సంకలనాలు
Telugu

ప్రారంభమైన పదినెలల్లోనే అమ్ముడైన ఓ స్టార్టప్ కథ ఇది !

team ys telugu
27th Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

అభిషేక్ నాయక్. అప్పటికే ఓ ఫేమస్ స్టార్టప్ ఫౌండర్. సెకోయా క్యాపిటల్ సహకారంతో తను గతంలో ఏర్పాటు చేసిన ఘర్ పే సంస్థను ఢెలివరీ కొనుగోలు చేసింది. 2013 జూలైలో ఘర్‌పే నుంచి బయటకి వచ్చాక ఒక కొత్త ప్రొడక్ట్ మీదే ఫోకస్ పెట్టారు అభిషేక్ నాయక్. కరెక్టుగా పదిమాసాల్లో పాపులర్ అయిపోయారు. ఆయన స్థాపించిన కంపెనీయే క్లింక్ నౌ. తమ కస్టమర్ బిహేవియర్‌ను, ఖర్చు చేస్తున్న తీరును బ్యాంకర్లు (క్లైంట్లు) సులువుగా అర్థంచేసుకునే విధంగా డేటాను ఎనలైజ్ చేయడం ఈ సంస్థ పని.

అభిషేక్ నాయక్, ఈజీ ట్యాప్

అభిషేక్ నాయక్, ఈజీ ట్యాప్


బెంగళూరు కేంద్రంగా మొదలైన Ezetap (ఈజీట్యాప్) ఓ మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్.. హార్డ్ వేర్ ప్రొవైడర్. ఇంటర్నెట్ లేకుండా కూడా కార్డ్ పేమెంట్స్‌ను ప్రాసెస్ చేయగల వ్యవస్థ ఇది. కేవలం మొబైల్ ఫోన్, నెట్వర్క్ ఉపయోగించుకుని ఇది లావాదేవీలను నిర్వహిస్తుంది. క్లింక్ నౌ బిజినెస్ మోడల్ తమకు అనుకూలంగా ఉండడంతో ఈజీ ట్యాప్ ఉత్సాహం చూపి కంపెనీని కొనేసింది. దీని వల్ల ఒక క్లైంట్‌కు పేమెంట్ సొల్యూషన్ అందించడంతో పాటు డేటాను ఎనలైజ్ కూడా చేయడం సాధ్యపడ్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది క్లైంట్లకు ఎంతగానో ఉపయోగపడ్తుంది.

కొనుగోలుకు ముందు క్లింక్ నౌ దగ్గర ఒకే ఒక్క క్లైంట్ ఉన్నారు. వాళ్లే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. తమ దగ్గరున్న లక్షన్నర డెబిట్, కార్డుదారుల డేటాను క్లింక్ నౌ ప్రొడక్ట్‌తో ఎనలైజ్ చేస్తున్నారు. ఆరు నెలల పాటు HDFC బ్యాంకుకు సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు కూడా నడుస్తోంది. వీటితోపాటు మరికొన్ని బ్యంకులు కూడా క్లైంట్లుగా మారేందుకు సిద్ధపడ్తున్న సమయమది. బ్యాంకులకు సేవలకు అమ్మడం అంత సులువైన విషయమేమీ కాదు. లావాదేవీల మార్కెట్లో అప్పుడు అంత పెద్దగా డబ్బు కూడా లేదు. ఇక వేల్యూ అడిషన్ సేవలనేవి ఎంతో దూరపు మాట అంటారు క్లింక్ నౌ ఫౌండర్ అభిషేక్.

ఈజీ ట్యాప్‌తో కలిపి వేల్యూ యాడెడ్ సేవలకు సంబంధించిన ఓ బేసిక్ యాప్‌పై అప్పట్లో దృష్టి పెట్టాం.

ఘర్ పే నుంచి క్లింక్ నౌ వరకూ

2013 జూలైలో ఘర్ పే సంస్థను ఢెలివరీ కొన్న తర్వాత క్లింక్ నౌ ప్రారంభమైంది. అప్పట్లో మాకిది ఓ ఛాలెంజ్ లాంటిది. ఘర్ పే.. క్లింక్ నౌ సంస్థల మధ్యపోలికే లేదు. ఈ రంగంలో మా టీంకి అసలు అనుభవమే లేదు. ఈ కామర్స్ సంస్థలకు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను అందించే సంస్థ ఘర్ పే అయితే.. ఆన్‌లైన్ లావాదేవీల కోసం రూపొందిన సంస్థ క్లింక్ నౌ.

లావాదేవీల డేటాను ఎవరూ అనలైజ్ చేయాలనే ఆలోచన కూడా లేని రోజుల్లో క్లింక్ నౌ పుట్టుకొచ్చింది. పేమెంట్ ఇండస్ట్రీలో వ్యాపరస్తులకు విలువ ఆధారిత సేవలు అందిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని మాకు అనిపించింది. అందుకే మేం ఆ దిశగా మా పరుగు ప్రారంబించాం. మా టీమ్ చాలా చక్కగా తన బాధ్యతలను మెరుగ్గా నిర్వర్తించడం వల్ల మార్పు (ట్రాన్సిషన్) సులభంగా సాధ్యమైంది.

క్లింక్ నౌ అనుభవం నుంచి ఏం నేర్చుకోవాలి

గడిచిన 10నెలలూ ఓ గొప్ప అనుభవాన్ని అభిషేక్ , అతని టీం కు సంపాదించి పెట్టాయి. ఈ ప్రాసెస్ లో అభిషేక్ ఆస్ట్రేలియన్ బ్యాంక్ తోపాటు ప్రంపంచలోని మరికొన్ని బ్యాంకులని కలిశాడు. దీని ద్వారా టీం మరికొన్ని అద్భుతమైన విజయాలను, అనుభవాలను నేర్చుకున్నారు.

1. బ్యాంకులకు ప్రొడక్ట్ అమ్మడం అంటే సులువైన విషయం కాదు. దానికి చాలా ఓర్పు అవసరం.

2. బ్యాంకుల తో కలసి పనిచేయడం వల్ల భారీ మొత్తంలో డబ్బుని సంపాదించొచ్చు కానీ.. చాలా టైం పడుతుంది.

3. కన్స్యూమర్‌ను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులకు సేవలను అందించడం అంటే చాలా కష్టం. అది కూడా మొట్టమొదటిసారి అలాంటి పని చేస్తున్న టీమ్‌పై ఇంకా ఎక్కువ బాధ్యత, భారం ఉంటుంది. అయినా సరే మా టీమ్ మెరుగైన పనితీరునే కనబర్చి.. అందరి మన్ననలూ పొందింది.

ఈజీట్యాప్(Eetap) తో కలసి పనిచేయాలనుకోవడం

పేమెంట్స్ కంపెనీ ఈజీట్యాప్‌తో కలిసి క్లింక్ నౌ పనిచేయడం ఓ సాధారణ విషయమే. ఈజీ ట్యాప్‌లో ఉన్న ముఖ్య ఫీచర్స్.. ఈ కొనుగోలుకు మార్గం సుగమం చేశాయి.

1. కంపెనీ రోడ్ మ్యాప్ లో కొన్ని నిర్దిష్టమైన, దూసుకెళ్లగలిగే ఆలోచనలు ఉండడం.

2 . ఓ గొప్ప ప్రాడక్ట్ ని తయారు చేయడమే కాకుండా, అనుభవం ఉన్న టీం ని ఈజీట్యాప్‌కి ఉంది.

3. సంజయ్, అభిజిత్‌లు మమ్మల్ని చాలా త్వరగా అర్థం చేసుకున్నారు. ఈజీట్యాప్‌తో కలిసి పనిచేయగలమని నమ్మారు.

4. ఒక్క పేమెంట్స్‌కే పరిమితం కాకుండా వాళ్లకు ఓ పెద్ద విజన్ ఉంది. విలువ ఆధారిత సేవలతో పాటు విదేశాలకూ వెళ్లాలని లక్ష్యాలు ఉన్నాయి.

image


ఈటూఈట్యాప్, క్లింక్ నౌ ఎందుకు కలిశాయి

మా కస్టమర్లకు టార్గెట్ ఆఫర్లను ఇంతకాలం ఈజీట్యాప్ ద్వారా మేం అందిస్తూ వచ్చాం. మేం కాస్త ముందుకు వెళ్లి మా కస్టమర్ల అవసరాలు, వాళ్ల ఆలోచనా ధోరణిని తెలివిగా గుర్తించి వాళ్లకు సరిగ్గా సరిపోయే మరిన్ని ఆఫర్లను ఇచ్చేందుకు వీలు పడ్తుందని.. ఈజీట్యాప్ కో ఫౌండర్ సంజయ్ స్వామి వివరించారు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags