కర్నాటక ఐఏఎస్ ఆధికారి రత్నప్రభ ఇన్‌స్పైరింగ్ స్టోరీ

13th Jan 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

అంద‌రూ ప‌నిచేస్తారు. కానీ.. న‌లుగురికి ఉప‌యోగ‌ప‌డేలా.. న‌లుగురినీ ప్ర‌భావితం చేయ‌గ‌లిగేలా ప‌నిచేసే వాళ్లు కొంత‌మందే ఉంటారు. అదీ ప్ర‌భుత్వ ఆఫీసుల్లో.. అధికారుల‌యితే వంద‌కు ఒక‌రో ఇద్ద‌రో ఉంటారు. అలాంటివాళ్ల‌లో ఒక‌రిని మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం,

image


క‌ర్నాట‌కలో ఒక‌ ఐఏఎస్ అధికారి. క‌ర్నాట‌కకు పెట్టుబ‌డుల రాష్ట్రంగా తీర్చిదిద్ద‌డానికి రాత్రింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతున్న ఏకైక అధికారి. ఆమె ఎంద‌రికో ఆద‌ర్శం. ఎంద‌రికో స్ఫూర్తి. ఆమె వెంట ప‌నిచేయాలంటే అధికారులు ఇష్ట‌ప‌డ‌తారు. ఆమె ప్రాజెక్ట్‌లో పాలుపంచుకోవాలని ఆరాటంగా ఎదురుచూస్తారు. ఎందుకంటే ఆమెతో ప‌నిచేస్తే ప‌ని విలువ తెలుస్తుంది. ప‌నిని న‌లుగురికీ ఉప‌యోగ‌ప‌డేలా ఎలా చేయాలో నేర్చుకోవ‌చ్చు. ఆమే.. క‌ర్నాట‌క కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీస్ అడిష‌న‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ ర‌త్న‌ప్ర‌భ‌

యువ‌ర్ స్టోరీ ప్రశ్నలు

ఇంత‌గా మిమ్మ‌ల్ని ప్రేరేపించిన అంశం ఏమిటి?

ర‌త్న‌ప్ర‌భ -కెరీర్ మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర్నుంచి కూడా ఇలాగే ప‌నిచేయ‌డం అల‌వాటు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో, జ‌నంతో మాట్లాడ‌టంలో అంద‌రికంటే భిన్నంగా ఆలోచిస్తాను. బ‌హుశా చేసే ప‌ని ప‌ట్ల నాకు ఉన్న మ‌క్కువ‌, ఆద‌ర‌ణ వ‌ల్ల ఇది అల‌వాటైంద‌ని అనుకుంటాను. అందుకే.. నేను ఎక్క‌డ ప‌నిచేసినా వాళ్లు న‌న్ను గుర్తుపెట్టుకుంటారు. అక్క‌డి నుంచి వ‌చ్చేసినా కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు. స‌ర్వీసులో చేరి ఇది 35వ ఏడు.

డిపార్ట్‌మెంట్ ప‌రంగా చూస్తే కావాల్సినంత ఎక్స్‌పీరియ‌న్స్ ఉంది. 1996-97 స‌మయంలో ఎగుమ‌తుల విభాగంలో ప‌నిచేశాను. ఈ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేయ‌డం అదే మొద‌టిసారి. అంత‌కుముందు చాలాచోట్ల జిల్లా క‌లెక్ట‌ర్‌గా పనిచేయ‌డంతో.. సామాజిక‌, గ్రామీణ అంశాల‌పై మాత్ర‌మే ఫోక‌స్ ఉండేది. అయితే, ఎగుమ‌తుల విభాగంలో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డంతో, అప్ప‌టికి ఎలాంటి అనుభ‌వం లేక‌పోవ‌డంతో చాలా ద‌గ్గ‌ర‌గా ప‌నిచేయాల్సి వ‌చ్చింది. అన్నీ నేర్చుకోవ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డింది,

ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప‌రిశ్ర‌మ‌లు

ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా యాక్ట్ కింద ప‌రిశ్ర‌మ‌ల‌కు భూములు ఇవ్వ‌డం, త‌ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుప‌ర్చ‌డం అనే అంశాన్ని అంద‌రూ మ‌ర్చిపోయారు. అందుకే.. భూములు కోల్పోయిన ప్ర‌తీ ఒక్క కుటుంబానికీ కచ్చితంగా ఒక ఉద్యోగం ఇవ్వాలన్న పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టాం. స్ధానిక యువ‌త‌కు ట్రైనింగ్ ఇచ్చేలా పరిశ్ర‌మ‌ల‌తో మాట్లాడుతున్నాం. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా ప‌రిశ్ర‌మ‌లు దీన్ని ప్రోత్స‌హిస్తున్నాయి కూడా. అందుకే.. అలాంటివాళ్ల‌ను, స్ధానిక ప‌రిశ్ర‌మ‌ల్లోకి పంపించ‌డం ద్వారా.. స్ధానిక యువ‌త‌కు ప‌ని నేర్చుకోవ‌డంతో పాటు ఉద్యోగం కూడా దొర‌కుతుంది.

మ‌రిన్ని పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌డం.

బెంగ‌ళూరు ప‌రిస‌రాల‌కూ దూరంగా ప‌రిశ్ర‌మ‌లు రావాల‌న్న‌దే మా ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీ ముఖ్య ఉద్దేశం. బెంగ‌ళూరు చుట్టుప‌క్క‌ల వ‌స్తున్న ఏ కంపెనీకి కూడా ఇప్ప‌టిదాకా రాయితీలు ఇవ్వ‌లేదు.సిటీకి ఎంత దూరంగా ప‌రిశ్ర‌మ ఏర్పాటుచేస్తే.. అన్ని రాయితీలు దొరుకుతాయి. హైద‌రాబాద్‌- క‌ర్నాట‌క రీజియ‌న్‌కు పెద్ద మొత్తంలో రాయితీలు ల‌భిస్తున్నాయి. త‌ర్వాత రెండు స్ధానాల్లో ముంబై-క‌ర్నాట‌, మైసూర్‌-మంగ‌ళూరు ఏరియాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఏరోస్పేస్‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్ ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయి.

మౌలిక వ‌స‌తులే పెద్ద స‌మ‌స్య‌

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటులో మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌డ‌మే అతిపెద్ద స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. అందుకే.. ఈ అంశానికి ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తోంది. ఒక ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ‌ను సైతం ఏర్పాటుచేసింది.

క‌ర్నాట‌క‌పై పెట్టుబ‌డిదారుల చూపు

పెట్టుబ‌డుల్లో నేను చార్జ్ తీసుకునేనాటికి క‌ర్నాట‌క దేశంలోనే 7- 8వ స్ధానంలో ఉండేది. ఇప్పుడు రెండో స్ధానానికి చేరింది. మొద‌టిస్ధానంలో గుజ‌రాత్ ఉంది. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ప్ర‌త్యేకంగా ఓ విమెన్ పార్క్‌ను ప్ర‌పోజ్ చేశాం. బెంగ‌ళూరు ఎయిర్‌పోర్ట్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో త్వ‌ర‌లో ఎన్నోడిఫెన్స్‌, ఎయిరోస్పేస్ హ‌బ్‌లు రాబోతున్నాయి. అందుకే.. ఆ పొజిష‌న్‌ను కాపాడుకోవ‌డంతో పాటు మ‌రిన్ని కంపెనీలు వ‌చ్చేలా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు త‌యారుచేస్తున్నాం.

స్టార్ట‌ప్స్‌పై దృష్టి

స్ట‌ర్ట‌ప్ కంప‌నీల విష‌యంలో క‌ర్నాట‌క ఎప్పుడూ ముందే ఉంటుంది. ఐటీ రంగంతో పాటు త‌యారీ రంగంలో కూడా కొత్త కంపెనీల‌ను ప్రోత్స‌హించాల‌న్న‌ది మంత్రి ల‌క్ష్యం. దానిమీద దృష్టిపెడుతున్నాం.

మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు వ‌రాలు

ఇండస్ట్రియ‌ల్ పార్కుల్లో 5శాతం భూమిని మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు రిజ‌ర్వ్ చేసేలా పాల‌సీ తీసుకువ‌చ్చాం. గ‌తంలో వారిపై ప్ర‌త్యేక దృష్టి లేదు. కానీ.. ఇప్పుడు మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక రాయితీల‌తో పాటు స‌దుపాయాల క‌ల్ప‌న‌కు కృషిచేస్తున్నాం.

undefined

undefined


మీ వ్య‌క్తిగ‌త జీవితం గురించి?

మా నాన్న‌గారు సివిల్ స‌ర్వీసుల్లో ప‌నిచేశారు. మా త‌ల్లి డాక్ట‌ర్‌. పెద్ద‌న్నయ్య ప్లాస్టిక్ స‌ర్జ‌న్‌. రెండ‌వ అన్న కూడా సివిల్ స‌ర్వెంట్‌.చిన్న‌త‌నం నుంచి త‌ల్లిదండ్రులు వృత్తిప‌ట్ల అంకిత‌భావంతో ప‌నిచేయ‌డం చూస్తూ పెరిగాము.మాకూ అదే అల‌వాట‌యింది. కారులో వెళుతున్నా కూడా ప‌ని గురించే ఆలోచ‌న‌. జ‌నానికి సహాయం చేయాల‌న్న మా త‌ల్లిదండ్రుల ఆలోచ‌న మాపై తీవ్ర ప్ర‌భావం చూపింది. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటాను.

జ‌నం గుండెల్లో..

ఎక్క‌డ ప‌నిచేసినా జ‌నం న‌న్ను గుర్తుపెట్టుకుంటారు. బీద‌ర్‌లో మొద‌టి పోస్టింగ్‌. 32 ఏళ్ల క్రితం అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌గా ఉద్యోగం. ఇప్ప‌టికీ గుర్తు. ఒక‌సారి హాస్పిట‌ల్‌లో బ్ల‌డ్ ఇస్తుంటే.. ఆ వ్య‌క్తి పేరేంట‌ని అడిగాడు. ర‌త్న‌ప్ర‌భ అన్నాను. బీద‌ర్‌లో ప‌నిచేశారా అన్నాడు. అవును అని చెప్పాను. మా అమ్మగారు మీ గురించే చెబుతుంటారు. మీరు ఆ స‌మ‌యంలో అక్క‌డ ఎంతో స‌హాయం చేశార‌ని చెప్తుంటార‌ని అన్నాడు. నా ర‌క్తం తీసుకున్నాన‌ని మీ అమ్మ‌గారికి చెప్పు అంటే నవ్వాడు. మ‌రోసారి ఓ వ్య‌క్తి క‌లిసి మీరు బీద‌ర్ నుంచి వెళ్లిపోయారు కానీ.. మా మ‌న‌సుల్లోంచి కాదు అన్నాడు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతుంటాయి. ఇంత‌లా జ‌నాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌లిగినందుకు ఆనందంగా ఉంటుంది.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close