సంకలనాలు
Telugu

ఇంటర్నెట్ కేఫ్ నుంచి ఇంటర్నేషనల్ సంస్థలను ఢీకొట్టే స్థాయికి !

Poornavathi T
9th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఓ చిన్న భారతీయ కంపెనీ ప్రపంచ దిగ్గజాలతో పోటీపడితే ఆ థ్రిల్లేవేరు. అది కూడా ఓ ద్వితీయ శ్రేణి నగరం నుంచి ఆ కంపెనీ కార్యకలాపాలు నడుపుతుంటే.. ఇంకా మెచ్చుకుని తీరాల్సిందే ! పూణే లాంటి నగరంలో ఇద్దరితో మొదలైన కంపెనీ నాలుగేళ్ల కష్టంతో ఫ్రాస్ట్ అండ్ సులివన్, ఫారెస్టర్, గార్ట్‌నర్ లాంటి మహా మహా సంస్థలతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి ఎదిగింది. ఆశ్చర్యం ఏంటంటే.. "ఈ రోజు మేం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ రీసెర్చ్ సంస్థ. వాల్యూమ్స్, ప్రీమియం రీసెర్చ్ స్టడీస్ విభాగంలో మేం దూసుకుపోతున్నాం'' అంటారు మార్కెట్స్ అండ్ మార్కెట్స్ సిఈఓ, ఫౌండర్ సందీప్ సుగ్లా.

సందీప్ సుగ్లా, మార్కెట్స్ అండ్ మార్కెట్స్ సిఈఓ

సందీప్ సుగ్లా, మార్కెట్స్ అండ్ మార్కెట్స్ సిఈఓ


ఈ మార్కెట్ పరిశోధనా సంస్థ ప్రతీ ఏటా పది వివిధ రంగాలకు సంబంధించిన 400ల పూర్తిస్థాయి రీసెర్చ్ రిపోర్టులను తయారు చేస్తుంది. 2014 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్స్ అండ్ మార్కెట్స్ సంస్థ ఏడు మిలియన్ డాలర్ల EBITDA ప్రకటించింది. (EBITDA - వడ్డీలు, పన్నులు, డిప్రిసియేషన్, అమార్టైజేషన్‌ తీసేయకముందు వచ్చిన ఆదాయం)2015 ఆర్థిక ఏడాదిలో EBITDA 35 మిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు సందీప్ యువర్ స్టోరీకి వివరించారు.

క్లైంట్లు అందరూ ఫార్చ్యూన్ 500 కంపెనీలే !

8 రంగాల్లో ఉన్న వివిధ పెద్ద ప్రాజెక్ట్ విభాగాలు, భారీ వృద్ధికి అవకాశమున్న రంగాలు, కొద్దిమంది మాత్రమే సేవలు అందించే రంగాలపై మార్కెట్స్ అండ్ మార్కెట్స్ దృష్టి సారించింది. అందుకే అంతర్జాతీయ సంస్థలతో ధీటుగా పోటీపడ్తూ వారికి సమాధానం చెబ్తోంది.

ఇతర సంస్థలు పట్టించుకోని బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై స్పష్టమైన లక్ష్యంతో పనిచేయడం వల్ల కంపెనీ రెవెన్యూ పెరుగుతోంది. ఐబిఎం, సిస్కో, మైక్రోసాఫ్ట్, శాంసంగ్ వంటి ఫార్చ్యూన్ 500 కంపెనీలకు బిజినెస్ ఇంటెలిజెన్స్ పార్ట్‌నర్‌గా మార్కెట్స్ అండ్ మార్కెట్స్ వ్యవహరిస్తోంది.

''మా క్లైంట్లు కొత్త అప్లికేషన్స్ విషయంలో మమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తారు. కొత్త మార్కెట్లు, టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం మా బలం. అందుకే ఇప్పుడు పరిశోధనా విభాగంలో మా సంస్థది ఏకఛత్రాధిపత్యం''.

''ప్రస్తుతం ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఉన్న అధిక సంస్థలు మా క్లైంట్లే. వాళ్లే కాదు ప్రధమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్న ఐటి సంస్థలు కూడా మాతో పాటే ఉన్నారు''. 2010లో ఇద్దరితో మొదలై, 2013 నాటికి 260కి చేరుకుని, ఇప్పుడు 840 మంది ఉద్యోగులతో కంపెనీ ఏటికేడు దూసుకుపోతోంది.

image


క్లైంట్ల అభివృద్ధికి తోడ్పడితేనే తమ పరిశోధన సఫలమైందని ఎంఅండ్ఎం సంస్థ భావిస్తుంది. అందుకే వాళ్లు ఊహించినదానికంటే అధికంగా, వాళ్ల అంచనాలను మించి మా సేవలను అందిస్తామని చెబ్తుంది. RT వాల్డ్ వైడ్ పేరుతో 2014లో సర్వీస్ బేస్డ్ ప్లాట్‌ఫాంను కంపెనీ ప్రారంభించింది. అనుబంధ రంగాలకు సంబంధించిన సమచారమంతా రియల్ టైంలో కస్టమర్లకు అందుతుంది. ప్రపంచంలో ఏ ఒక్క కంపెనీ కూడా ఎకో సిస్టమ్‌నంతటినీ క్రమబద్ధీకరించి, ఒక వేదికపైకి తీసుకురాలేదని సందీప్ చెబ్తున్నారు.

ఉదాహరణకు. ఒక దేశంలోని తలసరి ఆదాయం పెరిగి ఆటోమొబైల్ తయారీ పెరిగిందని అనుకుందాం. దీంతో పాలిఅమైడ్ (ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ తయారీలో ఉపయోగిస్తారు) డిమాండ్‌ పెరుగుతుందని ఎంఅండ్ఎం ఎనలిస్టులు వెంటనే విశ్లేషించి సమాచారం పంపుతారు.

పరిశ్రమ పెద్దలతో మా ఎనలిస్టులు సంప్రదింపులు జరుపుతూ నిత్యం మార్కెట్లను పరిశీలిస్తూ ఉంటారు. ప్రత్యేక మార్కెట్లతో పాటు ఇతర పోటీదార్లకంటే భిన్నంగా మమ్మల్ని మేము స్థిరపరుచుకున్నామంటారు సందీప్.

సోలాపూర్‌ నుంచి మొదలు

సందీప్ వ్యాపార ప్రస్థానం మహారాష్ట్రలోని సోలాపూర్ అనే చిన్న పట్టణంలో ఓ ఇంటర్నెట్ కెఫెతో మొదలైంది. అతనికి ఉన్న పెద్ద పెద్ద ఆలోచనలతో ఆ కెఫెను మూసేసి పూణె వెళ్లి ఐబిఎన్ అనే కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ మార్కెట్ రీసెర్చ్‌తో పాటు వివిధ అసైన్‌మెంట్లను సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని చేసిపెట్టేది. కొన్ని ఔట్ సోర్సింగ్ ప్రాజెక్టులను కూడా చేపట్టేవారు. మెల్లిగా అది మార్కెట్స్ అండ్ మార్కెట్స్‌గా అభివృద్ధి చెందింది.

2013లో ఎంఅండ్ఎం సంస్థ స్టార్టప్స్ విభాగం నుంచి వచ్చిన టాప్ రిక్రూటర్‌ అయింది. ఐఐఎం - ఎ, ఐఐఎం-బి, ఐఐఎం-సి, ఐఐఎం-లక్నో, ఐఎస్‌బి, XLRI, FDI వంటి ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్ల నుంచి విద్యార్థులను రిక్రూట్ చేసుకుంది. ఎంఅండ్ఎంలో చేరిన వాళ్లలో మెకిన్సీ, యూబిఎస్, ఐడిసి, ఇన్ఫోసిస్ వంటి సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. వీళ్లలో ఛార్టెడ్ అకౌంటెంట్లు, పిహెచ్‌డిలు, ఎంబిఏ చేసిన వాళ్లతో సంస్థ బలం మరింత పెరిగింది. వివిధ విభాగాలు, రంగాల నుంచి ఉద్యోగులు రావడం వల్ల సంస్థ రీసెర్చ్ టీమ్ చాలా స్ట్రాంగ్ అయింది.

ప్రపంచంలోని టాప్ కంపెనీలు ఎంఅండ్ఎంతో చేతులు కలిపేందుకు... వీళ్ల పరిశోధన, టెక్నాలజీ, కొత్త అప్లికేషన్సే కారణం. అయితే మన దేశంలో వీళ్ల గురించి తెలిసిన వాళ్ల సంఖ్య బాగా తక్కువే. గతేడాది ఉద్యోగులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి కూడా యాజమాన్యం తెగ ఇబ్బందిపడేది. ఇప్పుడు మాత్రం ఇదే రంగంలో ఉన్న ఇతర కంపెనీలకు తీసిపోనంత స్థాయికి చేరామని యువర్ స్టోరీతో గర్వంగా చెప్తారు సందీప్.

డాలర్లలో చూడండి.. డాలర్లలోనే చెప్పండి

ఎంఅండ్ఎంలో పని సంస్కృతికి పెద్ద పీట వేస్తారు. ''ప్రతీ ఉద్యోగినీ ఓ మల్టీబిలియన్ డాలర్ సంస్థను నడుపుతున్న సిఈఓలా తీర్చిదిద్దుతామంటారు'' సందీప్. ప్రతీ ఉద్యోగికీ ఫార్చ్యూన్ 500 సంస్థల డైరెక్టర్లు, సిఎక్స్‌ఓలతో కలిసి పనిచేసి వాళ్లకు సలహాలు ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది. వాళ్లు చేసే పని మా క్లైంట్ల ఆదాయం పెరగడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. ''మా దగ్గర ప్రతీ ఉద్యోగీ డాలర్లలోనే చూడాలి, డాలర్లలోనే చెప్పాలి'', ఆ విధంగా మా శిక్షణ ఉంటుంది. ఆ విధానమే మా బిజినెస్‌ను సూచిస్తుందని వివరిస్తారు సందీప్.

ప్రపంచ వ్యాప్తంగా బి2బి ఇన్ఫర్మేషన్ మార్కెట్ సర్వీసుల వాటా 200 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. ''ఆదాయ మార్గాలు, డబ్బులు కుమ్మరించే విభాగాలను మేం ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాం. దాని వల్ల మా క్లైంట్లుగా ఉన్న కంపెనీలకు మెల్లిగా ఆదాయమూ వృద్ధి చెందుతుంది''. మాకు అధికంగా రెవెన్యూ నార్త్ అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఏషియా పసిఫిక్ దేశాల నుంచే వస్తుంది.

''వృద్ధి చెందుతున్న వివిధ విభాగాలను గుర్తించి, వాటి నుంచి ఆదాయాన్ని రాబట్టేందుకు చూస్తాం. కన్సల్టింగ్ విభాగంలో RTపేరుతో అత్యున్నత వేదికను ఏర్పాటు చేశాం. గ్లోబల్ కాన్ఫరెన్సుల ద్వారా మా క్లైంట్లతో ఉండే బంధం ధృడపడి మరింత ఉన్నత స్థాయికి చేరుతుంది. రీసెర్చ్ ద్వారానే మాకు 90 శాతం ఆదాయం సమకూరుతుంది. అంతే కాదు మా నుంచి అందే సేవల ద్వారా మా క్లైంట్లు కూడా అదే స్థాయిలో లబ్ధి పొందేందుకు చూస్తూ ఉంటారు''.

ఎవరూ సేవలు అందించని విభాగాలను గుర్తించండి, వాళ్ల అవసరాలు తీర్చిండి. అదే విజయానికి సూత్రం. సింపుల్‌గా ఇదే ఫార్ములాను ఫాలో అయి విజయం సాధించారు సందీప్.

మీ విజయానికి సూత్రం ఏంటి ? కామెంట్ల రూపంతో మాతో పంచుకోండి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags