సంకలనాలు
Telugu

బ్యూటీ లవర్సే టార్గెట్‌గా ఫ్యాబ్ బాగ్

భారత్ కు సబ్ స్క్రిప్షన్ కామర్స్ పరిచయంమార్కెట్లోకి వచ్చిన కొత్త శాంపుల్స్ ఇంటికినెలవారీ చందా తీసుకుంటే చాలు బ్యూటీ ప్రొడక్ట్స్ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నకొత్త తరహా కామర్స్దూసుకుపోతున్న ఫ్యాబ్ బాగ్

team ys telugu
5th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కాలం మారుతోంది. దానితోపాటే వ్యాపార దోరణలు మారుతున్నాయి. ఈక్రమంలో వ్యాపార నిఘంటువులో కొత్తగా చేరిన పదం, డిస్కవర్ కామర్స్ లేదా సబ్ స్క్రిప్షన్ కామర్స్.వినియోగ దారులు తమకు కావాల్సిన వస్తువులు ఇంటి వద్దకే తెప్పిపించు కునే సౌలభ్యం కలిపించడమే ఈ కొత్త తరహ వ్యాపార రహస్యం. నిజానికి,. మన వీధి చివరి కిరాణా కొట్టువాడు కూడా మనం ఒక ఫోన్ చేసి చెబితే సరుకులు ఇంటికే పంపిస్తారు. అయితే డిస్కవరీ లేదా సబ్ స్క్రిప్షన్ (చందా) కామర్స్ అలాంటిదే కానీ, అది మాత్రం కాదు.

ఈ తరహ వ్యాపారంలో వినియోగ దారులు చందా చెల్లిస్తారు... ఇక ఆపై నెలకు ఒక సారి లేక నిర్దేశిత కాలానికో ఒక వస్తువో లేదా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వస్తువులు శాంపుల్స్ తో నిండిన బాక్స్ వచ్చి మన ఇంటి తలుపులు తడుతుంది. ఇందులో మళ్లీ మూడు రకాలున్నాయి. అందులో ఒకటి శాంపిల్ మోడల్ దీనికి చందా కడితే మార్కెట్లికి వచ్చిన కొత్త ఉత్పత్తులు లేదా శాంపిల్ ఇంటికి వస్తుంది. ఇది ప్రధానంగా అలంకరణ వస్తువులు, బ్యూటీ ఇండస్ట్రీ ఉత్పత్తులు ఉంటాయి. ఇందులో సబ్ స్క్రిప్షన్ కామర్స్ వ్యాపారం చేసే సంస్థలకు రెండు చేతులా ఆదాయం ఉంటుంది. కొత్తఉత్పత్తుల గురించి తెలుసుకోవాలనుకునేవారు చెల్లించే చందాతో పాటుగా తమ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేసుకోవాలనుకునే బ్రాండ్స్ నుంచి కూడా ఆదాయం ఉంటుంది.

ఫ్యాబ్ బాగ్ ప్రొడక్ట్స్

ఫ్యాబ్ బాగ్ ప్రొడక్ట్స్


ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇటీవల కాలంలో సబ్ స్క్రిప్షన్ కామర్స్ లో బిర్చ్ బాక్స్, జాలీ బాక్స్ విజయవంతమయ్యాయి. ముంబై నుంచి పనిచేస్తున్న బ్యూటీ అండ్ గ్రూమింగ్ డిస్కవరీ సర్వీస్, ఫ్యాబ్ బ్యాగ్ ( పూర్వనామం వేల్ల్వెట్టే) భారత దేశంలో సబ్ స్క్రిప్షన్ కామర్స్ కు ఉదాహరణ గా నిలిచింది. ఫ్యాబ్ లో సభ్యత్వం తీసుకుంటే ప్రపంచ ప్రసిద్ద బ్రాండ్స్ సహా ఉత్తమ నాణ్యత గల వస్తువులు ప్రతినెలా మీ ఇంటికి వస్తాయి

ఫ్యాబ్ బ్యాగ్ ను 2012 లో IIT-ముంబై, IIM - అహ్మదాబాద్ పూర్వ విద్యార్ధి వినీత్ సింగ్, బిట్స్ పిలాని, IIM అహ్మదాబాద్ పూర్వ విద్యార్ధి కౌశిక్ ముఖర్జీ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫ్యాబ్ బ్యాగ్ లాభాల మలుపు తిరిగింది. ఇటీవల ఫ్యాబ్ బ్యాగ్, ఏంజెల్ ఇన్వెస్టర్ రంజన్ ఆనందన్, నకుల్ గుప్తా, భారతీయ పెట్టుబడిదారుల నుంచి మొదటి రౌండ్ ఫండింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో 'యువర్ స్టొరీ' ఫ్యాబ్ వ్యవస్థాపకులను, పెట్టుబడిదారులను కలిసి, సబ్ స్క్రిప్షన్ కామర్స్ కథా ,కమామిషు ఏమిటి, ఈ కొత్త వ్యాపారం డైనమిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. వివరాలలోకి వెళితే ...

వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ

వినీతా సింగ్, కౌశిక్ ముఖర్జీ


ఫ్యాబ్ బ్యాగ్ ఇలా ప్రారంభమైంది ?

వినీతకు డిస్కవరీ కామర్స్ గురించి తెలిసే సమయానికి ఆమె లాభాల బాటలో నడుస్తున్న క్యూ - వెరిఫై అనే హెచ్.అర్. సర్వీసెస్ ను నిర్వహిస్తున్నారు. ఈ మోడల్ ముందుగా అమెరికా, యురోపియన్ మార్కెట్ల లో ప్రారంభమైంది. అక్కడ చాలా చాలా ఖరీదైన, అంత తేలిగ్గా మార్కెట్లో దొరకని బ్రాండ్స్ ను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు దీన్ని ఉద్దేశించారు. ఈ ఆలోచన మాకు బాగా నచ్చింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ లోకి కొత్త కొత్త గ్లోబల్ బ్రాండ్స్ ప్రవేశిస్తున్న నేపధ్యంలో మేము డిస్కవరీ కామర్స్ ను చాలా అరుదైన అవకాశంగా భావించాము. ఆ ఆలోచనల ఫలితంగా 2012 లో ఫ్యాబ్ బ్యాగ్ రూపదిద్దుకుంది అంటారు కౌశిక్.

భారత దేశంలో సబ్ స్క్రిప్షన్ కామర్స్ ను నడిపించే మార్కెట్ ఏది ?

సబ్ స్క్రిప్షన్ కామర్స్ ను భారతీయ వినియోగ దారులకు అనుకూలంగా మలుచుకోవచ్చని మా విశ్వాసం. కొత్త ఉత్పత్తుల గురించి తెలుసుకోవడం ముఖ్యమే అయినా, మా వినియోగదారులు నెలసరి బ్యాగ్ ను నిత్య వినియోగ వస్తువులుగానూ చూస్తారు. వారు ఖర్చు చేసే డబ్బుకు పూర్తిస్థాయి ప్రతిఫలం లభించినప్పుడు మాకు, కస్టమర్లకు ప్రయోజనకరం. కొత్త సేవలకు వినియోగదార్లు అలవాటు పడేందుకు ఇదే డ్రైవింగ్ ఫోర్స్. ఇతర దేశాలలో ఈ కొత్త బిజినెస్ మోడల్ ను చాలా రకాలుగా వాడుకుంటున్నారు, అయితే ఫ్యాబ్ మాత్రం ఒక్క బ్యూటీ ఉత్పత్తులకే పరిమితం. ఒక పద్ధతి ప్రకారం శాంపిల్ సప్లై, వాడి చూసి సంతృప్తి పొందిన వారు చేసే కొనుగోళ్లు రానున్న రోజుల్లో బాగా పెరగుతాయని భావిస్తున్నామనే నిర్వహకుల మాట.

మిలియన్ డాలర్ల టర్నోవర్

ఫ్యాబ్ బ్యాగ్ పోటీ ధరలకు చౌకగా నెలసరి సౌందర్య సామగ్రిని (నెలకు రూ. 399) ఆఫర్ చేస్తోంది. మార్కెట్ ధరలతో పోలిస్తే వియోగ దారులకు మూడు రెట్లు ప్రయోజనం చేకూర్చే ఫుల్ సైజు , ట్రావెల్ సైజు బ్యాగ్స్ రెంటినీ ఎంచక్కా ఇంటికే పంపిస్తుంది. సౌందర్య వస్తువులకు ఉన్న గిరాకి దృష్ట్యా ముందు ముందు వ్యాపారం మరింత విస్తరించే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. ఆఫీసులలో సహచర ఉద్యోగులు, కాలేజీ అమ్మాయిలు సమిష్టిగా ఆర్డర్ ప్లేస్ చేయడం ద్వారా మార్కెట్ ను వేగంగా విస్తరించుకోవచ్చునని కూడా కంపెనీ ఆశిస్తోంది. ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఫ్యాబ్ బ్యాగ్ ఈ సంవత్సరం ఆరంభంలోనే మిలియన్ డాలర్ల టర్నోవర్ మార్కును దాటి లాభాల బాట పట్టిందని ప్రమోటర్లు చెబ్తున్నారు. ఇంతవరకు 40,000లకు పైగా చందాదారులకు సౌందర్య కిట్స్ ను పంపారు. 1, 00,000 కి పైగా సభ్యులు ఆన్-లైన్ లో రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యాబ్ లో 22 మంది సభ్యుల బృందం ఉంది. వీళ్ళంతా పనులను పంచుకుని ముందుకు సాగుతున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags