సంకలనాలు
Telugu

‘జైవీ’తో వైద్యరంగాన్ని మార్చనున్న ఆ నలుగురు

మూడు ప్రపంచ నగరాలు నలుగురు వ్యక్తులుఐటీతో హెల్త్ కేర్ రంగాన్నే మార్చేస్తామంటున్నారుభారత్ లో వైద్యరంగమంటే.. జైవీకి ముందు జైవీకి తర్వాత అంటారని ధీమా

ashok patnaik
19th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

జైవీ టెక్నాలజీస్ అనేది ఎండ్ టు ఎండ్ హెల్త్ పరిష్కారం. స్టార్టప్ సెన్స్ ప్రపంచంలో ఉన్న మూడు వివిధ నగరాల్లోని స్నేహితులను ఒక్కటిగా చేసింది. స్టీవ్ ఖోడ్ ది న్యూయార్క్. అర్జున్ దాస్ గుప్తాది ప్యారిస్. శైలేంద్ర మాథుర్, జోహెబ్ తన్వీర్ ది పూణే. వీరంతా వాళ్ల అభిరుచుల్ని పంచుకున్నారు. వీళ్ల నలుగురిలో రెండు విషయాలు మాత్రం కామన్‌గా ఉన్నాయి. టెక్నాలజీని బాగా ఇష్టపడతారు. అదేవిధంగా ఏం చేసినా సాధారణంగా ఉండకూడదని ఆలోచిస్తారు.

జైవీ బృంద సభ్యులు

జైవీ బృంద సభ్యులు


ఒక సంభ్రమాన్ని కలిగించిన ఐడియా సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి స్టార్టప్ మొదలు పెట్టేలా చేసింది. 2014 లో ప్రారంభమైన జైవీ టెక్నాలజీస్ హెల్త్ కేర్ రంగంలో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. ఆసుపత్రులు, వైద్యులు, ఫార్మాసిస్టులు, పేషెంట్లతో పాటు వారి కుటుంబాలకు సైతం మేలు జరిగేలా ఈ టెక్నాలజీలో అవకాశాలున్నాయి.

ఈ ఆలోచన వెనకున్న వ్యక్తి శైలేంద్ర. ఆయన అభిప్రాయం ప్రకారం. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చాలా మార్పులు తీసుకురాగలిగింది. ఆర్థిక, ట్రావెల్, రిటైల్‌తోపాటు చాలా రంగాల్లో ఐటి తీసుకొచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే హెల్త్ కేర్ రంగంలో ఐటీ సేవల వినియోగం అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ఇక్కడ వ్యాపారావకాశాలు కనిపించాయి. అదే విధంగా సామాజిక కోణంలో చూసినా హెల్త్ కేర్‌ రంగానికి ఐటీ సేవల అవసరం ఎంతైనా ఉందనిపించింది. దీంతో మేం ఒక చిన్న ప్రయత్నం చేశామని అన్నారాయన.

ఈ ఆలోచనతో మిగతా వాళ్లు ఈ రకమైన వ్యాపారంలోకి రావడం పెద్ద కష్టమని నేను అనుకోను అని జోవీ ఆర్కిటెక్, యూఐ డిజైనర్ అనూజ్ అన్నారు. 

అనుజ్

అనుజ్


“ఏడేళ్లు క్యాన్సర్ తో పోరాడి 2013 లో మా నాన్న గారు చనిపోయారు. హెల్త్ కేర్ రంగం ఎంత దారుణంగా ఉందనే దానికి ఇంత కంటే మంచి ఉదాహరణ ఏముంటుంది. మా ఇంటిలో జరిగిన ఈ దుర్ఘటన తర్వాత హెల్త్ కేర్ లోకి నా ఐటి స్కిల్స్ ‌ని తీసుకు రావడానికి నాకు స్పష్టత వచ్చింది. శైలేంద్ర నాతో అన్నప్పుడు .. ఏమాత్రం సంశయించకుండా ఓకే చెప్పేశా. ఐటి తో హెల్త్ కేర్ రంగం దశ, దిశను మార్చేద్దామని సంకల్పించాం” - అనుజ్

జైవీ లో ఆసక్తి కలిగించే కొన్ని ఫీచర్లు:

1.ఎక్కువ మంది డాక్టర్ల అపాయింట్‌మెంట్లను పర్యవేక్షించడంతోపాటు స్కెడ్యూల్ చూసుకోడానికి రిసెప్షనిస్టులను అనుమతిస్తారు.

2. పేషెంట్లు మందులెప్పుడు తీసుకోవాలో, అపాయింట్‌మెంటు ఎప్పుడనే విషయం ఆటోమేటిక్‌గా తెలుస్తుంది.

3. పేషెంట్ హెల్త్ రికార్డులు డిజిటలైజ్ చేసి ఉంటాయి. దీంతో డాక్టర్లు అతని రికార్డులు చూసుకునే వీలవుతుంది. మరింత మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది దోహదపడ్తుంది.

4. ల్యాబ్ లలో చేసిన టెస్టుల రిపోర్టులు జైవ్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల దాన్ని పేషెంట్ తోపాటు డాక్టర్ చూసుకునే వీలు కుదురుతుంది.

హెల్త్ కేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడానికి జైవ్ మార్గదర్శిగా వ్యవహరిస్తోంది. ఇంటర్నెట్ వినియోగంతో ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మార్కెట్ లో ఉన్న ప్రామాణిక సాంకేతికతను మించి ఉండే అవకాశాలపై చర్చించుకొని ముందుకు వెళ్లేందుకు టెక్నాలజీని వాడుతున్నారు. జైవ్ అనుబంధ ఆసుపత్రులన్నీ అధునిక హంగులతో ఉంటాయి. ఎంతో తక్కువ సమయంలోనే క్రిటికల్ కేసుల పరిష్కారించేందుకు అవకాశముంటుంది.


జోహైబ్

జోహైబ్


సామాజిక మార్పులకు అనుగూణంగా తాను ఒక అందమైన సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేశానని చెప్పుకొచ్చారు జైవ్ ప్రైమ్ డెవలపర్ జోహైబ్ . వైద్యాన్ని సరసమైన, అందుబాటులో ఉన్న, స్థిరమైన రంగంగా మార్చే విప్లవంలో నేను కూడా భాగస్వామినయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.

జోహైబ్, శైలేంద్ర, అనూజ్‌ల ఆలోచన అయితే బాగానే ఉంది. కానీ ఆ ఆలోచన అమలులోకి తీసుకు రావడం ఎలా? అనే ప్రశ్న అందరి మదిని తొలిచినప్పుడు.. వారికి దొరికిన జవాబే.. స్టీవ్. వారంతా తమ ఐటి ఉద్యోగాలొదిలేసి.. వ్యాపారంలో దిగడానికి కావల్సిన మద్దతును ఇచ్చింది స్టీవ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డైమండ్ పాలిషింగ్ బిజినెస్‌ని విడిచిపెట్టిన స్టీవ్ జైవ్ కంపెనీకోసం ఇనిషియల్ ఇన్వెస్టిమెంట్ పెట్టారు. జైవ్‌లో స్టీవ్ సేల్స్‌ని మ్యానేజ్ చేస్తున్నారు. 

“రెండేళ్లుగా కుటుంబంతో పాటు డైమండ్ వ్యాపారంలో ఉన్న నేను, అక్కడినుంచి బయటపడాలని అనుకున్నా. కొత్త ప్రాజెక్టు వెతికే పనిలో ఉన్నా. కొత్త ప్యాషన్‌తో ఉన్న నాకు అంజూ చెప్పిన ఆలోచన జైవీ అవతరించడానికి కారణమైంది. ఐటి బ్యాక్ గ్రౌండ్‌లో ఎక్కువ కాలం అనుభవం ఉన్న వీరు ప్రారంభించబోయే ప్రాజెక్టులో నేనూ చేరాలనుకున్నా” అని స్టీవ్ చెప్పుకొచ్చారు.

“రెండేళ్లుగా కుటుంబంతో పాటు డైమండ్ వ్యాపారంలో ఉన్న నేను, అక్కడినుంచి బయటపడాలని అనుకున్నా. కొత్త ప్రాజెక్టు వెతికే పనిలో ఉన్నా. కొత్త ప్యాషన్‌తో ఉన్న నాకు అంజూ చెప్పిన ఆలోచన జైవీ అవతరించడానికి కారణమైంది. ఐటి బ్యాక్ గ్రౌండ్‌లో ఎక్కువ కాలం అనుభవం ఉన్న వీరు ప్రారంభించబోయే ప్రాజెక్టులో నేనూ చేరాలనుకున్నా” అని స్టీవ్ చెప్పుకొచ్చారు.


వైద్యరంగంలో సమూల మార్పులకు జైవీ కారణమైంది. టెక్నాలజీని స్మార్ట్ గా ఉపయోగించి లేబర్‌ని తగ్గించడం ఇందులో మొదటిది. సరసమైన ధరలకే విలువైన వైద్యసేవలు ఇవ్వడంతో పాటు వైద్యరంగంలో నిలకడకు కొత్త భాష్యాన్నిచ్చింది. హెల్త్ కేర్ ఇండస్ట్రీని జైవీకి ముందు.. జైవీకి తర్వాత అని రెండుగా చూడొచ్చు. అంతలా ఈ రంగంలో ఐటి వినియోగం పెంచి.. తనదైన ముద్రను వేసుకుంది జైవీ.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags