సంకలనాలు
Telugu

ఓ స్కూల్ విద్యార్థి స్టార్టప్... 'యూత్ కనెక్ట్'

యువత కోసం యువత ద్వారా ‘యూత్ కనెక్ట్ ’..స్టూడెంట్స్ తో పాటు విద్యాసంస్దల కోసం ఎక్స్ క్లూజివ్ ప్లాట్ ఫాం..విద్యాసంస్ధలు, విద్యార్దులు తమ అభిప్రాయాలు తెలిపే వేదిక

ABDUL SAMAD
18th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పాపులారిటి, ప్రాంతాన్ని బట్టి, కొన్ని కాలేజ్ లు, ఇన్‌స్టిట్యూట్లు, యునివర్సిటీలను ఎంచుకున్న ‘యూత్ కనెక్ట్ ప్లస్ నెట్వర్క్’, విద్యా సంస్ధల కోసం ఎటువంటి ఖర్చు లేకుండా, వారి డొమైన్ ‘youthconnectmag.com’ ఆధ్వర్యంలో మ్యాగజీన్ ప్రారంభిస్తుంది.

image


2012 లో, యువత అభిప్రాయాన్నితెలిపే విధంగా ‘యూత్ కనెక్ట్’ పేరుతో ప్రింట్ మరియు డిజిటల్ ఫోరమ్ ను ప్రాంభించారు రాహుల్ భగ్చందాని, దివేష్ అస్వాని. “ఫేస్ బుక్ లో సాధారణంగా రాహుల్ తో జరిగిన సంభాషణలో, మార్కెట్లో ఉన్నసాంప్రదాయ మీడియా కాకుండా యువతకు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఉందని చర్చించుకున్నామంటున్నారు ‘యుత్ కనెక్ట్’ సహవ్యవస్ధాపకులు, సీఈఓ దివేష్ అస్వాని.”

“యువత చదవాలని అనుకుంటారు కాని వారికి తగ్గ సమాచారం దొరకడంలేదు. రాహుల్ రాయడంతో పాటు బ్లాగింగ్, అలాగే డిజైనింగ్ కూడా బాగా చేసే వాడు. అలా మేమిద్దరం ఓ టీమ్‌గా మా పని ప్రారంభించామంటున్నారు.”

ఇద్దరు కలిసి 2010 లో తమ పనిని ప్రారంభించారు, అప్పడు బగ్చాందాని తన స్కూల్ పూర్తి చేయగా, అస్వాని గుజరాత్ టెక్నాలజికల్ యూనివర్సిటీ లో తన ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నాడు. అదే యూనివర్సిటీ వారి వెంచర్‌ను ‘స్టూడెంట్ స్టార్టప్ సపోర్ట్ సిస్టమ్’ ద్వారా సహకరించింది.

వీటి వెనుక ఉద్దేశం

ఈ వెంచర్ వెనుక ముఖ్య ఉద్దేశ్యం విద్య వ్యవస్ధలోని టాలెంట్, కంటెంట్, అలాగే కార్యక్రమాలను అనుసంధానం చేయడం. అంతే కాకుండా విద్యా సంస్ధల పబ్లిక్ ఇమేజ్ పెంచుకునే అవకాశంతో పాటు ఉచితంగా పీఆర్ కూడా లభిస్తుంది.

సామాన్యంగా విద్యా సంస్ధల వెబ్ సైట్లు కేవలం అడ్మిషన్లు, రిజల్ట్స్ వరకే పరిమితమై ఉన్నాయి. అయితే ‘యూత్ కనెక్ట్’ డోమేన్ సహకారంతో విద్యా సంస్దలు తమ అభిప్రాయాలు, మేసేజ్లు, స్టూడింట్ కమ్యూనిటీ తరపున సందేశాలు, టీచర్ – స్టూడెంట్ కూడా ఈ డోమేన్ లో మెసేజ్ షేర్ చేసుకోవచ్చు.

‘యూత్ కనెక్ట్’ డోమేన్ వల్ల లాభాలు

image


• ప్రతీ విద్యా సంస్ధ వెబ్ సైట్ ‘youthconnectmag.com’ సబ్ డొమైన్ పై హోస్ట్ చేసే వీలుంది. ఉదాహరణకు XYZ ఈ నెట్వర్క్ లో చేరితే, వారికి xyz.youthconnectmag.com అలాట్ చేస్తారు. అన్ని సౌకర్యాలతో, ఈజీ టూల్స్ తో ఈ డోమేన్ పనిచేస్తుంది.

• ప్రతీ విద్యా సంస్ధ వెబ్ సైట్ ఒకేలా కనిపిస్తాయి, కాని అందులో ఉండే కంటెంట్ అక్కడి విద్యార్ధులు క్రియేట్ చేస్తారు.

• సంపాదకీయ సహకారం- విద్యా సంస్ధలకు ఎడిటోరియల్ సహకారంతో పాటు టక్నికల్ పరంగా ‘యూత్ కనెక్ట్’ మ్యానేజ్ చేస్తుంది.

• అన్ని విద్యాసంస్ధల్లోని బెస్ట్ కంటెంట్ ను ‘యూత్ కనెక్ట్’ వెబ్ సైట్ హోం పేజ్ పై డిస్ ప్లే చేస్తారు. ఇక ఎక్స్ క్లూసివ్ కంటెంట్ ను ప్రింట్ కూడా చేస్తారు. ప్రింట్ సర్కులేషన్ సుమారు 11వేలు ఉండగా, 60 శాతం కొత్త యూజర్లు ప్రతి నెల చేరుతున్నారు, అంతే కాకుండా విద్యా సంస్ధల తరుపున తయారు చేస్తున్న టాలెంట్ ను ఎలాంటి ఖర్చు లేకుండా బ్రాడ్ కాస్ట్ కూడా చేసుకోవచ్చు.

• ఉచితంగా – ఈ ప్లాట్ ఫాం అన్ని విద్యా సంస్దలకు ఉచితం. లాంచ్ అయిన మూడు నెలల్లో సుమారు 150-200 విద్యాసంస్ధలకు అందుబాటులో ఉంటుంది, ఆ తరువాత ఇతరులకు అవకాశాలు ఉంటాయి.

ప్రస్తుత పరిస్ధితులు

ప్రస్తుతం వివిధ కాలేజ్ లు , ఇన్ స్టిట్యూట్లు, యునివర్సిటీలను కలుస్తూ వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మొట్రో నగరాలతో ప్రారంభమై, చిన్న నగరాలకు విస్తరిస్తున్నారు.

“కొంత మంది వారి కాలేజ్ లను డెవలప్ చేయాలనుకుంటారు, అలాంటి వారికి టెక్నికల్ సపోర్ట్ నెట్వర్క్ ఉండటంతో పాటు రీడర్ కూడా ఉండటంతో మంచి ఎక్స్ పోజర్ ఉంటుంది, అందుకు సబ్ డోమేన్ పెట్టుకోవడానికి సంకోచించరంటున్నారు సహ వ్యవస్ధాపకులు భగ్చందాని”.

విద్యా సంస్ధలను యూత్ కనెక్ట్ తో చేరడానికి సబ్ డోమేన్స్ ను ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఇక వచ్చే 18 నెలల్లో మరిన్ని విద్యాసంస్ధలు వీరితో చేరుతారని భావిస్తున్నారు. “ఈ సైట్ మరియు ఐడియా ను కాపి కొట్టడం పెద్ద విషయం కాదంటున్న భగ్చందాని”, భవిష్యత్తులో పోటీకూడా ఉండే అవకాశముందని అంటున్నారు.

image


ఫండింగ్

“ప్రింట్ వ్యాపారం సరిగ్గా లేని సమయంలో ఈ రంగంలో దిగడం మేము తీసుకున్న అతి పెద్ద రిస్క్, అయితే ఆ రిస్క్ కు ఫలితం కూడా లభించిందంటున్నారు భగ్చందాని”.

‘యూత్ కనెక్ట్’ కు ఆదాయ మార్గం ప్రకటనల ద్వారా వచ్చే బ్యానర్ యాడ్, స్పాన్సర్ స్టోరీలు. భవిష్యత్తులో “ విద్యా సంస్ధల మధ్య ఈవెంట్స్ నిర్వహించే ప్లాన్ కూడా చేస్తున్నాము. ఇప్పటికే 2 సంవత్సరాల అనుభవమున్న మాకు, అడ్వర్టైజర్లు కూడా ‘యూత్ కనెక్ట్’ లాంటి ప్లాట్ ఫాంపై ప్రకటనలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారంటున్నారు.”

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags