సంకలనాలు
Telugu

'బిగ్‌ స్టైలిస్ట్'తో బ్యూటీషియన్లను వెదికేపని సులువు

దేశవ్యాప్తంగా ఆన్‌డిమాండ్ సర్వీసులకు పెరుగుతున్న ఆదరణఅనేక నగరాల్లో స్టైలిస్ట్, బ్యూటీషియన్లను వెదకడమంటే నరకమేసౌందర్య సమస్యలన్నిటికీ చెక్ పెడతామంటున్న బిగ్‌స్టైలిస్ట్

Krishnamohan Tangirala
6th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మన దేశంలో ఆన్‌డిమాండ్ కాన్సెప్ట్‌కు ఆదరణ పెరుగుతోంది. డ్రైవర్స్, టైలర్స్, ఫోటోగ్రాఫర్స్, మెకానిక్స్‌ సర్వీసులతోపాటు... నిత్యావసరాలు సహా స్మార్ట్‌ఫోన్‌లోంచే ఆర్డర్ చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. గ్రోఫర్స్, డ్రైవ్‌యు, అర్బన్ టైలర్ వంటి సైట్ల రూట్‌లో.. బిగ్‌స్టైలిస్ట్‌ను రూపొందించారు రిచా సింగ్. బ్యూటీ ప్రొఫెషనల్స్‌కు ఇది మార్కెట్‌ప్లేస్. సర్టిఫైడ్ బ్యూటీషియన్స్ సహా... ఈ రంగంలోని సర్వీసులను ఒకచోటకు చేర్చడమే బిగ్‌స్టైలిస్ట్ లక్ష్యం.

బిగ్‌స్టైలిస్ట్

బిగ్‌స్టైలిస్ట్


ప్రస్తుతం మన దేశాల సౌందర్యానికి సంబంధించిన పరిశ్రమ మొత్తం చెదురుమదురుగానే ఉందని చెప్పాలి. దీనికి తోడు అనేక సర్వీసులకు వసూలు చేసే ఛార్జీలు అధికంగా ఉండడంతోపాటు.. కాస్త అసౌకర్యంగా కూడా ఉంటున్నాయి. కొత్త ప్రాంతానికి వెళ్లినపుడల్లా రిచా, దీప్‌శిఖాలకు నమ్మకమైన బ్యూటీషియన్‌లను వెదకడం చాలా కష్టమయ్యేది.

బిగ్‌స్టైలిస్ట్‌కి బీజం

బ్యాచ్‌లర్స్ డిగ్రీ చదివేందుకు రిచా.. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు మారాల్సి వచ్చింది. ఇక్కడ సరైన వసతులు గల బ్యూటీ పార్లర్స్ లేకపోవడంతో అమ్మాయిలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించింది రిచా.

"మాలో చాలామంది ఖరగ్‌పూర్‌లోని స్థానిక పార్లర్‌లలోని సేవలు అంతగా నచ్చేవి కావు. దీంతో కోల్‌కతా వెళ్లి హెయిర్ సర్వీసులు పొందాల్సి వచ్చేది. ఇక్కడ మాత్రమే కాదు. డిగ్రీ పూర్తయ్యాక ఇతర నగరాలకు వెళ్లినపుడు కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేశాను. కన్సల్టెంట్స్, బ్యాంకర్స్‌గా పనిచేసే నాలాంటి వారికి.. వీలైన సమయంలో బ్యూటీషియన్‌ల అపాయింట్‌మెంట్ దొరకడం చాలా క్లిష్టంగా ఉండేది. నిజానికి ఆ సమస్య ఇప్పుడు కూడా ఉంది " - రిచా.

బిగ్‌స్టైలిస్ట్ ప్రారంభానికి ముందు.. కేపిటల్ వన్, అలివర్ విమాన్‌లలో బిజినెస్ అనలిస్ట్, కన్సల్టెంట్‌గా విధులు నిర్వహించారు రిచా. ఈమెతోపాటు చిన్మయ శర్మ, అనురాగ్ శ్రీవాస్తవలు కో-ఫౌండర్స్‌గా జాయిన్ అవడమే కాకుండా.. ఆపరేషన్స్, టెక్నాలజీ విభాగాలను చూసుకోవడం ప్రారంభించారు.

బెంగళూరులోని ఐఐటీ, ఐఐఎంలలో విద్యాభ్యాసం చేశారు చిన్మయ. బెయిన్ అండ్ కంపెనీలో పలు విభాగాల్లో నాలుగేళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. హైద్రాబాద్ కేంద్రంగా ట్యాలెంట్ అక్విజిషన్, మేనేజ్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడీజీలో అనురాగ్ విధులు నిర్వహించారు.

సొంత వెంచర్‌ ప్రారంభంలో ఎదురయ్యే అవరోధాలను పరిశీలించాక.. ఈ ముగ్గురూ క్షేత్రస్థాయిలో పరిశోధన నిర్వహించారు. ఆ తర్వాత బిగ్‌స్టైలిస్ట్‌ కాన్సెప్ట్‌ను సిద్ధం చేసుకున్నారు.

ఉత్తమ బ్యూటీ సర్వీసులను ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో.. ఓ ప్లాట్‌ఫాం డిజైన్ చేయాలన్నది వీళ్ల ఆలోచన. కస్టమర్లకు వారికి కోరుకున్న సమయంలో, ఆ ప్రాంతంలోని అత్యుత్తమ బ్యుటీషియన్‌లను అందించడమే లక్ష్యంగా బిగ్‌ స్టైలిస్ట్ ప్రారంభించారు.

సవాళ్లు

మే 2015లో ముంబైలో ప్రారంభించినపుడు.. మొదటి నెల 100మంది కస్టమర్లకు సేవలు అందించారు. సగటు లావాదేవీల విలువ ₹ 1200. ప్రస్తుతానికి ఈ వెంచర్‌ను పూర్తిగా ఫౌండర్లు తమ దగ్గరున్న స్వంత నిధులతో ఏర్పాటు చేశారు.

ఇప్పటికే మేం కొంతమంది ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాం. సీడ్ స్టేజ్ ఫండింగ్ పూర్తయ్యాక.. ఈ నిధుల ద్వారా కార్యకలాపాలు పెంచుకోవడంతోపాటు.. సేవలను మరింత విస్తృతం చేస్తాం.

ఎక్కడ నివసిస్తున్నారనే అంశంతో సంబంధం లేకుడా.. కస్టమర్లకు దగ్గరలో ఉన్న ఉత్తమ స్టైలిస్ట్‌లు, అత్యుత్తమ బ్యూటీ ప్రొఫెషనల్స్‌ సర్వీసులను.. వారి చెంతకు చేర్చడమే బిగ్‌స్టైలిస్ట్ సాధించాల్సిన లక్ష్యం.

రిచా, చిన్మయ, అనురాగ్

రిచా, చిన్మయ, అనురాగ్


సర్వీసుల్లో నాణ్యత, సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌ను బోర్డ్‌లోకి తేవడం క్లిష్టమైన విషయం. ఇలాంటి వారిని ఎంపిక చేసుకుని, వారిని ఒప్పించేందుకు కష్టపడాల్సి ఉంటుంది.

“ అయినా సరే నాణ్యత విషయంలో కఠిన నిబంధనలనే పాటించాలని నిర్ణయించుకున్నాం. బ్యుటీషియన్స్, హెయిర్ స్టైలిస్ట్‌లను బోర్డ్‌లోకి తీసుకునే ముందు వారి డీటైల్స్, సర్టిఫికేషన్లను వెరిఫై చేస్తాం”అని చెప్పారు రిచా.

పోటీతోనే అవకాశాలు కూడా

ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిగ్‌స్టైలిస్ట్... వానిటీక్యూబ్, బుల్‌బుల్‌లాంటి వెంచర్‌లతోపాటు.. విస్తృతంగా అందుబాటులో ఉండే అంసంఘటిత రంగంలోని పార్లర్లతో పోటీపడాల్సి ఉంటుంది. నేషనల్ కేపిటల్ రీజయన్‌లోని ఏ ప్రాంతంలో అయినా కేవలం 90నిమిషాల్లోనే సౌందర్య సేవలు అందించే ఆన్‌డిమాండ్ మార్కెట్ ప్లేస్ వానిటీ క్యూబ్.

ఆహారం, ఆరోగ్యం తర్వాత.. ముఖ్యంగా మహిళలు అతి ఎక్కువగా ఖర్చు చేసేది సౌందర్యంపైనే. ప్రతీ నెలా ఉద్యోగం చేసే సగటున ఒక్కో మహిళ ₹2 నుంచి 3వేలు బ్యూటీ నీడ్స్‌పై ఖర్చు చేస్తున్నారు.

పరిశ్రమ అంచనాల ప్రకారం.. ఇంతటి విస్తృతమైన భారతదేశంలో బ్యూటీ సర్వీసుల మార్కెట్ విలువ 4.8 బిలియన్ డాలర్లు. అంటే 30వేల కోట్ల రూపాయల పైమాటే. ఇది శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రధానమైనది కూడా.

యువర్‌స్టోరీ పరిశీలన

గత ఏడాదిగా దేశంలో ఆన్‌డిమాండ్ సర్వీసులకు డిమాండ్ అనుకున్నదానికంటే వేగంగా పెరుగుతోంది. ప్రధానంగా మెట్రోలు, నగరాల్లోని కస్టమర్లు వీటికి ఎక్కువగ మొగ్గు చూపుతున్నారు. లాండ్రీ, డ్రైవర్, గ్రాసరీ, ఎఫ్‌ఎంసీజీ ఫుడ్స్‌ కోసం కూడా వీటిపై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఈ ఏడాది మన దేశంలోబ్యూటీ, వెల్‌నెస్ రంగాల్లో ఆన్‌లైన్ ప్లేయర్ల వాటా గణనీయంగా పెరుగుతోంది. కస్టమర్లు, వ్యాపారులు, ఇన్వెస్టర్లు కూడా ఈ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. మొబైల్ ప్లాట్‌ఫాంనే నమ్ముకున్న వోయ్‌మో... యువి క్యాన్, టాక్సీ ఫర్ ష్యూర్ కో ఫౌండర్ అప్రమేయల నుంచి రెండు రౌండ్ల సీడ్ స్టేజ్ ఫండింగ్ పూర్తి చేసింది. మొబైల్‌తోపాటు.. క్లౌడ్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్న మేనేజ్‌ మై స్పా 6మిలియన్ డాలర్ల సిరీస్ ఏ ఫండింగ్ కంప్లీట్ చేసింది. అస్సెల్ పార్ట్‌నర్స్ ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేసింది.

ఎక్కడికక్కడ స్థానిక మార్కెట్లపై ఆధారపడ్డ ఆన్‌ డిమాండ్ సర్వీసులకు ఇప్పుడు మంచి కాలమని చెప్పాలి. అయితే.. ఈ విభాగం త్వరలో కన్సాలిడేషన్ స్టేజ్‌కు రాబోతోంది. బ్యూటీ వెల్‌నెస్ రంగాల్లో అంత ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు, బడా వెంచర్లు లేకపోవడం.. ఇంకొన్నేళ్లు ఈ రంగంలో భవిష్యత్తు ఉందనే అంచనాలను ఏర్పరుస్తోంది.

వెబ్‌సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags