సంకలనాలు
Telugu

మహిళల టాయిలెట్ సమస్యకు 'పీ బడ్డీ'తో సమాధానం

మహిళల కోసం వినూత్న ఆలోచనపీబుడ్డిస్ రూపకల్పన చేసిన ఢిల్లీ కుర్రాళ్లుస్వచ్ఛభారత్ మిషన్ కు సహాయ పడనున్న ప్రాడక్ట్

ashok patnaik
7th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

గ్రామీణ భారతంలో ప్రతి మహిళ జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే ఉంటుంది. బయిటకు చెప్పుకోలేక శుభ్రమైన టాయిలెట్ లేక నానా అవస్థలు పడుతుంటారు. వీటికి చెక్ చెప్పేందుకు ముగ్గురు ఢిల్లీ యువకుల మదిని తొలిచిన ఆలోచనే పీ బడ్డీస్. నాటకీయంగా సంభాషించుకున్న.. ఈ ముగ్గరు చివరికి కార్యరూపం తీసుకొచ్చి.. సుసాధ్యం చేశారు. 2014 లో ఢిల్లీలో పీ బడ్డీస్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా స్త్రీలకు నాణ్యతతో కూడిన నాప్ కిన్స్ అందించేందుకు, మహిళల పరిశుభ్రత, సన్నిహిత రక్షణ ఉత్పత్తులు రూపొందించారు. చెత్త చెత్తగా ఉన్న మరుగుదొడ్లు అసహ్యించుకునే మహిళల కోసం ఓ విప్లవాత్మక ఉత్పత్తే పీ బుడ్డి. పని, సుదూర యాత్రల్లో ఉన్నప్పుడు వీటిని ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఇవి యూజ్ అండ్ త్రో కావడంతో మహిళలు పరిశుభ్రత పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అమలైన ఆలోచన

జనవరి 2014 లో జైపూర్ నుంచి ఢిల్లీకి వెళుతున్నాము. మేము నలుగురుం జంటలుగా ఉన్నాం. మహిళలు, మార్గంలో ప్రతి పెట్రోలు స్టేషన్ దగ్గర టాయిలెట్‌కు వెళ్లడానికి పడుతున్న అవస్థలు గమనించాము. ఎక్కడో ఆగడం.. అక్కడ వాష్ రూమ్ సరిగ్గా లేకపోవడం..తిరిగి వెనక్కి రావడం జరిగింది. మొత్తం ఐదు చోట్లకు వెళ్లగా ఒక్కటి మాత్రమే కొంచెం శుభ్రంగా అనిపించింది. సాధారణంగా మహిళలు ఎల్లప్పుడూ మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. మా ఫ్రెండ్స్ భార్యలో ఒకరు.. యూరోప్‌లో మురికి టాయిలెట్‌లో మూత్రవిసర్జనకు ప్లాస్టిక్ పరికరం ఉంటుందని గుర్తు చేశారు. అలా మాకు తట్టిన ఐడియాతోనే "PeeBuddy'' స్థాపించామంటారు దీప్. మా ఫ్రెండ్ భార్య అన్న మాటలతో నాకు తళుక్కున సలహా మెరిసింది. మేము భారతదేశం లో ఈ తరహా ప్రొడక్ట్స్ తయారు చేస్తే ఎలా ఉంటుందని, ప్రశ్న మాలో ఉదయించింది. అయితే ఇదే విషయంపై చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్కరూ నవ్వడంతో పాటు,ఆలోచనను తోసిపుచ్చారు. కొంత మంది వెనక్కి లాగారు. కానీ మేం మాత్రం ఆలోచనలకు కార్యారూపం పెట్టామన్నారు దీప్

దీప్(ఫౌండర్),రాహుల్,మోహిత్(కో ఫౌండర్లు)

దీప్(ఫౌండర్),రాహుల్,మోహిత్(కో ఫౌండర్లు)


ఈవెంట్స్ నిర్వహణలో ప్రొఫెషనల్ అయిన దీప్, అతని భార్య కార్పెట్ వ్యాపారంలో ఆమెకు సహాయం చేస్తూ రగ్గులు సంస్థకు రూపకల్పన చేశారు. కానీ అతని మనస్సులో నాటుకున్న పీబడ్డీ ఏర్పాటుకు పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీప్‌కు అతని స్నేహితులైన మోహిత్ బజాజ్, రాహుల్ ఆనంద్‌లు ఈ వెంచర్‌లో కలవాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 2014 నుంచి వారు పనిచేస్తున్న ఉద్యోగాలను విడిచి... పీబడ్డి కంపెనీల్లో కో ఫౌండర్లుగా కంపెనీలో చేరిపోయారు.

అందరూ మూత్రవిసర్జనకు కొత్త పరికరాలు రావడంతో...మొదట్లో కొంత ఆసక్తి ఉంది. షాపుల వద్దకు వెళ్లి.. వాటిని మార్కెటింగ్ కోసం నానా అవస్థలు పడ్డారు. దుకాణాల వద్దకు వెళ్లడం, మరో వైపు ఉత్పత్తిని కొనసాగిస్తూనే డాక్టర్లు, ప్రొఫెషనల్స్‌ను కలిసి వాటిపై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. హైపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్‌లో మహిళల అవసరాలపై దృష్టి సారిస్తున్నామని చెపుతూనే... మాకు మాత్రం బ్యాక్ టూ డోర్ అనే సమాధానమే వినిపించింది . మా ఉత్పత్తి పదం 'పీ' ఎందుకంటే 'మహిళలు నిలబడి peeing' గురించి మాట్లాడటానికి తగ్గట్టుగానే ఆ పేరు పెట్టామని "దీప్ చెప్పారు.

పీబడ్డీ ప్రాడక్ట్ ప్యాక్

పీబడ్డీ ప్రాడక్ట్ ప్యాక్


ఏప్రిల్ 2014 లో నలుగురు మిత్రులు 65 లక్షల రూపాయిలతో పీబడ్డిని ప్రారంభించారు. మహిళల అవసరాలపై అవగాహనతో పాటు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తెలుసుకొన్న ఈ టీమ్ వారి ఉత్పత్తి పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఓటమిని అంగీకరించకుండా సక్సెస్ అవుతామని ధైర్యంతో చెబుతున్నారు. మహిళల మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి తగిన వస్తువులు, అవకాశాలు లేవు.. కాబట్టి వీటి అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ముందుగా మార్కెట్లోకి వెళ్లడమే మాకు ప్రధాన అడ్డంకి.. ఒక్కసారి మహిళల నుంచి మాకు ధ్రువీకరణ వచ్చిందంటే, మా ఉత్పత్తులు హాట్ కేక్.. ఆ విషయం మాకు తెలుసు.. మా ఆలోచన అంతా ప్రారంభం కోసమేనంటారు కంపెనీ ఫౌండర్స్..

ఉత్పత్తి ప్యాక్

PeeBuddy నిలబడి మూత్రవిసర్జన చేసుకొనే విధంగా మహిళలు కాళ్ళ మధ్య సరిపోయే, డిస్పోజబుల్ సొరంగం ఆకారంలో కాగితం రూపొందించారు. దీంతో మూత్రవిసర్జన చేయడం ఈజీ అవుతుంది. రాహుల్ చేసిన డిజైన్ తో మహిళలకు సౌకర్యవంతంగా ఉండేది. వీటితో పాటు "మేము దాదాపు 10 ఆకారాలు ప్రయోగాలు చేశాము. ఇంకా మా ఉత్పత్తి కోసం పేటెంట్ దాఖలు చేశామన్నారు. దానికి ఫిబ్రవరి 2015 న హక్కులు వచ్చాయంటారు దీప్. సాధారణంగా 10 ప్యాడ్స్ ఉన్న ప్యాక్ ధర 200రూపాయలుండగా , 20 ప్యాడ్స్ ప్యాక్ రూ. 375 రూపాయలు.

భారత రిటైల్ దుకాణాలకు మా ప్రొడక్ట్స్ చేరడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. కానీ PeeBuddy కి ఆన్ లైన్ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కామర్స్ వెబ్ సైట్లు అయిన Healthkart, Snapdeal, Amazon.in వంటి సంస్థలు వినియోగదారులకు మా ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇక ఢిల్లీలోని షాపింగ్ కాంప్లెక్స్ లు రిటైల్ దుకాణాలైన WH స్మిత్, NewU కూడా ఉత్పత్తి మొదలుపెట్టాయి. ముంబై మారథాన్ స్టాండర్డ్ చార్టర్డ్ నుంచి కూడా అతిపెద్ద ధ్రువీకరణ వచ్చింది. ప్రారంభించిన మొదటి ఏడాదే దాదాపు 20,000 బుడ్డీస్ అంటే 15 లక్షల విలువైన విక్రయాలు చేశామని వివరిస్తారు.

మార్కెట్ ఎక్కడ ?

"మా ప్రొడక్ట్స్ కు లిమిట్లెస్ మార్కెట్ ఉంది. ఎప్పుడూ పబ్లిక్ టాయిలెట్స్ మహిళలు శుభ్రంగా వాడుకోగలుగుతారో అప్పటి వరకు మార్కెట్ కు ఢోకా ఉండదని చెబుతారు. అప్పుడే PeeBuddy తగ్గుతుంది. అదే జరిగితే నాకు అంత కంటే సంతోషం ఏమి ఉండదు. కానీ అప్పటి వరకు మా ఉత్పత్త్తులును వినియోగదారులు కొనుగోలు చేస్తూనే ఉంటారు. అంతే కాదు ఇది కీళ్ళనొప్పులు కల్గిన మహిళలకు, గర్భం దాల్చినప్పుడు కూడా మహిళలకు తోడుగా ఉంటుందని దీప్ చెబుతారు.


ఫ్యూచర్ ప్లాన్స్

PeeBuddy రాబోయే నెలల్లో ఉత్పత్తుల శ్రేణిని పెంచాలనే యోచనలో ఉంది. మరో వారంలో మేము మా రెండవ ఉత్పత్తి ప్రారంభించనున్నామని వివరిస్తున్నారు. మహిళలకు సన్నిహిత తొడుగులు, తయారు చేయనున్నామని డీప్ చెప్పారు. మే లో శిశువు సంరక్షణ ఉత్పత్తులుపై రీసెర్చి చేసి కొత్త డిజైన్ చేస్తామని చెబుతున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags