సంకలనాలు
Telugu

వీళ్లు రాబోయే వ్యాధుల్ని గుర్తించి చెప్పే స్టార్టప్ కనిపెట్టారు..!!

21st Feb 2016
Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share

ఆన్ లైన్ లో ఆస్పత్రులను వెతుక్కోవచ్చు. డయాగ్నస్టిక్స్ సెంటర్స్ ని వెతుక్కోవచ్చు. మెడిసిన్ తెప్పించుకోవచ్చు. కానీ టెక్నాలజీ సాయంతో మనిషికి రాబోయే వ్యాధులను ముందే గుర్తించొచ్చంటే నమ్ముతారా? ఇదెలా సాధ్యం అన్న డౌట్ వస్తుంది. కానీ సాధ్యమే అని నిరూపిస్తోంది హెల్త్ నెక్స్ట్ జెన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేథస్సు సాయంతో దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి పేషెంట్లకు వార్నింగ్ బెల్ మోగిస్తోందీ స్టార్టప్.


ఇటీవల కాలంలో స్టార్టప్స్ చాలా వస్తున్నాయి. హెల్త్ కేర్ రంగంలో చూస్తే ఆన్ లైన్ లో డాక్టర్స్ ని, డయాగ్నస్టిక్ సెంటర్లలో టెస్టులను బుక్ చేసుకోవడానికి ఎన్నో కంపెనీలు సాయం చేస్తున్నాయి. అయితే ఇవన్నీ పెద్ద కష్టమైన సర్వీసులేమీ కాదు. హెల్త్ కేర్ కనెక్టివిటీ చాలా స్టార్టప్ లకు మొదటి ప్రాధాన్యంలో ఉంటున్నాయి. ఆన్ లైన్ డెలివరీ, కన్సల్టేషన్ పోర్టల్స్ లాంటివి కనెక్టివిటీని సులభతరం చేస్తున్నాయి. కానీ టెక్నాలజీ సాయంతో వ్యాధులను గుర్తించడం, రాబోయే జబ్బుల గురించి అలర్ట్ చేయడం సాధ్యమంటోందీ స్టార్టప్. కృత్రిమ మేథస్సు, ఆధునిక గణాంక పద్ధతులతో జనాభాలో ఇప్పటివరకున్న జబ్బులు... కనిపించే లక్షణాల ఆధారంగా రాబోయే వ్యాధులేంటో చెప్పేస్తోంది. మధుమేహం వల్ల వచ్చే చూపు సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధుల్లాంటి దీర్ఘకాలిక రోగాలను హెచ్చరిస్తూ ప్రజలకు సాయం చేస్తోంది హెల్త్ నెక్స్ట్ జెన్. అంతే కాదు... వ్యాధుల పట్ల అవగాహన అందిస్తోంది. వ్యాధులు విస్తరించకుండా అప్రమత్తం చేస్తోంది. మెడిసిన్ విషయంలో కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ, డాక్టర్లతో మాట్లాడిస్తోంది.

ఇలా మొదలైంది

వెంకటేష్ హరిహరన్, సురేష్ మల్లందిర. 15 ఏళ్లుగా స్నేహితులు. 2015లో ఓ రోజు స్టార్టప్ గురించి ఆలోచించారు. మేథోమథనం చేశారు. ఆరోగ్యం, చికిత్స రంగంలో స్టార్టప్ అయితే ఎలా ఉంటుందని అనుకున్నారు. వెంకటేష్ సోదరుడు సంతోష్ హరిహరన్ వీరితో కలిశాడు. సాన్ ఫోర్డ్ బర్హం, యూనివర్సిటీ ఆఫ్ టొరొంటోలో హెల్త్ కేర్ రీసెర్చర్ గా పనిచేసిన అనుభవం సంతోష్ కు ఉంది. ఈ ముగ్గురూ కలిసి హెల్త్ నెక్స్ట్ జెన్ కు రిబ్బన్ కట్ చేశారు. మొదట ఇది ప్రాక్టీస్ మేనేజ్ మెంట్, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ప్లాట్ ఫామ్ గా మొదలైంది. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అనేది భారతదేశానికి అతిపెద్ద సవాల్ అని గుర్తించారు ఈ ముగ్గురు. ప్రజల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచేలా పేషెంట్లకు ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు.

 
undefined

undefined


కీలకమైన అడుగు

తమ సేవల్ని అంతటితో ఆపకూడదనుకున్నారు. ఇంకా ఏదైనా చేయాలని తహతహలాడారు. హెల్త్ నెక్స్ట్ జెన్ ను ఇంటెలిజెంట్ ప్లాట్ ఫామ్ గా తీర్చిదిద్దాలనుకున్నారు. అప్పటికే చాలా డాటా అందుబాటులో ఉంది. ఆ డాటాను విశ్లేషించి పేషెంట్లకు రాబోయే వ్యాధులను ముందే గుర్తించి అప్రమత్తం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. టెక్నాలజీ సాయంతో ఇది సాధ్యమని తెలుసుకున్నారు. అయితే ఇలాంటి సేవలు అందించాలంటే నిపుణులైన సైంటిస్టులు, టెక్నాలజిస్టులు అవసరం. ట్రీట్మెంట్ కొనసాగుతున్నన్ని రోజులూ పేషెంట్ పై దృష్టిపెట్టి వారు కోలుకుంటున్న విధానం, మందులు వాడుతున్న విధానంపై సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. టెక్నాలజీ డెవలపర్లతోపాటు టొరొంటోకు చెందిన జన్యు సంబంధిత పరిశోధకులను, పీహెచ్ డీ చేసిన జన్యు డాటా సైంటిస్ట్ లను నియమించుకున్నారు.

"త్వరలో మేము కొందరు మెడికల్ డాక్టర్లను, బిజినెస్ అడ్వైజర్లను నియమించుకోబోతున్నాం. డల్లాస్, టొరొంటో, బెంగళూరులో గ్లోబల్ టీమ్ ను సెట్ చేసుకుంటాం. వీటి ద్వారా హెల్త్ కేర్ రంగంలో సానుకూలంగా దూసుకెళ్తాం. అమెరికాలో ఇలాంటి సర్వీసులు అందించే పలువురు కాంపిటీటర్లు ఉన్నారు. కానీ ఇండియాలో మాకు ఎవరూ పోటీ లేరు"- వెంకటేష్.

రెవెన్యూ మోడల్

సాఫ్ట్ వేర్ యాజ్ ఏ సర్వీస్ రెవెన్యూ మోడల్ ని ఫాలో అవుతున్నారు. ఒక్కో పేషెంట్ కు తగ్గట్టుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం బీటా ప్లాట్ ఫామ్ ను 15 వేల పేషెంట్లతో HNG@Clinic యాప్ కు మార్చేశారు.

ఉత్పత్తులు

1. HNG@Explore: ఇది మెషీన్ లెర్నింగ్ అనలిటిక్స్ అప్లికేషన్. బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ తో పాటు ఆల్గరిథమ్ ఉపయోగించుకొని పెషెంట్ల ఆరోగ్య వివరాలను గ్రాఫికల్ విజువలైజేషన్ చేస్తూ జరగబోయే నష్టాలను వర్గీకరణ చేస్తుంది. త్వరలో ఔషధ వినియోగ డాటాను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. తద్వారా తక్కువ ఖర్చయ్యే ఔషధాలను పేషెంట్లకు సూచించొచ్చు.

2. HNG@Manage: ఇది పేషెంట్ లెవెల్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్. ఔషధాల విషయంలో పేషెంట్ల నిబద్ధతను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. రిమైండర్లు అందిస్తుంది. ఈ రెండు ఉత్పత్తులు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ప్లాట్ ఫామ్ ఉపయోగించి రూపొందించినవే.

భవిష్యత్ ప్రణాళికలు


తమ ఉత్పత్తులను ఈ ఏడాది భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య సంస్థలతో అనుసంధానించాలని అనుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఆస్పత్రుల నుంచి యాంత్రికంగా సమాచారాన్ని సేకరించి, మరిన్ని వ్యాధులపై పరిశోధనలను విస్తరించాలనుకుంటోంది.

"భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా డేటా సేకరణ సులభతరం చేసేందుకు ప్రముఖ ప్రొవైడర్లతో మేం పనిచేస్తున్నాం. పేషెంట్లకు ఖర్చులు తగ్గించేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రెడిక్టీవ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉపయోగించుకుంటాం" - వెంకటేష్.

యువర్ స్టోరీ మాట

డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ అండ్ ప్రమోషన్ కు చెందిన 2000-2015 డాటా ప్రకారం హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ 3.21 బిలియన్ డాలర్లు. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ప్రకారం 2015 నాటికి భారతదేశంలో హెల్త్ కేర్ మార్కెట్ విలువ వంద బిలియన్ డాలర్లు. 2020 నాటికి 280 బిలియన్ డాలర్లు చేరుకుంటుందని అంచనా. వార్షిక వృద్ధి రేటు 22.9 శాతం కనిపిస్తోంది. హెల్త్ జెనోమిక్స్ కంపెనీ అయిన ఎక్స్ కోడ్ కో-ఫౌండర్ డాక్టర్ అబ్దుర్ రబ్ ఏమంటున్నారంటే-

 "2015లో హెల్త్ కేర్ లో వేర్వేరు అంశాల్లో ఐటీ వ్యాప్తి చెందింది. టెక్నాలజీ ఆధారిత పరికరాలు ఉపయోగించుకొని ప్రివెంటీవ్ హెల్త్ కేర్ పై వినియోగదారులు దృష్టిపెట్టారు."

 హెల్త్ నెక్స్ట్ జెన్ కూడా అదే దారిలో నడుస్తోంది. కానీ భారీ నిధులతో ఉన్న స్టార్టప్స్ తో పోటీ పడాల్సి ఉంది. ప్రాక్టో ఇప్పటికే ఆన్ లైన్ ఆర్డరింగ్ ను మొదలుపెట్టింది. గతేడాదే ఇన్ స్టా హెల్త్ ను సొంతం చేసుకుంది. మరింతగా విస్తరించేందుకు డాటాను ఉపయోగించుకుంటామని అంటున్నారు ప్రాక్టో కో-ఫౌండర్ శశాంక్.

Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share
Report an issue
Authors

Related Tags