సంకలనాలు
Telugu

ఈ 'సత్సంగం'లో పాల్గొంటే మీ బిజినెస్ సక్సెస్ అయినట్టే !

కంపెనీ ఎదుగుదలకు సలహాలిచ్చే ఈ2ఈ సంస్థఒంటరిగా ఉన్నా.. ఆశయాన్ని వీడొద్దంటున్న యశస్వినీఅపజయానికి కాదు.. విజయానికే భయపడాలంటూ స్ఫూర్తివ్యాపారంలో మొండితనం కావాలంటున్న సత్సంగ్

CLN RAJU
22nd Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సత్సంగ్ స్థాపన వెనక యశస్వినీ రామస్వామి ఆలోచన వుంది. ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థగా, 15 మంది అనుభవజ్ఞులైన నిపుణుల బృందం పనిచేస్తోంది. ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూత అందించేందుకు, వాళ్లకు మార్గ నిర్దేశం చేసేందుకు, అవసరమైతే కంపెనీ వెన్నంటి వుండి కొత్త ఇండస్ట్రీని పైకి తెచ్చేందుకు ఏర్పాటైన సంస్థ. ఒకవేళ వ్యాపారంలో విజయం సాధించలేకపోయినట్లయితే.. కనీసం ఆ పారిశ్రామికవేత్తకు సలహాలిచ్చి వేరే దిశగా వెళ్లమని దారి చూపుతారు. 2012 లో ఫార్చ్యూన్ /యూఎస్ అంతర్జాతీయ మహిళల మార్గనిర్దేశక శాఖ భాగస్వామ్యాన్ని ఎంచుకుంది. భారత దేశంలో మహిళలు నాయకత్వ, వ్యాపార వేత్తలుగా ఎదగాలని ప్రచారం చేసే ఆ బాధ్యతల్ని యశస్వినికి అప్పగించింది.

(ఫోటోలో యశస్వినీ రామస్వామి, e2e కంపెనీ వ్యవస్థాపకురాలు )

(ఫోటోలో యశస్వినీ రామస్వామి, e2e కంపెనీ వ్యవస్థాపకురాలు )


ఈ2ఈ(e2e) పేరుతో కంపెనీని స్థాపించి బెంగళూరు కేంద్రంగా కార్యకలాపలను సాగిస్తున్నారు యశస్వినీ రామస్వామి.

ఇన్ఫోసిస్ బిపిఓలో మేనేజ్మెంట్ కన్సల్టంట్‌గా యశస్వినీ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆడిటింగ్ సహా పలు రంగాల్లో పనిచేసిన అనుభవం ఆమెకుంది. నాయకత్వ శిక్షణ, మధ్యవర్తిత్వం, నైపుణ్యాభివృద్ధి, ద్వారా సంస్థలకు పెట్టుబడులను తిరిగి వచ్చేలా చేయడం... వ్యాపార ప్రదర్శనలో పట్టును సాధించే ప్రాంతాలను గుర్తించడం... ఇలా పలు రంగాల్లో పనిచేసిన అనుభవముంది. ఆర్థిక, బీపీవో, ఐటీ ఇండస్ట్రీ సెగ్మెంట్లలో నిర్మించి నిర్వహించి బదిలీ చేసే (Build Operate Transfer) పద్ధతిని అమెరికా , ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో నిర్వహించింది. అలా ఇప్పటివరకు 3 వేల మందికి నాయకత్వ లక్షణాలు, సూత్రాలు, స్వయం నిర్వహణ, క్రియాశీల పరిస్థితులు, వ్యక్తిత్వ వికాసం, అవగాహన ప్రమాణ కార్యక్రమాలు.. మొదలైన వాటిపై శిక్షణనిచ్చింది.

ఐఐఎం-బీ(IIM-B)లో ప్రోగ్రామ్ డైరెక్టర్స్ లో ఒకరిగా యశస్వి ఎంపికయ్యారు. భారతదేశంలోని ఐఐఎంలలో చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు వేగవంతమైన కార్యక్రమాలను రూపొందించడంలో శిక్షణనిచ్చారు.

హర్ స్టోరీ (HerStory) తో యశస్విని తన విజయ రహస్యాలను పంచుకుంది.

స్వయంకృషితో నేర్చుకోవడం

“నేను కోయంబత్తూర్ లో పుట్టి ఢిల్లీలో పెరిగాను. మా తండ్రి ఐఏఎస్ అధికారి. నేను పెరిగిన వాతావరణం అంతా ప్రజలతో ముడిపడి వుండేది. చిన్న గ్రామాల దగ్గర్నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఏది ఎలావుంటుందో అన్నీ చూసేశాను. పేదల్లో నిరుపేదలను, ధనవంతుల్లో అత్యధిక ధనవంతులను అందరినీ చూశాను. ఆర్థికశాస్త్రంలో మా తల్లి గోల్డ్ మెడలిస్ట్. నేను బాగా చిన్నగా వున్నప్పుడు నన్ను కంప్యూటర్ రంగంలో స్థిరపడేలా చేయాలని మా తల్లిదండ్రులు భావించే వాళ్లు. అలా ముందుచూపుగల తల్లిదండ్రులను కలిగివుండటం నిజంగా నా అదృష్టం”.

నా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్నది.. నిజాయితీకి ప్రాధాన్యతనివ్వడం, విలువలుగల వ్యవస్థలో వాస్తవాలను గ్రహించడం. మా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల దగ్గర దేశభక్తి అంటే ఏంటో తెలుసుకుంటూ పెరిగాను. నా అంతట నేనుగా స్వతంత్రంగా నిలబడటం, నిజాయితీగా వుండటమనేది నేర్చుకున్నాను.

వ్యాపారవేత్తగా మారడం

“నేను చిన్నప్పుడు మొదట ఆర్మీలో చేరాలనుకున్నాను. చాలా ఏళ్లుగా నాకు అదో కలగా వుండేది. ఆ తర్వాత నేను టెన్నిస్ క్రీడాకారిణి కావాలనీ అనుకున్నాను. కానీ చివరకు వ్యాపారవేత్తనయ్యాను. ఎలాంటి వ్యాపార సంబంధమైన నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చాను. మేమంతా సరస్వతినే నమ్ముకుని పూజించాం. లక్ష్మీ దేవిని కాదు. ఇన్ఫోసిస్, వేలంకని సమ్మేళనం లో 13 ఏళ్ల తర్వాత .. నెక్ట్స్ ఏంటనేదానిగురించి ఆలోచించడం మొదలు పెట్టాను. వ్యాపారం దారిలో వెళ్లమని మా మార్గదర్శకులు నన్ను ప్రోత్సహించారు. కన్సల్టింగ్ రంగానికి విలువను తేవాలనే ప్రధాన కారణంతోనే నేనీవ్యాపార రంగంలో అడుగుపెట్టాను. సలహా అనేది మన దేశంలో పెద్ద ఆదరణ కలిగివున్న రంగం కాదు. ఎందుకంటే ఉచిత సలహాలు ఎక్కడైనా మనకు దొరుకుతాయి. దీనికి భారతదేశంలో పెద్దగా ప్రశంసించరు. మేం నాలుగేళ్లుగా 51 మంది క్లయింట్లను కలిశాం. ఆ తర్వాతే కంపెనీని ప్రారంభించాం. అది చాలా విలువైనదని అర్థమైంది.”

బయట ప్రపంచంతో సంబంధాలను కలిగివుండటం

“సీఐఐఈ(CIIE) లో మహిళా విభాగంలో పనిచేశాను. మహిళలకోసం అర్థవంతమైన పని చేసేందుకు ఏ సంస్థతోనైనా కలవడానికి నేను ఇష్టపడతాను. నా అంతట నేనుగా ముందుకెళ్తాను. 50 శాతం మహిళా జనాభా వుంది. కానీ... వారి గళం వినిపించేందుకు సరైన వేదికలు కూడా లేవు. అందుకనే మేమే మహిళలకోసం శిక్షణా శిబిరాలను అర్థవంతంగా నిర్వహించాలనుకున్నాం. అలా ఆర్థికపరమైన శిక్షణా శిబిరాలను మహిళలకోసం నిర్వహించాం. ఎందుకంటే...ఆర్థిక రంగంలో మహిళకు ఇంకా సాధికారత రాలేదని సర్వేలను బట్టి తెలుస్తోంది. ఒక్క అధికార స్థాయిలోనే కాదు. సంస్కృతి మీద అధ్యయనం చేశాం. సమిష్టిగా శిక్షణనిచ్చేదెలా..? అనే దాన్ని తెలుసుకున్నాం. చాలా చోట్ల మహిళా సమ్మేళనాల్లో కేవలం మహిళలను మాత్రమే ఆహ్వానిస్తుంటాం. అలా కాకుండా మగవారిని కూడా అలాంటి సమావేశాలకు వచ్చేలా చూడాలి. ప్రపంచ మహిలా మార్గదర్శక భాగస్వామ్యమనే కార్యక్రమానికి ఫార్చ్యూన్ అమెరికా శాఖ నుంచి... ప్రపంచ వ్యాప్తంగా 25 మంది మహిళలల్లో నేను మాత్రమే ఎంపిక చేయబడ్డాను. ఇది సొంత దేశంలో గొప్ప భవిష్యత్ ను మహిళకు అందిస్తుందని గర్వపడుతా. వాషింగ్ టన్ లో చాలా సమయాన్ని గడిపాము. ఎంతోమంది పార్లమెంట్ సభ్యులను కలిశాము. హిల్లరీ క్లింటన్ తో రాత్రి భోజనం చేశాం. అప్పుడే మహిళాభ్యున్నతికి ఎలాంటి ఆలోచన చేస్తే మంచిదని చూశాం. హిల్లరీ క్లింటన్ కూడా మాకు స్ఫూర్తి నిచ్చారు. మేము రాజకీయాల దిశగా అడుగులు వేస్తే.. మాకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇస్తామన్నారామె.

మమ్మల్ని సిలికాన్ వ్యాలీకి తీసుకెళ్లారు. దిగ్గజాలైన 5వందల మంది సీఈవోల చేత మాకు మార్గ నిర్దేశం చేశారు. పర్యటనలో చివరి వారం.. న్యూయార్క్ . అక్కడ చాలామంది బ్యాంకర్లను కలుసుకున్నాం. ఆర్థిక వాణిజ్యం ఎలా పనిచేస్తుందనేది తెలుసుకున్నాం.

పెద్ద కలను కను.. ఎదిగే దిశగా లక్ష్యం పెట్టు...

నీలో ఆసక్తి వుంటే.. నువ్వు ఒంటరిగా వున్నట్లు అనిపిస్తే. అదే ఆలోచనతో రావాలి. ఇక్కడ ఎప్పుడూ నాస్తికతను కలిగివుండాలి. ఎందుకంటే నిరుత్సాహ పరిచేవాళ్లే ఎక్కువ. నా వరకైతే.. అమెరికా పర్యటన మొత్తం ఎంతో నైతికస్థైర్యాన్ని, బలాన్నిచ్చింది. ప్రపంచంలో వుండే మహిళలను నేను చూశాను. మనకున్న సమస్యలనే వాళ్లెలా పట్టించుకోరో తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు ప్రపంచవ్యాప్తంగా వున్న మహిళలందరితో పరిచయ సంబంధాలున్నాయి. వాళ్లంతా పెద్దగా కలలు కంటారు. ఆఘ్గనిస్థాన్, యూరోప్ లాంటి దేశాలో వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళల్ని కూడా చూశాను. వాళ్లు ఎంతో కాలంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే వున్నారు. అదే నేను నేర్చుకునేందుకు గొప్ప అవకాశంగా భావించాను.

సత్సంగ్ (Satsang) సీఈవోగా వ్యాపారాన్ని మొదలు పెట్టాను. ఇది కొత్త వ్యాపారవేత్తలు, సీఈవోలకు విభిన్నమైన అనుభవాలను ఇస్తుంది. మేమే తరగతులు నిర్వహిస్తాం, బృంద చర్చలు, వ్యాపార ఆలోచనల్లోని లోటు పాట్లను వాస్తవికంగా చూపుతాం. నిజానికి వాళ్లను ఎదిగేలా చేయడమే మా ప్రధాన ఉద్దేశం.

నా పెద్ద కల ఏంటంటే..ఇప్పుడున్న స్థాయితో రాజీపడాలనుకోను. కంపెనీని ఇంకా పెద్ద, మంచి ప్రపంచ స్థాయి కంపెనీగా తీర్చిదిద్దాలనేది నా ఆశయం. బయట దేశాలకు వెళ్లి ఎంతో నేర్చుకునే అవకాశం నాకు ఈ దేశం ఇచ్చింది. నా దేశం నాకోసం ఇంత చేసినప్పుడు.. నేనూ నా దేశానికి ఏదో ఒక రూపంలో మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నాను. విభిన్నంగా చేయడానికి నేను ఇష్టపడతాను. అందుకే నాకు కొన్ని పనులు సవాళ్లుగా మారుతాయి.

మొండిగా ఎదగాలి

ముందు నువ్వు డబ్బుకు సమస్య లేకుండా చూసుకోవాలి. నీ సంస్థను నిర్వహించడానికి కావాల్సిన వనరుల్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే వ్యాపారంలో ప్రాథమిక సూత్రం. నీపైన నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. ఇతరుల నుంచి సలహాలను తీసుకోవాలి. ఇది రెండో సూత్రం. ఎప్పుడూ నష్టపోని వ్యాపారులను సంప్రదించాలి. వారి నుంచి వ్యాపారానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఏ క్షణంలో కూడా విజయగర్వమనేది నీ తలకు ఎక్కకూడదు. ... అంటారు యశస్వినీ.

నువ్వు మహిళవైతే, చాలామంది నీకు ఎలాంటి గొప్ప ఆశయం లేదనుకుంటారు. వ్యాపారంలో కూడా అభివృద్ధి, ప్రమాణాల గురించి ఆలోచిస్తారు. నువ్వేదో జేబు ఖర్చులు( పాకెట్ మనీ) కోసం చేస్తున్నావని అనుకునే వాళ్లే అంతా. నీ భర్త నీకు అండదండలుగా వున్నాడని కూడా భావిస్తారు. కానీ ఎవరున్నా.. లేకున్నా.. చేసే పనిపై దృష్టి పెట్టాలి. స్థిరంగా నీ వినియోగదారులకు విలువైన సేవలను అందించు. వ్యాపార పనులు వాటంతట అవే మారిపోతాయి. అయితే నువ్వు కొంచెం కటువుగా, మొండిగా వుండాలి. అదే నేను చెప్పే పెద్ద పాఠం. ఎప్పుడూ గంభీరంగా, మొండిగా వుండాలంటాను.

ముక్కుసూటిగా, విస్పష్టంగా వుండటం వ్యాపారంలో నీకు సహకరిస్తుంది. “నేను సాధించాలనుకున్న దాంట్లో సగం కుడా సాధించలేదు”. అమెరికాలో మనకు సలహాలిచ్చే మార్గనిర్దేశకులు దీన్నే పాటిస్తారు. చాలా సమయాల్లో ఎక్కువగా మహిళలు తక్కువ సహాయాన్ని తీసుకుంటారు. బయట ఎవరికీ ఎలాంటి చిరాకు, అసహనం కలిగించకుండా మేము కూడా సహాయాన్ని, సలహాలను తీసుకుంటాం.

ఆధ్యాత్మిక భావాల వైపు కూడా నేను ఎక్కువగా ఆకర్షితురాలిని అయ్యాను. ఎందుకంటే.. వ్యాపారవేత్తగా ప్రయాణం ఒక్కోసారి ఒంటరితనంతో కూడుకున్నది. మనకు మనమే పెద్ద శత్రువులు.

రెండు ఉదాహరణలు నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను: “ అపజయానికి భయపడకూడదు. మనం విజయాన్ని పొందినప్పుడే భయపడాలి..”. అలాగే... “ రేపు అనేది నీకు మిగిలిన జీవితంలో తొలి రోజు”.

నాకు తెలిసి మనకు మనమే పెద్ద శత్రువు. మనంతట మనమే ఎన్నో పరిధుల్ని, పరిమితుల్ని పెట్టుకున్నాం. ఉన్నతంగా ఎదగాలంటే, మనంతట మనమే పోరాడుకోవాలి. అంతే కాదు.. మన దేశం, సమాజం గురించి కూడా ఆలోచించాలి. మనం ఎన్నో ఉద్విగ్నతల భారాన్ని మోస్తూ వెళుతున్నాం. అతి పెద్ద విషయాల్లో చాలా చిన్న విషయాలు పరిగణనలోకి రావు. ప్రతి రోజూ కూడా నీ రాతను నువ్వే తీర్చిదిద్దుకునేలా , గొప్పగా , గర్వంగా ఎదిగేలా ముందుకు వెళ్లాలి. అంటూ విజయసూత్రాల్ని , వ్యాపార పద్ధతులను చాలా అర్థవంతంగా తెలిపారు యశస్వినీ రామస్వామి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags