సంకలనాలు
Telugu

మీ మెడికల్ బిల్ తగ్గాలా..? అయితే ఇలా చేయండి!!

12th Apr 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


"యాభై లక్షల రూపాయలు..."

కార్పొరేట్ హాస్పిటల్ ఫార్మాసిస్ట్ నోటి వెంట వచ్చిన ఆ ఫిగర్ ని అజయ్ గండోత్రా నమ్మలేకపోయాడు. తను సరిగ్గా వినలేదమో అనుకుని మళ్లీ అడిగాడు "ఎంత..?" అని. ఎందుకైనా మంచిదని ఈ సారి కొంచెం కేర్ ఫుల్ గా చెవులు రిక్కించి మరీ విన్నాడు...

"యాభై లక్షల రూపాయలు సర్..." 

 ఈ సారి అజయ్ కి ఈ మొత్తం డీటీఎస్ లో వినిపించింది. చెవుల్లో పావుగంట సేపు అలా వినిపిస్తూనే ఉండిపోయింది.

కుర్చీలో జారిగిలబడిపోయాడు.. కాసేపటికి తేరుకున్నాడు. దేశదేశాలు తిరిగి ఉద్యోగాలు చేసి కూడబెట్టుకున్నదంతా హాస్పిటల్ ఖాతాలో జమ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని నిట్టూర్చాడు.

అజయ్ గండోత్రా తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్. అమ్మకు వైద్యం చేయించడం కోసం విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు వదిలి ఇండియాకి వచ్చేశాడు. వైద్య ప్రక్రియ ప్రారంభం అయింది. కానీ కీమోథెరపి కోసం "హెర్సిప్టిన్" అనే మెడిసిన్ ను ఏడాది పొడవునా వాడాల్సి ఉంటుంది. ఈ మందు ఏడాదికి సరిపడా డోస్ విలువ అక్షరాలా రూ.40 నుంచి 50 లక్షలు.

అనుభవం ఇచ్చిన ఐడియా

హెల్త్ ఇన్సూరెన్సులు ఎన్ని ఉన్నా వాటికి ఉన్న పరిమితుల దృష్ట్యా- తనకు బిల్లు కట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదనుకున్నాడు. కానీ చివరి ప్రయత్నంగా గూగుల్ లో గంటల తరబడి వివరాలు సేకరించి కంపెనీల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి నేరుగా మందులు కొనుగోలు చేసి దాదాపుగా నలభై శాతం ఆదా చేసుకున్నాడు. ఈ మెడికల్ బిల్లులు దాదాపు అందరినీ ఏదో ఒక సందర్బంలో పీడిస్తూనే ఉంటాయని అజయ్ గండోత్రాకు అప్పుడర్థమయింది. తను గూగుల్ సెర్చ్ తో నలభై శాతం ఆదా చేసుకున్న విధంగానే అందరికీ సాయపడాలనే నిర్ణయానికి వచ్చాడు. కొంత పరిశోధన చేసిన తర్వాత గత ఏడాది జూన్ లో తన భార్య నిషి గండోత్రాతో కల్సి సేవ్ ఆన్ మెడికల్స్ ను ప్రారంభించాడు. 

అజయ్, నిషి, సేవ్ ఆన్ మెడికల్స్ ఫౌండర్స్<br>

అజయ్, నిషి, సేవ్ ఆన్ మెడికల్స్ ఫౌండర్స్


హాస్పిటల్స్ తో టై అప్

కస్టమర్ల మెడికల్స్ బిల్స్ ను సగానికి సగం ఆదా చేయాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించాడు. ఒక్క మెడిసిన్స్ అందుబాటులోకి తేవడం మాత్రమే కాదు- హాస్పిటల్స్ తో టై అప్ అయ్యారు. వీడియోల ద్వారా డాక్టర్ కన్సల్టేషన్ సేవలు అందించేందుకు మరికొన్ని స్వతంత్ర ఆస్పత్రులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ హాస్పిటల్స్ అన్నీ తమ సాధారణ ఫీజుల్లో ఇరవై నుంచి యాభై శాతం వరకు సేవ్ఆన్ మెడికల్స్ ద్వారా సేవలు పొందేవారికి డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. అత్యవసరం అయిన ఆపరేషన్లు కూడా సేవ్ఆన్ మెడికల్స్ లో రిజిస్టర్ అయిన హాస్పిటల్స్ లో చేయించుకోవచ్చు. దీనికి కూడా హాస్పిటల్స్ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. సేవ్ ఆన్ మెడికల్స్ వెబ్ సైట్ లో కస్టమర్లకు కావాల్సిన సమాచారం అందుబాటులో ఉంచుతున్నారు. 

" ఆర్డర్ అందుకున్న తర్వాత నిపుణులైన మా ఫార్మాసిస్టులు అంతా క్షణ్ణంగా పరిశీలన చేస్తారు. ప్రిస్క్రిప్షన్ వ్యాలిడిటీని అంచనా వేస్తారు. తర్వాత వినియోగదారునికి ఫోన్ చేసి వివరాలను కన్ఫర్మ్ చేసుకుంటారు. తర్వాత సప్లయిర్ నుంచి మేము సేకరించి.. వినియోగదారునికి పంపిస్తాము" అజయ్

డాక్టర్ల నుంచి వీడియో కన్సల్టేషన్ పొందడానికి saveonmedicals.comలో కస్టమర్ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ ని, అపాయింట్ మెంట్ టైమ్ ని కూడా అప్పుడే ఎంపిక చేసుకోవచ్చు. పేమెంట్ కూడా ఆన్ లైన్ లో చేసేయవచ్చు. అపాయింట్ మెంట్ కన్ఫర్మ్ అయిన వెంటనే అటు డాక్టర్ కి- ఇటు బుక్ చేసుకున్నవారికి వీడియో లింక్ తో మెసెజ్ వెళ్లిపోతుంది.

సక్సెస్ స్టోరీ బిగిన్స్...

రూ.35 లక్షల రూపాయల పెట్టుబడితో అజయ్ దంపతులు సేవ్ ఆన్ మెడికల్స్ ను లాంఛ్ చేశారు. ఇప్పుడు మొత్తం ఎనిమిది మందితో కూడిన టీం ఈ స్టార్టప్ బాధ్యతలు చూస్తోంది. గుర్గావ్ కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ ఆండ్రాయిడ్ యాప్, వెబ్ సైట్ ద్వారా సేవలు అందిస్తోంది. ప్రారంభించి ఇంకా ఏడాది కూడా పూర్తి కాక ముందే ఈ స్టార్టప్ నెలకు 30శాతానికిపైగా పెరుగుదల నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు లక్ష వీడియో సెషన్స్ ను బుక్ చేశారంటే మెడికల్ బిల్స్ పై ఎంత ఆదా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 500 మంది డాక్టర్లు, 50 వేల విజిటర్స్, 1000 ఆర్డర్ల రికార్డును సేవ్ ఆన్ మెడికల్స్ మెయిన్ టెయిన్ చేస్తోంది. వెబ్ సైట్ ద్వారా కస్టమర్లు కొనుగోలు చేసే మెడిసిన్స్, వీడియో కన్సల్టేషన్, ఇన్ పేషంట్ సర్జరీ బుకింగుల ద్వారా వచ్చే కమిషన్ ఈ స్టార్టప్ కు ప్రధాన ఆదాయ వనరు.

దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించే లక్ష్యంతో ఇండియాపోస్ట్, ఫెడ్ఎక్స్, డెలివరీ లాంటి కొరియర్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 22వేల పిన్ కోడ్ లను కవర్ చేస్తుంది సేవ్ ఆన్ మెడికల్స్. ఈ జనవరిలోనే ఆండ్రాయిడ్ యాప్ ను లాంఛ్ చేశారు. ఇప్పటికే 5 వేల మంది దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది రూ.25 కోట్ల రెవిన్యూను అంచనా వేస్తున్నదీ స్టార్టప్. 2017-18 ఆర్థిక సంవత్సరానికల్లా రూ.15 కోట్ల టర్నోవర్ సాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సేవ్ ఆన్ మెడికల్స్ బృందం <br>

సేవ్ ఆన్ మెడికల్స్ బృందం


అందుకున్నంత మార్కెట్

ఇండియాలో హెల్త్ కేర్ మార్కెట్ వంద బిలియన్ డాలర్లు. మరో ఐదేళ్లలో ఇది దాదాపుగా మూడింతలు పెరిగి 280 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇప్పటికే ఆన్ లైన్ మెడిసిన్స్ రంగంలో నెట్ మెడ్, వన్ ఎంజీ, ఎం కెమిస్ట్, డెలీమెడి లాంటి సంస్థలు మార్కెట్ రూలర్స్ గా ఉన్నాయి. ప్రాక్టో, లిబ్రేట్, పోర్టియా లాంటి సంస్థలు డాక్టర్ల కన్సల్టేషన్ స్పేస్ ని డామినేట్ చేస్తున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ ఒకే సమయంలో క్యాప్చర్ చేయాలనే లక్ష్యంతో సేవ్ ఆన్ మెడికల్స్ ప్రయత్నాలు చేస్తోంది. దీనితో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో లోకల్ డాక్టర్లతో టైఅప్ అయి ఫ్రాంఛైజీ పద్దతిలో మెడికల్ సెంటర్స్ ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నారు. మెడిసిన్స్ కలెక్షన్ పాయింట్స్, వీడియో ద్వారా డాక్టర్ కన్సల్టేషన్ సర్వీసులను ఈ సెంటర్ల ద్వారా అందించాలని నిర్ణయించారు.

భారత్ లో హెల్త్ కేర్ రంగం ఎప్పటికీ ఖరీదైనదే. ఎగువ మధ్యతరగతి వర్గాలకు సైతం కార్పొరేట్ వైద్యం ఖరీదైన వ్యవహారమే. దీన్ని వారికి అందుబాటులోకి తెచ్చే ఆలోచనలు ఎప్పటికీ విజయగాథలుగానే ఉంటాయి. దీన్ని "సేవ్ ఆన్ మెడికల్స్" నిరూపిస్తోంది.

వెబ్ సైట్:  

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags