ ప్రారంభమైంది. ఓ కాల్ సెంటర్ సెటప్ చేసుకొని మెడిసెన్స్ ఆర్డర్ ఇస్తే డెలివెరీ చేసేవారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. స్టాఫ్‌తోపాటు ఆర్డర్లు తక్కువగా ఉండటం వల్ల అన్ని ప్రాంతాలకు విస్తరించే వెసులుబాటు లేదు. ఫోన్ కాల్స్ నుంచి వెబ్ మోడ్‌లోకి ప్రవేశించగానే మార్కెట్ డబుల్ అయింది. 2014 మేలో మా కంపెనీ పూర్తి స్థాయి స్టార్టప్ స్ట్రక్చర్‌ని ఆపాదించుకుంది. సైట్ మొదలు పెట్టగానే అనూహ్య స్పందన వచ్చింది. ఈ సెక్టార్లో డిమాండ్ ఉందని తెలుసు కానీ ఈ స్థాయిలో ఉంటుందని ఊహించలేకపోయామన్నారు అబు. అలా ప్రారంభమైన స్టార్టప్ ఇప్పుడు హెల్త్ ఇండస్ట్రీలో ఓ స్థాయికి చేరుకుంది. విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది.

image


బుక్ మెడ్స్ లోని ఫీచర్లు

  1. బుక్ మెడ్స్‌లో ప్రిస్క్రిక్షన్ అక్కర్లేని ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అన్నీ దొరుకుతాయి.
  2. డాక్టర్ ప్రిక్సిప్షన్ అవసరం అయిన చోట తప్పని సరిగా చీటీని ఫోటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  3. అప్ లోడ్ చాలా సులువుగా ఉంటుంది. కుదరకపోతే వాట్సాప్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. వాటికి మెసేజ్ చేస్తే సరిపోతుంది.
  4. మెడికల్ ప్రొడక్టులు దాదాపు వెయ్యికి పైగా ఉన్నాయి. వీల్ చెయిర్ దగ్గరి నుంచి గ్లౌజుల దాకా ఎన్నో రకాలైన ప్రాడక్టులు ఆన్ లైన్లో ఆర్డ్ ఇస్తే ఇంటి దగ్గరకే డెలివరి చేస్తారు.
  5. వెబ్ సైట్లో రిజిస్ట్రర్ అయిన కస్టమర్లకు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీళ్లకి రిమైండర్ సర్వీసు ఇస్తున్నారు. దీనివల్ల ఇంట్లో మెడిసిన్ వాడే పెద్దవాళ్లు మరచిపోడానికి ఆస్కారం ఉండదు. పేషెంట్‌కు సంబంధించిన రిమైండర్ వారిని అసిస్ట్ చేసే మరెవరికైనా కావాలంటే దాన్ని కూడా అందిస్తారు. ఇలా కేర్ టేకర్లకు రిమైండర్ పాపప్ తోపాటు ఫోన్ కాల్ కూడా చేసి గుర్తు చేస్తారు.
  6. మెడిసిన్స్‌ను డైరెక్ట్‌గా ఫార్మసీ కంపెనీల నుంచి తెప్పిస్తారు కనుక వాటిపై కస్టమర్లకు డిస్కౌంట్లను ఇచ్చే వెసులుబాటుంది.

బుక్ మెడ్స్ టీం

బుక్ మెడ్స్ టీం విషయానికొస్తే అబు జెఎన్‌టియూలో బిటెక్ పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో ఏడేళ్లు పనిచేశారు. రెండు మూడు స్టార్టప్‌లకు సహకారం అందించారు. కాస్త అనుభవం సంపాదించిన తర్వాత బుక్ మెడ్స్‌ను ప్రారంభించారు. సుభద్ర.. బుక్ మెడ్స్‌కు కో- ఫౌండర్. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి అయిన ఆమె 15ఏళ్ల పాటు అమెరికాలో వివిధ కంపెనీల్లో పనిచేశారు. భారత్ తిరిగి వచ్చిన తర్వాత బుక్ మెడ్స్ టీంలో జాయిన్ అయ్యారు. వీరితో పాటు ఆన్ రోల్, ఆఫ్ రోల్ కలిపి దాదాపు 35మంది టీం ఉన్నారు.

ఫౌండర్ అబు

ఫౌండర్ అబు


రెవెన్యూ మోడల్ అండ్ ఫండింగ్

బుక్ మెడ్స్‌కు ఇప్పటి వరకూ రెండు రౌండ్ల ఫండ్‌ని రెయిజ్ చేసింది. డిపిబిఎస్(DPBS), ఫ్యాబెల్లా (Fabella) సంస్థలు దాదాపు 2.5లక్షల డాలర్లను ఫండింగ్ చేశాయి. రెవెన్యూ మోడల్ విషయానికి వస్తే.. ఫార్మా కంపెనీల నుంచి మందులు, ఇతర ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి.. కస్టమర్లకు సరఫరా చేయగా వచ్చిన ఆదాయమే కంపెనీ రెవెన్యూ. కంపెనీ ఏడాది టర్నోవర్ 3 కోట్లు దాటింది. ఆదాయంతో పాటు లాభాలు కూడా గణనీయంగానే ఉన్నట్టు కంపెనీ చెబ్తోంది. మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని... సక్సెస్ అయితే.. మిగిలిన నగరాలకు కూడా వేగంగా వెళ్లేందుకు అవకాశం ఉందని అబూ చెబ్తున్నారు.


ఈ రంగంలో ఉన్న ఇతర ప్లేయర్స్

వన్ ఎంజీ(1 mg) పేరుతో ఢిల్లీ కేంద్రంగా ఉన్న స్టార్టప్ దాదాపు 6 మిలియర్ డాలర్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఫండింగ్‌కు ఢోకాలేని ఈ స్టార్టప్ ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే జిగి(zigy) సౌత్‌లో మెడ్ ప్లస్ కంటే మెరుగ్గా పనిచేస్తోంది. దీనికి ఐగేట్ సిఈఓ మూర్తి 3మిలియన్ ఫండింగ్ చేశారు. మెడ్ ప్లస్‌తో ప్రస్తుతానికి పోటీ లేకపోయినా ఈ రెండు కంపెనీలతో భవిష్యత్‌లో పోటీ తప్పదు. అయితే వీటిని అధిగమించడానికి కొన్ని మెరుగైన సర్వీసులు అందిస్తామని అబు చెబ్తున్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

బుక్ మెడ్స్‌ సైట్‌కు నెలకు 50వేల హిట్స్ ఉన్నాయి. 35వేల మంది రిజిస్టర్డ్ యూజర్లున్నారు. నెలవారీ మందులు కొనుగోలు చేసే వాళ్ల సంఖ్య 6వేలు దాటుతోంది. ప్రస్తుతం యాండ్రాయిడ్‌లో లభిస్తున్న యాప్‌ త్వరలో ఐఓఎస్‌లో కూడా అభివృద్ధి చేస్తున్నారు. వచ్చే ఏడాది కల్లా యాప్ ప్లాట్‌ఫాం ద్వారా 50,000 మంది యూజర్లకు చేరువ కావాలని చూస్తోంది. ప్రస్తుతానికి హైదరాబాద్‌కే పరిమితమైన సేవలను ఫండింగ్ వస్తే.. కోల్‌కతా, చెన్నైలకు విస్తరించాలని చూస్తున్నారు. తర్వాత ముంబై, బెంగళూరు, ఢిల్లీలను టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రమోషన్ విషయంలోనూ కంపెనీ చురుగ్గా ఉంది.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags