సంకలనాలు
Telugu

గ్యారేజ్ నుంచి వంద కోట్ల వెంచర్ స్థాయికి ఎదిగిన యూనిసెల్ టెక్నాలజీస్

2003లోనే ఎస్ఎంఎస్‌లను ఓ మార్కెట్‌గా గుర్తించిన వినయ్గ్యారేజ్ నుంచి మొదలై మల్టీ నేషనల్ కంపెనీలకు సేవలందించే స్థాయికంపెనీ ఓ రేంజ్‌లో ఉన్నపుడు దెబ్బ తీసిన ట్రాయ్ నిబంధనలుసంక్షోభం నుంచి బయటపడి ఇంకా బలపడ్డ యూనిసెల్

4th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

టెలికాం మేజర్ ఎయిర్‌సెల్‌లో విజయవంతమైన పాత్ర పోషించాక... విజయ్ అగర్వాల్ యూనిసెల్ టెక్నాలజీస్‌తో తానే సొంత సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎస్ఎంఎస్, వాయిస్, యూఎస్ఎస్‌డీ, ఈమెయిల్ విభాగాల్లో ఛానల్స్‌కు క్లౌడ్ సేవలు అందిస్తుంది యూనిసెల్ టెక్నాలజీస్.

వినయ్, యూనిసెల్ టెక్నాలజీస్ అధినేత

వినయ్, యూనిసెల్ టెక్నాలజీస్ అధినేత


2003లో యూనిసెల్‌ను మరో వ్యక్తితో కలిసి ఓ గ్యారేజ్‌లో ఏర్పాటు చేశారు వినయ్. “అతను 2004లో కంపెనీని వదిలి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి కొంతకాలంపాటు నేనొక్కడినే నిర్వహించాను. మా ఉద్యోగుల్లోనే కొంతమందికి పారిశ్రామిక రంగంపై దృష్టి, కోరిక ఉన్నాయి. దీంతో వారిలో కొంతమంది భాగస్వాములుగా మారారు” అంటారు వినయ్.

చెన్నైలో ప్రారంభమైన ఈ స్టార్టప్ తొలి ప్రాజెక్ట్.. హచ్ సంస్థతో నిర్వహించింది. అయితే ఆ తర్వాత రెండేళ్లపాటు వినయ్‌కు మానసిక, శారీరక టెన్షన్లు తప్పలేదు. “హచ్ తర్వాత... కర్నాటకలో ఎయిర్‌టెల్ ప్రాజెక్టు మాకు అతి పెద్దది. మా ప్లాట్‌ఫాంను సేవాసంస్థలకు ఉపయోగించుకునేలా ఒప్పందం కుదిరింది. ఒకసారి పూర్తిస్థాయి మెషినరీ, ప్రాసెస్ సెటప్ అయ్యాక.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేద”న్నారు వినయ్.

వినయ్ వ్యక్తిగతం, వ్యక్తిత్వం

పూనేలోని సింబియాసిస్‌లో విద్యాభ్యాసం చేసిన వినయ్... భారత్‌లో టెలికాం బూమ్ మొదలైన సమయంలో కెరీర్ ప్రారంభించారు. టెలికాం సంస్థలో కీలక విధులు నిర్వహించడంతో టెక్నాలజీ నుంచి బిల్లింగ్ వరకూ, వాల్యూ యాడెడ్ సర్వీసుల నుంచి కస్టమర్ బేస్ వరకూ... వైర్‌లెస్ రంగంపై విస్తారమైన అనుభవాన్ని గడించారు.

వర్చువల్ నెంబర్ సర్వీస్, మొబైల్ బ్యాంకింగ్, బల్క్ పుష్ ఎస్ఎంఎస్, హెచ్ఆర్ కమ్యూనికేషన్, మీడియా ఇంటిగ్రేషన్, సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్, సప్లై చైన్, వాహన నిర్వహణ వంటి... అనేక సర్వీసులను అవసరాలకు, డిమాండ్లకు అనుగుణంగా అందిస్తుంది యూనిసెల్ టెక్నాలజీస్. ఇవే కాకుండా మెసేజింగ్, ఎల్‌బీఎస్, కంటెంట్ డెలివరీ వంటి సేవలనూ అందిస్తుంది.

ప్రస్తుతం ఈ సంస్థ ఐటీ, రిటైల్, ప్రభుత్వ రంగం, తయారీ, సరఫరా, మీడియా రంగాల్లో వెయ్యికి పైగా ఎంటర్‌ప్రైజ్ క్లయింట్లకు సేవలందిస్తోంది. యూనిసెల్ క్లయింట్లలో అసెంచర్, ఐబీఎం, న్యూయార్క్ మాక్స్‌లైఫ్, ఇన్ఫోసిస్, విప్రో వంటి బడా కంపెనీలు కూడా ఉన్నాయి.

ఎస్ఎంఎస్ ప్రయాణంలో ట్రాయ్ పదనిసలు

“బాబ్రీ మసీద్ తీర్పు సమయంలో ఎస్ఎంఎస్‌లపై బ్యాన్ విధించడంతో మేం చాలా ఇబ్బంది పడ్డాం. 7రోజుల పాటు ఒక్క ఎస్ఎంఎస్ కూడా పంపలేకపోయాం. పూర్తిగా ఎస్ఎంఎస్‌లపైనే ఆధారపడ్డ మా కంపెనీకి ఈ సమయం చాలా క్లిష్టమైనది” అంటారు వినయ్.

టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్ట్రీని ప్రారంభించడం సమస్యలు తెచ్చిపెట్టింది. “ఎస్ఎంఎస్ ఆధారిత కంపెనీలను ఓ పరిశ్రమగానూ, ఓ విభాగంగానూ గుర్తించలేదు ట్రాయ్. వెయ్యికిపైగా కస్టమర్లున్న మా సంస్థకు... ప్రాసెస్, టెక్నాలజీ, సిస్టంలపై పూర్తి వివరాలను ఇవ్వాలని ఎన్‌సీపీఆర్ నిబంధనలు చెబ్తున్నాయి. అదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించినవారిపై లక్షల కొద్దీ జరిమానాలు, మూడేళ్ల నిషేధం వంటివి మరిన్ని చిక్కులు తెచ్చే అంశాలు” అన్నారు వినయ్.

ట్రాయ్ నిబంధనల తర్వాత ధరలు పెరిగిపోవడం, విధానాలు మారిపోవడంతో 70శాతం మార్కెట్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఇండస్ట్రీ ఫేస్ చేయాల్సి వచ్చిన అతి పెద్ద ఛాలెంజ్ ఇదే. అయితే ఈ సమస్య నుంచి బయటపడి మరింత బలపడింది యూనిసెల్ టెక్నాలజీస్.


ముందుంది రహదారి

రూ. 100 కోట్ల టర్నోవర్‌ను అధిగమించింది యూనిసెల్ టెక్నాలజీస్. అన్ని విభాగాల్లోనూ అభివృద్ధి సాధించి 2015 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల టర్నోవర్ చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకుంది సంస్థ. ఇందుకోసం తమ సామర్ధ్యాన్ని సెకనుకు లక్ష లావాదేవీలను పెంచుకుంటోంది.

ఆదాయంలో 20-25 శాతాన్ని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్/ ఈమెయిల్ సేవల ద్వారా ఆర్జించాలనే లక్ష్యంగా పెట్టుకుంది యూనిసెల్. ప్రస్తుతం మొత్తం రెవెన్యూలో 95శాతం ఎస్ఎంస్ఎస్‌ల ద్వారా లభిస్తోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags