వాయు కాలుష్యం తగ్గించే అద్భుత ప్రయోగం

వాయు కాలుష్యం తగ్గించే అద్భుత ప్రయోగం

Thursday May 11, 2017,

1 min Read

రోజురోజుకూ కర్బన్ ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణాన్ని విపరీతంగా పొల్యూట్ చేస్తోంది. యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా అండ్ ద గ్లోబల్ ప్రాజెక్టు చేసిన సర్వే ప్రకారం 2014లో ఇండియా 2.6 బిలియన్ టన్నుల కార్బన్ విడుదల చేసి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా భారత్ విడుదల చేసిన కర్బన ఉద్గారాల శాతం 7.2. ఆ లెక్కన ఏడాదికి సగటున విడుదలయ్యే కార్బన్ శాతం 2.0. 130 కోట్ల మంది ఉన్న మన దేశానికి ఆ లెక్క ఎంతో ప్రమాదకరం. భవిష్యత్ లో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.

image


ఈ పరిస్థితి అంతకంతకూ దిగజారతుండటంతో సహజ వాయువులు భూమిలోపల శిలాజాల్లో ఇరుక్కుపోతున్నాయి. కొన్ని మిలియన్ సంవత్సరాలుగా అవి భూగర్భంలోనే నిక్షిప్తమై ఉంటున్నాయి. అలాంటి వాయువుల్ని పైకి రప్పిస్తే భూమ్మీద పొల్యూషన్ అనేమాటే వుండదు.

అలాంటి ప్రయోగంలో సక్సెస్ అవుతున్నాడు బాంబే ఐఐటీ ప్రొఫెసర్ విక్రమ్ విశాల్. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను భూమిలోపలికి ఇంజెక్ట్ చేయడం వల్ల శిలాజాల్లో నిక్షిప్తమై ఉన్న సహజవాయువులు ఒక్కసారిగా పైకి లేస్తాయి. పొయిన ఏడాది తన సొంత లేబొరేటరీలో ఇలాంటి ప్రయోగమే చేసి రియల్ టైంలో రిజల్ట్ చూశాడు. 40 శాతం మిథేన్ వాయువు రిట్రైవ్ అయింది. ఈ శాస్త్రీయ విధానంలో ముప్పావు వంతు విజయం సాధించిన తీరు భవిష్యత్ మీద ఆశ కలిగిస్తోంది.

ముంబై ఐఐటీలోని ఎర్త్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న విక్రమ్ విశాల్ నేషనల్ సైన్స్ అకాడెమీ నుంచి ఇటీవలే యంగ్ సైంటిస్ట్ అవార్డు తీసుకున్నారు. విశాల్ కనుగొన్న ఈ ప్రత్యేకమైన, శాస్త్రీయమైన పద్ధతి అనుకున్న రీతిలో విజయవంతమైతే- పరిశ్రమల నుంచి ఎంత శాతం కార్బన్ డై ఆక్సైడ్ విడుదలైనా వాయు కాలుష్యం అన్నమాటే ఉండదు.