సంకలనాలు
Telugu

మన్నించు మహాత్మా..! ఈ నయా గాంధీ వారసులను..!

team ys telugu
17th Sep 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
నేను గత వారం రాసిన ఓ ఆర్టికల్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రతి ఒక్కరూ దీనిపై వాదనలకు దిగారు. ఒక్కొక్కరిది ఒక్కో దృక్పథం. నాది చాలా విశాల స్వభావమని కొందరు అన్నారు. మరికొంత మంది నేను మూర్ఖుడినని తీర్పు చెప్పేశారు. మరికొంత మంది నా రాజకీయ జీవితం ముగిసిపోయిందని జోస్యం చెప్పారు. నన్ను తీవ్రంగా ద్వేషిస్తూ అనేక మెయిల్స్ వచ్చాయి. నా వాట్సాప్ నెంబర్ సందేశాలతో నిండిపోయింది. అందులో నన్ను అభినందిస్తున్న వాటితో పాటు... నిందిస్తున్నవి కూడా చాలా ఉన్నాయి. టీవీ చానళ్లు నిరంతరాయంగా చర్చాకార్యక్రమాలు నిర్వహించాయి. చాలా పత్రికలు ఎడిటోరియల్స్ రాశాయి. సీనియర్ జర్నలిస్టులు తమ అభిప్రాయాలతో ఆర్టికల్స్ రాశారు. అయినా నేను మౌనంగానే ఉన్నాను. నా ఆర్టికల్ జాతిపిత మహాత్మగాంధీని ఉద్దేశించినది కాదు. భారతదేశానికి, ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందించిన ఓ గొప్ప స్ఫూర్తిని నేను ఉదహరించాను. కొంత మంది నన్ను తీవ్రంగా విమర్శించేవారు... మహాత్ముని గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నా ఆర్టికల్ మహాత్మాగాంధీని తీవ్రంగా కించపరిచేలా ఉందన్నారు. 

మీకో విషయం గుర్తు చేస్తాను. కొద్దిరోజుల క్రితం వరకు దేశం ఎవరైనా మహాత్ముని గురించి మాట్లాడవచ్చు.అతని గురించి తెలుసుకోవచ్చు. గాంధీజితో వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉండటం నా జీవితంలో ఓ గొప్ప వరం లాంటిది. ఇలాంటి స్వచ్ఛమైన, నిష్కళంకమైన. ధైర్యవంతలైన మనిషి ఇంతకు ముందు భూమి మీద లేరని చెప్పగలను. మహాత్ముడు మనుషుల్లో మనిషి. హీరోల్లో హీరో. యోధుల్లో యోధుడు. గాంధీతత్వమే భారతీయుత గుర్తుగా మారిపోయింది. దీన్ని మనం సుదీర్ఘ కాలం చెప్పుకుంటాం. అద్భుతమైన మాటలన్నది ఎవరో కాదు...మరో గ్రేట్ ఇండియన్ గా మనం కీర్తించే గోపాలకృష్ణ గోఖలే. నా ఆర్టికల్ ద్వారా దైవదూషణకు పాల్పడినట్లు చాలా మంది విమర్శిస్తున్నారు. కాని ఇది నిజమా..?. వేరే సందర్భంలో దీనిపై చర్చిస్తా. అయితే నేను అమితంగా అభిమానించే, మార్గదర్శకునిగా భావించే ఒకే ఒక వ్యక్తి మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ. నేను అతన్ని నేను మహాత్మగాంధీకి ఆరాధకుడిని కాదు. గుడ్డిగా సమర్థించుకుంటూ పోయేవాడినీ కాదు. అయితే బ్రిటిష్ పాలకులపై విజయం సాధించేలా భారతీయలకు స్ఫూర్తినిచ్చిన ఏకైక వ్యక్తిగా మహాత్మగాంధీ ఘనతగానే నేను ఎల్లప్పుడూ భావిస్తాను. భారత ప్రదలందరూ సంఘటితం కావడం వెనుక ఓశక్తి ఉంది. అదే మహాత్మాగాంధీ. ఆయన దీన్ని ఒక అసాధ్యమైన దారిలో చేసి చూపించారు. హింసామార్గంలో ప్రపంచం అంతా పయనిస్తున్నప్పుడు బాపు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అహింసామార్గాన్ని చెప్పడమే కాదు.. ఆచరించి చూపించారు. గాంధీజీ ఓ సమయంలో హింసామార్గాన్ని ఎంతగానే నమ్మేవారనే విషయం ఇప్పటితరంలో చాలా మందికి తెలియని విషయం. నేను ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు పూర్తిగా హింసామార్గం వల్లే సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మాను. అహింసా మార్గంపై నాకెలాంటి నమ్మకం లేదని గాంధీ మహాత్ముడే చెప్పుకున్నారు. అయితే ప్రఖ్యాత రష్యన్ రచయిత టాల్ స్టాయ్ రచనలతో మహాత్ముడు ప్రభావితమయ్యారు.1906లో నాకో లక్ష్యం ఏర్పడింది. ప్రజల జీవితాల్లోనుంచి హింస, అసత్యాలను దూరం చేస్తూ అహింసా, సత్యం మార్గాలతో నింపేలా చేయాలనుకున్నానని మహాత్ముడు చెప్పారు. హింస ఎంతో ఆకర్షణీయమైనది. సంచలనాత్మకమైనది కూడా. హింసాత్మక హీరోయిజానికి చరిత్రలో ఎంతో ఆదరణ ఉంది. ఎన్నో చారిత్రక విజయాలు హింసాత్మకతతో ముడిపడి ఉన్నాయి.

image


1917 రష్యా విప్లవం ఓ సంచలనం. ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజం -కమ్యూనిజం ఆదరణలోకివచ్చిన సందర్భం అంది. ఇది ఎంతో మంది ప్రపంచస్థాయి నేతల్ని అందించింది. అంతరాలు లేని సమాజాన్ని సృష్టించేందుకు హింసాత్మక ధోరణినిమార్క్సిజం సమర్థించింది. పెట్టుబడిదారి వ్యవస్థలోని లోపాల్ని... బానిసత్వాన్ని అంతమొందించడానికి హింసాపథం ఓ ఆయుధంగా మారింది. అయితే ఇలాంటివాటికి ఆకర్షితుడవడానికి మహాత్ముడేమి సామాన్యమైన వ్యక్తిత్వం ఉన్నవారు కాదు. సర్ క్రూజన్ విల్లీను స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ లాల్ ధింగ్రా హత్య చేసిన సమయంలో గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు దేశమంతా ఈ హత్యను సమర్థిస్తోంది. అయితే గాంధీ మాత్రం దీన్ని సమర్థించలేకపోయారు. ఈ ఘటనతో గాంధీ మనస్తాపానికి గురయ్యారు. హత్యలతో భారతదేశం సాధించేదేమీ ఉండదు. హత్యకు గురయ్యేవాళ్లు.. తెల్లవాళ్ల.. నల్లవాళ్ల అన్నది సమస్య కాదు. ఇలాంటి సమస్యల వల్ల దేశం బయటపడలేని సమస్యల్లో చిక్కుకుపోతుందని గాంధీజీ బలంగా నమ్మినట్లు.. రాజ్ మోహన్ గాంధీ రాసిన మోహన్ దాస్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. రాజ్ మోహన్ గాంధీ మహాత్ముని మనవడు. మహాత్మా గాంధీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఔన్నత్యం మాటల్లో మాత్రమే ఉండేది కాదు. తన గొప్పతనాన్ని ఆయన బోధించిన గొప్ప నియమాలు యదార్ధానికి అనుకూలంగా ఉంటాయి. ఆయన పాటించలేని వాటి గురించి ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఈ నియమంవల్ల గాంధీ తన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాంధీజీ నియమం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నది ఆయన భార్య కస్తూర్బానే. దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహంలో పాల్గొంటున్న సమయంలో కస్తూర్బా తీవ్ర అనారోగ్యానికి గుర్యయారు. ఆ సమయంలో గాంధీ జైలులో ఉన్నారు. పెరోల్ తీసుకుని భార్యతో గడపమని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ గాంధీజీ నిరాకరించారు. తన సత్యాగ్రహాన్నీ వివరిస్తూ భార్యకు ఓ లేఖ రాశారు. సత్యాగ్రహం నీతో కలవడానికి అంగీకరించడం లేదు. అందుకే ధైర్యంగా ఉండి మందులు తీసుకుంటూ ఉండు. కచ్చితంగా కోలుకుంటావు. అయితే ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. గాంధీజీ సమక్షంలో లేకుండా చనిపోతానేమో అని కస్తూర్బా భయపడ్డారు కూడా. ఇలా తను పెట్టుకున్న నియమాలను ఎంత కఠినపరిస్థితుల్ోలనూ వదులుకోలేదు మహాత్ముడు. గాంధీ సిద్దాంతాలపై అతని కుమారుడు హరిలాల్ కూడా అసంతృప్తితో ఉండేవాడు. 

image


అయితే తదనంతర కాలంలో అతను గాంధీజీ పెట్టుకున్న సిద్దాంతాల విలువను తెలుసుకున్నాు. హరిలాల్ తన చదువును గాంధీజీ నిర్లక్ష్యం చేస్తున్నారని ఎప్పుడూ అనుకునేవారు. హరిలాల్ ను ఉన్నత చదువు కోసం ఇంగ్లాండ్ కు పంపేందుకు ఇష్టపడలేదు. అయితే ఇంగ్లాండ్ కు వెళ్లాలని హరిలాల్ కు ఎంతో కోరిక.కానీ గాంధీజీ మాత్రం తన కుమారుని కోసం సిద్దాంతాలను పక్కన పెట్టాలనుకోలేదు. దీనిపై ఆగ్రహంగా హరిలాల్ గాంధీజీ లేఖ కూడా రాశారు. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అత్యంత ఇష్టమైన కోరికను తీర్చలేకపోయినందుకు గాంధీ బాధపడ్డారు. కానీ సిద్దాంతాలను మాత్రం వదిలేందుకు సిద్ధపడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రాజకీయ నాయకుడు తన పిల్లల్ని . అన్ని విధాలుగా ప్రమోట్ చేసుకునే పనిలో ఉంటారు. ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలని గాంధీ కోరుకుంటారని ఇలాంటి ఉదంతాలతో మనకు తెలిసిపోతుంది. గాంధీజీ ఇలా తన కొడుకును కూడా కాదనడానికి కారణం...ఇంగ్లాండ్ వెళ్లేందుకు హరిలాల్ తో పాటు చగన్ లాల్ అనే విద్యార్థి కూడా పోటీపడ్డారు. హరిలాల్ కన్నా.. చగన్ లాల్ కే స్కాలర్ షిప్ పొందే ప్రతిభ ఎక్కువ ఉందని గాంధీ గ్రహించారు. కానీ తన పలుకుబడితో ఆ విద్యార్థికి అన్యాయం చేయాలనుకోలేదు. ఇదే తండ్రికుమారుల మధ్య విబేధాలకు కారణం అయింది. అయినా గాంధీ నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడ్డారు. తన సింప్లిసిటీ వల్లే గాంధీ మహోన్నతుడయ్యారు. అతను కాంప్లికేటెడ్ కాదు. నలుపు.తెలుపు అనే సమస్యే రాదు. అతని నిబద్ధత వల్లే అతను సమాజంలో ఓ రోల్ మోడల్ గా నిలబడ్డారు. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆ సచ్చీలత వెనక్కి వెళ్లిపోయింది. ప్రతీదానికి నిందించడం కామన్ గా మారిపోయింది. గాంధీ మహాత్ముడు ఎన్నటికీ మహోన్నతుడే. ఒక్క ఆర్టికల్ అతని గొప్పతనాన్ని తగ్గించదు. చరిత్ర చెరిగిపోదు. ఈ చర్చ ఇలా సాగుతూనే ఉంటుంది.

రచయితః అశుతోష్‌, ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags