సంకలనాలు
Telugu

బొద్దింక స్టార్టప్ ల గురించి విన్నారా..?

SOWJANYA RAJ
18th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


రెండు మూడేళ్లుగా స్టార్టప్స్ కు ఓ రకంగా రాజయోగం నడిచింది. స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్స్ పోటీలు పడ్డారు. కొత్త టాలెంట్, అనుభవజ్ఞులు స్టార్టప్స్ లో భాగమయ్యేందుకు ఉత్సాహం చూపించారు. దానికి తగ్గట్లుగా మార్కెట్ పరిస్థితులు కూడా ప్రొత్సాహకరంగా ఉన్నాయి. కానీ ఈ ఏడాది అంటే 2016లో పరిస్థితులు మాత్రం అలా ఉండే అవకాశం కనిపించడం లేదు. గత మూడేళ్లుగా మహర్దశ నడిచింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు స్టార్టప్ ను పెట్టాలన్నా.. కాపాడుకోవాలన్నా.. బొద్దింక మార్గమే బెటర్ ఆప్షన్. సక్సెస్ ఫుల్ స్టార్టప్ అంట్రపెన్యూర్ గా పేరు తెచ్చుకున్న గరీమా జునేజా చెబుతున్న కాక్రోచ్ స్టార్టప్ థియరీ.. ఆమె మాటల్లోనే చదువుదాం...

ఏంటీ బొద్దింక స్టార్టప్..?

2016 స్టార్టప్ లకు అత్యంత కఠినమైన సంవత్సరం కానుందని ఇప్పటికే ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ విశ్లేషణలు ప్రారంభించారు. మార్కెట్ లో పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోయింది. పెట్టుబడిదారులు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. తెలివిగా ఆలోచిస్తున్నారు. తమ నిధుల్ని తమ దగ్గరే కొంతకాలం అంటిపెట్టుకోవాలని భావిస్తున్నారు. వారంతా ప్రస్తుత పరిస్థితిని "వెదజల్లడం ఆపేసి అట్టిపెట్టుకోవడం"అనే స్థితిగా భావిస్తున్నారు.

అంటే పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. మార్కెట్ పరిస్థితుల మార్పులను తట్టుకోవడం, సంక్షోభాలను అధిగమించడం, ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోవడం, మార్కెట్ కండిషన్లకు తగ్గట్లుగా పనితీరు మెరుగుపర్చుకోవడం ఈ అంశాలకు అనుగుణంగా స్టార్టప్ లు తమను తాము మార్చుకోగలగాలి. అచ్చంగా బొద్దింకలాగే. బొద్దింక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎలా తన జీవనగమనాన్ని మార్చుకుని బతకి బట్టకడుతుందో.. అలానే ఇప్పుడు స్టార్టప్ లు వ్యవహరించాలి.

బొద్దింక స్టార్టప్ కావాలంటే ఏం చేయాలి..?

కాలేజీ చదువు అయిపోయిన వెంటనే నేను డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ వైరర్ కర్రీ ప్రారంభించారు. దానికి పెట్టుబడి పెద్దగా లేదు. కానీ లాభాల బాటలో పయనించేలా చేయగలిగాను. స్టార్టప్ యజమానిని కాగలిగాను. సక్సెస్ సాధించినందుకు అవార్డులూ అందుకున్నాను. అందుకే నా అనుభవాల నుంచి నేను కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను.

"అత్యధిక జీతాలను ఉద్యోగులను ఎంపిక చేసుకోకండి. మీ ఉత్సాహాన్ని, మీ విజన్ ను మాత్రమే మీరు నమ్ముకోండి.."

బాగా టాలెంట్ ఉన్నవాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం వచ్చింది. కానీ వారికి అత్యధిక జీతాలను ఆఫర్ చేయాల్సి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ చాన్స్ తీసుకోకండి. మన విజన్ నే మనం అమ్ముకుంటాము. ఇక్కడ పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకుంటారని మనం వారికి తరచూ చెబుతూ ఉంటాము. పెద్ద పెద్ద అందమైన భవనాల్లో ఆఫీసులు, భారీ జీతాలు మా దగ్గర ఉండవు. కానీ పనిలో ఎంతో నేర్చుకునే అవకాశం మాత్రం ఉంటుందని చెబుతూంటాము. మన స్ట్రగుల్ స్టోరీని వారికి వివరించి చెబుతూ ఉండాలి.

ఇలా చెబుతూ ఉంటే మనం ఆటోమేటిక్ గా డబ్బు కోసం ఎవరు వచ్చారో ఈజీగా గుర్తించవచ్చు. ఇది మన కంపెనీ అని మనస్ఫూర్తిగా భావించేవారినే మనం ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి ఉద్యోగులే తర్వాత తర్వాత కంపెనీకి అవసరమైన నాయకత్వాన్ని తయారు చేస్తారు.

నోట్: అయితే జీతం ఆఫర్ అనేది చాలా సున్నితమైన అంశం. ప్రతిభావంతులకు సరైన వేతనం అందాలి. అదే సమయంలో ప్రతిభావంతులు కాని వారికి వారి కన్నా తక్కువ వేతనం ఉండాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం అత్యవసరం.

image


ఫిక్స్ డ్ ఎసెట్స్ మీద ఖర్చు తగ్గించండి..!

మేము కంపెనీ ప్రారంభించిన కొత్తలో ఉద్యోగులను ఎంపిక చేసుకున్నప్పుడు.. ఎవరి ల్యాప్ ట్యాప్ వారు తెచ్చుకోవాలనే నిబంధన పెట్టాం. దాని వల్ల చాలా సొమ్ము ఆదా అయింది. ఉదాహరణకు ఇరవై మంది ఉద్యోగులు ఉన్నారనుకుందాం. వారి కోసం ఇరవై ల్యాప్ ట్యాప్ లు కొంటే... ఏడు లక్షల రూపాయలు ఖర్చయిపోతాయి. వాడకం తర్వాత ప్రతి రెండేళ్లకు ఓసారి వీటిని మార్చాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి మూడు లక్షల రూపాయలకుపైగానే ల్యాప్ ట్యాప్స్ మీద ఖర్చు చేయాల్సిఉంటుంది.

అదే సమయంలో ఈ మొత్తం పెట్టి ఓ టీంమెంబర్ ను నియమించుకుంటే.. ఎవరు బాగా ఎక్కువ ఉపయోగపడతారో అంచనా వేసుకోండి.

సర్వర్స్, ఇంటర్నెట్ కోసం ఖర్చు పెట్టండి..!

చాలా తక్కువ మొత్తం పెట్టుబడితో.. మంచి బృందంతో మేము స్టార్టప్ పని ప్రారంభించాం. అయితే మేము సర్వర్స్ పైనా కొంత పొదుపు చేయాలని ప్రయత్నించాం. అయితే కొన్నాళ్లకు మాకు అర్థమయింది ఏమిటంటే.. సర్వర్స్ మీద.. ఇంటర్నెట్ మీద ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత మంచిదని. అందుకే వెంటనే మా విధానాన్ని మార్చుకుని.. మేలైన ఇంటర్నెట్, సర్వర్లను సమకూర్చుకున్నాం.

ఒక చెడ్డ సర్వర్ ఇప్పటి వరకు మీ కష్టాన్ని ఒక్క క్షణంలో బూడిదలో పోసిన పన్నీరు చేయగలదు.

మా సర్వర్ ఓ వారంతంలో క్రాష్ అయింది. గంటలోనే గూగుల్ ప్లే స్టోర్ లో మాపై వ్యతిరేక కామెంట్లు ప్రారంభమయ్యాయి. మేను చాలా డబ్బు నష్టపోయాం. మళ్లీ రిప్యుటేషన్ పొందడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

పొదుపుగా ఉండండి..!

ఇది చాలా మంది వ్యవస్థాపకుల వ్యక్తిగత విషయం కానీ.. కాస్త సీరియస్ మేటర్. పొదుపుగా బతకడం నేర్చుకోండి. నిరాడంబరంగా, నేలమీద జీవించండి. మీరు స్టార్టప్ నుంచి జీతం తీసుకుంటున్నా సరే... ఆదా చేసుకోండి.

నేను డిజిటల్ మార్కెటింగ్ స్టార్టప్ ప్రారంభించిన తర్వాత కూడా కోవర్కింగ్ స్పేస్ ను డెవలప్ చేయడానికి ప్రయత్నించాను. ఈ ప్రయత్నం నాకు మరింత అదనపు ఆదాయాన్ని సమకూర్చి పెట్టింది. అలాగే మోటివేషన్, వెట్ వర్కింగ్ కూడా లభించింది. అది నాకు SUV ఇస్తుందనే నేను ఆలోచించలేదు.

ప్రొడక్ట్ నే సెంటర్ పాయింట్ గా ఉంచండి..!

మన స్టార్టప్ ప్రొడక్ట్, సర్వీస్ విలువను ఎప్పటికప్పుడు పెంచుకోవడం మర్చిపోకూడని విషయం. పెద్ద పెద్ద స్టార్టప్స్ అన్నీ వారు చేసే సర్వీస్, ప్రొడక్ట్ కు ఎప్పటికప్పుడు మెరుగులు అద్దుతూనే ఉంటారు. ప్రజలు దాన్నిసులువుగా ఇష్టంగా వాడుకునేలా తీర్చిదిద్దడమే స్టార్టప్ సెంటర్ పాయింట్ గా ఉండాలి. అలా చేస్తే మీదే పర్ఫెక్ట్ కాక్రోచ్ స్టార్టప్.

గమనిక: ఆర్టికల్ లో అభిప్రాయాలన్ని రచయితవి మాత్రమే. యువర్ స్టోరీ అభిప్రాయంగా భావించాల్సిన అవసరం లేదు.

(రచయిత- గరీమా జునేజా. కాలేజీ పూర్తవడంతోటే వైరల్ కర్రీ పేరుతో డిజిటల్ మార్కెటింగ్ స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్న ఆంట్రప్రెన్యూర్)

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags