సంకలనాలు
Telugu

ప్రాణం పోసే శ్వాసకు జీవం ఇస్తున్న 'ఆన్‌మాస్క్'

శ్వాసించే గాలిని శుభ్రం చేసే హైద్రాబాద్ కంపెనీ కాలుష్యంపై అవగాహన పెంచే కేంపెయిన్‌లుస్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం కల్పిస్తున్న 'ఆన్‌మాస్క్'యూజ్ & త్రో కాకుండా వాష్ & రీయూజ్ మాస్కుల విక్రయం

Krishnamohan Tangirala
7th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సత్య కృష్ణ గన్ని... ఆన్ మాస్క్ వ్యవస్థాపకులు. హైద్రాబాద్ జెఎన్‌టియు నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్‌ నుంచి మెకానికల్, కంప్యూటర్ సైన్స్.., రెండు రంగాల్లోనూ ఎంఎస్ పూర్తి చేసారు సత్య కృష్ణ. భారత్‌లో పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న ఈ పరిస్థితుల్లో ఈయన మళ్లీ సొంత దేశంలో అడుగుపెట్టారు. ఈ పొల్యూషన్‌కి ఓ పరిష్కారం కనుక్కోవాలనుకునే ఆలోచన నుంచి పుట్టినదే "ఆన్‌ మాస్క్".

మార్ట్‌మొబి ప్రారంభించినది కూడా సత్యనే. కొంత మంది స్నేహితులను తన కంపెనీలో కార్యకలాపాలకు ఒప్పించగలిగారు ఈయన. వారిలో ఒకరు డా. అరుణ్ కుమార్ ఇట్టా, ఈయన కో-ఫౌండర్ కం సీటీఓ. అమెరికాలోని జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పోస్ట్ డాక్టరల్ కేండిడేట్. కెమికల్ ఇంజినీరింగ్‌లో పరిశోధనలు చేయడం అరుణ్‌కు ప్యాషన్. గాలి కాలుష్యం.. ప్రత్యేకించి మెంబ్రేన్ టెక్నాలజీ, దాన్ని ఉపయోగించే విధానాలపై ఉన్న అవగాహన.. సత్య ఆలోచనలతో అరుణ్ కలిసేందుకు సహకరించాయి.

2012 సెప్టెంబర్‌లో హైద్రాబాద్‌లో ఆన్‌ మాస్క్ ప్రారంభమైంది. మొదట్లో దీనికి వ్యవస్థాపకుల్లో ఒకరు నిధులు సమకూర్చారు. 2013 సెప్టెంబర్‌లో షెఫాలీ శ్రీమలి సీఈఓగా జాయిన్ అయ్యారు. తర్వాత ఆమె కంపెనీలో కొంత భాగస్వామి కూడా అయ్యారు. ఐఐటీ-ఢిల్లీ, స్పెయిన్‌లోని ఐఈఎస్ఈ బిజినెస్ స్కూల్ నుంచి పట్టాలు పొందారు షెఫాలి. తాను ఏదైనా సొంతగా వెంచర్ ప్రారంభించాలి, సాధించాలి అనుకుంటున్నపుడు సత్యతో పరిచయమైంది ఆమెకు.

గాలి కాలుష్యం నుంచి తగిన రక్షణ కల్పించడంపై ఆన్‌మాస్క్ ప్రధానంగా దృష్టి నిలిపింది. మనం పీల్చుతున్న గాలిలో దిగజారుతున్న పరిస్థితులపై... నిజానికి మనకో అవగాహన ఉండాలి. కానీ అలా జరగడం లేదు. పీల్చేగాలిలో నాణ్యమైనదిగా ఉండేందుకు యాంటీ పొల్యూషన్ మాస్కులను తయారు చేస్తోంది ఆన్‌మాస్క్. ఇవి ఉతికి, మళ్లీ ఉపయోగించుకోడానికి వీలుగా ఉండడం విశేషం.

ఇదే ఆన్‌మాస్క్ అందించే యాంటీ పొల్యూషన్ మాస్క్

ఇదే ఆన్‌మాస్క్ అందించే యాంటీ పొల్యూషన్ మాస్క్


ఇక్కడ కనిపిస్తున్నది సాధారణ మాస్కులు కావు. తీవ్ర పరిశోధనల అనంతరం స్వచ్ఛమైన గాలి మన శ్వాసనాడులకు అందించేలా ఖచ్చితమైన నాణ్యతతో తయారు చేశారు వీటిని. పైలట్ ప్రాజెక్టుగా మాస్క్‌లు అందించిన తర్వాత... ఉపయోగించినవారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని... తగిన మార్పులు చేసి మరింత అభివృద్ధి చేశారు.

ప్రస్తుతం ఆన్‌మాస్క్ బీ2సీ(బిజినెస్ టూ కన్జూమర్) విధానంలో వ్యాపారం చేస్తోంది. ఆన్‌లైన్‌లో ఈ కామర్స్ పోర్టల్స్ ద్వారా విక్రయాలు చేస్తోంది. అలాగే స్టాల్స్, కేంపెయిన్స్ ద్వారా ఆఫ్‌లైన్ సేల్స్ కూడా జరుపుతోంది ఆన్‌మాస్క్.

“ఇప్పటివరకూ ఎలాంటి పెయిడ్ ఆన్‌లైన్ మార్కెటింగ్ చేయలేదు మేం. ఆఫ్‌లైన్ విక్రయాల్లో హైద్రాబాద్ మార్కెట్‌పై దృష్టి పెట్టాం. వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, వారిలో చైతన్యం పెంచేందుకు కేంపెయిన్స్ కూడా నిర్వహిస్తున్నాం. అలాగే మా ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ఆప్షన్లను కూడా పెంచబోతున్నాం. ఇక్కడ సక్సెస్ అయ్యాక ఇదే విధానాన్ని ఇతర నగరాల్లోనూ అమలు చేస్తాం. అసలు మా ప్రొడక్ట్ గురించి ఎంతమందికి తెలుసు ? అందులో ఎంతమందికి కొనుగోలు చేసే ఉద్దేశ్యం ఉంది ? ఎంతమంది ఇప్పటికే కొన్నారు ? కొనుగోలు చేయడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా ? మళ్లీ కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నది ఎంతమంది ? అనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం” అంటున్నారు షెఫాలీ.

ప్రస్తుతానికి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన మెట్రో సిటీలపై దృష్టి పెట్టినా... భవిష్యత్తులో అధిక కాలుష్య స్థాయిలున్న ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించే యోచనలో ఉంది ఆన్‌మాస్క్.

“అత్యుత్తమ నాణ్యత కలిగిన మాస్కులను అందించడంతో పాటు.. పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తులనూ అందిస్తున్నాం. ఆయా ఇండస్ట్రీల్లో ఉంటే కాలుష్య కారకాలు, స్థాయిలను అనుసరించి ప్రత్యేకంగా వారికోసం డిజైన్ చేసిన మాస్కులు అందిస్తున్నాం. వర్కర్ల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడంలో భాగంగా... మా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అనేక పరిశ్రమలు ముందుకొస్తున్నాయ”ని చెబ్తున్నారు షెఫాలీ.

శ్వాస సంబంధిత ఉత్పత్తులు అందించే కంపెనీ కావడంతో... సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి ఆన్‌మాస్క్‌కి. “ఈ మాస్క్ కొనుగోలుకు సంబంధించి మానసిక అడ్డంకులు ఉన్నాయి. చాలా మంది ప్రజలు తాము చూస్తున్నది నిజమే అనుకుంటారు. తాము పీలుస్తున్న గాలి స్వచ్ఛమైనదే అని భావిస్తున్నారు. వారికి వాతావరణంలో దుమ్ము కనిపిస్తుంటే... దాన్ని ఎదుర్కోడానికి ముక్కుకో కర్చీఫ్ కడితే చాలని అనుకుంటున్నారు. ఓ హెల్మెట్ ధరిస్తే పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ లభించినట్లే అని భావిస్తున్నారు” అంటున్నారు షెఫాలీ.

image


ఈవెంట్లు, ఎగ్జిబిషన్లలో ప్రచారం నిర్వహించడం ద్వారా తామూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నామంటున్నారు ఆన్‌మాస్క్ ప్రతినిధులు. నాంపల్లి గ్రౌండ్స్‌లో ఆస్తమా మెడిసిన్ ఇచ్చే సమయంలో జరిగిన ఇలాంటి ఒక సంఘటనను వివరించారు షెఫాలీ. “ గ్రామీణ ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో ఉండేవారు... గాలి, పొగాకు కారణంగా ఏర్పడే పొగ, గృహాల్లో వంట చేసే సమయంలో వచ్చే పొగ కారణంగా పడుతున్న ఇబ్బందులు ఆస్తమాను మించి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోనూ ఈ తరహా మాస్కులు తెచ్చి విక్రయిస్తే... తమతోపాటు తమలా ఇబ్బందులు పడతున్నవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని గ్రామీణులు మమ్మల్ని కోరారు”.

త్వరలో మరిన్ని రకాల ప్రోడక్టులతో పోర్ట్‌ఫోలియోను విస్తరించుకోబోతోంది ఆన్‌మాస్క్. అలాగే కస్టమర్ల అవసరాలకు అనుగుణంగానూ మాస్కులు తయారు చేయబోతున్నారు. హైద్రాబాద్ తర్వాత బెంగళూరులో తమ కార్యకలాపాలు ప్రారంభించబోతోంది ఆన్‌మాస్క్.

ఆన్‌మాస్క్ గురించి మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి : OnMask

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags