సంకలనాలు
Telugu

మహిళల సమస్యలు దూరం చేసే టాయిలెట్ ఫైండర్లు

సమీపంలో ఎక్కడున్నాయో తెలిపే యాప్‌లు

18th Oct 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

పురుషులతో పోటీగా మహిళలు కూడా ఉద్యోగాల్లో పోటీ పడుతున్నారు. అన్ని సంస్థల్లోనూ మహిళల సంఖ్య రాను రాను పెరిగిపోతోంది. కానీ మహిళలకే ప్రత్యేకమైన కొన్ని సమస్యలకు పరిష్కారం మాత్రం ఇంకా దొరకడం లేదు. అందులో ముఖ్యమైనది టాయిలెట్స్ లేకపోవడం. ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి మహిళా మరుగుదొడ్ల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. శుభ్రమైన టాయిలెట్లు ఎక్కడ ఉంటాయో తెలియక, ఇంటికి వచ్చే వరకు తమ సమస్యను అలా కడుపులోనే దాచుకుని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు టాయిలెట్ ఫౌండర్ యాప్స్ వచ్చేశాయిప్పుడు.

బయటకు చెప్పుకోలేని ఈ సమస్య దేశంలో చాలామంది మహిళలు రోజూ ఎదుర్కొంటున్నారు. కానీ వారిలో చాలా తక్కువమందికి మాత్రమే ప్రత్యామ్నాయాలున్న విషయం తెలియదు. మహిళల ఆరోగ్యం, కేర్ ప్రాడక్ట్స్ తయారీ సంస్థ పీబడ్డీ. ఈ సంస్థ కూడా ఇటీవలే ఓ యాప్ ను ఆవిష్కరించింది. ఆ యాప్ ను గూగుల్ ప్లే ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇమేజ్ కర్టసీ గెట్టీ ఇమేజెస్

ఇమేజ్ కర్టసీ గెట్టీ ఇమేజెస్


‘‘టాయిలెట్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా పీ బడ్డీని విడుదల చేశాం. అయితే ఆ డిస్పోజబుల్ పేపర్ ప్రోడక్ట్ వాడుకునేందుకు టాయిలెట్లు ఎక్కడున్నాయి. అందుకే సమీపంలోని టాయిలెట్ల వివరాలను తెలియజేసేందుకు మేం ఓ యాప్ ను ఆవిష్కరించాం’’ అని పీ బడ్డీ ఫౌండర్ దీప్ బజాజ్ తెలిపారు.

రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలియజేసే వేదికల్లానే ఈ టాయిలెట్ ఫౌండర్ యాప్ కూడా పనిచేస్తుంది. ప్రజలకు తెలియని వివరాలను కూడా ఈ యాప్ వివరిస్తుంది.

ఈ యాప్ శౌచాలయాల్లో ఉండే సౌకర్యాలు, వాటిని ఉచితంగా వాడుకోవచ్చా లేక పెయిడ్ టాయిలెట్సా? ఆ వివరాలను కూడా అందజేస్తుంది. సమీపంలో ఉన్న వాటి వివరాలను జిపిఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇలాంటి టాయిలెట్ ఫైండర్ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్ లో అనేకం ఉన్నాయి. మూత్రాలయ, ఫ్లష్, స్వచ్ఛ్ భారత్ టాయిలెట్ లొకేటర్, గొట్టాగో, టాయిలెట్ ఫస్ట్, సుసువిధ వంటి యాప్‌లు ఈ వివరాలను అందిస్తున్నాయి.

మహిళల భద్రత కోసం రూపొందించిన నిర్భయ యాప్ నిర్వాహకులే ఓ టాయిలెట్ ఫైండర్ యాప్ ను కూడా రూపొందించారు. పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో ప్రజా టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో ఈ యాప్ ల ద్వారా ప్రజలకు సమాచారం ఇస్తున్నారు. ఈ సమాచారం మహిళలకు ప్రాథమిక అవసరమని భావిస్తున్నారు.

‘‘ప్రస్తుతం చాలామంది మహిళలు తమ ఉద్యోగ నిర్వహణలో భాగంగా పట్టణాలను విడిచి గ్రామాలకు వెళ్లాల్సి వస్తున్నది. అలాంటి వారికి ఈ సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పనిచేస్తున్న అన్ని టాయిలెట్ల వివరాలను మేం సేకరించాం. మా యాప్‌లలో మ్యాప్ లతోపాటు సమాచారాన్ని కూడా అందజేస్తున్నాం’’ అని స్మార్ట్ క్లౌడ్ ఇన్ఫోటెక్ సీఈవో గజానన్ సఖారే ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

దేశంలో ఉన్న అతి పెద్ద సమస్యల్లో టాయిలెట్లు లేకపోవడం కూడా ఒకటి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్-ఎన్ ఎస్ ఎస్ ఓ) 2012లో నిర్వహించిన సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 32 శాతం మందికి మాత్రమే సొంత మరుగుదొడ్లు ఉన్నాయి. మరో తొమ్మిది శాతం మంది తమ ఇంటి బయట ఉన్న టాయిలెట్లను ఉపయోగిస్తున్నారు.

వీటి నిర్మాణంపై కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దేశంలో వంద మిలియన్ కొత్త శౌచాలయాలు త్వరలోనే నిర్మించనున్నట్టు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ప్రకటించారు. అసలు సమస్య ఏమిటంటే వాటి నిర్వహణే. ప్రస్తుతం ఉన్న వాటి నిర్వహణ ఇప్పుడు సమస్య.

‘‘ప్రస్తుతం ఉన్న అన్ని టాయిలెట్లు శుభ్రంగా ఉండాలన్నదే మా ఆశయం. పబ్లిక్ ప్లేస్ ఓనర్లు టాయిలెట్ల గురించి పట్టించుకోవడం లేదు. దీంతో కిందిస్థాయిలో టాయిలెట్ల నిర్వహణపై పర్యవేక్షణ తక్కువగా ఉంది. మా యాప్ ల ద్వారా టాయిలెట్ల నిర్వహణపై ప్రజలు ఏమంటున్నారో వారు తెలుసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా నిర్వహణ బాధ్యతలు అప్పగించొచ్చు’’ అని దీప్ చెప్పారు.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, పట్టణాల్లో టాయిలెట్ల నిర్వహణ, వాటి సంఖ్య కాస్త గొప్పగానే ఉంది. సాధారణ ప్రజలు వాడుకునేందుకు కేఫ్ లు, పెట్రోల్ పంపులు, కేఎఫ్‌సీ, మెక్ డొనాల్డ్ వంటి పెద్ద రెస్టారెంట్లలో టాయిలెట్లు ఉన్నాయి. అయితే వాటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటం మరింత అవసరం.

గుర్తించేందుకు వీలుగా ఉన్న ప్రజా టాయిలెట్ల వివరాలను యాప్‌లు అందజేస్తున్నాయి. అయితే యాప్‌లు మరింత చక్కగా పనిచేసి, సాధారణ ప్రజలు ఉపయోగించుకునేందుకు వీలున్న వాటన్నింటి వివరాలను అందించాలి.

ఉదాహరణకు పీబడ్డీ బృందం ముంబైలో ప్రజా టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించుందుకు 12 మంది వాలంటీర్లను నియమించింది. వారు తెలుసుకున్న సమాచారాన్ని యాప్‌లో పొందుపరుస్తోంది. సమాజ సేవలో భాగంగా టాయిలెట్లను నిర్వహించాలని కార్పొరేట్లు, పెట్రోల్ పంపుల నిర్వాహకులను కోరే ఆలోచనలో ఉన్నదీ స్టార్టప్ కంపెనీ.

‘‘టాయిలెట్లను క్లీన్ గా ఉంచడంపై వారు దృష్టిసారిస్తే, తమ టాయిలెట్లను టాయిలెట్ ఫైండర్స్ యాప్ లలో చేర్చేందుకు ఎలాంటి శ్రమ పడక్కర్లేదు’’ అని దీప్ తెలిపారు.
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags