మీ పిల్లలు స్కూల్లో సరిగ్గా చదవడం లేదా... ? అయితే వాళ్లకు ఆన్ లైన్లో ప్రైవేటు కోచింగ్ ఇప్పించడమే ఉత్తమ పరిష్కారం అంటూ ఈ మధ్య కాలంలో ఓ రేడియో యాడ్ తెగ సందడి చేస్తోంది. డిజిటల్ ప్రపంచంలో ఆన్ లైన్లో వీడియో పాఠాలు చెప్పే వేదికల్లో ఇప్పుడు మరో సంస్థ నాణ్యమైన శిక్షణా సేవల్లో అద్భుతంగా రాణిస్తోంది. ఎడ్యూటెక్ రంగం భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్న పరిశ్రమ. నానాటికీ పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగంతో ఈ పరిశ్రమ ఏడాదికి 8 శాతం వృద్ధి రేటుతో పరుగులు తీస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో ట్యూటర్ విస్టా, విజ్ ఐక్యూ, కోర్సెరా, స్కిల్ అప్ ఇండియా, ఎడ్యురేకా వంటి పెద్ద సంస్థలు పాదుకొని ఉన్నాయి. వీటితో పాటు సీఏ కార్ట్ ఈ జాబితాలో కొత్తగా చోటు దక్కించుకుంది.
ఇప్పటి వరకూ ఈ రంగంలో ఉన్న సంప్రదాయ బిజినెస్ టూ బిజినెస్ విధానానికి స్వస్తి పలుకుతూ కొత్తగా బిజినెస్ టూ కస్టమర్ అనే కొత్త విధానంతో విజయం సాధించారు సుఫలాం వ్యవస్థాపకులు, సీఏ కార్ట్ సృష్టికర్త పూరూ మిశ్రా. ఈ సీఏ కార్ట్ చాలా ఆసక్తికరంగా మొదలైంది. 2011 నుంచి సుఫలాం దేశవ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థలకు ఈ లెర్నింగ్ టెక్నాలజీ అందిస్తూ వస్తోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని... సదరు వినియోగదారులు విద్యార్థులకు వీడియో కోర్సులు తయారు చేసి అమ్ముకునేవారు.
2013లో ముంబైలో ఒక పేరున్న పెద్ద విద్యా సంస్థ...సుఫలాం టెక్నాలజీని ఉపయోగించుకుని, అత్యుత్తమమైన ఫ్యాకల్టీతో అద్భుతమైన వీడియో కోర్సులను సిద్ధం చేసింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే... అది ఒక్క ప్రాడెక్ట్ కూడా అమ్ముకోలేకపోయింది. ఇందులో తప్పు ఎక్కడ జరిగిందో అని పురు ఒక్కసారి పరిశీలించినప్పుడు... అతనికి ఒక విషయం అర్థమైంది. ఆ సంస్థ బృంద సభ్యులు... ఈ కొత్త టెక్నాలజీ ప్రాడెక్ట్స్ వల్ల.. అప్పటికే ఉన్న తమ క్లాస్ రూం ప్రోగ్రామ్ వ్యాపారం మీద ప్రతికూలప్రభావం పడుతుందని భయపడ్డారు. దీంతో వాళ్లు కొన్నాళ్ల పాటు వేచి చూడాలని అనుకున్నారు.
ఇలా వాళ్ల సందిగ్ధతను అర్థం చేసుకున్న పురు వాళ్ల మిత్ర బృందం... ఓ విన్నూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. వాళ్లు ఈ కోర్సులను భారత దేశంలో ఉన్న విద్యార్థులకు అమ్మి, వచ్చిన ఆదాయంలో కొంత భాగం వాళ్లకు ఇస్తామన్న ప్రతిపాదనలు చేశారు. అప్పటికి ఆ సంస్థ ముంబైలో మాత్రమే విస్తరించి ఉండటంతో వాళ్ల ప్రతిపాదనలకు వెంటనే అంగీకరించి, వాళ్లకు ఆ వ్యాపార అవకాశం ఇచ్చింది. అలా సీఏకార్ట్ ఆవిర్భవించింది. మేం ఇలా ఆ సంస్థ ఉత్పత్తులను అమ్మడం మొదలు పెట్టిన తర్వాత.. అది చూసి మిగిలిన సంస్థలు కూడా మాతో వ్యాపార ఒప్పందాలు చేసుకున్నాయంటారు పురు.
సుఫలాంను ఉపయోగించుకుని, సీఏకార్ట్ బిజినెస్ టూ బిజినెస్ అన్న విధానం నుంచి బిజినెస్ టూ కస్టమర్ రంగంలోకి అడుగు పెట్టింది. దీనికోసం వాళ్లు కొంత మంది ఫ్యాకల్టీతో ఒప్పందాలు చేసుకుని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆన్ లైన్లో బిజినెస్ మొదలు పెట్టారు. ఈ బిజినెస్ టూ కస్టమర్ అనే విధానం పూర్తి భిన్నమైనది, దీంతో ఈ బృందానికి చాలా కాలం పాటు ఎన్నో కొత్త అనుభవాలు అవగతమయ్యాయి.
ఆలోచనలు నిజమైన వేళ
మాకు ఇంకా గుర్తుంది. మా సేల్స్ టీం తొలినాళ్లలో ప్రతీ సేల్ కోసం చాలా ఎక్కువ సమయం వెచ్చించేవారు. ఇది గతంలో మేం వినియోగించిన బీ టూ బీ విధానంలోని స్ప్రెడ్ షీట్ ఆధారిత కస్టమర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో అవసరమైన సమయం కన్నా ఎక్కువ. కానీ అదే విధానాలతో ఈ బీ టూ సీ మాధ్యమంలో కూడా మేం ముందుకెళ్లడం మాకు ఇబ్బందిగా, మా ప్రయత్నాలకు ఆటంకంగా కూడా ఉండేదంటారు పురు.
క్రమేపీ స్టూడెంట్స్ నుంచి మాకు కాల్స్ పెరుగుతున్నా..వాటిని నిర్వహించేంతగా మా టీం సిద్ధమవ్వలేదు. దీంతో వాళ్లు ఆ బీటూ బీ విధానాన్ని ఆపేసి, ఓ కొత్త విధానం మొదలు పెట్టాలని అనుకున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున వస్తున్న కాల్స్ ఎటెండ్ అవ్వడానికి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ల టీంను పెంచుకున్నారు. వారికి కూడా నైపుణ్యాల అభివృద్ది కోసం కొత్తగా కస్టమర్ సర్వీస్ ట్రైనింగ్ కూడా ఇప్పించారు. ఈ ప్రక్రియలతో కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించింది.
దీని తర్వాత వాళ్లకు ఎదురైన మరో అడ్డంకి... కస్టమర్లు వాళ్ల బ్రాండ్‌ను మిగిలిన వాటితో పోలిస్తే పెద్దగా విశ్వసించకపోవడం. తొలినాళ్లలో స్టూడెంట్స్ ఆన్ లైన్ కోర్సుల కోసం ఇందులో పెద్దగా ఆర్డర్లు చేసేవారు కాదు. క్యాష్ ఆన్ డెలివరీ అన్నది ఒక మంచి ఆప్షనే అయినా... కానీ మా ఆర్థిక పరిస్థితి, సంస్థ పెట్టుబడుల దృష్ట్యా అది మాకు పెద్దగా లాభాలను తెచ్చిపెట్టే విధానం కాదు. ఎందుకంటే మేం చాలా కింది స్థాయి నుంచి ఎదుగుతున్నాం. ప్రతి రూపాయి కూడా మాకు లెక్కే. అందుకే మేం కస్టమర్ల కాల్స్ మీద మరింత శ్రద్ధ వహించాలని అనుకున్నాం. ఇందుకోసం మొదటి 500 కాల్స్ స్వీకరించడంలో టాప్ మేనేజ్మెంట్ శ్రద్ధ వహించారు. ఇలా కస్టమర్లతో నేరుగా సంభాషించడం వల్ల, మేనేజ్మెంట్ కి వాళ్ల అవసరాలు బాగా అవగతమయ్యాయి. దీంతో మేం విద్యార్థులకు మరింత మెరుగైన సేవల్ని అందించడాకి వీలుపడింది. క్రమేమీ మా సేవల్ని నమ్మేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. స్టూడెంట్స్ మమ్మల్ని వారి స్నేహితులకు రిఫర్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది ఆర్డర్లు కూడా ప్లేస్ చేస్తూ వచ్చారంటారు పురు.
ఒక్కో మెట్టూ ఎక్కుతూ
సీఏకార్ట్ ప్రారంభించిన 18 నెలల్లో దాదాపు లక్షా 80 వేల మంది విద్యార్థులు ఈ సేవల్ని వినియోగించుకన్నారు. 110 కన్నా ఎక్కువ మంది టీచర్లు, వెయ్యికి పైగా ప్రాడెక్ట్ లు లభిస్తున్నాయి. ఇప్పుడు ఈ సీఏకార్ట్ ను పురు మిశ్రాతో పాటు నిట్ గోల్డ్ మెడలిస్ట్ సునీల్ జవాజీలు నడిపిస్తున్నారు. వాళ్లిద్దరూ ఇంతకు ముందు అగేరే సిస్టమ్స్, క్వాల్ కం ఇంటర్నేషనల్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఏఆర్ఎం, ఎస్ టీ మైక్రో ఎలక్ట్రానిక్స్ సంస్థ మాజీ ఉద్యోగి అరుణ్ కుమార్ లతో కలసి పనిచేశారు.
ఇప్పుడు ఆఫ్ లైన్లో లభిస్తున్న ఈ ఎడ్యుకేషన్ మెటీరియళ్లు చాలా అసంపూర్తిగా, కొద్ది పాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో వేర్వేరు టీచర్ల నుంచి సహాయం అవసరం అవుతుంది. అంతే కాదు వాళ్లు చాలా ఎక్కువ సంఖ్యలో పుస్తకాల్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. సంపూర్ణ విషయ పరిజ్ఞానం కోసం తరచుగా వాళ్లు తమ సీనియర్లు, స్నేహితులను సంప్రదించాల్సి ఉంటుంది. కొన్ని అంశాల్లో విద్యార్థులు తమ అవసరాలను పూర్తిగా నెరవేర్చుకునే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ వాటిని నేర్చుకునే ప్రయత్నం చేసినా వాటిలో పరిపూర్ణత సాధించడం కోసం వాళ్లు మరింత సమయం కష్టపడాలి. మరింత డబ్బును, శక్తిని ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ మార్కెట్లు కూడా ఆఫ్ లైన్ మార్కెట్ల మాదిరిగానే అసంపూర్తిగా ఉన్నాయి. ఈ సమస్య వివిధ రూపాల్లో పెరుగుతూ వస్తోంది.
ఈ సమస్యలన్నీ పరిష్కరించేలా .. సీఏకార్ట్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది కామర్స్ విద్యార్థుల పూర్తి స్థాయి అవసరాలను తీర్చేలా ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ వేదిక. ఇందులో విద్యార్థులకు వారి సిలబస్ కాలానుగుణంగా ప్రతి స్థాయిలోనూ అవసరమైన పాఠ్యాంశాలను ఈ సిబ్బంది పూర్తి స్థాయిలో అవగతం చేసుకుని అందిస్తున్నారు. ఇది వారికి సాధారణ పరీక్షా సమాచారంతో పాటు, నిపుణుల సలహాలు, మార్గదర్శకత్వం, పుస్తకాలు, ఈ కోర్స్ అసైన్మెంట్లు, సహచర విద్యార్థుల, నిపుణుల అభిప్రాయాలు, సందేహాల నివృత్తితో పాటు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగాల కల్పనకు కూడా సదుపాయలు కల్పిస్తోంది. విద్యార్థులు సీఏకార్ట్ నుంచి కోర్సులు, పుస్తకాలు కొనుగోలు చేసుకోవచ్చు. వీళ్లకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సదరు ఫ్యాకల్టీకి, ఇతర పబ్లిషర్లకు కూడా భాగమిస్తారు. విద్యార్థుల కెరియర్లో ప్రతి స్టేజ్ లోనూ మరిన్ని సేవలు అందించడంతో పాటు, చాలా అంశాల్లో రాణించేందుకు సహాయ పడతారు.
ఎంతో భవిష్యత్తున్న మార్కెట్
ఈ రోజుల్లో ఎడ్యుటెక్ .. మూడు బిలియన్ డాలర్ల మార్కెట్ కలిగి ఉంది. ఏటా కోటి నలభై లక్షల మంది విద్యార్థులు ఇందులో చేరుతున్నారు. ఇది ఏటా 18 శాతం వ్యాపార వృద్ధి రేటును కలిగి ఉంది. ఇప్పుడు ఇండియన్ ఆన్ లైన్ మార్కెట్లో మొదటి స్థానానికి చేరడం మీదే మా దృష్టంతా ఉంది. ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తున్న ఈ రంగంలో, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక విధానంలో మా సేవలన్నీ పూర్తిగా సమర్థమైనవని మాకు తెలుసు. అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం మా సేవల్ని చాలా తక్కువ స్థాయిలో, ఎక్కువ ప్రాంతాల్లో లేదా ఎక్కువ విద్యా రంగాల్లో విస్తరించాలని అనుకోవడం లేదని పురు... తమ భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పుకొచ్చారు.
- 1) భారత దేశంలో సుమారు 40 లక్షల మంది కామర్స్ విద్యార్థులతో సీఏకార్ట్ ఈ కామర్స్ విద్యా విధానంలో ఆన్ లైన్ టూల్స్ అందించే సంస్థల్లో దాదాపుగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
- 2) అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద స్థాయిలో ఫ్యాకల్టీతో ఒప్పందాలు కుదుర్చుకుని, ఈ ఎడ్యుకేషన్ ఫ్లాట్ ఫాం మీద విస్తృత స్థాయిలో కోర్సులు అందిస్తోంది.
- 3) విన్నూత్నమైన ఈ లెర్నింగ్ టూల్స్, ప్రాడెక్ట్లతో విద్యార్థులకు, టీచర్లకు సమర్థమైన, పరిపూర్ణమైన, బెస్ట్ అకడమిక్ సమాచారాన్ని అందిస్తాయి.
- 4) భారతదేశంలోని కామర్స్ ఎడ్యుకేషన్ మార్కెట్లో లీడర్ షిప్ స్థానాన్ని చేరుకున్న తర్వాత మిగిలిన విద్యా విధానాలు, రంగాల్లో విస్తరించాలని ఆలోచనలో ఉంది సీఏకార్ట్.