ఆన్ లైన్లో ఆర్గానిక్ విత్తనాలు.. హైదరాబాద్ యువజంట వినూత్న ఆలోచన

ఆన్ లైన్లో ఆర్గానిక్ విత్తనాలు.. హైదరాబాద్ యువజంట వినూత్న ఆలోచన

Thursday May 18, 2017,

2 min Read

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్గానిక్ మాట వినిపిస్తోంది. మార్పు మంచిదే కానీ, బయట దొరికే ఆర్గానిక్ వస్తువుల్లో గ్యారెంటీ ఏంటి. అవి సేంద్రియ ఉత్పత్తులే అని నమ్మకమేంటి? ఓ యువకుడికి వచ్చిన ఈ సందేహం.. ఒక స్టార్టప్ దిశగా అడుగులు వేసేలా చేసింది.

image


మనిషి ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. సేంద్రీయ ఉత్పత్తుల మీద జనానికి అవగాహన పెరుగుతోంది. ఈ మార్పు మంచిదే. కానీ బయట మార్కెట్లలో దొరికే ఆర్గానిక్ ప్రాడక్టుల్లో నిజమెంత? అవి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించినవే అని గ్యారెంటీ ఏంటి? అందమైన ప్యాకింగ్, ఆర్గానిక్ అని లేబుల్ వేయగానే దానికి పవిత్రత రాదు. మార్కెట్లో ఆర్గానిక్ వెజిటెబుల్స్ కావల్సినవన్నీ దొరుకుతున్నాయి. వాటిల్లో నిజానిజాలు ఎవరు ప్రూఫ్ చేయాలి? ఇలాంటి సందేహమే నవీన్ అనే యువకుడికి వచ్చింది? బాల్కనీలో మనమే ఆకు కూరలు పండించుకుంటే ఎలా వుంటుంది అనే ఆలోచనతో షాపులన్నీ తిరిగాడు. ఎక్కడా తాను అనుకున్న విత్తనం దొరకలేదు. ఒకటుంటే ఒకటి లేదు. ఆ విసుగులోంచే పుట్టిన ఆలోచనే సీడ్ బాస్కెట్ డాట్ ఇన్.

2 నెలల పరిశోధన చేశాడు. మరో ఆరు నెలలు వెబ్ సైట్ కోసం కష్టపడ్డాడు. మొత్తమ్మీద 8 నెలల కష్టం తర్వాత, హోం గార్డెనింగ్ కోసం అన్ని రకాల విత్తనాలు దొరికే ఆన్ లైన్ స్టోర్ గా సీడ్ బాస్కెట్ అవతరించింది. ఇందులో ప్రస్తుతానికి వంద రకాల సీడ్స్ అందుబాటులో ఉన్నాయి. పూల విత్తనాలు, ఫ్రూట్ సీడ్స్ కూడా ఉన్నాయి. 

image


మొదట్లో అనుకున్నంత రెస్పాండ్ లేదు. అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కొరియర్ ప్రాబ్లం, షిప్పింగ్ సమస్య ఉండేది. మెల్లిగా ఒక్కో ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతానికి నెలకు 50 ఆర్డర్లొస్తున్నాయి. వర్షాలు పడేనాటికి 100 ఆర్డర్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంచి ఇన్వెస్టర్ దొరికితే స్టార్టప్ ఎక్స్ పాన్షన్ చేయాలని చూస్తున్నారు. ఈ జూన్ నాటికి ఫ్రెస్కో సమన్వయంతో బాల్కనీలో 4*4 ఏరియాలో నాలుగు రకాల ఆకు కూరల్ని పెంచే హైడ్రోఫోనిక్స్ విధానాన్ని తేవాలని చూస్తున్నారు.

నవీన్ వృత్తిపరంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండెపూడి గ్రామం నుంచి వచ్చిన నవీన్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా హైదరాబాదులో స్థిరపడ్డారు. నవీన్ భార్య చందన- ఆర్డర్స్ సంబంధించిన పనులు, కొరియర్ వ్యవహారాలు చూస్తారు.

సీడ్ బాస్కెట్ డాట్ ఇన్ ద్వారా విత్తనాలు కొంటున్న కస్టమర్లంతా నవీన్ ఆలోచన బాగుందంటున్నారు. ఇంటింటికీ ఆర్గానిక్ ఫుడ్ అనే సూత్రంతో భవిష్యత్ లో ముందుకు పోతామని నవీన్ నమ్మకంతో చెప్తున్నాడు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి