సంకలనాలు
Telugu

ఓ కాలేజ్ డ్రాపౌట్. కానీ కెమెరాతో కథలు చెప్పడంలో హిట్

team ys telugu
23rd Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

"సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్ కావాలంటే ఎంబిఏనో.. లేక ఏదైనా ప్రముఖ బిజినెస్ స్కూల్ డిగ్రీలోనూ అవసరం లేదు " అంటున్నారు కాలేజ్ డ్రాపౌట్ అయిన అనన్య రిజ్వాని. ఆంట్రప్రెన్యూర్స్‌కి అపజయమనేది ఉండదు. సాగించే ప్రయాణంలో ప్రతీ రోజు ఒక చరిత్రే అంటుంది తను.

తనపై జనాలకు ఉన్న సందేహాలని, సంశయాల్ని స్పష్టమైన సమాధానమిచ్చింది. తమ పిల్లల విజయాల్ని గొప్పగా చెప్పుకునే మహిళలు.. తనను అనుమానంగా చూసినా, తన దగ్గరకు వచ్చే క్లైంట్లు తానింకా చిన్న పిల్లేనని బిజినెస్ గురించి మాట్లాడేందుకు వెనుకడుగు వేసినా, బాగా చదువుకొని ఉంటే ఇంకా బాగా ఎదిగేదాన్ని అని తల్లిదండ్రులు, బంధువులు భావించినా.. అన్నింటినీ అధిగమించి ముందుకు సాగడాన్ని నేర్చుకుంది.

అనన్య

అనన్య


"ఎన్నో ఒత్తిళ్లను, అభద్రతా భావాన్ని, అనుమానాల్ని, నా మీద, నా కలల మీద నాకే కలిగిన సందేహాల్ని అధిగమించా. సొంతంగా స్టూడియోను నడపడం, నెలవారీ బిల్లులు చెల్లించడం, జీతాలు ఇవ్వడం అన్నీ నాకు నేనే చెల్లించుకునే దశకు చేరుకున్నాను. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం, ఎమోషన్లను హాం డిల్ చేసే మెచ్యూరిటీ లేని చిన్నతనం, తీవ్ర ఒత్తిడితో ఒక్కోసారి ఏమీ తినకపోయేదాన్ని. దీంతో గ్లూకోజ్ ఇంజక్షన్లు తీసుకోవాల్సి వచ్చేది. నేను ఏమవుతానోనని నాన్న బెంగపడేవాడు, నేను ఏం కావాలని కోరుకుంటున్నానో తెలియని అమ్మ ఏడ్చేది. ఒక్కోసారి నిద్రలేని రాత్రుల్ని అనుభవించాను. నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక్క ఫ్రెండ్ కూడా లేని పరిస్థితి. అయితే ఎన్ని ఉన్నా నేను మాత్రం కేవలం సంపాదన మీద మాత్రమే దృష్టి పెట్టుకోవద్దని అనుకున్నాను. అది స్ట్రెస్ పెంచుతుంది. మా నాన్నలా నా వర్క్ మీదే ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నా" అంటుంది కాలేజ్ డ్రాపవుట్ అనన్య.

వారణాసి ఘాట్స్ నుంచి ఢిల్లీ పయనం

సింధి అయిన అనన్య.. వారణాసిలో పుట్టి పెరిగింది. తండ్రి చేసే ఎక్స్‌పోర్ట్ బిజినెస్, నిర్వహించే హోంస్టే వల్ల అనన్యకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. దోంతో పాటే ఇతర పిల్లలకంటే భిన్నంగా తన బాల్యాన్ని గడిపింది. " చిన్నప్పటి నుంచి నాకు స్వేచ్ఛను ఇచ్చారు. 'నేనెపుడు డాడ్‌ను అక్కడికి వెళ్లొచ్చా ? ' అని అడగలేదు. 'నేను ఇక్కడికి ఇందుకోసం వెళ్తున్నాను, అని చెప్పేంత స్వేచ్చ ఉండేది. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. ఎక్కడికైనా వెళ్లి ఏదైనా సాధించేంత అవకాశం కలిగించారు'' అంటారు అనన్య.

మూడేళ్లకే కథక్ నేర్చుకోవడంతో.. కళలంటే అనన్యకు ఆసక్తి ఏర్పడింది. 10 ఏళ్ల పాటు కో-ఎడ్‌లో సాగిన చదువు మానవీయ విలువల గురించి తెలుసుకునేలా చేసింది. 11, 12 వ తరగతుల కోసం స్కూల్ మారినపుడు వ్యత్యాసం కనిపించినా అనన్య మేనేజ్ చేసుకుంది. కొత్త స్కూల్ వాతావరణం వ్యక్తిగతంగాను, అన్ని విధాలా అభివృద్ధిలోకి రావడానికి తోడ్పడింది.

మొదలైన అన్వేషణ

స్కూల్ చదువు ముగిశాక అనన్యకు ఏ దిశలో వెళ్లాలో అర్థం కాలేదు. ఆ వయస్సులోని ఇతర పిల్లల్లాగే తనకు నిజంగా ఏం కావాలో తేల్చుకోలేక పోయింది. ఏడాదిలోనే కాలేజ్ మానేసింది. ఆ తర్వాట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కోర్స్ చేరింది. అది కూడా మధ్యలోనే వదిలేసింది.

తనకు దొరికిన ఖాళీ సమయాల్లో కెమెరాను వెంటబెట్టుకుని, బెనారస్ ఘాట్ల దగ్గరకు వెళ్ళేది. తండ్రి నిర్వహిస్తున్న హోం స్టే లో భాగంగా అక్కడికి వచ్చే ఫారినర్లతో కలిసి వారణాసిని వారికి పరిచయం చేసింది. దీంతో అనన్య.. టూరిజం రంగంలోకి అడుగు పెడ్తుందని తండ్రి భావించారు. అయితే తాను మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తనకంటూ స్వంత గుర్తింపు తెచ్చుకోవాలని భావించింది. అప్పుడే స్టార్టప్ బగ్ తనను తొలిచేసిందని చెప్తుంది అనన్య.

"చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని, కలల్ని సాకారం చేసుకోవడానికి మించింది మరేదీ లేదు" అంటుంది అనన్య. చివరికి తన కలలకు ఒక రూపం ఇస్తూ వెడ్డింగ్ స్పెషలైజేషన్‌తో ఫోటోగ్రఫీ స్టూడియోను 2013 జూలైలో వారణాసిలో ప్రారంభించింది. అక్కడే కొంతకాలం పనిచేసిన అనన్య, 19 ఏళ్ల వయసులో, అప్పటి దాకా దాచుకున్న 40 వేలతో, స్టూడియో పెట్టుకోవడానికి ఢిల్లీ బయలుదేరింది.


image


కెమెరా వెనుక జీవితం

స్వయంగా నేర్చుకున్న ఫోటోగ్రఫితో తనకు నచ్చిన స్పెషలైజేషన్‌ను ఎంచుకుంది అనన్య. పెళ్లిళ్లలో కనిపించే సంస్కృతీ, సంప్రదాయాలంటే నాకిష్టం. తరతరాలుగా వస్తున్న ఆచారాల్ని కళ్లకు కట్టినట్లు చెప్తాయి. వివాహాల్లో కనిపించే వివిధ అంశాల్ని ఫోటోల రూపంలో కథలా చూపిస్తాను" అంటుంది.

అనన్య ఫ్రెండ్స్ చాలామంది సినిమాల కోసం కాలేజ్ బంక్ కొడితే, తను మాత్రం ఖర్చులు, బిల్లుల్ని ఎలా తీర్చాలా అని ఆలోచించేది. తను ఎంచుకున్న రంగం గురించి ఏనాడూ పశ్చాత్తాపడలేదు. పట్టుదలతో పనిచేసేది. "డబ్బులు సంపాదించడం, సక్సెస్ కావడం రాత్రికి రాత్రే జరగదని తెలుసుకున్నాను. నా వయసు వారికంటే ఎక్కువగా మానసికంగా బలపడ్డాను. ఎందుకంటే ఇది నేను ఎంచుకున్న మార్గం కాబట్టి " అంటుంది అనన్య. ఒక్కోసారి 19 ఏళ్ల వయసు వారు ఎలా ఉంటారో అలా తను ఉంటే బాగుండేదని అనిపించినా, తాను ఎంచుకున్న రంగానికే ప్రాధాన్యతనిచ్చింది.

" నాకున్న ఐదుగురు టీం మెంబర్లతో ఒకే రోజు రెండు నగరాల్లో పనిచేసిన రోజులున్నాయి. ఒక్కోసారి అసలు పనికూడా లేని రోజుల్ని చూశాను. అంత బాగాలేని క్లైంట్లు కూడా ఉన్నారు, ఫోటో ఎడిట్స్ లేట్ అయ్యేవి, ఒక్కో ప్రాజెక్టుకు నయా పైసా ఇచ్చేవారు కాదు. ఒక్కోసారి నేను నా టీంకు సరిగా డబ్బులు ఇవ్వలేకపోయేదాన్ని. మరి కొంత మంది క్లైంట్లు ముందుగా అనుకున్నంత పేమెంట్లు చేసేవారు కూడా కాదు " అంటూ పాత రోజులను గుర్తుచేసుకుంటుంది. 

క్లైంట్ల కోరికలు అందుకోవడం కష్టమయ్యేది

ఒక్కోసారి క్లైంట్ల అంచనాలు అందుకోవడం పెద్ద సవాలుగా పరిగణించేది. " చాలామంది మేము అంతకు ముందు చేసిన దాంట్లో ఉన్న ద బెస్ట్ అనుకునే వాట్ని చూసి తమకూ అలానే చేయమని అడుగుతుంటారు. అయితే ఒక్కో వివాహం ఒక్కో రకంగా తీయాల్సి వస్తుందని వాళ్లకి ఎలా చెప్పాలో అర్థం కాకపోయేది. అక్కడి పరిసరాల్లో ఉండే లైట్లు వేరుగా ఉంటాయి, పెళ్లికి వచ్చేవారు వేరి దగ్గరి నుంచి అక్కడి వాతావరణం కూడా అంతా ఒకే రకంగా ఉండదు. కానీ వాళ్లు మాత్రం తాము కోరిందే చేయమంటారు" అని వర్క్ ఎక్స్‌పీరియన్స్ చెబుతుంది అనన్య.

అన్నింటికంటే కష్టతరంగా అనిపించేది, తాను తన తోటి వయస్సువారిలా ఉండలేకపోవడమే అని బాధపడ్తుంది. 20 ఏళ్ల వయస్సులో అందరిలాగే తనకూ పార్టీలు చేసుకోవాలని, ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. తనూ యువతేనని గుర్తుకొస్తుంది. కానీ, తాను పూర్తి చేయాల్సిన వర్క్ గుర్తు రావడంతో వెంటనే.. ఆ కలలన్నీ.. కరిగిపోయేవని చెబ్తుంది. తాను చేసిన తప్పుల్ని ఏమాత్రం దాచుకోకుండా చెప్పే అనన్య, అవే తన ఎదుగుదలకు, మెరుగయ్యేందుకు దోహదపడ్డాయని వివరిస్తుంది.

మొబైల్ ఫోన్స్ మన జీవితంలోకి ప్రవేశించి సర్వాంతర్యామిగా మారిపోయాయి. ఇన్‌స్టాగ్రాం, ఫేస్ బుక్, సెల్ఫి క్రేజ్ తో ప్రతీ ఒక్కరు ఫోటోగ్రాఫర్లుగా మారిపోయారు. ఇదే విషయాన్ని అనన్యను అడిగితే, " ఈరోజుల్లో ఫొటోగ్రఫి గందరగోళంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ప్రతీ నిమిషానికి లక్షల ఫోటోలు అప్ లోడ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు సబ్జెక్ట్‌గా మారిపోయారు. ఇలాటి ఫోటోలు తొందరగానే అంతరించిపోయే జాబితాలో చేరిపోతాయి. అది వారికి కూడా తెలుసు.

image


నాకూ ఒక కల ఉంది

అనన్య తన కళను ఒక మంచి పనికి ఉపయోగించింది. అనన్య వారంతాల్లో ఒక స్వచ్చంద సంస్థలోని పిల్లలకు చదువు చెప్తుంది. "ఫోటోగ్రఫీ ప్రారంభించిన మొదట్లోనే కొన్ని సంస్థలతో పని చేయడం ప్రారంభించాను. వారణాసిలోని ఫెయిర్ మెయిల్, ఇపుడు ప్రోత్సాహన్ అనే సంస్థలతో పని చేస్తున్నా. వీధి బాలలు, యువతకు సృజనాత్మక విద్య, స్వయం సమృద్ధికి అవసరమైన కళల్ని నేర్పిస్తున్నాం " అంటుంది.

కళ తనను తాను మలచుకోవడానికి ఉపయోగపడితే, ఫోటోగ్రఫి తనను తాను వ్యక్తీకరించుకోవడానికి ఉపయోగపడిందని చెప్తుంది అనన్య. "అందరిలాగే నేను అనేలా కాకుండా, నేను అందరికంటే విభిన్నం అని గుర్తించేలా చేసింది. జీవితం డబ్బులు సంపాదించడానికో, సక్సెస్ కావడానికో కాదు, మన కలల్ని సాకారం చేసుకోవడానికి. ఆ కల చిన్నదయినా, పెద్దదయినా ఒకటే. నేను పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలోని అమ్మాయిలు వాళ్ల గతాన్ని మరిచిపోయి, భవిష్యత్తులో కళ ద్వారా తమని తాము నిరూపించుకోవాలనేది నా కల" అంటూ ముగిస్తుంది అనన్య.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags