సంకలనాలు
Telugu

మీరు ఎక్కడున్నా మీ మొబైల్‌‌తో కంప్యూటర్‌ను ఆపరేట్ చేయొచ్చు

గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్‌తో పోటీపడ్తున్న ఓ స్టార్టప్ఎక్కడున్న మొబైల్ ద్వారా పిసి ఆపరేట్ చేసుకోవచ్చుఒక్క చిన్న యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలుప్రపంచవ్యాప్తంగా బాగా పాపలర్ అవుతున్న ఇండియన్ యాప్4.5 లక్షల డౌన్‌లోడ్స్‌తో జోరు

5th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, మైక్రోసాఫ్ట్ ఒన్ డ్రైవ్‌ వంటి జెయింట్స్‌తో పోటీపడ్తూ ఓ కంపెనీ దూసుకుపోతోంది. మీరు ఎక్కడున్నా మీ కంప్యూటర్‌ను మీ మొబైల్ ద్వారా ఓ చిన్న యాప్‌తో యాక్సెస్ చేసుకునే సౌలభ్యం కలుగుతోంది. మీ సిస్టమ్‌లోని మూవీస్, మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయడమే కాకుండా ఫైల్స్‌ను కాపీ కూడా చేసుకోవచ్చు.

AIRSTREAM.IO పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ యాప్‌ను నిత్యా ల్యాబ్స్ రూపొందించింది. ఏడాదిన్నర నుంచి ఈ యాప్ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు నాలుగున్నర లక్షల డౌన్‌లోడ్స్ సాధించి అందరినీ తనవైపు ఆకర్షించింది. నెలకు 40 వేల మంది యూజర్స్ తరచూ ఈ యాప్‌ను ఉపయోగించుకుంటున్నారు. రెండు వందలకు పైగా దేశాల నుంచి డౌన్ లోడ్స్ జరిగాయి. రోజుకు సగటున 450 వరకూ కొత్త సైనప్స్ అవుతున్నాయి.

image


జితిన్ పిళ్లై, అగ్నిమిత్ర పాఠక్... ఇద్దరూ స్నేహితులు. 2010లో పూణె నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి కొంత కాలం ఉద్యోగాలు చేశారు. అయితే తామే ఒక కంపెనీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వీళ్లిద్దరీలో బలంగా ఉండేది. అప్పుడప్పుడే ఫేస్ బుక్‌ గేమ్స్ బాగా పాపులర్‌ అవుతున్నాయి. ఫార్మ్ విల్లే వంటి గేమ్స్ పొందుతున్న ప్రాచుర్యాన్ని చూసి నిత్యా టెక్నోసిస్ అనే సంస్థను ఇద్దరూ స్టార్ట్ చేశారు. గేమ్స్ ఫీల్డ్‌లో ఏదైనా చేయాలనే తపన వీళ్లిద్దరిలో బలంగా ఉండేది. కానీ స్టార్టప్స్‌కు అతి వర్కవుట్ అయ్యేది కాదని త్వరగానే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దృష్టి హార్డ్‌వేర్ వైపు మళ్లింది. ఆండ్రాయిడ్‌, టివిని కనెక్ట్ చేసే హార్ట్‌వేర్ తయారు చేయాలని ఆలోచించారు. అయితే అక్కడ కూడా నిలదొక్కుకోలేమని తెలిసొచ్చింది. ఈ మధ్యలో ఆర్థిక అవసరాలను తీరడానికి కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్‌ను చేసేవారు.

ఎయిర్‌స్ట్రీమ్ టీమ్

ఎయిర్‌స్ట్రీమ్ టీమ్


అయితే హార్డ్‌వేర్ తయారీ సమయంలో వాళ్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొన్ని సందర్భాల్లో పిసి నుంచి రిమోట్ యాక్సెస్ అవసరమయ్యేది. ఈ సమస్యను అధిగమించేందుకు పుట్టిందే ఎయిర్‌స్ట్రీమ్. దీన్ని ఓ ఫీచర్‌లా మార్చి.. ఇందులో ఉన్న వ్యాపారాన్ని పసిగట్టారు.

లక్షల్లో డౌన్‌లోడ్స్

జనవరి 2013లోనే ఎయిర్‌స్ట్రీమ్ మంచి వృద్ధిని కనబర్చింది. ఈ ఆలోచన జిఎస్ఎఫ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. దీంతో ప్రొడక్ట్ మెల్లిగా ఒక్కో దశ దాటుకుంటూ వచ్చింది. మొదటి ఏడాదిలోనే వివిధ ప్లాట్‌ఫార్మ్స్‌పై లక్షన్నరకు పైగా డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. ప్రస్తుతం ఎయిర్ స్టీమ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ వర్షన్ ఫోన్లపైన, విండోస్, మ్యాక్, లినక్స్ వర్షన్స్ ఉన్న డెస్క్‌టాప్‌పై పనిచేస్తోంది.


వివిధ వేదికలపై వీళ్లు చేసిన ప్రొడక్స్ ప్రెజంటేషన్‌తో ఇన్వెస్టర్లు తెగ ఇంప్రెస్ అయ్యారు. ఒన్ 97 మొబిలిటీ ఫండ్ - విజయ్ శేఖర్ శర్మ, ఇండియా మార్ట్ - దినేష్ అగర్వాల్, అనుపమ్ మిట్టల్, విస్పీ దవేర్‌ నుంచి కొద్ది మొత్తంలో నిధులు సమీకరించారు. ఈ మధ్యే రెండో రౌండ్‌ కూడా పూర్తైందని తెలిసినా ఎంత పెట్టుబడి, వాటా అనే విషయాలపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ కంపెనీకి విస్పీ దవేర్, కంచన్ కుమార్, సౌరవ్ రే.. బోర్డ్ అడ్వైజర్లుగా ఉన్నారు.

పూణే కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థలో పదికిపైగా ఉద్యోగులు ఉన్నారు. ''రెవెన్యూ మోడల్‌ విషయానికి వస్తే ఇది బేసిక్ ప్రొడక్ట్ యూజర్స్‌కు ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. కొన్ని ప్రీమియం ఫీచర్లను యాడ్ చేయడంతో పాటు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాం'' అంటారు జితిన్. ఇప్పటికైతే ఎయిర్ స్ట్రీమ్ మెరుగైన గుర్తింపునే సాధించింది. ఇప్పుడు ఎలా కన్సాలిడేట్ చేసి, కొత్త మార్కెట్లలోకి ఎలా దూసుకెళ్తారు అనేదే ఆలోచించాల్సిన విషయం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags