సంకలనాలు
Telugu

సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకమే లక్ష్యంగా మొదలైన ‘ప్రకృతి వనం’

ashok patnaik
24th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


సహజ సిద్ధంగా ఎలాంటి ఎరువులూ వాడకుండా సేంద్రీయ పద్థతుల్లో పండిన పంటలపై ఇప్పుడిప్పుడే జనంలో ఆదరణ పెరుగుతోంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై నగర వాసులు సైతం ఓ నిర్ణయానికి వస్తున్నారు. అలాంటి జనానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రారంభమైంది 'ప్రకృతి వనం'. ఆర్గానిక్ ఫుడ్‌పై అన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ ఇప్పుడు స్టార్టప్ మార్కెట్లో కూడా ఓ చర్చకు దారితీస్తోంది. దీన్ని బిజినెస్ మాడ్యూల్‌గా తీసుకోవడమే కాదు పర్యావరణానికి చేతనైన సాయం చేయొచ్చంటున్నారు ఫౌండర్ సురేష్ చౌదరి.

image


‘కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో ఆహార అలవాట్లు కూడా మారిపోయాయి. పాత తరం ఆరోగ్యవంతంగా ఉండటానికి ఇప్పటి తరం వారు చీటికీ మాటికీ అనారోగ్యానికి గురి కావడానికి కారణం మారిన ఆహారపు అలవాట్లే ’ - అంటారు సురేష్

దీంతో ఎలాంటి ఎరువులు(ఫర్టిలైజర్స్) లేకుండా పండించిన ఆహారపు అలవాట్లపై ఇప్పుడిప్పుడే జనం ఆలోచించడం మొదలుపెట్టారు. నాణ్యమైన వస్తువుల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టడానికైనా సిద్ధపడుతున్నారు. అయితే మేం మాత్రం తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన ఆర్గానిక్ ఫుడ్‌ని ఇస్తున్నామని సురేష్ చెబ్తున్నారు. ఆర్గానిక్ ఫుడ్ అంటే అదో ఖరీదైన వ్యవహారం అనే అభిప్రాయాన్ని పొగొట్టుకోవాలని చెప్పారు. తమ కస్టమర్ల సంతృప్తి కంటే మరేది ఎక్కువ కాదంటారు. ప్రకృతి వనానికి హైదరాబాద్‌లో మంచి బ్రాండ్ వేల్యూ ఉందనేది నిర్వాహకుల మాట.

ఇంతకీ ఏంటీ ప్రకృతి వనం

ప్రకృతి వనం అనేది ఓ ఆర్గానిక్ బజార్. ఆన్ లైన్‌తోపాటు ఆఫ్ లైన్‌లో ప్రోడక్టులను సేల్ చేస్తుంది. ఇక్కడ దొరికే వస్తువులన్నీ సేంద్రీయమైనవే. ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా పండించిన పంట నుంచి తయారు చేసినవే. హైదరాబాద్‌తో పాటు ఇతర ఆంధ్రా ప్రాంతాల్లోని పట్టణాల్లో ఆర్గానిక్ వస్తువులు అమ్మే వివిధ దుకాణాల్లో ప్రకృతి వనానికి సంబంధించిన ఉత్పత్తులు లభిస్తాయని సురేష్ చెబ్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి సమీపంలో 70ఎకరాల్లో ఈ సేంద్రీయ సాగు చేస్తున్నారు. అక్కడ పండించిన వివిధ రకాలైన పంటల నుంచి తయారైన వివిధ ప్రోడక్టులను ప్రకృతి వనం బ్రాండ్ మీద మార్కెట్లో అమ్ముతున్నారు. నూనెలు, పొడులు, అటుకులు, బెల్లం, పసుపు, కారం తోపాటు చాలా రకాలైన వస్తువులు వీళ్లు అమ్ముతున్నారు. వీటితో పాటు సాంప్రదాయ పిండి వంటలు, పచ్చళ్లు ఇక్కడ తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లోని ప్రకృతి వనం స్టోర్ ఉంది.

ఆరోగ్యకరమైన ప్రత్యేక నూనెలు

వేరుశనగ నూనె, సీసమ్ నూనె, కొబ్బరి నూనెలను సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. దక్షిణ భారత దేశంతో ఎక్కువగా ఈ ఆయిల్స్‌నే ఉపయోగిస్తారు. దీన్ని ప్రత్యేక మిల్లులో తయారు చేస్తారు. సాంప్రదాయ పద్దతిలో తీసిన ఈ ఆయిల్‌లో కొవ్వు ఆమ్లాలు (ఫాటీ యాసిడ్స్) తక్కువగా ఉంటాయి. ఇక సీసమ్ ఆయిల్ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పటి రోజుల్లో మసాజ్‌కు దీన్ని ఉపయోగిస్తారు. స్ట్రెస్‌కు సంబంధించిన రుగ్మతలకు ఇది సరైన మందు. ఇక కొబ్బరి నూనెను కోల్డ్ ప్రెస్ పద్ధతిలో తయారు చేస్తున్నారు. వర్జిన్ కోకోనట్ ఆయల్ వీళ్లదగ్గర లభిస్తోంది.

నూనె తయారు చేసే మిల్లు

నూనె తయారు చేసే మిల్లు


ప్రకృతి వనం ఫౌండర్ గురించి

ప్రకృతి వనం ప్రారంభించడానికి అసలు కారణం తాను వ్యవసాయ కుటుంబం నుంచి రావడమే అంటారు సురేష్. ఆంధ్రప్రదేశ్‌లోని క్రిష్ణా జిల్లాకు చెందిన సురేష్ హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లకు కెమెరా, లెన్స్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తుంటారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. కానీ సేంద్రీయ వ్యవసాయంపై ఉన్న మక్కువతో ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. సాగును స్వయంగా పర్యవేక్షించి ప్రోడక్టులను తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. తన తోపాటు చాలా మందికి ఈ సంస్థ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. సేంద్రీయ ప్రాడక్టులు అందించి ఎంతో మంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

ఇప్పటి వరకూ ఆఫ్‌లైన్ సేల్స్ బాగానే సాగుతున్నాయి. ఇకపై ఆన్‌లైన్ అమ్మకాలపై కూడా పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించాలని చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన స్టోర్‌ను మిగిలిన నగరాలకూ విస్తరించాలని చూస్తున్నారు.

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags