సంకలనాలు
Telugu

క్లిక్ అవ్వాలంటే పరిమితులను దాటాల్సిందే..

కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చేస్తూ హాబీగా మొదలైన ఫోటోగ్రఫీవైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో దినేశ్ కుంబ్లేకు ప్రత్యేకమైన స్థానం అరుదైన ఫోటోలతో పుస్తకాల ప్రచురణఫోటోలు నచ్చి అవకాశమిచ్చిన గుజరాత్ సర్కార్వివిధ ప్రాజెక్టులతో సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్‌ అయిన ఫోటోగ్రాఫర్

team ys telugu
16th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

దినేశ్ కుంబ్లే.. వన్యప్రాణి ఫోటోగ్రాఫర్. అందరి ఫోటోగ్రాఫర్ల మాదిరిగానే ఆయనా కెరీర్‌ను ప్రారంభించారు. అయితే ఎదుగుతున్న ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లలో చాలా మందికి నిరుత్సాహం ఎదురవుతోంది. దీనికి కారణం తమలో ఉన్న నైపుణ్యానికి పదునుపెట్టి కెరీర్‌గా మల్చుకోవడంలో విఫలమవుతుండడమే. ‘డ్రీమ్ సఫారి’ పుస్తకం ముద్రణకు ముందు దినేశ్‌ది కూడా అటువంటి పరిస్థితే. ఇక అక్కడి నుంచి ఆయన ప్రస్థానం ముందుకు సాగింది. సొంత ముద్రణ సంస్థ ఏర్పాటుతోపాటు గుజరాత్ టూరిజం విభాగంతో కలిసి విభిన్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. దినేశ్ కుంబ్లేతో యువర్‌స్టోరీ జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..

తాను రాసిన పుస్తకాలతో దినేశ్ కుంబ్లే

తాను రాసిన పుస్తకాలతో దినేశ్ కుంబ్లే


యువర్ స్టోరీ - వన్యప్రాణి ఫోటోగ్రాఫర్‌గా ఎలా ఎదిగారు?

డీకే: కళాశాల రోజు నుంచే ఫోటోలు తీయడం అలవాటు. కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు 1991 నుంచి 1994 మధ్య యూఎస్ వెళ్లాను. దాచుకున్న డబ్బులతో సెకండ్ హ్యాండ్ కెమెరాను కొన్నాను. భోజనం ఉందా లేదా అని ఆలోచించేవాడిని కాదు. నా చేతిలో కెమెరా ఉంటే చాలు అని అనుకునేవాడిని. భారత్ తిరిగొచ్చాక 'స్టంప్ విజన్' అనే కంపెనీని స్థాపించాను. స్పోర్ట్స్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడమే ఈ కంపెనీ వ్యాపారం. అనాలిసిస్ సాఫ్ట్‌వేర్‌ను భారత క్రికెట్ టీమ్‌కు విక్రయించిన తొలి కంపెనీ స్టంప్ విజన్.

 2000-2004 దక్షిణాఫ్రికాకు మధ్య తర చూ వెళ్లేవాడిని. ఆ సమయంలో ఫోటోగ్రఫీపై తిరిగి ఆసక్తి కలిగింది. కొద్ది రోజుల్లోనే ఫోటోగ్రఫీలోకి అడుగు పెట్టాను. వన్యప్రాణుల చిత్రాలతో కూడిన పుస్తకం ‘డ్రీమ్ సఫారి’ విడుదల చేశాను. కెన్యా, టాంజానియా పర్యటించినప్పుడు అక్కడ తీసిన వన్యప్రాణుల ఫోటోలను ఈ పుస్తకంలో ముద్రించాం. 2009లో క్రాబ్ మీడియాను ప్రారంభించాను. ఆ తర్వాత నాకు తెలిసిందేమంటే పుస్తకాన్ని ముద్రించడం ఆషామాషీ వ్యవహారం కాదని. 

గిర్ అడవుల్లో చీతా వేగాన్ని ఒడుపుగా కెమెరాలో బంధించిన దినేష్

గిర్ అడవుల్లో చీతా వేగాన్ని ఒడుపుగా కెమెరాలో బంధించిన దినేష్


నేను తీసిన ఫోటోలను పలు ప్రభుత్వాలకు, మంత్రులకు, పర్యాటక శాఖ అధికారులకు పంపాను. ఏదైనా ప్రాజెక్టు వస్తుందని ఆశతో ఈ పని చేశాను. నరేంద్ర మోడి గుజరాత్ సీఎంగా ఉన్నరోజుల్లో ఆయన కార్యాలయం నుంచి పిలుపు అందింది. గుజరాత్ ప్రభుత్వం కోసం పని చేయాలన్నది ఆ పిలుపు సారాంశం. వెంటనే ఓకే చెప్పాను. ఆరు నెలల తర్వాత ‘వైబ్రంట్ వైల్డ్‌లైఫ్’ పేరుతో పుస్తకాన్ని విడుదల చేశాం. సీఎం కార్యాలయం నుంచి ప్రముఖులకు ఈ పుస్తకాన్ని అందించడం గర్వంగా ఉంది. వైబ్రంట్ వైల్డ్‌లైఫ్ 3,000 కాపీలు ముద్రించారు. కొన్నేళ్ల తర్వాత కచ్‌పైన ఒక ప్రాజెక్టును చేయాల్సిందిగా గుజరాత్ అధికారులు కోరారు.

యువర్ స్టోరీ - కచ్ ప్రాజెక్టు అనుభవాలు ఎలా ఉన్నాయి ?

డీకే: వన్యప్రాణులు, క్రీడలకు సంబంధించిన ప్రాజెక్టులు మాత్రమే గతంలో చే శాను. దీంతో కచ్ ప్రాజెక్టు సవాల్‌గా నిలిచింది. సాహిత్యం, కళలు, వస్త్రాలు, ప్రకృతి దృశ్యాలపై పని చేశాను. నీటి గర్భంలోనూ తీసిన ఫోటోలున్నాయి. కచ్- ఎ పిక్టోరియల్ జర్నీ’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని 2013లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆవిష్కరించారు.

యువర్ స్టోరీ - క్రాబ్ మీడియా ఏమిటి ?

డీకే: ఇదొక క్రియేటివ్ ఏజెన్సీ. డిజిటల్, ప్రింట్ రంగంలో సేవలందిస్తోంది క్రాబ్ మీడియా. మైక్రోసాఫ్ట్‌తోపాటు మరిన్ని కంపెనీల కోసం యూజర్ ఇంటర్‌ఫేస్, యూజర్ ఎక్స్‌పీరియెన్స్ డెవలప్‌మెంట్‌పై పనిచేశాం. పుస్తకాల ముద్రణలో ప్రధానంగా క్రీడల విభాగంపై పూర్తిగా నిమగ్నమైంది ఈ కంపెనీ. సచిన్-జీనియస్ అన్‌ప్లగ్డ్, వైడ్ యాంగిల్‌తోపాటు వన్యప్రాణులకు సంబంధించిన డ్రీమ్ సఫారి వంటి పుస్తకాలూ అచ్చువేశాం.

గిర్ జాతీయ పార్కులో రోడ్డు మధ్యలో కూర్చున్న మగ సింహం. రాత్రి పూట జిప్సీ లైట్ల వెలుగులో తీసిన ఫోటో.

గిర్ జాతీయ పార్కులో రోడ్డు మధ్యలో కూర్చున్న మగ సింహం. రాత్రి పూట జిప్సీ లైట్ల వెలుగులో తీసిన ఫోటో.


యువర్ స్టోరీ - ఫోటోగ్రఫీ ఎలా నేర్చుకున్నారు ?

డీకే: స్వతహాగా నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి, వెతకడానికి ఇంటర్నెట్ కూడా ఉండేది కాదు. చిత్రాలతో కూడిన పుస్తకం కొనడంగానీ, అనుభవజ్ఞులతో మాట్లాడ్డం, కొన్నిసార్లు ప్రయోగం చేయడం ద్వారా నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అయ్యారు. ఫోన్లలోనే ఫోటోలు తీస్తున్నారు. కెమెరాల ధరా తగ్గింది. ఫోటోలు ఎలా తీయాలో చేప్పే వీడియోలు ఆన్‌లైన్‌లో వచ్చేశాయి. అయితే అందరూ ఈ రంగంలో విజయవంతం కాలేరు. విజేతగా నిలవాలంటే పరిధి దాటి పనిచేయాల్సిందే. నైపుణ్యం ఎప్పటికప్పుడు పెంచుకోవాలి.

యువర్ స్టోరీ - మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు, అంశం ఏమిటి ?

డీకే: యాన్సెల్ అడమ్స్ వంటి గొప్పవాళ్లను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వన్యప్రాణి ఫోటోగ్రఫీకి కీలక స్థానం బెంగళూరు అని విశ్వశిస్తున్నాను. టీఎన్‌ఏ పెరుమాల్ పనితీరుకు నేను ముగ్ధుడనయ్యాను. ఆయన వయసిప్పుడు 78. అయినప్పటికీ అడవిలోకి వెళ్లి ఫోటోలు తీయడం ఆయన సరదా. ఆ రోజుల్లో ఆయన చేసిన పనితనం అమోఘం. విలువకట్టడమూ సాధ్యం కాదు. ఎందుకంటే సాంకేతికంగా తక్కువ వనరులతోనే ఆయన పేరు సంపాదించుకున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్‌కు పనిచేసిన జిమ్ బ్రాండెన్‌బర్గ్ పనితీరు అభినందనీయం. వారి ఫోటోగ్రఫీకి కాదు ఈ అభిమానం. వారి జ్ఞానాన్ని మలిచిన తీరు, ఫోటోలో జీవం, సందేశం, అపురూప దృశ్యాన్ని బంధించిన తీరు.. ఇవన్నీ వారిపై అభిమానం పెంచేలా చేశాయి. అపురూప దృశ్యం వెలకట్టలేనిది.

ఫోటోగ్రఫీకి వీరు ఎందుకు అతుక్కుపోయారో ప్రజలు లోతుగా అర్థం చేసుకోవాలి. వెర్రి, బ్రతుకుదెరువు, ప్రకృతి అందాలు లేదా వన్యప్రాణుల గురించి సమాచారం ఇవ్వడం.. విషయం ఏదైతేనేం ఫోటోగ్రఫీ ద్వారా ఏం చేస్తారనే చూడాలి. ఫోటోగ్రఫీ వ్యాపకం అయితే ఫర్వాలేదు. వృత్తి కోసం దీనిని ఎంచుకుంటే మాత్రం డబ్బులు సంపాదించే మార్గం చూసుకోవాలి. నీ పనితీరును నలుగురికి తెలియజేయాలి. ప్రైవేటు కంపెనీలను, ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లాలి. ఫోటో తీసి కూర్చుంటే సరిపోదు.

అంతరించిపోతున్న మెకాక్. తమిళనాడులో తీసిన చిత్రమిది.

అంతరించిపోతున్న మెకాక్. తమిళనాడులో తీసిన చిత్రమిది.


యువర్ స్టోరీ - వన్యప్రాణుల నిర్వహణ భారత్, ఆఫ్రికాల మధ్య వ్యత్యాసం ఏమిటి ?

డీకే: భౌగోళికంగా, స్థలాకృతిలో రెండు దేశాలు విభిన్నంగా ఉంటాయి. వన్యప్రాణుల విషయంలో భారత్ మరింత భిన్నం. అటు వన్యప్రాణుల నిర్వహణలో సవాళ్లు కూడా తేడాగా ఉన్నాయి. భారత్‌లో అటవీ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ఆధారపడ్డారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయి. జనాభా పెరుగుతుండడంతో అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. భారత్‌తో పోలిస్తే ఆఫ్రికాలో ఈ సమస్యలు తక్కువ. వన్యప్రాణులను కాపాడడంలో ఆఫ్రికా నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వన్యప్రాణులను రక్షించుకోవడంలో మనవాళ్లు చేసిన కృషి తక్కువేమీ కాదు.

యువర్ స్టోరీ - వన్యప్రాణులను మరింత ఉత్తమంగా ఎలా పరిరక్షించగలం?

డీకే: వన్యప్రాణుల గురించి అవగాహన పెంచాలి. పులుల రక్షణకు ప్రభుత్వం చాలా వెచ్చించింది. మరి ఇతర ప్రాణులు, పక్షుల మాటేమిటి ? తోడేలు, బట్టమేకపక్షి కేవలం భారత్‌లోనే కనపడతాయి. ఇవి అంతరించిపోతున్నాయి కూడా. వీటి గురించి మాట్లాడేవారు కరువయ్యారు. వీటిని రక్షించే ప్రభుత్వ విధానాలు కూడా లేవు. ఈ విధానాలు వీటిని రక్షిస్తాయని నేను అనుకోవడం లేదు. ప్రజల్లోనే మార్పు రావాలి. పర్యాటక శాఖ కీలకంగా వ్యవహరిస్తే మార్పు తీసుకు రాగలం. అంతరించిపోతున్న వన్యప్రాణులను కాపాడుకోగలం.

యువర్ స్టోరీ - యువ ఫోటోగ్రాఫర్లకు మీరిచ్చే సలహా ?

డీకే: ఫోటోగ్రఫీని కెరీర్‌గా విజయవంతంగా మల్చుకోవాలంటే ఔత్సాహిక యువత ఇవి పాటించాల్సిందే..

1. ప్రయోగాలు, ఫోటోలు తీయడాన్ని కొనసాగించాలి.

2. మీకంటూ ప్రత్యేకతను ప్రదర్శించండి.

3. నిపుణులతో చర్చించండి. మీరు తీసిన ఫోటోలపై సవిమర్శకు ఆహ్వానించండి. మీకు మీరే విమర్శకుడిగా నిలవండి.

4. నిరుత్సాహపడ వద్దు. ఓపిక పట్టండి. ఇవే మీకు బలం.

యువర్ స్టోరీ - మీరు చేసిన ఇతర ప్రాజెక్టులేమిటి ?

డీకే: లైఫ్ ఇన్ ద జంగిల్, రూరల్ ఫుట్‌ప్రింట్, ద స్టాప్ ఓవర్ పేరుతో పుస్తకాలు తీసుకొచ్చాం. పశ్చిమ కనుమల్లోని పూలకు సంబంధించిన పుస్తకం ముద్రించాం. అంతరించిపోతున్న పూలపైన విస్మయ నాయక్ అనే పరిశోధకురాలు అద్భుతమైన ప్రాజెక్టు చేసింది. మరొక పుస్తకం నీలగిరి మౌంటెయిన్ రైల్వేకు చెందిన ద నీలగిరి క్వీన్ రైలుకు సంబంధించింది. ఐటీసీ, మైక్రోసాఫ్ట్, కెనెరా బ్యాంకు తదితర కంపెనీలకు బ్రాండింగ్ ప్రాజెక్టులను నిర్వహించాం.

Photo credits - Diinesh kumble

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags