సంకలనాలు
Telugu

యువర్ స్టోరీలో నూతన అధ్యాయం మొదలు

ఏడేళ్లుగా సాగుతున్న యువర్ స్టోరీ ప్రయాణంనా లక్ష్యాన్ని చేరుకోవడానికి, రెక్కలు విప్పార్చడానికి నిధులు సమీకరించామమ్మల్ని నమ్మి, మా సిద్ధాంతాలకు విలువ ఇచ్చే వాళ్లు దొరకడం అదృష్టంయువర్ స్టోరీలో ప్రముఖులు పెట్టుబడిరతన్ టాటా, వాణీ కోలా, మోహన్‌దాస్ పాయ్, కార్తీ మదస్వామి మా ప్రయాణానికి మద్దతు పలికారుత్వరలో మీ భాషలోనే మీ కథలు మాకు చెప్పండి, వినండి, రాయండిప్రాంతీయ భాషల్లో యువర్ స్టోరీ - శ్రద్ధా శర్మ

team ys telugu
17th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆగస్ట్ 2008, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేనో కొత్త వెంచర్ ప్రారంభించబోతున్నానని ముంబైలో ఉన్న కొంత మంది పారిశ్రామికవేత్తల సమూహానికి చెప్పాను. వెలుగులోకి రాని, సూపర్ స్టార్స్ కాని మామూలు జనాలు... ఉత్సాహం, భవిష్యత్తుపై ఆశతో ముందుకు కదిలే వాళ్ల కథలను ప్రపంచానికి చెప్పాలని ఉందని వివరించాను. వారిలో కేవలం కొంత మంది మాత్రమే 'డూ ఇట్' అంటూ ప్రోత్సహించారు. అధిక శాతం మంది 'ఇది వర్కవుట్ అయ్యేది కాదంటూ' తేల్చేశారు.

''ఆరు నెలలకు మించి నిలబడలేవు. అదో సోషల్ హాబీ లాంటిది, అంతకు మించి అందులో ఏమీ లేదు. జనాలకు తెలియని పారిశ్రామికవేత్తల కథల చెప్పడం వల్ల కమర్షియల్‌గా ఒరిగేదేంటి ?''

అయినా నా మనసు మాటనే నేను విన్నాను. సెప్టెంబర్ 16, 2008న యువర్ స్టోరీ ప్రారంభించాను. (సైట్ లైవ్‌లోకి వెళ్లింది).

image


ఇప్పటికీ ఏడేళ్లుగా మా ప్రయాణం సాగుతూనే ఉంది. ఇన్నేళ్లుగా ఎంతో ఉత్సాహంగా, ఇదే ధ్యాసగా బతికాం. మీ గాధలను ప్రపంచానికి తెలియజేయడమే మా శ్వాసగా జీవించాం. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న ప్రముఖులతో కలిసి ఇప్పుడు మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం.

మీ కథలను ప్రపంచానికి చెప్పడమే ప్రధాన ఉద్దేశంగా ఏడేళ్లుగా ప్రతీ రోజూ పనిచేస్తున్నాము. బలీయమైన కాంక్ష, మా పై మాకు ఉన్న నమ్మకమే మా ఆస్తి. అన్నింటికంటే ముఖ్యం... ఆంట్రప్రెన్యూర్స్ ప్రేమ, వాళ్ల ఆదరణే మమ్మల్ని ముందుకు నడిపించింది. ప్రేమ, ఉత్సాహం, ఆనందంతో పాటు విమర్శలనూ స్వీకరిస్తూనే ముందుకు సాగాం.

శ్రమిస్తున్న వాళ్లు, విజయ తీరాలను చేరిన వాళ్లు, భవిష్యత్‌పై కలలు కంటున్న వాళ్లు, ఓడిపోయిన వాళ్లందరితో నేను నా అనుభవాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. నా ప్రయాణం నుంచి మీరూ మీ అర్థాలను వెతుక్కోవచ్చు.

  • నాకు చాలా కాలమే పట్టింది.. లాట్ ఆఫ్ టైం

ఒంటరిగా నేను చాలా దూరం సుదీర్ఘ ప్రయాణమే చేయాల్సి వచ్చింది. అసలు నేను ఏం చేస్తున్నానో నాకైనా అర్థమవుతోందా.. అని చాలా సార్లు లోలోపల కుమిలిపోయాను. కానీ, నా లోపల రగులుతున్న జ్వాలే నన్ను ఇంతకాలం ముందుకు నడిపించింది. డూ ఆర్ డై. ఆగిపోవడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాకూడదని నిశ్చయించుకున్నా.

  • అద్భుతమైన అనుభవాలే నా ఆస్తి

మంచి, చెడులను నేను ఆనందంగానే స్వీకరిస్తాను. అవే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకువచ్చాయి. అన్ని తెలుసని అనుకుంటున్న వాళ్లను, నిపుణులను నమ్మొద్దు. ఎందుకంటే వాళ్లను చూసి మీరు కుంగిపోతారు. వెనక్కివాలిపోతారు. ఇట్స్ ఓకె. అందరూ చేయగలరు. ప్రతీ ఒక్కరికీ ఆ సత్తా ఉంది. మీ అనుభవాల్లో ఆనందంగా బతకండి.

ఎన్ని సార్లు కుమిలిపోయానో, ఎన్ని సందర్భాల్లో గుండెలు పగిలేలాంటి అనుభవాలను ఎదుర్కొన్నానో.. నన్ను బాగా దగ్గరి నుంచి చూసిన వాళ్లకు మాత్రమే తెలుసు. ఒక్కటి మాత్రం నిజం. మీరు పాతాళాన్ని చూడకపోతే.. ఎత్తులకు చేరినప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించలేరు. నేను చాలా సందర్భాల్లో అట్టడుగుకు చేరాను, జీవించడానికి అది కూడా ఓ మంచి స్థావరమే. అయితే కింద పడిన ప్రతీ సారీ.. అంతే ఉత్సాహంతో, రెట్టింపు వేగంతో పైకి లేస్తూ వచ్చాను.

  • కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను

చేసిన కృషికి వంద రెట్ల ఫలితం రావడాన్ని నేను కళ్లారా చూశాను. మారిపోతున్న ఎంతో మంది పారిశ్రామికవేత్తలను నేను దగ్గరుండి చూశాను. వాళ్లలా మారిపోకుండా ఉండేందుకు నేను చాలా కష్టపడ్డాను. నా వెన్నెంటే ఉంటే నా టీమ్ నేనెప్పుడూ భూమి మీదే ఉండేట్టు చేసింది. నా చుట్టూ మారుతూ ఉన్న ప్రపంచాన్ని కళ్లారా చూశాను.

  • ఏడేళ్లుగా సొంత కాళ్లపైనే !

ఇప్పుడు మేం చేసిన నిధుల సమీకరణ వార్తలను మీరు చూశారు. అయితే ఇది బూట్ స్ట్రాపింగ్‌కు దొరికిన గౌరవం మాత్రమే కాదు. ఇట్ డిజర్వ్స్. ఏడేళ్లుగా బూట్ స్ట్రాపింగ్ (సొంత నిధుల ఖర్చు) చేస్తూ వస్తున్నాను. నా దగ్గర చాలా అవకాశాలున్నాయని, ఎంతోమంది నిధులు కుమ్మరించడానికి వస్తున్నారని దాని అర్థం కాదు. నా బూట్ స్ట్రాపింగే నన్నీ స్థాయికి తీసుకువచ్చాయి. ఎవరి సహకారమూ లేకుండా పయనించాల్సి ఉంటుందని తెలిసినప్పుడు ఆ ఆలోచన, ధృడత్వమే వేరుగా ఉంటుంది.

నా రెక్కలు విప్పార్చడానికి, నా లక్ష్యం చేరుకుని.. ప్రతీ కథకూ ప్రాముఖ్యం ఉందని ప్రపంచానికి తెలియజేయడానికి బయటి నుంచి నిధుల సమీకరణ చేశాను. అయితే అలాంటి విలువలు, ఆలోచనలు ఉన్న వాళ్లతోనే నడవాలని నిశ్చయించుకున్నాను.

''నా అదృష్టం కొద్దీ వీళ్లంతా దొరికారు. రతన్ టాటా, వాణీ కోలా (కలారి క్యాపిటల్), కార్తీ మదస్వామి (క్వాల్‌కాం వెంచర్స్), టివి మోహన్‌దాస్‌ పాయ్ .. యువర్ స్టోరీలో పెట్టుబడి పెట్టారనే వార్తను మీతో ఆనందంగా పంచుకుంటున్నాను''.

ప్రతీ కథకూ ఓ విలువ ఉంటుందని నమ్మడం గొప్ప విషయం. ఈ ఆలోచనకు మద్దతు తెలిపి, మా విశ్వాసాన్ని విశాల హృదయంతో ఆదరించడం ఇంకా ముఖ్యం. యువర్ స్టోరీని వివిధ రకాలుగా ప్రభావితం చేసిన వాళ్లందరి పేర్లనూ ఇక్కడ చెప్పలేను. కానీ మాకు మద్దతు తెలిపి, మాతో పాటు నిలిచిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా బ్రిలియంట్‌ టీమ్‌కు. వాళ్ల గమ్యంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకున్న ప్రతీ ఆంట్రప్రెన్యూర్‌కూ నా కృతజ్ఞతలు.

ఇక్కడ మీ అందరికీ మరో ఉత్తేజితమైన ప్రకటన. ప్రతీ కథా మాకూ ముఖ్యమే అనేది యువర్ స్టోరీ డిఎన్ఏ. అందుకే భారత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓ టెక్ ప్రొడక్ట్‌ను లాంచ్ చేయబోతున్నాం. ఇక్కడ మీరు మీ కథలను మీ భాషలోనే చదవచ్చు, రాయొచ్చు, మాట్లాడొచ్చు, అది కూడా మొబైల్ ఫోన్‌ ద్వారా. ఎప్పటి నుంచో మీకు ఇవ్వాలని అనుకుంటున్న బహుమతి ఇది. ఇక నుంచి మన స్టోరీలను మన భాషల్లోనే చెప్పుకుని ఎన్నో ఒరిజినల్ స్టోరీలకు ప్రాణం పోయచ్చు. ఈ ప్రయాణంలో మీరందరూ మాతోపాటి కలిసి రండి. ప్రతీ ఇంట్లో ఉన్న ఓ కథను, వాళ్ల ఆశలను, వాళ్లలో రగులుతున్న జ్వాలను మన భాషలో ప్రపంచానికి పరిచయం చేద్దాం.

మీతో కలుపుకుంటూ, మీ ప్రయాణంలో మమ్నల్ని భాగస్వామ్యం చేసుకుంటూ యువర్ స్టోరీకి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఎల్లలు లేని మీ ప్రేమ, ఆప్యాయతే ఇప్పుడు ఇలా వెల్లివిరిసింది.

ఒక్క క్షణం... మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కథల్లో భాగమైన మీకు, నాకు, మనకు.. అందరికీ ఛీర్స్.

- శ్రద్ధా శర్మ, చీఫ్ ఎడిటర్, ఫౌండర్ - యువర్ స్టోరీ

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags