సంకలనాలు
Telugu

గాలి నుంచి నీరు తీసే వార్కావాటర్

గ్రామీణ ఇథియోపియా కోసం ఓ వినూత్న ఆవిష్కరణ విద్యుత్ అవసరం లేని మోడల్ స్థానికంగా లభించే వస్తువులతోనే తయారీ వార్కావాటర్ భవిష్యత్ తరాలకోసం తయారైన మ్యానిఫెస్టో

ABDUL SAMAD
27th May 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

ఈశాన్య ఇథియోపియా ఎత్తైన పీఠభూమిపై ఉన్న పర్యావరణ సహిత ప్రాంతం. పూర్తిగా గ్రామాలతో నిండిన ఈశాన్య ఇథియోపియాలో నీటి సమస్య చాలా ఎక్కువ. సహజ వనరులు నిండిన ఈ ప్రదేశంపై... ఇంకా పారిశ్రామిక రంగం కన్ను పడలేదు. అయితే ఇక్కడ నీటి పారుదల, విద్యుత్, పారిశుధ్యం వంటి సమస్యలు మాత్రం ఎక్కువ. ఇప్పుడు గ్రామీణ ఇథియోపియాకు అభివృద్ధి అక్కర్లేదు... కానీ ప్రజలు కనీస జీవన విధానం పెరిగేలా చర్యలు అవసరం.

స్విట్జర్లాండ్‌కు చెందిన ఆండ్రియాస్ వోల్గర్, ఇటలీకి చెందిన ఆర్టురో విట్టోరి... ఆర్కిటెక్చర్ & విజన్ అనే సంస్థను ప్రారంభించారు. వీరిద్దరు ఆర్కిటెక్ట్స్. 2012లో వీరిద్దరూ ఇథియోపియా ఈశాన్య ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడి సమస్యలు పరిశీలించిన వీరిద్దరూ వార్కావాటర్ ఆలోచన చేశారు. పర్యావరణంలోంచి నీటిని గ్రహించే నిలువైన సెటప్ ఉండేలా చేసిన ప్రయోగం ఇది. నీటి సేకరణకు, సంగ్రహణకు ఇప్పటివరకూ ఉన్న అనేక విధానాలను పక్కకు నెట్టి... వీరిద్దరూ కొత్త ప్రయోగం చేశారు. 2013 డిసెంబర్‌లో ఆండ్రియాస్ వోల్గర్ ఏవీ సంస్థ నుంచి బయటకు వెళ్లిపోయినా... విట్టోరి ఆధ్వర్యంలో ప్రయాణం కొనసాగిస్తోంది వార్కావాటర్.

ప్రకృతిని కాపాడండి అంటూ కబుర్లు చెప్పే ప్రాజెక్ట్ కాదిది. వార్కావాటర్‌ని ఆర్కిటెక్చర్ & విజన్ సంస్థ రూపొందించిన ఫిలాసఫీ అని చెప్పాలి. టెక్నాలజీ, ప్రకృతి, పర్యావరణ... ఈ మూడింటిపై ఆధారపడి డిజైన్ చేసిన ప్రత్యేక నిర్మాణం వార్కావాటర్. గ్రామాలకు తగిన రీతిలో ఒక పాత్ర వంటి ఏర్పాటు. తక్కువ ఖర్చుతో అత్యంత ప్రాకృతికంగా నీటిని గ్రహించే విధానం.

వివిధ సహజ వస్తువులతో తయారైన వార్కా వాటర్

వివిధ సహజ వస్తువులతో తయారైన వార్కా వాటర్


గాలి నుంచి ఏర్పడిన తేమ ద్వారా ఏర్పడిన నీటి బిందువులు

గాలి నుంచి ఏర్పడిన తేమ ద్వారా ఏర్పడిన నీటి బిందువులు


ప్రకృతికి లభించినట్లుగానే

వార్కావాటర్ డిజైన్‌లో ప్రతీ అడుగు ఇథియోపియా జీవనానికి అద్దం పట్టదు. బుట్టలు తయారు చేసే డిజైన్ మాదిరిగా ఉంటుంది ఇది. దీన్ని తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులన్నీ స్థానికంగా అందుబాటులో ఉండేవే. చూడడానికి అస్పష్టంగా ఉన్నా... దీన్ని ప్రతీ గ్రామీణ ఇథియోపియా వాసి కూడా.. తయారీ, రిపేర్, నిర్వహణ చేయగలిగేలా డిజైన్ చేశారు.

వార్కావాటర్‌లో ఉపయోగించే వస్తువులన్నీ పర్యావరణ సహితమైనవే. వెదురు, జనపనార, బయోప్లాస్టిక్స్ వంటివి భూమిలో తేలికగా కలిసిపోయేవే. నిరంతరాయంగా నీటిని గ్రహించే ఈ డిజైన్‌ పనిచేసేందుకు ఎలాంటి శక్తివనరులు అందించనవసరం లేదు. ప్రకృతి నుంచి భూమికి లభించినట్లుగానే వర్షపునీరు, మంచు, నీటి బిందువులను ఇది సంగ్రహిస్తుంది. జెముడు చెట్ల మాదిరిగా ప్రకృతి నుంచే నీరు తీసుకుని, తనలో దాచుకుంటుంది. ఎడారుల్లోనూ బతికి, నీటిని తనలో ఉంచుకునే బ్రహ్మజెముడు, నాగజెముడు చెట్లే.. వార్కావటర్‌కి స్ఫూర్తి. ఈ విధానం మంచులోంచి నీటిని గ్రహించడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది.

తామర ఆకులను కూడా వార్కావాటర్ అభివృద్ధిలో స్ఫూర్తిగా తీసుకున్నారు. తామరాకులు నీటిలోనే ఉంటాయి కానీ ఒక్క చుక్క నీటిని కూడా గ్రహించవు. అదే సమయంలో అవి ఎప్పుడూ పొడిగానే ఉండేలా ఉంటుంది వాటి నిర్మాణం. అందుకే తామరాకులూ ఈ డిజైన్ కోసం ఉపయోగపడ్డాయి.

సాలీడు గూడు వార్కావాటర్ నిర్మాణం మరో ఇన్‌స్పిరేషన్. దీని అంతర్గత నిర్మాణం చూస్తే మనకు సాలీడు గూడు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. తన గూడు కోసం సాలీడు ఉత్పత్తి చేసే బూజు వంటి పదార్ధం కూడా నీటిని పీల్చుకుంటుంది. అందుకే దీన్ని కూడా ఈ నిర్మాణంలో ఉపయోగించారు. ఇలాంటి అత్యంత తేలికైన, సున్నితమైన విధానాలతోనే ఓ పర్యావరణ సహితమైన పెద్ద ప్రాజెక్టును రూపకల్పన జరిగింది.

వార్కా వాటర్ గురించి తెలుసుకుంటున్న ఇథియోపియా వాసులు

వార్కా వాటర్ గురించి తెలుసుకుంటున్న ఇథియోపియా వాసులు


ఇథియోపియాలో నీటి కష్టాలు

సగటున ఒక్కో ఇథియోపియా వాసి రోజుకు 15 లీటర్ల నీటిని ఉపయోగించుకుంటాడు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 300లీటర్లకు పైగానే ఉంటుంది. కనీసం ఒక్కో ఇథియోపియా వ్యక్తికి రోజుకు 100లీటర్లు అందుబాటులోకి తేవాలన్నది వార్కావాటర్ లక్ష్యం. 85.3శాతం ఇథియోపియన్లు గ్రామాల్లోనే జీవిస్తున్నారు. ఇక్కడ పారిశుధ్య ఏర్పాట్లు లేకపోవడంతో రోగాలు చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నాయి. కేవలం 44శాతం మందికి మాత్రమే నీరు అందుబాటులో ఉంది. గ్రామవాసుల్లో 34శాతం మందికే ఈ సౌకర్యం ఉంది. ఇదంతా శుభ్రమైన నీటి గురించి కాదు... కేవలం నీటి అందుబాటు గురించి మాత్రమే.

ఇక్కడ నేలలో బంగారం సహా అనేక సహజవనరులున్నాయి. పర్యావరణంలో అనేక మార్పులు ఇక్కడ ఉండడంతో... సహజంగా ఇది వనరుల పరంగా చాలా విలువైన ప్రాంతం. ఒకవేళ వార్కావాటర్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే... మైళ్లకొద్దీ నడిచి చిన్నచిన్న కుంటల్లోంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన కష్టాలకు.. ఇథియోపియన్లు చరమగీతం పాడొచ్చు. ఎలాంటి మెషినరీ ఉపయోగించకుండా, విద్యుత్ అవసరం లేకుండా, గ్రామీణ వాసులే స్వయంగా తయారు చేసి నిర్వహించుకునేలా చేసిన ఈ ఏర్పాటు మాత్రం అధ్భుతమనే చెప్పాలి.

సవాళ్లకి ఎదురు నిలిచి...

చుట్టూ ఉండే వస్తువులకు, ప్రకృతికి అడ్డ పడకుండా... తనంతట తానుగా నిలబడే పొడవైన ఓ నిర్మాణం చేయాలి. ఇది కూడా భూమిపైనే పూర్తి నిర్మాణం ఉండేలా చేయడమే AV ఎదుర్కున్న అసలు సమస్య. అతి తేలకైన టెక్నాలజీని స్థానికంగా లభించే మెటీరియల్‌తోనే పూర్తి చేయాలి. అన్నీ పర్యావరణహితంగా ఉండాలి.

ఇలాంటి డిజైన్ నమూనా మొదట తయారు చేసేందుకు నాలుగు నెలలు పట్టింది. పూర్తి స్థాయి పర్ఫెక్ట్ మోడల్ సిద్ధం చేసేందుకు AV మూడేళ్ల సమయం తీసుకుంది.

టెక్నాలజీ నిర్మాణానికే నాలుగేళ్లు

వార్కావాటర్ వెర్షన్ 3.1... ఇప్పుడీ మోడల్ 10మీటర్ల ఎత్తు, 60కిలోల బరువుంటుంది. ఐదు రకాల వస్తువులతో నిర్మాణం పూర్తి చేస్తారు. ఆరుగురు వ్యక్తులు నిర్మాణంలో పాలుపంచుకుంటారు. ఎలాంటి పరికరాలు లేకుండా కేవలం మానవ శక్తితోనే పూర్తి చేసేయచ్చు. వార్కావాటర్‌ని తయారు చేయడానికి 4 రోజులు పడితే, అసెంబుల్ చేయడానికి 3 రోజులు అవసరం. ఒక్కో టవర్ నిర్మాణానికి అయ్యే ఖర్చును 1000డాలర్ల (మన కరెన్సీలో రూ.65 వేల లోపు) కంటే తక్కువగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం 10 రకాల పూర్తి స్థాయి ప్రోటోటైప్ వార్కావాటర్ మోడల్స్ సిద్ధంగా ఉన్నాయి.


నీరు... అంత కంటే ఎక్కువ

కేవలం నిర్మాణం పూర్తి చేస్తే సరిపోదంటారు AV టీం. నీటి నిర్వహణపై పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఇథియోపియన్లకు దీని ఉపయోగాన్ని వివరించనున్నారు. నీటి వాడకం, సరఫరా, పంటలకు ఉపయోగించే నీటి రీసైక్లింగ్‌పైనా క్లాసెస్ చేపట్టనున్నారు. వాతావరణంలో మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేందుకు... షేర్‌డ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నారు కూడా. దీనిమూలంగా పంటల ధరలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

వార్కావాటర్ కేవలం సాంకేతిక ఆవిష్కరణ కాదు. భవిష్యత్ తరాలకు తాము అందిస్తున్న మ్యానిఫెస్టో అంటారు ఆర్కిటెక్చర్ & విజన్ టీం.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags