సంకలనాలు
Telugu

బ్యూటీ సెక్టారుకే మేకప్ వేస్తున్నారు !!

Sri
17th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అందమే ఆనందం... ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ రెండు స్లోగన్స్ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటి జనం. ఓ లెక్క ప్రకారం భారతదేశంలో అందం, ఆరోగ్య రంగాల మార్కెట్ 4.8 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇక్కడితో ఆగిపోలేదు. మార్కెట్ ఇంకా పెరుగుతోంది. ఇలాంటి రంగంలో సరికొత్త స్టార్టప్ గుర్గావ్ కు చెందిన ది మేకోవర్స్. భారతదేశంలో బ్యూటీ అండ్ వెల్ నెస్ సెక్టార్ కు మెరుగులు దిద్దుతోంది ఈ సంస్థ.

ఒక్క క్లిక్ తో కంప్లీట్ మాచారం

ఈ ఏరియాలో ఏ స్పాకు వెళ్లాలి ? సరైన సేవలు అందిస్తున్న సెలూన్ ఎక్కడుంది? బ్యూటీ ట్రీట్ మెంట్ ఎక్కడ బాగుంటుంది? ఏదో ఒక టైమ్ లో ఇలాంటి సందేహాలు మనకూ వచ్చి ఉంటాయి. అయితే ఈ సందేహాలు తీర్చుకునేందుకు తెలిసినవాళ్లనీ, తరచూ వెళ్లేవాళ్లని అడిగి తెలుసుకుంటారు చాలామంది. మిగతావారి అనుభవాలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకుంటారు. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇలాంటి సమస్యలు తీరిపోయాయి. ఎక్కడ ఏ సెలూన్ ఎలాంటి సేవలు అందిస్తుందో ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు. కస్టమర్లకు సరిగ్గా ఇలాంటి సేవలే అందిస్తోంది ది మేకోవర్స్. సెలూన్, స్పా, మేకప్ ఆర్టిస్ట్, స్కిన్ సెంటర్స్, జిమ్స్, ఫిట్ నెస్ స్టూడియోస్, పర్సనల్ ట్రైనర్స్, డైటీషియన్స్... ఇలా అందం, ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్ లో సేవలందిస్తోంది ది మేకోవర్స్. బుకింగ్ సర్వీసెస్ తో పాటు అందం, ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కస్టమర్లకు అందిస్తోంది. వారి అభిప్రాయాలు తెలుసుకుంటోంది. వాటి ద్వారా క్లైంట్లకు రేటింగ్స్, ఫీడ్ బ్యాక్ ఇస్తోంది.

కమల్ గులాటీ

కమల్ గులాటీ


టీమ్ @ ది మేకోవర్స్

మార్చి 2014లో ది మేకోవర్స్ ని ప్రారంభించారు కమల్ గులాటీ. మొదట్లో పార్ట్ టైమర్స్ తో స్టార్టప్ ని నడిపించారు. సమాచార సేకరణ కోసమే కొన్ని నెలలు కృషి చేశారు. స్టార్టప్ కి పటిష్టమైన పునాది వేసిన తర్వాత ఫుల్ టైమ్ ఉద్యోగులతో జనవరి 2015లో ఆఫీసును తెరిచారు. ఫౌండర్ గా, డైరెక్టర్ గా కమల్ కీలకంగా వ్యవహరించారు. దీర్ఘకాలిక వ్యూహంతోనే బరిలోకి దిగారు. తక్కువ సిబ్బంది, పరిమితమైన ఆర్థిక వనరులతో స్టార్టప్ కి రిబ్బన్ కట్ చేశారు. కేవలం పది మంది ఫుల్ టైమ్ ఉద్యోగులతో ప్రారంభమైన ఈ స్టార్టప్ లో వ్యాపారానికి సంబంధించిన అన్ని విభాగాలను కవర్ చేసే ఉద్యోగులు ఉండటం విశేషం. అంబుజ్ రావత్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మేనేజర్. క్లైంట్ల కోసం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్ అమలు చేసే బాధ్యత అతనిది. నితికా బావా క్లైంట్ రిలేషన్ షిప్ మేనేజర్. వ్యాపారులకు, కంపెనీకి మధ్య వ్యవహారాలు, కొత్త క్లైంట్లను చేర్చుకోవడం, ఇప్పుడున్న క్లైంట్ల డాటా అప్ డేట్ చెయ్యడం లాంటి బాధ్యతలు చూసుకుంటారు. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటీవ్ గా కుల్దీప్ కైర్ ఉన్నారు. ప్రస్తుత, భవిష్యత్తు కస్టమర్లతో నేరుగా మాట్లాడుతుంటారు. వారి అవసరాలకు తగ్గట్టుగా స్టార్టప్ ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు.

టీమ్ @ ది మేకోవర్స్

టీమ్ @ ది మేకోవర్స్


సోషల్ మీడియాపైనే ఆధారం

వేర్వేరు మార్గాల ద్వారా క్లైంట్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది ది మేకోవర్స్. వీరికి ఓ బ్లాగ్ కూడా ఉంది. బ్యూటీ, ఫిట్ నెస్ కు సంబంధించిన సమాచారం, కథనాలతో నిత్యం బ్లాగ్ ను అప్ డేట్ చేస్తున్నారు. ఈ బ్లాగ్ ను తాన్యా శర్మ చూసుకుంటారు. ఇక సర్వీసులకు సంబంధించిన అంశాలు, సమాచార సేకరణ కోసం అంకుర్ సోనితో పాటు మరో ముగ్గురు కొత్త ఉద్యోగులు నిత్యం అన్నీ వెబ్ సైట్స్ చెక్ చేస్తుంటారు. ప్రస్తుతం సెలూన్లు, స్పాలు డిమాండ్ కేటగిరీలో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. వీటి గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. మాట్లాడుకుంటున్నారు. ది మేకోవర్స్ సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతోంది. మౌఖిక ప్రచారం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా కస్టమర్లను చేరుకుంటోంది. వారికి వస్తున్న సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పేందుకు ఓ కాంటాక్ట్ నెంబర్, ఛాట్ ప్లగిన్ ఉన్నాయి. క్లైంట్ల నుంచి పెయిడ్, ప్రీమియమ్ లిస్టింగ్స్ ద్వారా ఆదాయం వస్తోంది. పేయుమనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

"జనవరి 2015లో ది మేకోవర్స్ కు ప్రతీ రోజూ సగటున 80 మంది యూజర్లు ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ సంఖ్య ప్రతీ రోజు ఐదు వందలకు పెరిగింది. మా ద్వారా రోజుకు కనీసం వంద వరకు యూజర్ బుకింగ్ అపాయింట్ మెంట్స్ ఉంటున్నాయి. కస్టమర్ల బ్యూటీ అండ్ ఫిట్ నెస్ అవసరాల విషయంలో మేం గూగుల్ స్థాయికి ఎదగాలన్నది మా టార్గెట్" అంటారు కమల్.
image


బ్యూటీ అండ్ వెల్ నెస్ సెక్టార్

తలసరి ఆదాయం పెరుగుతున్న కొద్దీ... తీవ్రమైన ఒత్తిళ్లతో జీవితం గడుపుతున్న కొద్దీ... బ్యూటీ, వెల్ నెస్ సెక్టార్ లో వృద్ధి కనిపిస్తూనే ఉంటుందన్నది మార్కెట్ నిపుణుల అంచనా. వేర్వేరు పట్టణాలకు తరచూ పర్యటించేవాళ్లకు ఇలాంటి వెబ్ సైట్స్ సాయపడుతున్నాయి. ఈ స్టార్టప్స్ కి ప్రోత్సాహమూ లభిస్తోంది. బ్యూటీ అండ్ గ్రూమింగ్ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ Purplle కు జనవరి 2015లో IvyCap Ventures ద్వారా ఐదు మిలియన్ డాలర్ల సిరీస్ ఏ ఫండింగ్ లభించింది. మరోవైపు Nykka కు ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి 3.4 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. Vyomo స్టార్టప్ మొబైల్ యాప్ తయారీకి YouWeCan ventures సాయం చేస్తోంది. VanityCube, Bulbul, Play n live, BigStylist లాంటి సంస్థలతో ది మేకోవర్స్ పోటీ పడుతోంది.

భవిష్యత్ ప్రణాళికలు

మరిన్ని సేవలను అందించే ఆలోచనలో ఉంది ది మేకోవర్స్. కస్టమర్ల కోరిక మేరకు ఇంటికి వచ్చి హెయిర్ కట్ అందించాలనుకుంటోంది. వీరికి 70 శాతం వెబ్ సైట్ ద్వారా బుకింగ్స్ జరిగితే, 30 శాతం మొబైల్ వెబ్ సైట్ ద్వారా జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలోగా మొబైల్ యాప్ తీసుకురావాలనుకుంటున్నారు. దేశంలో ప్రధాన నగరాలకు విస్తరించాలన్న ఆలోచనలో ఉంది ది మేకోవర్స్. అందుకు తగ్గట్టుగా నిధుల కోసం వేట మొదలుపెట్టింది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags