సంకలనాలు
Telugu

హ‌స్త‌క‌ళ‌ల‌కు పూర్వవైభవం తెస్తున్న ఎక్స్‌క్విజిట్‌

మ‌న క‌ళ‌లు మ‌ళ్లీ వెలిగిపోతున్నాయి. ఆన్‌లైన్ వేదిక‌గా ఖండాత‌రాల‌కు మ‌న క‌ళ‌ల ఖ్యాతి చేరిపోతోంది. రేప‌టి త‌రానికి తెలియ‌కుండా పోతున్న హ‌స్త‌క‌ళ‌ల ప్రాభ‌వం మ‌ళ్లీ మొద‌ల‌వుతోంది. క‌ళాకారుల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్ట‌లేక‌పోతున్న‌క‌ళ‌లు.. ఇప్పుడు డాల‌ర్ల మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి.

Karthik Pavan
30th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

గ్లోబ‌లైజేష‌న్ పుణ్య‌మా అని హ‌స్త‌క‌ళ‌లు, వాటిని న‌మ్ముకుని బ‌తుకుతున్న క‌ళాకారుల‌కు ఆద‌ర‌ణ క‌రువ‌వుతోంది. కొల్హాపురి చెప్పులు, చెన్న‌ప‌ట్నం కొయ్య‌బొమ్మ‌లు..కంచీపురం చీర‌లు ఇలా ర‌క‌ర‌కాల క‌ళ‌లు ఇప్పుడు ఆ ప్రాంతాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. రేప‌టి త‌రానికి మ‌న వార‌స‌త్వ క‌ళ‌ల గురించి తెలియ‌కుండా పోతోంది. అలాంటి వ‌స్తువున్నీ ఒక‌చోట చేర్చి ఆన్‌లైన్‌లో విక్ర‌యించాల‌న్న ఆలోచ‌న‌తో మొద‌ల‌యిందే exqzt సంస్థ‌. క‌ళాకారులు, వాటిని ప్రోత్స‌హిస్తున్న ఎన్‌జీవోల‌ను ఈ పోర్ట‌ల్ ఒక‌తాటిపైకి తీసుకురావ‌డ‌మే కాకుండా అంద‌రికీ ఉపాధిని కూడా క‌ల్పిస్తోంది.

ఐడియా ఎలా వ‌చ్చిందంటే..!

ఎక్స్‌క్విజిట్ వ్య‌వ‌స్థాప‌కులు అవినాష్‌. అనీల్‌

ఎక్స్‌క్విజిట్ వ్య‌వ‌స్థాప‌కులు అవినాష్‌. అనీల్‌


exqzt రూప‌క‌ర్త అవినాష్ బెంగ‌ళూరులోని రోడ్ల‌మీద న‌డుచుకుంటూ వెళుతున్నాడు. ప‌క్క‌నే జ‌న‌ప నార‌తో త‌యారుచేస్తున్న కొన్ని వ‌స్తువులు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కొద్దిరోజుల‌కే పూణే వెళుతున్న త‌న‌ను.. మిత్రుడొక‌రు షోలాపూర్ చెప్పులు తీసుకుర‌మ్మ‌ని అడిగాడు. వెంట‌నే అవినాష్ మ‌దిలో ఐడియా వ‌చ్చింది. ప‌ట్ట‌ణాలకు దూర‌మైన సంప్ర‌దాయ హ‌స్త‌క‌ళ‌ల‌ను అంద‌రికీ అందుబాటులోకి తీసుకురావాల‌నుకున్నాడు. అందుకు ఈ కామ‌ర్స్ చ‌క్క‌టి ఐడియా అని గుర్తించి త‌న మిత్రుడు అనీల్ క‌ద‌మ్‌తో క‌లిసి exqztకు రూప‌క‌ల్ప‌న చేశాడు.

exqzt ఎలా ప‌నిచేస్తుంది?

మొద‌ట్లో ఇన్వెంట‌రీ మోడ‌ల్ ద్వారా ఈ కాన్సెప్ట్‌ను ప‌బ్లిక్‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. మ‌రో రెండునెల‌ల్లో పూర్తిస్థాయి మార్కెట్ మోడ‌ల్ రెడీ చేయాల‌ని భావిస్తున్నారు. అలానే.. త‌యారీదారులు ఉండే కీల‌క ప్రాంతాల్లో.. వ‌స్తువ‌ల‌ను సేక‌రించ‌డానికి హ‌బ్ ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ రెడీచేస్తున్నారు. హ‌బ్‌లు ఏర్పాటుచేయ‌డం ద్వారా వ‌స్తువుల సేక‌ర‌ణ సుల‌భ‌వం కావ‌డంతో పాటు క‌ళాకారుల‌కు ట్రైనింగ్ హ‌బ్‌గా కూడా ప‌నికివ‌చ్చే అవ‌కాశ‌ముంది. క‌ళాకారుల‌కు ఈకామ‌ర్స్‌ని ప‌రిచ‌యం చేయ‌డానికి, వారి వ‌స్తువ‌ల‌ను మార్కెటింగ్ చేయ‌డానికి కొత్త మార్గాల‌ను తెలియ‌జేయ‌డానికి ఈ హ‌బ్‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డతాయంటారు అవినాష్.

స‌వాళ్లు

క‌ళ‌ల‌కు పుట్టినిల్ల‌యిన మ‌న దేశంలో.. ఎంతోమంది హ‌స్త‌ క‌ళాకారులు తాము త‌యారుచేసిన వ‌స్తువుల‌ను మార్కెటింగ్ చేసుకోలేక‌.. కేవ‌లం ఆయా ప్రాంతాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నారు. దీని వ‌ల్ల ఆదాయ మార్గాలు కూడా ఉండ‌టంలేదు. అందుకే.. ప‌టిష్ట‌మైన టీమ్‌ని మ‌రో రెండు నెల‌ల్లో ఏర్పాటు చేసుకోవ‌డం ద్వారా.. క‌ళ‌లు, క‌ళాకారుల‌ను గుర్తించాల‌ని భావిస్తున్న‌ట్టు అవినాష్ చెబుతున్నారు.

వ్యాపార విస్త‌ర‌ణ‌

ప్ర‌స్తుతం exqzt సైట్‌లో 20 ర‌కాల క‌ళాకారులు త‌యారుచేసిన వ‌స్తువులు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తీ నెలా దాదాపు 40శాతం మంది కొత్త కొనుగోలుదారులు త‌మ సేవ‌ల‌ను వినియోగించుకుంటున్నార‌ని exqzt టీమ్ చెబుతోంది.ఈ నేప‌ధ్యంలో మ‌న సంప్ర‌దాయ హ‌స్త‌క‌ళ‌ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావ‌డం కోసం ప‌ఠటిష్ట‌మైన నెట్‌వ‌ర్క్‌ని ఏర్పాటుచేయ‌డం ముఖ్య ఉద్దేశ‌మ‌ని అవినాష్ భావిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు ఐన్వెస్ట‌ర్ల‌ను సంపాదించ‌డం ద్వారా ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఈకామ‌ర్స్‌లో హ‌స్త‌క‌ళ‌ల‌కు గుర్తింపు

ఆవ‌కాయ నుంచి శాటిలైట్ ప‌రిక‌రాల వ‌ర‌కూ.. ప్ర‌తీదీ ఈ మ‌ధ్య ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. ఇప్ప‌టికే Jaypore ,Tjori, Kashmiri Boxలాంటి సంస్థ‌లు ఆయా ప్రాంతాల్లో త‌యార‌య్యే హ‌స్త‌క‌ళ‌ల‌ను ఆన్‌లైన్‌లో అమ్ముతూ మంచి బిజినెస్ చేస్తున్నాయి.ఈ నేప‌ధ్యంలో త‌మ కాన్సెప్ట్ ఖ‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉందంటోంది exqzt టీమ్‌.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags