సంకలనాలు
Telugu

చెత్త తీసుకొచ్చి ఈ మెషీన్ లో పడేస్తే మీకొక బంపర్ ఆఫర్..!

పర్యావరణం కాపాడేందుకు ఢిల్లీ కుర్రాళ్ల కత్తిలాంటి ఐడియా

team ys telugu
23rd Feb 2017
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

కూల్ డ్రింక్ తాగి బాటిల్ విసిరేస్తారు. చిప్స్ తిని రేపర్ నలిపిపడేస్తారు. కొద్దోగొప్పో సివిక్ సెన్స్ ఉంటే దగ్గర్లో డస్ట్ బిన్ ఏమైనా ఉందా అని చూస్తారు. లేదంటే అదే నిర్లక్ష్యం. అదే పట్టనితనం. పర్యావరణ విధ్వంసంలో తెలియకుండానే భాగస్వాములవుతున్నాం. ఈ ధోరణికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి. ఇదే ఆలోచన వచ్చింది ఢిల్లీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లకి.

సాధారణంగా జనం వాటరో, కూల్ డ్రింకో తాగి బాటిల్ నిర్లక్ష్యంగా పడేస్తారు. అలా కాకుండా, వాటిని ఒక మెషీన్ లో వేస్తే మీకు పిజా ఆఫర్లు ఇస్తాం.. రీచార్జ్ కూపన్లు ఇస్తాం.. సినిమా టికెట్స్ ఇస్తాం.. అంటే ఎలా వుంటుంది? ఖాళీ బాటిల్ ఇచ్చేస్తే పిజా వస్తోందంటే, చిప్స్ రేపర్ పడేస్తే రీచార్జ్ కూపన్ వస్తోందంటే, ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. కాకపోతే ఎక్కడపడితే అక్కడ కాదు.. వాళ్లు ఏర్పాటు చేసిన వెండింగ్ మెషీన్ లోనే వేయాలి. అదీ కండీషన్.

image


మెషీన్ లో ఎవరేం వేశారు.. ఎవరికేం కూపన్ ఇవ్వాలి అనేది ఎలా నిర్ణయిస్తారనేగా మీ సందేహం. దానికీ ఒక మెకానిజనం ఉంది. ఉదాహరణకు కోక్ తాగి ఖాళీ టిన్ మెషీన్ లో అందులో వేశారనుకోండి. అక్కడే ఒక గ్రీన్ బటన్ ఉంటుంది.. దాన్ని ప్రెస్ చేయాలి. వెంటనే మెషీన్ బాటిల్ ని స్కాన్ చేసుకుంటుంది.. అది ప్లాసికా, అల్యూమినియమా అని డిసైడ్ చేసుకుంటుంది. దాన్ని బట్టి ఒక ఆటోమేటిక్ ఫైవ్ డిజిట్ కోడ్ జెనరేట్ చేస్తుంది. అది డిస్ ప్లే మీద కనిపిస్తుంది. ఆ కోడ్ ని మొబైల్ లో టైప్ చేసి కాల్ చేయగానే వెంటనే మొబైల్ కి ఎస్సెమ్మెస్ వస్తుంది. ఫలానా పిజా షాపులో మీకు ఇన్ని పాయింట్లు అలాట్ చేస్తున్నాం.. అవసరముంటే రిడిమ్ చేసుకోండి అని మెసేజ్ వస్తుంది. ఇదీ దాని కాన్సెప్ట్.

మెషీన్ పేరు వియ్-కన్వర్ట్. ఢిల్లీకి చెందిన అశుతోష్‌, ప్రణవ్ అనే ఇద్దరు విద్యార్ధులకు వచ్చిన ఐడియా ఇది. అపార్టుమెంటుల్లో, కాలేజీ మైదానాల్లో, రోడ్ల పక్కన.. ఇలా ఎక్కడ పడితే అక్కడ వేస్టేజీ అంతా పోగవుతుంటే చూసి ఆవేదన చెందారు. ఒకపక్క స్వచ్ఛ్‌ భారత్ లాంటి కార్యక్రమాలు జరుగుతుంటే.. ఇంకో పక్క బొత్తిగా సివిక్ సెన్స్ మరిచిపోయి ఇలా వ్యవహరిస్తున్నాం. దీనికి పరిష్కారంగా తమవంతు ఏదైనా చేయాలని భావించారు. ఆ మేథోమథనంలోంచి పుట్టిందే వియ్-కన్వర్ట్ వెండింగ్ మెషీన్. డస్ట్ బిన్స్ ఉంటాయి. కానీ ఎవరూ ఫాలో కారు. స్లోగన్స్ రాస్తాం.. ఎవరూ పట్టించుకోరు. అదే ఆఫర్లు అన్నాం అనుకోండి.. ఇదిగో ఇలా జాగ్రత్తగా తీసుకొచ్చి పడేస్తారు. టిపికల్ ఇండియన్ సైకాలజీమీద ప్రాజెక్ట్ డెవలప్ చేశారు. 2015లో ఈ వెండింగ్ మెషీన్ ఐడియా వచ్చింది.

image


ద గార్డియన్, పార్థ్‌ దాస్ శర్మ రీ సైక్లింగ్ పోర్టల్, ద కబాడీవాలా.కామ్, సినర్జీ సోర్సింగ్ లాంటి పేరున్న రీసైక్లింగ్ యూనిట్లతో మాట్లాడుకున్నారు. దాంతోపాటు వోచర్ ఆఫర్ కోసం సుమారు 50 కంపెనీలతో డీల్ సెట్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ వ్యాప్తంగా మెషీన్ యూజర్స్ ఉన్నరు. వారి సంఖ్య 5వేలకు చేరింది. ఇప్పటిదాకా 700కిలోలకు పైగా వేస్టేజీ రీసైకిల్ కి ఇచ్చారు.

వేస్ట్ మేనేజ్ మెంట్ ఇండస్ట్రీ వాల్యూ 400 మిలియన్ డాలర్లుగా ఉంది. వియ్ కన్వర్ట్ స్టార్టప్ నెలకు రెండు లక్షలకుపైనే రెవెన్యూ నమోదు చేస్తోంది. త్వరలో హైదరాబాద్, ముంబై, పుణె, బెంగళూరు వంటి నగరాల్లో వెంచర్ ఎక్స్ పాండ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అందుకోసం ఫండ్స్ రెయిజ్ చేయాలని భావిస్తున్నారు.

స్వచ్ఛ్‌ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని తమవంతు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుతున్న ఈ కుర్రాళ్ల ఆలోచనని అందరూ మెచ్చుకుంటున్నారు.  

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags